మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ. మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.
మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ. మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.
- మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ. మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.1
- కరీంనగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకాంత్‌పై దాడి పరామర్శించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రీకాంత్‌పై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. దాడుల సంస్కృతిని తెచ్చింది బీజేపీనే: గంగుల కమలాకర్ మేయర్ పీఠం ఇస్తే దాడులా? కరీంనగర్ ప్రజలు బీజేపీకి మేయర్ పదవిని కట్టబెడితే, వారు నగరంలో 'దాడుల సంస్కృతి'కి తెరలేపారని గంగుల కమలాకర్ మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ రెండు పర్యాయాలు మేయర్ పీఠం అధిరోహించినా, అలాగే కాంగ్రెస్ హయాంలోనూ కరీంనగర్‌లో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన సుపరిపాలన అందించామని గుర్తుచేశారు. కక్షసాధింపు చర్యలు: బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలలో తిరుగుతున్నాడనే అక్కసుతోనే బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు తన అనుచరులతో కలిసి రోడ్డుపై శ్రీకాంత్‌పై ఇనుప రాడ్లతో పాశవికంగా దాడి చేశారని ఆరోపించారు. శ్రీకాంత్ చనిపోయాడని భావించి వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ప్రశ్నలు...పోలీసుల తీరుపై ప్రశంసలు కరీంనగర్ ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు? కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు పార్టీలో ఏం జరుగుతుందో అర్థమవుతుందా?" అని గంగుల ప్రశ్నించారు. గతంలో తన కార్యాలయంపై దాడి జరిగినప్పుడే హోం మంత్రి హోదాలో ఉన్నవారు స్పందించి చర్యలు తీసుకుని ఉంటే, నేడు ఇలాంటి దాడులు పునరావృతం కాకపోయేవని అన్నారు. కిసాన్ నగర్‌లో తాము రోడ్లు వేయిస్తే, బీజేపీ నాయకులు రాడ్లతో ప్రజలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. గెలిచి మూడు నెలలు కూడా కాకముందే దాడులకు తెరలేపారని ధ్వజమెత్తారు. పోలీసుల పనితీరు: పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏ పార్టీవారైనా సరే చట్టం ముందు శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. అభివృద్ధి వర్సెస్ విధ్వంసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్‌ను రూ.1,650 కోట్లతో అత్యద్భుతంగా, సురక్షితమైన 'స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్దామని తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ నగరానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారనుకుంటే, కేవలం దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ ఎప్పుడూ శాంతియుతంగా, సేఫ్ సిటీగా ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ శ్రేణులకు పూర్తి భరోసా. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ తన కార్యకర్తలకు అండగా ఉంటుందని భెరోసా కల్పించారు. కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే కరీంనగర్‌కు రానున్నట్లు తెలిపారు. రెండేళ్లలో ఈ ప్రభుత్వం తొలగిపోతుంది, ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తాము. మేము కూడా ప్రతిదాడులు చేయము కానీ చట్టం ముందే దోషులను నిలబెడతాము" అని హెచ్చరించారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి స్పందించి, హింసకు పాల్పడిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే గంగుల తో పాటు బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.2
- కరీంనగర్ జిల్లా నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు ఆందోళన దిగారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి మాట్లాడుతు నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెడుతూ గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడిపల్లి సత్యం గ్రామానికి వచ్చి ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తారని హామీ ఇచ్చిన మాట నిజం కదా అని గుర్తు చేశారు.శమేడిపల్లి సత్యం ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఈ రిలే నిరాహార దీక్షను జిల్లా కేంద్రానికి తరలించి ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పోలీసులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యముకు కొమ్ముకాస్తూ నారాయణపూర్ గ్రామస్తులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే వారిపై పెట్టిన అక్రమ కేసులను తీసివేయాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామంగా ప్రకటించేంతవరకు గ్రామస్థులకు అండగా ఉంటామన్నారు.1
- ప్రతి ఇంట జాతీయ జెండా ఎగరాలి .... బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రజలను చైతన్యపరచాలని సిద్దిపేట జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, అక్కన్న పేట మండల ఇన్‌చార్జి మాచర్ల కుమారస్వామి పిలుపునిచ్చారు. సోమవారం అక్కన్నపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం, ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికీ జాతీయ జెండాలను పంపిణీ చేసి జాతీయ స్ఫూర్తిని నింపాలని కార్యకర్తలకు సూచించారు. అక్కన్నపేట మండలంలో సర్ ప్రక్రియ దాదాపు 100 శాతం పూర్తయిందని, మిగిలిన ఫారాలను బి ఎల్ ఓ లతో మాట్లాడి పూర్తి చేయించాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ చేరుకుని ప్రజలతో సంబంధాలు పెంచుకోవాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్, మడక రవికుమార్, ఉపాధ్యక్షులు అర్జున్ నాయక్, సాంకే సంతోష్, కార్యదర్శులు వేముల ప్రసాద్, జన్నారపు కళ్యాణ్ విష్ణు, లావుడ్య రైనా నాయక్, వివిధ మోర్చాల అధ్యక్షులు ఇరుగుదినుల రాజకుమార్, మాలోత్ రాజునాయక్, గేరుమల రాజు, గంగుల కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు సలేంద్ర తిరుపతి, సోషల్ మీడియా కన్వీనర్ జంగపల్లి శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఈశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: సింగర్ మంగ్లీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని మంగ్లీ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు మంగ్లీకి ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న మంగ్లీ, ఆలయ విశిష్టతను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు, అభిమానులు ఆమెను ఆసక్తిగా గమనించారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా. *మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ కి వచ్చే పర్యాటకుల భద్రతకు చర్యలు.* *పర్యాటకులు పోలీస్ వారి సూచనలు, హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలి.* *మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ.* తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. *పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.* ఎస్పీ గారి వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.4
- క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో... కార్మిక చట్టాల పరిరక్షణకై మరో పోరాటం.. టేకు మల్ల సమ్మయ్య ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక, రైతు సంఘాల పిలుపుమేరకు కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద ఏఐటియుసి, టి యు సి ఐ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతు, కార్మిక వ్యతిరేక చట్టాల కాపీలను దగ్ధం చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, టి యు సి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జిందం ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోయడ సృజన కుమార్ మాట్లాడుతూ.... కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ,వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి వాణిజ్య ఒప్పందాలను చేస్తుందని*, దేశానికి వెన్నుముక రైతు అని చెప్పినటువంటి కేంద్రం, నేడు రైతుకి గిట్టుబాటు ధర లేకుండా, సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా, విత్తనాలు అధిక రేట్లు పెంచుతూ, యూరియా రేట్లు రెట్టింపు చేస్తూ, ఆరు కాలం పంట పండించే రైతుకు గిట్టు గిట్టుబాటు ధర కల్పించకుండా మధ్య దళారీలు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని వారు ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకం 100 రోజులు నుండి 200 రోజులకు పెంచాలని, రోజువారీ కూలీ 700 ఇవ్వాలని ఒకవైపు ఆందోళన చేస్తుంటే ఉన్న పథకాన్ని రద్దుచేసి రాంజీ పథకం పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తుందని దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు*. *విద్యుత్ సవరణ 2025 చట్టం రద్దు చేయాలని, పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని చట్టం చేయాలని, రుణమాఫీ, పంటల బీమా అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, స్వేచ్ఛ వాణిజ్య* *ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళనకు పూనుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, సిపిఐ నగర సహాయక కార్యదర్శి పైడిపల్లి రాజు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి కిమ్మసారపు నరసయ్య , బొంతల ఎల్లయ్య, దాసరి అనిల్, టి యు సి నాయకులు ఎస్ కమలాకర్ ,మునీధర్, శ్రీపతి ప్రసాదులు పాల్గొన్నారు2