క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో... కార్మిక చట్టాల పరిరక్షణకై మరో పోరాటం.. టేకు మల్ల సమ్మయ్య ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక, రైతు సంఘాల పిలుపుమేరకు కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద ఏఐటియుసి, టి యు సి ఐ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతు, కార్మిక వ్యతిరేక చట్టాల కాపీలను దగ్ధం చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, టి యు సి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జిందం ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోయడ సృజన కుమార్ మాట్లాడుతూ.... కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ,వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి వాణిజ్య ఒప్పందాలను చేస్తుందని*, దేశానికి వెన్నుముక రైతు అని చెప్పినటువంటి కేంద్రం, నేడు రైతుకి గిట్టుబాటు ధర లేకుండా, సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా, విత్తనాలు అధిక రేట్లు పెంచుతూ, యూరియా రేట్లు రెట్టింపు చేస్తూ, ఆరు కాలం పంట పండించే రైతుకు గిట్టు గిట్టుబాటు ధర కల్పించకుండా మధ్య దళారీలు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని వారు ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకం 100 రోజులు నుండి 200 రోజులకు పెంచాలని, రోజువారీ కూలీ 700 ఇవ్వాలని ఒకవైపు ఆందోళన చేస్తుంటే ఉన్న పథకాన్ని రద్దుచేసి రాంజీ పథకం పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తుందని దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు*. *విద్యుత్ సవరణ 2025 చట్టం రద్దు చేయాలని, పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని చట్టం చేయాలని, రుణమాఫీ, పంటల బీమా అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, స్వేచ్ఛ వాణిజ్య* *ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళనకు పూనుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, సిపిఐ నగర సహాయక కార్యదర్శి పైడిపల్లి రాజు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి కిమ్మసారపు నరసయ్య , బొంతల ఎల్లయ్య, దాసరి అనిల్, టి యు సి నాయకులు ఎస్ కమలాకర్ ,మునీధర్, శ్రీపతి ప్రసాదులు పాల్గొన్నారు
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో... కార్మిక చట్టాల పరిరక్షణకై మరో పోరాటం.. టేకు మల్ల సమ్మయ్య ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక, రైతు సంఘాల పిలుపుమేరకు కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద ఏఐటియుసి, టి యు సి ఐ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతు, కార్మిక వ్యతిరేక చట్టాల కాపీలను దగ్ధం చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, టి యు సి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జిందం ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోయడ సృజన కుమార్ మాట్లాడుతూ.... కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ,వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి వాణిజ్య ఒప్పందాలను చేస్తుందని*, దేశానికి వెన్నుముక రైతు అని చెప్పినటువంటి కేంద్రం, నేడు రైతుకి గిట్టుబాటు ధర లేకుండా, సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా, విత్తనాలు అధిక రేట్లు పెంచుతూ, యూరియా రేట్లు రెట్టింపు చేస్తూ, ఆరు కాలం పంట
పండించే రైతుకు గిట్టు గిట్టుబాటు ధర కల్పించకుండా మధ్య దళారీలు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని వారు ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకం 100 రోజులు నుండి 200 రోజులకు పెంచాలని, రోజువారీ కూలీ 700 ఇవ్వాలని ఒకవైపు ఆందోళన చేస్తుంటే ఉన్న పథకాన్ని రద్దుచేసి రాంజీ పథకం పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తుందని దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు*. *విద్యుత్ సవరణ 2025 చట్టం రద్దు చేయాలని, పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని చట్టం చేయాలని, రుణమాఫీ, పంటల బీమా అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, స్వేచ్ఛ వాణిజ్య* *ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళనకు పూనుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, సిపిఐ నగర సహాయక కార్యదర్శి పైడిపల్లి రాజు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి కిమ్మసారపు నరసయ్య , బొంతల ఎల్లయ్య, దాసరి అనిల్, టి యు సి నాయకులు ఎస్ కమలాకర్ ,మునీధర్, శ్రీపతి ప్రసాదులు పాల్గొన్నారు
- వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటుచేసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనులను చేస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటుచేసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనులను చేస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో అన్ని దేవాలయాలు స్టోన్ తో నిర్మాణాలు చేపడితే ఇక్కడ మాత్రం సిమెంట్ నిర్మాణాలు చేస్తున్నారని, అభివృద్ధి పేరిట వేములవాడ చరిత్రను రూపుమాపుతున్నారని, ఇటీవల శూన్య మాసమైన ఆషాడ మాసంలో మంత్రులు అభివృద్ధి పనులకు ఎలా ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల్లో ఆది శంకరాచార్య విగ్రహం, ఈ దేవాలయాన్ని నిర్మించిన రాజరాజ నరేంద్రుని విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై అధికారులను ప్రశ్నిస్తే తమకేం సంబంధం లేదని, ఈవోని అడుగుతే తనకు సంబంధం లేదని, పవర్ ఉంది కదా అని నిర్మాణాలు ఇష్టమొచ్చినట్లు జరిపితే పశ్చిమబెంగాల్లో పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్ కు పడుతుందన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్మాణాలు లేకపోతే వచ్చే శ్రావణమాసంలో పెద్ద ఎత్తున తమ పార్టీ తరఫున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.2
- ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR TV 9 న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల నగరంలోని సాయికుంట ఇంటిగ్రేటెడ్ బీసీ బాలుర హాస్టల్ ఆవరణలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యత, వాటి సంరక్షణ, మొక్కలను దత్తత తీసుకొని పెంచాల్సిన బాధ్యతపై ప్రకృతి మిత్ర వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్ అవగాహన కల్పించారు. అనంతరం హాస్టల్ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో విద్యార్థులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటించారు. మొక్కల సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, నాటిన మొక్కలను వారికి దత్తతగా అప్పగించారు. మొక్కలను కాపాడుతూ వాటి పెరుగుదలకు తోడ్పడే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ సుధమల హరికృష్ణ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కొత్తూరి ముకుందం, జిల్లా ఫారెస్ట్ ఏఓ పొన్న మల్లయ్య, బీసీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి గుండు వెంకటేష్, జైపూర్ ఎంపీడీవో శ్రీపతి బాపురావు, వేమనపల్లి ఎంపీఓ పోలంపల్లి వెంకటేష్, హాస్టల్ అధికారి నైతం లక్ష్మణ్, ప్రకృతి మిత్ర సభ్యులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, చెట్ల ప్రాధాన్యత, ప్రకృతిని కాపాడాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 🌱🌳1
- 3వ రోజుకు చేరిన సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న నిరసన దీక్ష మూడో రోజు కూడా కొనసాగుతోంది. మూడో రోజు నిరసనలో భాగంగా బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల కండువాలు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన దీక్షకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌశిక్ హరన్, పర్లపల్లి రవి, జివి రాజు, కర్క శ్రీనివాస్ రెడ్డి (కార్పొరేటర్), నిమ్మరాజుల రవి (కార్పొరేటర్), కల్వాల సాగర్ తదితరులు పాల్గొని బాధితులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ నిరసన దీక్ష లక్కా శ్రావణ్ గౌడ్ అధ్యక్షతన శాంతియుతంగా కొనసాగుతోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు.1
- ఎంతకాలం బతికినం అనేది కాదు ఎట్లా బతికినమనేదే ముఖ్యం . దీనికి నిదర్శనం మన పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర : BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతకాలం బతికినం అనేది కాదు.. ఎట్లా బతికినం అనేది ముఖ్యం దానికి నిదర్శనం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలివచ్చిన జనం లక్షకు పైగా మంది 12 గంటల పాటు వర్షం పడుతున్నా ఎక్కడికి వెళ్లకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతాము2
- పెద్ది విగ్రహ ప్రతిష్ఠను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఉద్రిక్తత ల మధ్య బీఆర్ఎస్ నాయకులు నర్సంపేటలో ప్రతిష్ఠించారు. సోమవారం నిర్వహించిన ఈ విగ్రహ ప్రతిష్ఠ స్థలానికి చేరుకున్న డీసీపీ, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ప్రైవేట్ భూమిలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే మీకేంటని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు వెనక్కి తగ్గడంతో విగ్రహ ఏర్పాటును ఘనంగా నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ కి వచ్చే పర్యాటకుల భద్రతకు చర్యలు. పర్యాటకులు పోలీస్ వారి సూచనలు, హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలి. మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.1
- జైల్ భరో విజయవంతానికి గోదావరిఖనిలో 2K రన్ : తుమ్మల రాజారెడ్డి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మెండే శ్రీనివాస్ గోదావరిఖని సిఐటియు ఆఫీసు శ్రామిక భవన్ నుండి కూరగాయల మార్కెట్ వరకు... ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ గోదావరిఖని పారిశ్రామిక కార్మికులు, యువత, ప్రజల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి గారు 2k రన్ జండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ... క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు రైతులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికుల హక్కులను హరిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి ఎన్టీపీసీ తదితర సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ, 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల రైతుల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు, కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మెండె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపెల్లి జిల్లా కోశాధికారి ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి, ఆరేపల్లి రాజమౌళి, వంగల శివరాం రెడ్డి, నంది నారాయణ, దుర్గాప్రసాద్, జనార్దన్ రెడ్డి, అఖిల్, కుంభం కిషన్, కే సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.1
- చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన బాబు చుట్టూ చోద్యం చూస్తున్న జనం… మనవత్వం మంటకలిసిందా?", మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం లక్ష్మీనగర్–కృష్ణ కాలనీ వెళ్లే దారిలో " "అప్పుడే పుట్టిన ఓ శిశువును చెత్తకుప్పలో పడేసిన ఘటన కలకలం రేపింది. " "పసికందు ఏడుపు, ఆర్తనాదం వినిపిస్తున్నా చుట్టూ ఉన్న కొందరు జనం " "చోద్యం చూస్తూ నిలబడటం ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తోంది." "అయితే అదే సమయంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ కృష్ణ కాలనీకి చెందిన " "లేడీ జిమ్ ట్రైనర్ వెంటనే స్పందించి శిశువును తన చేతుల్లోకి తీసుకుని కాపాడారు. " "అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి మంచిర్యాల ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు."ఒక తల్లి గర్భంలో తొమ్మిది నెలలు పెరిగి ఈ లోకంలోకి వచ్చిన ఆ చిన్నారి… " "జీవితం మొదలైన క్షణాల్లోనే చెత్తకుప్పలో కనిపించడం హృదయ విదారకం. " "కన్నీళ్లు పెట్టే ఆ పసికందుకు తప్పు ఏముంది? పుట్టడం తప్పా? " "మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు సమాజం తన మనవత్వాన్ని మరోసారి ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి." ) ( "శిశువును కాపాడిన లేడీ జిమ్ ట్రైనర్ చూపిన ధైర్యం, దయకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. " "ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, " "పసికందుల రక్షణపై సమాజంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది." ) ఈ ఘటన ప్రతి ఒక్కరికీ ఒక గట్టి హెచ్చరిక. పుట్టిన వెంటనే రక్షణ కోసం " "ఎదురుచూస్తున్న పసికందును నిర్లక్ష్యం చేయడం సమాజానికి తీరని మచ్చ. " "ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో శిశువును గుర్తిస్తే వెంటనే 108కు సమాచారం అందించి, " "సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా పోలీసులకు తెలియజేయాలి. " "శిశువుల ప్రాణ రక్షణలో ప్రతి క్షణం ఎంతో విలువైనది." జన తెలంగాణ మంచిర్యాల జిల్లా ప్రతినిధి కాంపల్లి రాజేష్ కుమార్1