చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన బాబు చుట్టూ చోద్యం చూస్తున్న జనం… మనవత్వం మంటకలిసిందా?", మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం లక్ష్మీనగర్–కృష్ణ కాలనీ వెళ్లే దారిలో " "అప్పుడే పుట్టిన ఓ శిశువును చెత్తకుప్పలో పడేసిన ఘటన కలకలం రేపింది. " "పసికందు ఏడుపు, ఆర్తనాదం వినిపిస్తున్నా చుట్టూ ఉన్న కొందరు జనం " "చోద్యం చూస్తూ నిలబడటం ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తోంది." "అయితే అదే సమయంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ కృష్ణ కాలనీకి చెందిన " "లేడీ జిమ్ ట్రైనర్ వెంటనే స్పందించి శిశువును తన చేతుల్లోకి తీసుకుని కాపాడారు. " "అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి మంచిర్యాల ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు."ఒక తల్లి గర్భంలో తొమ్మిది నెలలు పెరిగి ఈ లోకంలోకి వచ్చిన ఆ చిన్నారి… " "జీవితం మొదలైన క్షణాల్లోనే చెత్తకుప్పలో కనిపించడం హృదయ విదారకం. " "కన్నీళ్లు పెట్టే ఆ పసికందుకు తప్పు ఏముంది? పుట్టడం తప్పా? " "మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు సమాజం తన మనవత్వాన్ని మరోసారి ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి." ) ( "శిశువును కాపాడిన లేడీ జిమ్ ట్రైనర్ చూపిన ధైర్యం, దయకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. " "ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, " "పసికందుల రక్షణపై సమాజంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది." ) ఈ ఘటన ప్రతి ఒక్కరికీ ఒక గట్టి హెచ్చరిక. పుట్టిన వెంటనే రక్షణ కోసం " "ఎదురుచూస్తున్న పసికందును నిర్లక్ష్యం చేయడం సమాజానికి తీరని మచ్చ. " "ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో శిశువును గుర్తిస్తే వెంటనే 108కు సమాచారం అందించి, " "సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా పోలీసులకు తెలియజేయాలి. " "శిశువుల ప్రాణ రక్షణలో ప్రతి క్షణం ఎంతో విలువైనది." జన తెలంగాణ మంచిర్యాల జిల్లా ప్రతినిధి కాంపల్లి రాజేష్ కుమార్
చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన బాబు చుట్టూ చోద్యం చూస్తున్న జనం… మనవత్వం మంటకలిసిందా?", మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం లక్ష్మీనగర్–కృష్ణ కాలనీ వెళ్లే దారిలో " "అప్పుడే పుట్టిన ఓ శిశువును చెత్తకుప్పలో పడేసిన ఘటన కలకలం రేపింది. " "పసికందు ఏడుపు, ఆర్తనాదం వినిపిస్తున్నా చుట్టూ ఉన్న కొందరు జనం " "చోద్యం చూస్తూ నిలబడటం ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తోంది." "అయితే అదే సమయంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ కృష్ణ కాలనీకి చెందిన " "లేడీ జిమ్ ట్రైనర్ వెంటనే స్పందించి శిశువును తన చేతుల్లోకి తీసుకుని కాపాడారు. " "అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి మంచిర్యాల ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు."ఒక తల్లి గర్భంలో తొమ్మిది నెలలు పెరిగి ఈ లోకంలోకి వచ్చిన ఆ చిన్నారి… " "జీవితం మొదలైన క్షణాల్లోనే చెత్తకుప్పలో కనిపించడం హృదయ విదారకం. " "కన్నీళ్లు పెట్టే ఆ పసికందుకు తప్పు ఏముంది? పుట్టడం తప్పా? " "మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు సమాజం తన మనవత్వాన్ని మరోసారి ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి." ) ( "శిశువును కాపాడిన లేడీ జిమ్ ట్రైనర్ చూపిన ధైర్యం, దయకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. " "ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, " "పసికందుల రక్షణపై సమాజంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది." ) ఈ ఘటన ప్రతి ఒక్కరికీ ఒక గట్టి హెచ్చరిక. పుట్టిన వెంటనే రక్షణ కోసం " "ఎదురుచూస్తున్న పసికందును నిర్లక్ష్యం చేయడం సమాజానికి తీరని మచ్చ. " "ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో శిశువును గుర్తిస్తే వెంటనే 108కు సమాచారం అందించి, " "సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా పోలీసులకు తెలియజేయాలి. " "శిశువుల ప్రాణ రక్షణలో ప్రతి క్షణం ఎంతో విలువైనది." జన తెలంగాణ మంచిర్యాల జిల్లా ప్రతినిధి కాంపల్లి రాజేష్ కుమార్
- జైల్ భరో విజయవంతానికి గోదావరిఖనిలో 2K రన్ : తుమ్మల రాజారెడ్డి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మెండే శ్రీనివాస్ గోదావరిఖని సిఐటియు ఆఫీసు శ్రామిక భవన్ నుండి కూరగాయల మార్కెట్ వరకు... ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ గోదావరిఖని పారిశ్రామిక కార్మికులు, యువత, ప్రజల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి గారు 2k రన్ జండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ... క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు రైతులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికుల హక్కులను హరిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి ఎన్టీపీసీ తదితర సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ, 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల రైతుల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు, కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మెండె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపెల్లి జిల్లా కోశాధికారి ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి, ఆరేపల్లి రాజమౌళి, వంగల శివరాం రెడ్డి, నంది నారాయణ, దుర్గాప్రసాద్, జనార్దన్ రెడ్డి, అఖిల్, కుంభం కిషన్, కే సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.1
- కాసేపటి క్రితం గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దూకడం ప్రారంభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కాసేపటి క్రితం గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దూకడం ప్రారంభించింది. మత్తడి దూకే ప్రదేశానికి సందర్శకులు ఎవరు కూడా వెళ్లకూడదని సిరిసిల్ల డీఎస్పీ కత్రోజ్ నాగేంద్ర చారి, ఎల్లారెడ్డిపేట సి ఐ వెంకటేష్ లు హెచ్చరికలు జారీ చేశారు.నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.1
- ఆదివాసీ వేడుకల్లో అధికారుల సందడి.. గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే, కలెక్టర్ నృత్యం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివాసీ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన కార్యక్రమాల్లో గిరిజనులు, కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ మకరంద్ సంప్రదాయ నృత్యంలో పాల్గొని సందడి చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గిరిజన కళాకారులతో కలిసి నృత్యం చేయడంతో కార్యక్రమ ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తమ అభిమానాన్ని చాటిన ఈ దృశ్యాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. కార్యక్రమానికి హాజరైన ప్రజలు అధికారుల నృత్యాన్ని ఆసక్తిగా తిలకిస్తూ చప్పట్లతో అభినందించారు.1
- ముగిసిన ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ...ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 లక్షల 94 వేల మంది ఓట్లు తొలగింపు...అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లు తొలగింపు ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ నేటితో ముగుస్తున్న నేపథ్యంలో భారీగా ఓట్లు తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు లక్షల 94 వేల మంది పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశాలున్నాయి. అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లు తొలగిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 29 లక్షల 97 వేల మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 26 లక్షల మూడు వేల మంది సర్ ప్రక్రియలో పాల్గొని ఎన్యూమరేషన్ ఫామ్ లు బిఎల్వో లకు అందజేశారు. ఈరోజు అర్ధరాత్రి వరకు ఎన్యూమరేషన్ ఫామ్ లు స్వీకరించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. డబల్ ఎంట్రీ, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిపోతున్నాయి. ఓటర్ జాబితా పై అభ్యంతరాలను రేపటి నుంచి స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పరిష్కరిస్తారు. ఓటర్ ఫైనల్ జాబితా అక్టోబర్ 19న ప్రకటించనున్నారు. తాజా ఓటర్ జాబితాలో పేర్లు రానివారు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటర్ నమోదు కావాలంటే ఫామ్ 6 తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ 2002 లేదా 2026 సర్ ఫ్యామిలీ మ్యాపింగ్ డిటేల్స్ సమర్పించాల్సి ఉంటుంది.1
- ఈశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: సింగర్ మంగ్లీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని మంగ్లీ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు మంగ్లీకి ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న మంగ్లీ, ఆలయ విశిష్టతను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు, అభిమానులు ఆమెను ఆసక్తిగా గమనించారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా. *మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ కి వచ్చే పర్యాటకుల భద్రతకు చర్యలు.* *పర్యాటకులు పోలీస్ వారి సూచనలు, హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలి.* *మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ.* తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. *పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.* ఎస్పీ గారి వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.4
- ఆదివాసీలను అడవికి దూరం చేసే కుట్ర చేస్తున్న మోడీ ప్రభుత్వం : జూపాక శ్రీనివాస్ CPI ML మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గోదావరిఖని కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవ సభ జరిగింది. ఆదివాసీల హక్కులను పరిరక్షించడంతో పాటు, రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, జల్–జంగల్–జమీన్‌పై ఆదివాసీల హక్కులను కాపాడాలని *సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు* భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఆదివాసీ సమాజం ఇప్పటికీ భూమి, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, రహదారులు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అభివృద్ధి పేరుతో గనులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం ఆదివాసీల భూములను తీసుకోవడం వల్ల అనేక కుటుంబాలు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నాయి. ఆదివాసీల సంప్రదాయ హక్కులను గుర్తించి అటవీ హక్కుల చట్టం–2006ను సమర్థవంతంగా అమలు చేయాలి. అర్హులైన ప్రతి ఆదివాసీ కుటుంబానికి వ్యక్తిగత, సామూహిక అటవీ హక్కుల పట్టాలు ఇవ్వాలి. పోడు సాగుదారులసమస్యలను పరిష్కరించి, వారి సాగు భూములకు హక్కులు కల్పించాలి. ఆదివాసీల అనుమతి, గ్రామసభ నిర్ణయాలను పక్కన పెట్టి వారి భూములను ఇతర అవసరాలకు బదలాయించకుండా ఆదివాసీ ప్రాంతాల్లో నాణ్యమైన ప్రభుత్వ విద్య, హాస్టళ్లు, వైద్య సదుపాయాలు, తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి, మధ్యవర్తుల దోపిడీని అరికట్టాలి. ఆదివాసీ యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించాలి. గనులు, ప్రాజెక్టులు, పరిశ్రమల కారణంగా నిర్వాసితులయ్యే ఆదివాసీలకు న్యాయమైన పరిహారం, భూమి, పునరావాసం, ఉపాధి కల్పించిన తర్వాతే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. ఆదివాసీ భాషలు, సంస్కృతి,సంప్రదాయాలుజీవన విధానాన్ని పరిరక్షించాలి. మా ప్రధాన డిమాండ్లు జల్–జంగల్–జమీన్‌పై ఆదివాసీల హక్కులను కాపాడాలి.అర్హులైన ప్రతి ఆదివాసీ కుటుంబానికి అటవీ హక్కుల పట్టాలు ఇవ్వాలి.పోడుసాగుదారులపై వేధింపులు, అక్రమ కేసులు నిలిపివేయాలి. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం,తాగునీరు,రహదారులు వంటి మౌలిక సదుపాయాలుకల్పించాలి ఆదివాసీ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు పెంచాలి.ఆదివాసీల హక్కుల కోసం ఐక్యంగా నిలుద్దాంజల్–జంగల్–జమీన్‌ను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. *ఇంకా ఈ సభలో CPI ML మాస్ లైన్ ప్రజాపంథా పెద్దపెల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, జిల్లా నాయకులు మార్త రాములు, గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజుల లక్ష్మి, మార్త రాద, కలవల రాయమల్లు బత్తుల రాజన్న , శనగరపు రామస్వామి, సునీత, ఉడిగమ్మ తదితరులు పాల్గొన్నారు.1
- మెట్ పల్లి లో ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలు...ఇద్దరు పాపలు, ఒక బాబు జననం జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. ఒకేసారి ముగ్గురు చిన్నారులు జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మెట్పల్లి మండలం రాజేశ్వర్ రావు పేట గ్రామానికి చెందిన జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు వివాహమైన తర్వాత ఇది మొదటి సంతానం. రాజ లక్ష్మికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మెట్ పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆమెకు కాన్పు చేయగా ఒకే ప్రసవంలో ముగ్గురు పసిపాపలు జన్మించారు.పుట్టిన వారిలో ఒక బాబు,ఇద్దరు పాపలు ఉన్నారు. బాబు బరువు: 1.8 కేజీలు మొదటి పాప బరువు: 1.5 కేజీలు,రెండో పాప బరువు: 1.4 కేజీలు,ప్రస్తుతం తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.ముగ్గురు చిన్నారులు తక్కువ బరువుతో జన్మించడంతో,పిల్లల నిపుణుల (Pediatrician) ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.మొదటి సంతానంలోనే ఒకేసారి ముగ్గురు బిడ్డలు పుట్టడంతో జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు స్థానికులు,బంధువులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.1
- ముక్కిస లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, ఈరోజు మానకొండూరు మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ఎలా శేఖర్ బాబు, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.1