జైల్ భరో విజయవంతానికి గోదావరిఖనిలో 2K రన్ : తుమ్మల రాజారెడ్డి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మెండే శ్రీనివాస్ గోదావరిఖని సిఐటియు ఆఫీసు శ్రామిక భవన్ నుండి కూరగాయల మార్కెట్ వరకు... ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ గోదావరిఖని పారిశ్రామిక కార్మికులు, యువత, ప్రజల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి గారు 2k రన్ జండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ... క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు రైతులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికుల హక్కులను హరిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి ఎన్టీపీసీ తదితర సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ, 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల రైతుల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు, కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మెండె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపెల్లి జిల్లా కోశాధికారి ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి, ఆరేపల్లి రాజమౌళి, వంగల శివరాం రెడ్డి, నంది నారాయణ, దుర్గాప్రసాద్, జనార్దన్ రెడ్డి, అఖిల్, కుంభం కిషన్, కే సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

- 3వ రోజుకు చేరిన సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న నిరసన దీక్ష మూడో రోజు కూడా కొనసాగుతోంది. మూడో రోజు నిరసనలో భాగంగా బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల కండువాలు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన దీక్షకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌశిక్ హరన్, పర్లపల్లి రవి, జివి రాజు, కర్క శ్రీనివాస్ రెడ్డి (కార్పొరేటర్), నిమ్మరాజుల రవి (కార్పొరేటర్), కల్వాల సాగర్ తదితరులు పాల్గొని బాధితులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ నిరసన దీక్ష లక్కా శ్రావణ్ గౌడ్ అధ్యక్షతన శాంతియుతంగా కొనసాగుతోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు.1
- ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR TV 9 న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల నగరంలోని సాయికుంట ఇంటిగ్రేటెడ్ బీసీ బాలుర హాస్టల్ ఆవరణలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యత, వాటి సంరక్షణ, మొక్కలను దత్తత తీసుకొని పెంచాల్సిన బాధ్యతపై ప్రకృతి మిత్ర వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్ అవగాహన కల్పించారు. అనంతరం హాస్టల్ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో విద్యార్థులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటించారు. మొక్కల సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, నాటిన మొక్కలను వారికి దత్తతగా అప్పగించారు. మొక్కలను కాపాడుతూ వాటి పెరుగుదలకు తోడ్పడే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ సుధమల హరికృష్ణ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కొత్తూరి ముకుందం, జిల్లా ఫారెస్ట్ ఏఓ పొన్న మల్లయ్య, బీసీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి గుండు వెంకటేష్, జైపూర్ ఎంపీడీవో శ్రీపతి బాపురావు, వేమనపల్లి ఎంపీఓ పోలంపల్లి వెంకటేష్, హాస్టల్ అధికారి నైతం లక్ష్మణ్, ప్రకృతి మిత్ర సభ్యులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, చెట్ల ప్రాధాన్యత, ప్రకృతిని కాపాడాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 🌱🌳1
- కాసేపటి క్రితం గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దూకడం ప్రారంభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కాసేపటి క్రితం గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దూకడం ప్రారంభించింది. మత్తడి దూకే ప్రదేశానికి సందర్శకులు ఎవరు కూడా వెళ్లకూడదని సిరిసిల్ల డీఎస్పీ కత్రోజ్ నాగేంద్ర చారి, ఎల్లారెడ్డిపేట సి ఐ వెంకటేష్ లు హెచ్చరికలు జారీ చేశారు.నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.1
- ముగిసిన ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ...ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 లక్షల 94 వేల మంది ఓట్లు తొలగింపు...అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లు తొలగింపు ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ నేటితో ముగుస్తున్న నేపథ్యంలో భారీగా ఓట్లు తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు లక్షల 94 వేల మంది పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశాలున్నాయి. అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లు తొలగిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 29 లక్షల 97 వేల మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 26 లక్షల మూడు వేల మంది సర్ ప్రక్రియలో పాల్గొని ఎన్యూమరేషన్ ఫామ్ లు బిఎల్వో లకు అందజేశారు. ఈరోజు అర్ధరాత్రి వరకు ఎన్యూమరేషన్ ఫామ్ లు స్వీకరించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. డబల్ ఎంట్రీ, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిపోతున్నాయి. ఓటర్ జాబితా పై అభ్యంతరాలను రేపటి నుంచి స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పరిష్కరిస్తారు. ఓటర్ ఫైనల్ జాబితా అక్టోబర్ 19న ప్రకటించనున్నారు. తాజా ఓటర్ జాబితాలో పేర్లు రానివారు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటర్ నమోదు కావాలంటే ఫామ్ 6 తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ 2002 లేదా 2026 సర్ ఫ్యామిలీ మ్యాపింగ్ డిటేల్స్ సమర్పించాల్సి ఉంటుంది.1
- జైల్ భరో విజయవంతానికి గోదావరిఖనిలో 2K రన్ : తుమ్మల రాజారెడ్డి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మెండే శ్రీనివాస్ గోదావరిఖని సిఐటియు ఆఫీసు శ్రామిక భవన్ నుండి కూరగాయల మార్కెట్ వరకు... ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ గోదావరిఖని పారిశ్రామిక కార్మికులు, యువత, ప్రజల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి గారు 2k రన్ జండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ... క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు రైతులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికుల హక్కులను హరిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి ఎన్టీపీసీ తదితర సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ, 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల రైతుల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు, కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మెండె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపెల్లి జిల్లా కోశాధికారి ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి, ఆరేపల్లి రాజమౌళి, వంగల శివరాం రెడ్డి, నంది నారాయణ, దుర్గాప్రసాద్, జనార్దన్ రెడ్డి, అఖిల్, కుంభం కిషన్, కే సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.1
- చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన బాబు చుట్టూ చోద్యం చూస్తున్న జనం… మనవత్వం మంటకలిసిందా?", మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం లక్ష్మీనగర్–కృష్ణ కాలనీ వెళ్లే దారిలో " "అప్పుడే పుట్టిన ఓ శిశువును చెత్తకుప్పలో పడేసిన ఘటన కలకలం రేపింది. " "పసికందు ఏడుపు, ఆర్తనాదం వినిపిస్తున్నా చుట్టూ ఉన్న కొందరు జనం " "చోద్యం చూస్తూ నిలబడటం ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తోంది." "అయితే అదే సమయంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ కృష్ణ కాలనీకి చెందిన " "లేడీ జిమ్ ట్రైనర్ వెంటనే స్పందించి శిశువును తన చేతుల్లోకి తీసుకుని కాపాడారు. " "అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి మంచిర్యాల ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు."ఒక తల్లి గర్భంలో తొమ్మిది నెలలు పెరిగి ఈ లోకంలోకి వచ్చిన ఆ చిన్నారి… " "జీవితం మొదలైన క్షణాల్లోనే చెత్తకుప్పలో కనిపించడం హృదయ విదారకం. " "కన్నీళ్లు పెట్టే ఆ పసికందుకు తప్పు ఏముంది? పుట్టడం తప్పా? " "మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు సమాజం తన మనవత్వాన్ని మరోసారి ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి." ) ( "శిశువును కాపాడిన లేడీ జిమ్ ట్రైనర్ చూపిన ధైర్యం, దయకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. " "ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, " "పసికందుల రక్షణపై సమాజంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది." ) ఈ ఘటన ప్రతి ఒక్కరికీ ఒక గట్టి హెచ్చరిక. పుట్టిన వెంటనే రక్షణ కోసం " "ఎదురుచూస్తున్న పసికందును నిర్లక్ష్యం చేయడం సమాజానికి తీరని మచ్చ. " "ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో శిశువును గుర్తిస్తే వెంటనే 108కు సమాచారం అందించి, " "సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా పోలీసులకు తెలియజేయాలి. " "శిశువుల ప్రాణ రక్షణలో ప్రతి క్షణం ఎంతో విలువైనది." జన తెలంగాణ మంచిర్యాల జిల్లా ప్రతినిధి కాంపల్లి రాజేష్ కుమార్1