కొండా0పేట రామ్ రెడ్డిపై మండిపడుతున్న చెన్నూరు మైనార్టీలు* *భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్* కొండా0పేట రామ్ రెడ్డిపై మండిపడుతున్న చెన్నూరు మైనార్టీలు* *భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్* *చెన్నూరు:* చెన్నూరు భక్తవర్ మజీద్ కమిటీకి చెందిన *తన్వీర్ బేగం* గారికి సంబంధించిన భూమి విషయంలో వివాదం జరిగింది. తన్వీర్ బేగం పేరిట *పట్టా పాస్ బుక్* ఉన్నప్పటికీ, *కొండం పేట రామ్ రెడ్డి అనుచరులు* ఆమె పొలంలోకి వెళ్లి దాడికి దిగారని ఆరోపణలు ఉన్నాయి. మైనార్టీ లేడీస్ అని కూడా చూడకుండా నెట్టివేయడంతో తన్వీర్ బేగం మరియు ఆమె మనవడు బురదలో పడిపోయారు. "మా ఊరికి రావద్దు, ఇది రామ్ రెడ్డి భూమి" అంటూ బెదిరించారని తన్వీర్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. "మా భూమి మేము సాగు చేసుకుంటే మీరెవరు అడ్డుకునేది" అని ప్రశ్నించారు. ఈ విషయంపై *భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్* గారు స్పందించారు. మైనార్టీలను పట్టించుకోని అధికారుల తీరును తప్పుపట్టారు. "తన్వీర్ బేగంకు అన్యాయం జరిగితే భక్తవర్ మజీద్ మైనార్టీ కమిటీ మొత్తం కదిలి వస్తాం. అధికారులను నిలదీసి అడుగుతాం. అవసరమైతే మైనార్టీ సత్తా చూపిస్తాం" అని హెచ్చరించారు. "ఇప్పుడు మా కమిటీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా భూమి నాకు వచ్చేలా వాళ్ళు సహాయం చేస్తే వాళ్లకు రుణపడి ఉంటాను" అని *తన్వీర్ బేగం* తెలిపారు .
కొండా0పేట రామ్ రెడ్డిపై మండిపడుతున్న చెన్నూరు మైనార్టీలు* *భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్* కొండా0పేట రామ్ రెడ్డిపై మండిపడుతున్న చెన్నూరు మైనార్టీలు* *భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్* *చెన్నూరు:* చెన్నూరు భక్తవర్ మజీద్ కమిటీకి చెందిన *తన్వీర్ బేగం* గారికి సంబంధించిన భూమి విషయంలో వివాదం జరిగింది. తన్వీర్ బేగం పేరిట *పట్టా పాస్ బుక్* ఉన్నప్పటికీ, *కొండం పేట రామ్ రెడ్డి అనుచరులు* ఆమె పొలంలోకి వెళ్లి దాడికి దిగారని ఆరోపణలు ఉన్నాయి. మైనార్టీ లేడీస్ అని కూడా చూడకుండా నెట్టివేయడంతో తన్వీర్ బేగం మరియు ఆమె మనవడు బురదలో పడిపోయారు. "మా ఊరికి రావద్దు, ఇది రామ్ రెడ్డి భూమి" అంటూ బెదిరించారని తన్వీర్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. "మా భూమి మేము సాగు చేసుకుంటే మీరెవరు అడ్డుకునేది" అని ప్రశ్నించారు. ఈ విషయంపై *భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్* గారు స్పందించారు. మైనార్టీలను పట్టించుకోని అధికారుల తీరును తప్పుపట్టారు. "తన్వీర్ బేగంకు అన్యాయం జరిగితే భక్తవర్ మజీద్ మైనార్టీ కమిటీ మొత్తం కదిలి వస్తాం. అధికారులను నిలదీసి అడుగుతాం. అవసరమైతే మైనార్టీ సత్తా చూపిస్తాం" అని హెచ్చరించారు. "ఇప్పుడు మా కమిటీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా భూమి నాకు వచ్చేలా వాళ్ళు సహాయం చేస్తే వాళ్లకు రుణపడి ఉంటాను" అని *తన్వీర్ బేగం* తెలిపారు .
- ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR TV 9 న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల నగరంలోని సాయికుంట ఇంటిగ్రేటెడ్ బీసీ బాలుర హాస్టల్ ఆవరణలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యత, వాటి సంరక్షణ, మొక్కలను దత్తత తీసుకొని పెంచాల్సిన బాధ్యతపై ప్రకృతి మిత్ర వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్ అవగాహన కల్పించారు. అనంతరం హాస్టల్ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో విద్యార్థులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటించారు. మొక్కల సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, నాటిన మొక్కలను వారికి దత్తతగా అప్పగించారు. మొక్కలను కాపాడుతూ వాటి పెరుగుదలకు తోడ్పడే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ సుధమల హరికృష్ణ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కొత్తూరి ముకుందం, జిల్లా ఫారెస్ట్ ఏఓ పొన్న మల్లయ్య, బీసీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి గుండు వెంకటేష్, జైపూర్ ఎంపీడీవో శ్రీపతి బాపురావు, వేమనపల్లి ఎంపీఓ పోలంపల్లి వెంకటేష్, హాస్టల్ అధికారి నైతం లక్ష్మణ్, ప్రకృతి మిత్ర సభ్యులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, చెట్ల ప్రాధాన్యత, ప్రకృతిని కాపాడాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 🌱🌳1
- 3వ రోజుకు చేరిన సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న నిరసన దీక్ష మూడో రోజు కూడా కొనసాగుతోంది. మూడో రోజు నిరసనలో భాగంగా బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల కండువాలు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన దీక్షకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌశిక్ హరన్, పర్లపల్లి రవి, జివి రాజు, కర్క శ్రీనివాస్ రెడ్డి (కార్పొరేటర్), నిమ్మరాజుల రవి (కార్పొరేటర్), కల్వాల సాగర్ తదితరులు పాల్గొని బాధితులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ నిరసన దీక్ష లక్కా శ్రావణ్ గౌడ్ అధ్యక్షతన శాంతియుతంగా కొనసాగుతోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు.1
- కరీంనగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకాంత్‌పై దాడి పరామర్శించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రీకాంత్‌పై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. దాడుల సంస్కృతిని తెచ్చింది బీజేపీనే: గంగుల కమలాకర్ మేయర్ పీఠం ఇస్తే దాడులా? కరీంనగర్ ప్రజలు బీజేపీకి మేయర్ పదవిని కట్టబెడితే, వారు నగరంలో 'దాడుల సంస్కృతి'కి తెరలేపారని గంగుల కమలాకర్ మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ రెండు పర్యాయాలు మేయర్ పీఠం అధిరోహించినా, అలాగే కాంగ్రెస్ హయాంలోనూ కరీంనగర్‌లో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన సుపరిపాలన అందించామని గుర్తుచేశారు. కక్షసాధింపు చర్యలు: బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలలో తిరుగుతున్నాడనే అక్కసుతోనే బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు తన అనుచరులతో కలిసి రోడ్డుపై శ్రీకాంత్‌పై ఇనుప రాడ్లతో పాశవికంగా దాడి చేశారని ఆరోపించారు. శ్రీకాంత్ చనిపోయాడని భావించి వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ప్రశ్నలు...పోలీసుల తీరుపై ప్రశంసలు కరీంనగర్ ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు? కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు పార్టీలో ఏం జరుగుతుందో అర్థమవుతుందా?" అని గంగుల ప్రశ్నించారు. గతంలో తన కార్యాలయంపై దాడి జరిగినప్పుడే హోం మంత్రి హోదాలో ఉన్నవారు స్పందించి చర్యలు తీసుకుని ఉంటే, నేడు ఇలాంటి దాడులు పునరావృతం కాకపోయేవని అన్నారు. కిసాన్ నగర్‌లో తాము రోడ్లు వేయిస్తే, బీజేపీ నాయకులు రాడ్లతో ప్రజలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. గెలిచి మూడు నెలలు కూడా కాకముందే దాడులకు తెరలేపారని ధ్వజమెత్తారు. పోలీసుల పనితీరు: పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏ పార్టీవారైనా సరే చట్టం ముందు శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. అభివృద్ధి వర్సెస్ విధ్వంసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్‌ను రూ.1,650 కోట్లతో అత్యద్భుతంగా, సురక్షితమైన 'స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్దామని తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ నగరానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారనుకుంటే, కేవలం దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ ఎప్పుడూ శాంతియుతంగా, సేఫ్ సిటీగా ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ శ్రేణులకు పూర్తి భరోసా. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ తన కార్యకర్తలకు అండగా ఉంటుందని భెరోసా కల్పించారు. కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే కరీంనగర్‌కు రానున్నట్లు తెలిపారు. రెండేళ్లలో ఈ ప్రభుత్వం తొలగిపోతుంది, ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తాము. మేము కూడా ప్రతిదాడులు చేయము కానీ చట్టం ముందే దోషులను నిలబెడతాము" అని హెచ్చరించారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి స్పందించి, హింసకు పాల్పడిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే గంగుల తో పాటు బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.2
- జైల్ భరో విజయవంతానికి గోదావరిఖనిలో 2K రన్ : తుమ్మల రాజారెడ్డి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మెండే శ్రీనివాస్ గోదావరిఖని సిఐటియు ఆఫీసు శ్రామిక భవన్ నుండి కూరగాయల మార్కెట్ వరకు... ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ గోదావరిఖని పారిశ్రామిక కార్మికులు, యువత, ప్రజల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి గారు 2k రన్ జండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ... క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు రైతులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికుల హక్కులను హరిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి ఎన్టీపీసీ తదితర సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ, 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల రైతుల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు, కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మెండె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపెల్లి జిల్లా కోశాధికారి ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి, ఆరేపల్లి రాజమౌళి, వంగల శివరాం రెడ్డి, నంది నారాయణ, దుర్గాప్రసాద్, జనార్దన్ రెడ్డి, అఖిల్, కుంభం కిషన్, కే సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.1
- చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన బాబు చుట్టూ చోద్యం చూస్తున్న జనం… మనవత్వం మంటకలిసిందా?", మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం లక్ష్మీనగర్–కృష్ణ కాలనీ వెళ్లే దారిలో " "అప్పుడే పుట్టిన ఓ శిశువును చెత్తకుప్పలో పడేసిన ఘటన కలకలం రేపింది. " "పసికందు ఏడుపు, ఆర్తనాదం వినిపిస్తున్నా చుట్టూ ఉన్న కొందరు జనం " "చోద్యం చూస్తూ నిలబడటం ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తోంది." "అయితే అదే సమయంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ కృష్ణ కాలనీకి చెందిన " "లేడీ జిమ్ ట్రైనర్ వెంటనే స్పందించి శిశువును తన చేతుల్లోకి తీసుకుని కాపాడారు. " "అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి మంచిర్యాల ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు."ఒక తల్లి గర్భంలో తొమ్మిది నెలలు పెరిగి ఈ లోకంలోకి వచ్చిన ఆ చిన్నారి… " "జీవితం మొదలైన క్షణాల్లోనే చెత్తకుప్పలో కనిపించడం హృదయ విదారకం. " "కన్నీళ్లు పెట్టే ఆ పసికందుకు తప్పు ఏముంది? పుట్టడం తప్పా? " "మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు సమాజం తన మనవత్వాన్ని మరోసారి ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి." ) ( "శిశువును కాపాడిన లేడీ జిమ్ ట్రైనర్ చూపిన ధైర్యం, దయకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. " "ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, " "పసికందుల రక్షణపై సమాజంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది." ) ఈ ఘటన ప్రతి ఒక్కరికీ ఒక గట్టి హెచ్చరిక. పుట్టిన వెంటనే రక్షణ కోసం " "ఎదురుచూస్తున్న పసికందును నిర్లక్ష్యం చేయడం సమాజానికి తీరని మచ్చ. " "ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో శిశువును గుర్తిస్తే వెంటనే 108కు సమాచారం అందించి, " "సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా పోలీసులకు తెలియజేయాలి. " "శిశువుల ప్రాణ రక్షణలో ప్రతి క్షణం ఎంతో విలువైనది." జన తెలంగాణ మంచిర్యాల జిల్లా ప్రతినిధి కాంపల్లి రాజేష్ కుమార్1