ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR TV 9 న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల నగరంలోని సాయికుంట ఇంటిగ్రేటెడ్ బీసీ బాలుర హాస్టల్ ఆవరణలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యత, వాటి సంరక్షణ, మొక్కలను దత్తత తీసుకొని పెంచాల్సిన బాధ్యతపై ప్రకృతి మిత్ర వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్ అవగాహన కల్పించారు. అనంతరం హాస్టల్ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో విద్యార్థులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటించారు. మొక్కల సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, నాటిన మొక్కలను వారికి దత్తతగా అప్పగించారు. మొక్కలను కాపాడుతూ వాటి పెరుగుదలకు తోడ్పడే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ సుధమల హరికృష్ణ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కొత్తూరి ముకుందం, జిల్లా ఫారెస్ట్ ఏఓ పొన్న మల్లయ్య, బీసీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి గుండు వెంకటేష్, జైపూర్ ఎంపీడీవో శ్రీపతి బాపురావు, వేమనపల్లి ఎంపీఓ పోలంపల్లి వెంకటేష్, హాస్టల్ అధికారి నైతం లక్ష్మణ్, ప్రకృతి మిత్ర సభ్యులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, చెట్ల ప్రాధాన్యత, ప్రకృతిని కాపాడాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 🌱🌳

- ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR TV 9 న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల నగరంలోని సాయికుంట ఇంటిగ్రేటెడ్ బీసీ బాలుర హాస్టల్ ఆవరణలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యత, వాటి సంరక్షణ, మొక్కలను దత్తత తీసుకొని పెంచాల్సిన బాధ్యతపై ప్రకృతి మిత్ర వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్ అవగాహన కల్పించారు. అనంతరం హాస్టల్ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో విద్యార్థులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటించారు. మొక్కల సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, నాటిన మొక్కలను వారికి దత్తతగా అప్పగించారు. మొక్కలను కాపాడుతూ వాటి పెరుగుదలకు తోడ్పడే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ సుధమల హరికృష్ణ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కొత్తూరి ముకుందం, జిల్లా ఫారెస్ట్ ఏఓ పొన్న మల్లయ్య, బీసీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి గుండు వెంకటేష్, జైపూర్ ఎంపీడీవో శ్రీపతి బాపురావు, వేమనపల్లి ఎంపీఓ పోలంపల్లి వెంకటేష్, హాస్టల్ అధికారి నైతం లక్ష్మణ్, ప్రకృతి మిత్ర సభ్యులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, చెట్ల ప్రాధాన్యత, ప్రకృతిని కాపాడాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 🌱🌳1
- 3వ రోజుకు చేరిన సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న నిరసన దీక్ష మూడో రోజు కూడా కొనసాగుతోంది. మూడో రోజు నిరసనలో భాగంగా బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల కండువాలు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన దీక్షకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌశిక్ హరన్, పర్లపల్లి రవి, జివి రాజు, కర్క శ్రీనివాస్ రెడ్డి (కార్పొరేటర్), నిమ్మరాజుల రవి (కార్పొరేటర్), కల్వాల సాగర్ తదితరులు పాల్గొని బాధితులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ నిరసన దీక్ష లక్కా శ్రావణ్ గౌడ్ అధ్యక్షతన శాంతియుతంగా కొనసాగుతోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు.1
- కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాల్సిందే; పోతు విజయ శంకర్ అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయాల్సిందేనని ఐద్వా మహిళా సంఘం జన్నారం మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్, సిపిఎం జన్నారం మండల కార్యదర్శి మురిమడుగు లింగన్న డిమాండ్ చేశారు. జైల్ భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వారు ధర్నా రాస్తారోకో చేశారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యతని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- కొండా0పేట రామ్ రెడ్డిపై మండిపడుతున్న చెన్నూరు మైనార్టీలు* *భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్* కొండా0పేట రామ్ రెడ్డిపై మండిపడుతున్న చెన్నూరు మైనార్టీలు* *భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్* *చెన్నూరు:* చెన్నూరు భక్తవర్ మజీద్ కమిటీకి చెందిన *తన్వీర్ బేగం* గారికి సంబంధించిన భూమి విషయంలో వివాదం జరిగింది. తన్వీర్ బేగం పేరిట *పట్టా పాస్ బుక్* ఉన్నప్పటికీ, *కొండం పేట రామ్ రెడ్డి అనుచరులు* ఆమె పొలంలోకి వెళ్లి దాడికి దిగారని ఆరోపణలు ఉన్నాయి. మైనార్టీ లేడీస్ అని కూడా చూడకుండా నెట్టివేయడంతో తన్వీర్ బేగం మరియు ఆమె మనవడు బురదలో పడిపోయారు. "మా ఊరికి రావద్దు, ఇది రామ్ రెడ్డి భూమి" అంటూ బెదిరించారని తన్వీర్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. "మా భూమి మేము సాగు చేసుకుంటే మీరెవరు అడ్డుకునేది" అని ప్రశ్నించారు. ఈ విషయంపై *భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్* గారు స్పందించారు. మైనార్టీలను పట్టించుకోని అధికారుల తీరును తప్పుపట్టారు. "తన్వీర్ బేగంకు అన్యాయం జరిగితే భక్తవర్ మజీద్ మైనార్టీ కమిటీ మొత్తం కదిలి వస్తాం. అధికారులను నిలదీసి అడుగుతాం. అవసరమైతే మైనార్టీ సత్తా చూపిస్తాం" అని హెచ్చరించారు. "ఇప్పుడు మా కమిటీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా భూమి నాకు వచ్చేలా వాళ్ళు సహాయం చేస్తే వాళ్లకు రుణపడి ఉంటాను" అని *తన్వీర్ బేగం* తెలిపారు .1
- చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన బాబు చుట్టూ చోద్యం చూస్తున్న జనం… మనవత్వం మంటకలిసిందా?", మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం లక్ష్మీనగర్–కృష్ణ కాలనీ వెళ్లే దారిలో " "అప్పుడే పుట్టిన ఓ శిశువును చెత్తకుప్పలో పడేసిన ఘటన కలకలం రేపింది. " "పసికందు ఏడుపు, ఆర్తనాదం వినిపిస్తున్నా చుట్టూ ఉన్న కొందరు జనం " "చోద్యం చూస్తూ నిలబడటం ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తోంది." "అయితే అదే సమయంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ కృష్ణ కాలనీకి చెందిన " "లేడీ జిమ్ ట్రైనర్ వెంటనే స్పందించి శిశువును తన చేతుల్లోకి తీసుకుని కాపాడారు. " "అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి మంచిర్యాల ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు."ఒక తల్లి గర్భంలో తొమ్మిది నెలలు పెరిగి ఈ లోకంలోకి వచ్చిన ఆ చిన్నారి… " "జీవితం మొదలైన క్షణాల్లోనే చెత్తకుప్పలో కనిపించడం హృదయ విదారకం. " "కన్నీళ్లు పెట్టే ఆ పసికందుకు తప్పు ఏముంది? పుట్టడం తప్పా? " "మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు సమాజం తన మనవత్వాన్ని మరోసారి ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి." ) ( "శిశువును కాపాడిన లేడీ జిమ్ ట్రైనర్ చూపిన ధైర్యం, దయకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. " "ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, " "పసికందుల రక్షణపై సమాజంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది." ) ఈ ఘటన ప్రతి ఒక్కరికీ ఒక గట్టి హెచ్చరిక. పుట్టిన వెంటనే రక్షణ కోసం " "ఎదురుచూస్తున్న పసికందును నిర్లక్ష్యం చేయడం సమాజానికి తీరని మచ్చ. " "ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో శిశువును గుర్తిస్తే వెంటనే 108కు సమాచారం అందించి, " "సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా పోలీసులకు తెలియజేయాలి. " "శిశువుల ప్రాణ రక్షణలో ప్రతి క్షణం ఎంతో విలువైనది." జన తెలంగాణ మంచిర్యాల జిల్లా ప్రతినిధి కాంపల్లి రాజేష్ కుమార్1