logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

3వ రోజుకు చేరిన సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న నిరసన దీక్ష మూడో రోజు కూడా కొనసాగుతోంది. మూడో రోజు నిరసనలో భాగంగా బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల కండువాలు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన దీక్షకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌశిక్ హరన్, పర్లపల్లి రవి, జివి రాజు, కర్క శ్రీనివాస్ రెడ్డి (కార్పొరేటర్), నిమ్మరాజుల రవి (కార్పొరేటర్), కల్వాల సాగర్ తదితరులు పాల్గొని బాధితులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ నిరసన దీక్ష లక్కా శ్రావణ్ గౌడ్ అధ్యక్షతన శాంతియుతంగా కొనసాగుతోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు.

21 hrs ago
user_Telangana reporter
Telangana reporter
Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
21 hrs ago

3వ రోజుకు చేరిన సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న నిరసన దీక్ష మూడో రోజు కూడా కొనసాగుతోంది. మూడో రోజు నిరసనలో భాగంగా బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల కండువాలు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన దీక్షకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌశిక్ హరన్, పర్లపల్లి రవి, జివి రాజు, కర్క శ్రీనివాస్ రెడ్డి (కార్పొరేటర్), నిమ్మరాజుల రవి (కార్పొరేటర్), కల్వాల సాగర్ తదితరులు పాల్గొని బాధితులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ నిరసన దీక్ష లక్కా శ్రావణ్ గౌడ్ అధ్యక్షతన శాంతియుతంగా కొనసాగుతోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • కొండా0పేట రామ్ రెడ్డిపై మండిపడుతున్న చెన్నూరు మైనార్టీలు* *భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్* కొండా0పేట రామ్ రెడ్డిపై మండిపడుతున్న చెన్నూరు మైనార్టీలు* *భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్* *చెన్నూరు:* చెన్నూరు భక్తవర్ మజీద్ కమిటీకి చెందిన *తన్వీర్ బేగం* గారికి సంబంధించిన భూమి విషయంలో వివాదం జరిగింది. తన్వీర్ బేగం పేరిట *పట్టా పాస్ బుక్* ఉన్నప్పటికీ, *కొండం పేట రామ్ రెడ్డి అనుచరులు* ఆమె పొలంలోకి వెళ్లి దాడికి దిగారని ఆరోపణలు ఉన్నాయి. మైనార్టీ లేడీస్ అని కూడా చూడకుండా నెట్టివేయడంతో తన్వీర్ బేగం మరియు ఆమె మనవడు బురదలో పడిపోయారు. "మా ఊరికి రావద్దు, ఇది రామ్ రెడ్డి భూమి" అంటూ బెదిరించారని తన్వీర్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. "మా భూమి మేము సాగు చేసుకుంటే మీరెవరు అడ్డుకునేది" అని ప్రశ్నించారు. ఈ విషయంపై *భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్* గారు స్పందించారు. మైనార్టీలను పట్టించుకోని అధికారుల తీరును తప్పుపట్టారు. "తన్వీర్ బేగంకు అన్యాయం జరిగితే భక్తవర్ మజీద్ మైనార్టీ కమిటీ మొత్తం కదిలి వస్తాం. అధికారులను నిలదీసి అడుగుతాం. అవసరమైతే మైనార్టీ సత్తా చూపిస్తాం" అని హెచ్చరించారు. "ఇప్పుడు మా కమిటీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా భూమి నాకు వచ్చేలా వాళ్ళు సహాయం చేస్తే వాళ్లకు రుణపడి ఉంటాను" అని *తన్వీర్ బేగం* తెలిపారు .
    1
    కొండా0పేట రామ్ రెడ్డిపై మండిపడుతున్న చెన్నూరు మైనార్టీలు*  
*భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్*

కొండా0పేట రామ్ రెడ్డిపై మండిపడుతున్న చెన్నూరు మైనార్టీలు*  
*భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్*
*చెన్నూరు:*  
చెన్నూరు భక్తవర్ మజీద్ కమిటీకి చెందిన *తన్వీర్ బేగం* గారికి సంబంధించిన భూమి విషయంలో వివాదం జరిగింది.
తన్వీర్ బేగం పేరిట *పట్టా పాస్ బుక్* ఉన్నప్పటికీ, *కొండం పేట రామ్ రెడ్డి అనుచరులు* ఆమె పొలంలోకి వెళ్లి దాడికి దిగారని ఆరోపణలు ఉన్నాయి. మైనార్టీ లేడీస్ అని కూడా చూడకుండా నెట్టివేయడంతో తన్వీర్ బేగం మరియు ఆమె మనవడు బురదలో పడిపోయారు.
"మా ఊరికి రావద్దు, ఇది రామ్ రెడ్డి భూమి" అంటూ బెదిరించారని తన్వీర్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. "మా భూమి మేము సాగు చేసుకుంటే మీరెవరు అడ్డుకునేది" అని ప్రశ్నించారు.
ఈ విషయంపై *భక్తవర్ మజీద్ కమిటీ ఎండి సర్దార్ బాయ్* గారు స్పందించారు. మైనార్టీలను పట్టించుకోని అధికారుల తీరును తప్పుపట్టారు. "తన్వీర్ బేగంకు అన్యాయం జరిగితే భక్తవర్ మజీద్ మైనార్టీ కమిటీ మొత్తం కదిలి వస్తాం. అధికారులను నిలదీసి అడుగుతాం. అవసరమైతే మైనార్టీ సత్తా చూపిస్తాం" అని హెచ్చరించారు.
"ఇప్పుడు మా కమిటీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా భూమి నాకు వచ్చేలా వాళ్ళు సహాయం చేస్తే వాళ్లకు రుణపడి ఉంటాను" అని *తన్వీర్ బేగం* తెలిపారు .
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • మెట్ పల్లి లో ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలు...ఇద్దరు పాపలు, ఒక బాబు జననం జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. ఒకేసారి ముగ్గురు చిన్నారులు జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మెట్పల్లి ​మండలం రాజేశ్వర్ రావు పేట గ్రామానికి చెందిన జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు వివాహమైన తర్వాత ఇది మొదటి సంతానం. రాజ లక్ష్మికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మెట్ పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆమెకు కాన్పు చేయగా ఒకే ప్రసవంలో ముగ్గురు పసిపాపలు జన్మించారు.​పుట్టిన వారిలో ఒక బాబు,ఇద్దరు పాపలు ఉన్నారు. ​బాబు బరువు: 1.8 కేజీలు ​మొదటి పాప బరువు: 1.5 కేజీలు​,రెండో పాప బరువు: 1.4 కేజీలు,​ప్రస్తుతం తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.ముగ్గురు చిన్నారులు తక్కువ బరువుతో జన్మించడంతో,పిల్లల నిపుణుల (Pediatrician) ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.​మొదటి సంతానంలోనే ఒకేసారి ముగ్గురు బిడ్డలు పుట్టడంతో జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు స్థానికులు,బంధువులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
    1
    మెట్ పల్లి లో ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలు...ఇద్దరు పాపలు, ఒక బాబు జననం
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. ఒకేసారి ముగ్గురు చిన్నారులు జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మెట్పల్లి  ​మండలం రాజేశ్వర్ రావు పేట గ్రామానికి చెందిన జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు వివాహమైన తర్వాత ఇది మొదటి సంతానం. రాజ లక్ష్మికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మెట్ పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆమెకు కాన్పు చేయగా ఒకే ప్రసవంలో ముగ్గురు పసిపాపలు జన్మించారు.​పుట్టిన వారిలో ఒక బాబు,ఇద్దరు పాపలు ఉన్నారు.
​బాబు బరువు: 1.8 కేజీలు
​మొదటి పాప బరువు: 1.5 కేజీలు​,రెండో పాప బరువు: 1.4 కేజీలు,​ప్రస్తుతం తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.ముగ్గురు చిన్నారులు తక్కువ బరువుతో జన్మించడంతో,పిల్లల నిపుణుల (Pediatrician) ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.​మొదటి సంతానంలోనే ఒకేసారి ముగ్గురు బిడ్డలు పుట్టడంతో జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు స్థానికులు,బంధువులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాల్సిందే; పోతు విజయ శంకర్ అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయాల్సిందేనని ఐద్వా మహిళా సంఘం జన్నారం మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్, సిపిఎం జన్నారం మండల కార్యదర్శి మురిమడుగు లింగన్న డిమాండ్ చేశారు. జైల్ భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వారు ధర్నా రాస్తారోకో చేశారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యతని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    1
    కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాల్సిందే; పోతు విజయ శంకర్
అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయాల్సిందేనని ఐద్వా మహిళా సంఘం జన్నారం మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్, సిపిఎం జన్నారం మండల కార్యదర్శి మురిమడుగు లింగన్న డిమాండ్ చేశారు. జైల్ భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వారు ధర్నా రాస్తారోకో చేశారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యతని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • ఆదివాసీ వేడుకల్లో అధికారుల సందడి.. గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే, కలెక్టర్ నృత్యం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివాసీ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన కార్యక్రమాల్లో గిరిజనులు, కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ మకరంద్ సంప్రదాయ నృత్యంలో పాల్గొని సందడి చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గిరిజన కళాకారులతో కలిసి నృత్యం చేయడంతో కార్యక్రమ ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తమ అభిమానాన్ని చాటిన ఈ దృశ్యాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. కార్యక్రమానికి హాజరైన ప్రజలు అధికారుల నృత్యాన్ని ఆసక్తిగా తిలకిస్తూ చప్పట్లతో అభినందించారు.
    1
    ఆదివాసీ వేడుకల్లో అధికారుల సందడి.. గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే, కలెక్టర్ నృత్యం
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివాసీ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన కార్యక్రమాల్లో గిరిజనులు, కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ మకరంద్ సంప్రదాయ నృత్యంలో పాల్గొని సందడి చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గిరిజన కళాకారులతో కలిసి నృత్యం చేయడంతో కార్యక్రమ ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తమ అభిమానాన్ని చాటిన ఈ దృశ్యాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. కార్యక్రమానికి హాజరైన ప్రజలు అధికారుల నృత్యాన్ని ఆసక్తిగా తిలకిస్తూ చప్పట్లతో అభినందించారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    22 hrs ago
  • ముక్కిస లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, ఈరోజు మానకొండూరు మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ఎలా శేఖర్ బాబు, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ముక్కిస లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, ఈరోజు మానకొండూరు మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ఎలా శేఖర్ బాబు, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • ఆదివాసీలను అడవికి దూరం చేసే కుట్ర చేస్తున్న మోడీ ప్రభుత్వం : జూపాక శ్రీనివాస్ CPI ML మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గోదావరిఖని కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవ సభ జరిగింది. ఆదివాసీల హక్కులను పరిరక్షించడంతో పాటు, రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, జల్–జంగల్–జమీన్‌పై ఆదివాసీల హక్కులను కాపాడాలని *సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు* భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఆదివాసీ సమాజం ఇప్పటికీ భూమి, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, రహదారులు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అభివృద్ధి పేరుతో గనులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం ఆదివాసీల భూములను తీసుకోవడం వల్ల అనేక కుటుంబాలు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నాయి. ఆదివాసీల సంప్రదాయ హక్కులను గుర్తించి అటవీ హక్కుల చట్టం–2006ను సమర్థవంతంగా అమలు చేయాలి. అర్హులైన ప్రతి ఆదివాసీ కుటుంబానికి వ్యక్తిగత, సామూహిక అటవీ హక్కుల పట్టాలు ఇవ్వాలి. పోడు సాగుదారులసమస్యలను పరిష్కరించి, వారి సాగు భూములకు హక్కులు కల్పించాలి. ఆదివాసీల అనుమతి, గ్రామసభ నిర్ణయాలను పక్కన పెట్టి వారి భూములను ఇతర అవసరాలకు బదలాయించకుండా ఆదివాసీ ప్రాంతాల్లో నాణ్యమైన ప్రభుత్వ విద్య, హాస్టళ్లు, వైద్య సదుపాయాలు, తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి, మధ్యవర్తుల దోపిడీని అరికట్టాలి. ఆదివాసీ యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించాలి. గనులు, ప్రాజెక్టులు, పరిశ్రమల కారణంగా నిర్వాసితులయ్యే ఆదివాసీలకు న్యాయమైన పరిహారం, భూమి, పునరావాసం, ఉపాధి కల్పించిన తర్వాతే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. ఆదివాసీ భాషలు, సంస్కృతి,సంప్రదాయాలుజీవన విధానాన్ని పరిరక్షించాలి. మా ప్రధాన డిమాండ్లు జల్–జంగల్–జమీన్‌పై ఆదివాసీల హక్కులను కాపాడాలి.అర్హులైన ప్రతి ఆదివాసీ కుటుంబానికి అటవీ హక్కుల పట్టాలు ఇవ్వాలి.పోడుసాగుదారులపై వేధింపులు, అక్రమ కేసులు నిలిపివేయాలి. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం,తాగునీరు,రహదారులు వంటి మౌలిక సదుపాయాలుకల్పించాలి ఆదివాసీ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు పెంచాలి.ఆదివాసీల హక్కుల కోసం ఐక్యంగా నిలుద్దాంజల్–జంగల్–జమీన్‌ను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. *ఇంకా ఈ సభలో CPI ML మాస్ లైన్ ప్రజాపంథా పెద్దపెల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, జిల్లా నాయకులు మార్త రాములు, గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజుల లక్ష్మి, మార్త రాద, కలవల రాయమల్లు బత్తుల రాజన్న , శనగరపు రామస్వామి, సునీత, ఉడిగమ్మ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదివాసీలను అడవికి దూరం చేసే కుట్ర చేస్తున్న మోడీ ప్రభుత్వం : జూపాక శ్రీనివాస్ CPI ML మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గోదావరిఖని కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవ సభ జరిగింది.
ఆదివాసీల హక్కులను పరిరక్షించడంతో పాటు, రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, జల్–జంగల్–జమీన్‌పై ఆదివాసీల హక్కులను కాపాడాలని *సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు*
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఆదివాసీ సమాజం ఇప్పటికీ భూమి, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, రహదారులు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అభివృద్ధి పేరుతో గనులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం ఆదివాసీల భూములను తీసుకోవడం వల్ల అనేక కుటుంబాలు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నాయి.
ఆదివాసీల సంప్రదాయ హక్కులను గుర్తించి అటవీ హక్కుల చట్టం–2006ను సమర్థవంతంగా అమలు చేయాలి. అర్హులైన ప్రతి ఆదివాసీ కుటుంబానికి వ్యక్తిగత, సామూహిక అటవీ హక్కుల పట్టాలు ఇవ్వాలి. పోడు సాగుదారులసమస్యలను పరిష్కరించి, వారి సాగు భూములకు హక్కులు కల్పించాలి. ఆదివాసీల అనుమతి, గ్రామసభ నిర్ణయాలను పక్కన పెట్టి వారి భూములను ఇతర అవసరాలకు బదలాయించకుండా 
ఆదివాసీ ప్రాంతాల్లో నాణ్యమైన ప్రభుత్వ విద్య, హాస్టళ్లు, వైద్య సదుపాయాలు, తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి, మధ్యవర్తుల దోపిడీని అరికట్టాలి. ఆదివాసీ యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించాలి.
గనులు, ప్రాజెక్టులు, పరిశ్రమల కారణంగా నిర్వాసితులయ్యే ఆదివాసీలకు న్యాయమైన పరిహారం, భూమి, పునరావాసం, ఉపాధి కల్పించిన తర్వాతే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. ఆదివాసీ భాషలు, సంస్కృతి,సంప్రదాయాలుజీవన విధానాన్ని పరిరక్షించాలి.
మా ప్రధాన డిమాండ్లు
జల్–జంగల్–జమీన్‌పై ఆదివాసీల హక్కులను కాపాడాలి.అర్హులైన ప్రతి ఆదివాసీ కుటుంబానికి అటవీ హక్కుల పట్టాలు ఇవ్వాలి.పోడుసాగుదారులపై వేధింపులు, అక్రమ కేసులు నిలిపివేయాలి.
గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం,తాగునీరు,రహదారులు వంటి మౌలిక సదుపాయాలుకల్పించాలి
ఆదివాసీ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు పెంచాలి.ఆదివాసీల హక్కుల కోసం ఐక్యంగా నిలుద్దాంజల్–జంగల్–జమీన్‌ను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.            *ఇంకా ఈ సభలో CPI ML మాస్ లైన్ ప్రజాపంథా పెద్దపెల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, జిల్లా నాయకులు మార్త రాములు, గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజుల లక్ష్మి, మార్త రాద, కలవల రాయమల్లు బత్తుల రాజన్న , శనగరపు రామస్వామి, సునీత, ఉడిగమ్మ తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    21 hrs ago
  • ఈశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: సింగర్ మంగ్లీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని మంగ్లీ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు మంగ్లీకి ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న మంగ్లీ, ఆలయ విశిష్టతను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు, అభిమానులు ఆమెను ఆసక్తిగా గమనించారు.
    2
    ఈశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: సింగర్ మంగ్లీ 
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని మంగ్లీ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు మంగ్లీకి ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న మంగ్లీ, ఆలయ విశిష్టతను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు, అభిమానులు ఆమెను ఆసక్తిగా గమనించారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • నాగపూరి చందు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ షాక్‌తో మృతిచెందిన నాగపూరి చందు మృతదేహానికి సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెంచికల్‌పేట్ మండలం మోట్లగూడ వద్ద కరెంటు స్తంభంపై పనిచేస్తుండగా చందుకు షాక్ తగిలి మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ తరపున బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం, పెన్షన్‌తో పాటు కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీనిచ్చారు.
    1
    నాగపూరి చందు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం

ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ షాక్‌తో మృతిచెందిన నాగపూరి చందు మృతదేహానికి సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెంచికల్‌పేట్ మండలం మోట్లగూడ వద్ద కరెంటు స్తంభంపై పనిచేస్తుండగా చందుకు షాక్ తగిలి మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు.
విద్యుత్ శాఖ తరపున బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం, పెన్షన్‌తో పాటు కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీనిచ్చారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.