logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకాంత్‌పై దాడి పరామర్శించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రీకాంత్‌పై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. ​దాడుల సంస్కృతిని తెచ్చింది బీజేపీనే: గంగుల కమలాకర్ ​మేయర్ పీఠం ఇస్తే దాడులా? కరీంనగర్ ప్రజలు బీజేపీకి మేయర్ పదవిని కట్టబెడితే, వారు నగరంలో 'దాడుల సంస్కృతి'కి తెరలేపారని గంగుల కమలాకర్ మండిపడ్డారు. ​గతంలో బీఆర్ఎస్ రెండు పర్యాయాలు మేయర్ పీఠం అధిరోహించినా, అలాగే కాంగ్రెస్ హయాంలోనూ కరీంనగర్‌లో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన సుపరిపాలన అందించామని గుర్తుచేశారు. ​కక్షసాధింపు చర్యలు: బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలలో తిరుగుతున్నాడనే అక్కసుతోనే బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు తన అనుచరులతో కలిసి రోడ్డుపై శ్రీకాంత్‌పై ఇనుప రాడ్లతో పాశవికంగా దాడి చేశారని ఆరోపించారు. శ్రీకాంత్ చనిపోయాడని భావించి వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. ​కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ప్రశ్నలు...పోలీసుల తీరుపై ప్రశంసలు కరీంనగర్ ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు? కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు పార్టీలో ఏం జరుగుతుందో అర్థమవుతుందా?" అని గంగుల ప్రశ్నించారు. ​గతంలో తన కార్యాలయంపై దాడి జరిగినప్పుడే హోం మంత్రి హోదాలో ఉన్నవారు స్పందించి చర్యలు తీసుకుని ఉంటే, నేడు ఇలాంటి దాడులు పునరావృతం కాకపోయేవని అన్నారు. ​కిసాన్ నగర్‌లో తాము రోడ్లు వేయిస్తే, బీజేపీ నాయకులు రాడ్లతో ప్రజలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. గెలిచి మూడు నెలలు కూడా కాకముందే దాడులకు తెరలేపారని ధ్వజమెత్తారు. ​పోలీసుల పనితీరు: పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏ పార్టీవారైనా సరే చట్టం ముందు శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. ​అభివృద్ధి వర్సెస్ విధ్వంసం ​కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్‌ను రూ.1,650 కోట్లతో అత్యద్భుతంగా, సురక్షితమైన 'స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్దామని తెలిపారు. ​కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ నగరానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారనుకుంటే, కేవలం దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ​కరీంనగర్ ఎప్పుడూ శాంతియుతంగా, సేఫ్ సిటీగా ఉండాలని ఆకాంక్షించారు. ​బీఆర్ఎస్ శ్రేణులకు పూర్తి భరోసా. ​బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ తన కార్యకర్తలకు అండగా ఉంటుందని భెరోసా కల్పించారు. కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే కరీంనగర్‌కు రానున్నట్లు తెలిపారు. ​రెండేళ్లలో ఈ ప్రభుత్వం తొలగిపోతుంది, ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తాము. మేము కూడా ప్రతిదాడులు చేయము కానీ చట్టం ముందే దోషులను నిలబెడతాము" అని హెచ్చరించారు. ​ఈ ఘటనపై కేంద్ర మంత్రి స్పందించి, హింసకు పాల్పడిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే గంగుల తో పాటు బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

1 hr ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
1 hr ago

కరీంనగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకాంత్‌పై దాడి పరామర్శించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రీకాంత్‌పై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. ​దాడుల సంస్కృతిని తెచ్చింది బీజేపీనే: గంగుల కమలాకర్ ​మేయర్ పీఠం ఇస్తే దాడులా? కరీంనగర్ ప్రజలు బీజేపీకి మేయర్ పదవిని కట్టబెడితే, వారు నగరంలో 'దాడుల సంస్కృతి'కి తెరలేపారని గంగుల కమలాకర్ మండిపడ్డారు. ​గతంలో బీఆర్ఎస్ రెండు పర్యాయాలు మేయర్ పీఠం అధిరోహించినా, అలాగే కాంగ్రెస్ హయాంలోనూ కరీంనగర్‌లో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన సుపరిపాలన అందించామని గుర్తుచేశారు. ​కక్షసాధింపు చర్యలు: బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలలో తిరుగుతున్నాడనే అక్కసుతోనే బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు తన అనుచరులతో కలిసి రోడ్డుపై శ్రీకాంత్‌పై ఇనుప రాడ్లతో పాశవికంగా దాడి చేశారని ఆరోపించారు. శ్రీకాంత్ చనిపోయాడని భావించి వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. ​కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ప్రశ్నలు...పోలీసుల తీరుపై ప్రశంసలు కరీంనగర్ ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు? కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు పార్టీలో ఏం జరుగుతుందో అర్థమవుతుందా?" అని గంగుల ప్రశ్నించారు. ​గతంలో తన కార్యాలయంపై దాడి జరిగినప్పుడే

హోం మంత్రి హోదాలో ఉన్నవారు స్పందించి చర్యలు తీసుకుని ఉంటే, నేడు ఇలాంటి దాడులు పునరావృతం కాకపోయేవని అన్నారు. ​కిసాన్ నగర్‌లో తాము రోడ్లు వేయిస్తే, బీజేపీ నాయకులు రాడ్లతో ప్రజలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. గెలిచి మూడు నెలలు కూడా కాకముందే దాడులకు తెరలేపారని ధ్వజమెత్తారు. ​పోలీసుల పనితీరు: పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏ పార్టీవారైనా సరే చట్టం ముందు శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. ​అభివృద్ధి వర్సెస్ విధ్వంసం ​కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్‌ను రూ.1,650 కోట్లతో అత్యద్భుతంగా, సురక్షితమైన 'స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్దామని తెలిపారు. ​కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ నగరానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారనుకుంటే, కేవలం దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ​కరీంనగర్ ఎప్పుడూ శాంతియుతంగా, సేఫ్ సిటీగా ఉండాలని ఆకాంక్షించారు. ​బీఆర్ఎస్ శ్రేణులకు పూర్తి భరోసా. ​బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ తన కార్యకర్తలకు అండగా ఉంటుందని భెరోసా కల్పించారు. కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే కరీంనగర్‌కు రానున్నట్లు తెలిపారు. ​రెండేళ్లలో ఈ ప్రభుత్వం తొలగిపోతుంది, ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తాము. మేము కూడా ప్రతిదాడులు చేయము కానీ చట్టం ముందే దోషులను నిలబెడతాము" అని హెచ్చరించారు. ​ఈ ఘటనపై కేంద్ర మంత్రి స్పందించి, హింసకు పాల్పడిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే గంగుల తో పాటు బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ముక్కిస లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, ఈరోజు మానకొండూరు మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ఎలా శేఖర్ బాబు, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ముక్కిస లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, ఈరోజు మానకొండూరు మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ఎలా శేఖర్ బాబు, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR TV 9 న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల నగరంలోని సాయికుంట ఇంటిగ్రేటెడ్ బీసీ బాలుర హాస్టల్ ఆవరణలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యత, వాటి సంరక్షణ, మొక్కలను దత్తత తీసుకొని పెంచాల్సిన బాధ్యతపై ప్రకృతి మిత్ర వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్ అవగాహన కల్పించారు. అనంతరం హాస్టల్ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో విద్యార్థులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటించారు. మొక్కల సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, నాటిన మొక్కలను వారికి దత్తతగా అప్పగించారు. మొక్కలను కాపాడుతూ వాటి పెరుగుదలకు తోడ్పడే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ సుధమల హరికృష్ణ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కొత్తూరి ముకుందం, జిల్లా ఫారెస్ట్ ఏఓ పొన్న మల్లయ్య, బీసీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి గుండు వెంకటేష్, జైపూర్ ఎంపీడీవో శ్రీపతి బాపురావు, వేమనపల్లి ఎంపీఓ పోలంపల్లి వెంకటేష్, హాస్టల్ అధికారి నైతం లక్ష్మణ్, ప్రకృతి మిత్ర సభ్యులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, చెట్ల ప్రాధాన్యత, ప్రకృతిని కాపాడాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 🌱🌳
    1
    ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం
విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత
మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR 
ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం
విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత
మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR TV 9 న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల నగరంలోని సాయికుంట ఇంటిగ్రేటెడ్ బీసీ బాలుర హాస్టల్ ఆవరణలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముందు విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యత, వాటి సంరక్షణ, మొక్కలను దత్తత తీసుకొని పెంచాల్సిన బాధ్యతపై ప్రకృతి మిత్ర వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్ అవగాహన కల్పించారు.
అనంతరం హాస్టల్ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో విద్యార్థులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటించారు. మొక్కల సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, నాటిన మొక్కలను వారికి దత్తతగా అప్పగించారు. మొక్కలను కాపాడుతూ వాటి పెరుగుదలకు తోడ్పడే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ సుధమల హరికృష్ణ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కొత్తూరి ముకుందం, జిల్లా ఫారెస్ట్ ఏఓ పొన్న మల్లయ్య, బీసీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి గుండు వెంకటేష్, జైపూర్ ఎంపీడీవో శ్రీపతి బాపురావు, వేమనపల్లి ఎంపీఓ పోలంపల్లి వెంకటేష్, హాస్టల్ అధికారి నైతం లక్ష్మణ్, ప్రకృతి మిత్ర సభ్యులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, చెట్ల ప్రాధాన్యత, ప్రకృతిని కాపాడాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 🌱🌳
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • 3వ రోజుకు చేరిన సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న నిరసన దీక్ష మూడో రోజు కూడా కొనసాగుతోంది. మూడో రోజు నిరసనలో భాగంగా బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల కండువాలు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన దీక్షకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌశిక్ హరన్, పర్లపల్లి రవి, జివి రాజు, కర్క శ్రీనివాస్ రెడ్డి (కార్పొరేటర్), నిమ్మరాజుల రవి (కార్పొరేటర్), కల్వాల సాగర్ తదితరులు పాల్గొని బాధితులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ నిరసన దీక్ష లక్కా శ్రావణ్ గౌడ్ అధ్యక్షతన శాంతియుతంగా కొనసాగుతోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు.
    1
    3వ రోజుకు చేరిన సింగరేణి మారుపేర్ల బాధితుల  నిరసన దీక్ష
సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న నిరసన దీక్ష మూడో రోజు కూడా కొనసాగుతోంది. మూడో రోజు నిరసనలో భాగంగా బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల కండువాలు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిరసన దీక్షకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌశిక్ హరన్, పర్లపల్లి రవి, జివి రాజు, కర్క శ్రీనివాస్ రెడ్డి (కార్పొరేటర్), నిమ్మరాజుల రవి (కార్పొరేటర్), కల్వాల సాగర్ తదితరులు పాల్గొని బాధితులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు.
ఈ నిరసన దీక్ష లక్కా శ్రావణ్ గౌడ్ అధ్యక్షతన శాంతియుతంగా కొనసాగుతోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    23 hrs ago
  • 56 ఏళ్ల రాహుల్ గాంధీ ఫిట్నెస్ సీక్రెట్............. ఇదే 56 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటం వెనుక సీక్రెట్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. “ఎంత బిజీగా ఉన్నా రోజూ కనీసం గంటపాటు మార్షల్ ఆర్ట్స్, ఈత, రన్నింగ్, యోగా, ఏరోబిక్ వంటివి చేస్తా. అనారోగ్యకరమైన అలవాట్లను వ్యాయామంతో సరిదిద్దలేం. క్రమశిక్షణతో కూడిన శ్రమ, ఆరోగ్యకర ఆహారంతో ఫిట్నెస్ సాధించవచ్చు. స్నాక్స్ ఎక్కువగా తినడం మానుకోవాలి. లిక్కర్ అలవాటు ఉంటే పరిమితంగా తీసుకోవాలి' అని సూచించారు.
    1
    56 ఏళ్ల రాహుల్ గాంధీ ఫిట్నెస్ సీక్రెట్............. ఇదే
56 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటం వెనుక సీక్రెట్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. “ఎంత బిజీగా ఉన్నా రోజూ కనీసం గంటపాటు మార్షల్ ఆర్ట్స్, ఈత, రన్నింగ్, యోగా, ఏరోబిక్ వంటివి చేస్తా. అనారోగ్యకరమైన అలవాట్లను వ్యాయామంతో సరిదిద్దలేం. క్రమశిక్షణతో కూడిన శ్రమ, ఆరోగ్యకర ఆహారంతో ఫిట్నెస్ సాధించవచ్చు. స్నాక్స్ ఎక్కువగా తినడం మానుకోవాలి. లిక్కర్ అలవాటు ఉంటే పరిమితంగా తీసుకోవాలి' అని సూచించారు.
    user_Reporter Gaddam Kiran
    Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    41 min ago
  • ముగిసిన ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ...ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 లక్షల 94 వేల మంది ఓట్లు తొలగింపు...అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లు తొలగింపు ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ నేటితో ముగుస్తున్న నేపథ్యంలో భారీగా ఓట్లు తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు లక్షల 94 వేల మంది పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశాలున్నాయి. అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లు తొలగిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 29 లక్షల 97 వేల మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 26 లక్షల మూడు వేల మంది సర్ ప్రక్రియలో పాల్గొని ఎన్యూమరేషన్ ఫామ్ లు బిఎల్వో లకు అందజేశారు. ఈరోజు అర్ధరాత్రి వరకు ఎన్యూమరేషన్ ఫామ్ లు స్వీకరించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. డబల్ ఎంట్రీ, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిపోతున్నాయి. ఓటర్ జాబితా పై అభ్యంతరాలను రేపటి నుంచి స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పరిష్కరిస్తారు. ఓటర్ ఫైనల్ జాబితా అక్టోబర్ 19న ప్రకటించనున్నారు. తాజా ఓటర్ జాబితాలో పేర్లు రానివారు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటర్ నమోదు కావాలంటే ఫామ్ 6 తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ 2002 లేదా 2026 సర్ ఫ్యామిలీ మ్యాపింగ్ డిటేల్స్ సమర్పించాల్సి ఉంటుంది.
    1
    ముగిసిన ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ...ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 లక్షల 94 వేల మంది ఓట్లు తొలగింపు...అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లు తొలగింపు
ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ నేటితో ముగుస్తున్న నేపథ్యంలో భారీగా ఓట్లు తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు లక్షల 94 వేల మంది పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశాలున్నాయి. అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లు తొలగిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 29 లక్షల 97 వేల మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 26 లక్షల మూడు వేల మంది సర్ ప్రక్రియలో పాల్గొని ఎన్యూమరేషన్ ఫామ్ లు బిఎల్వో లకు అందజేశారు. ఈరోజు అర్ధరాత్రి వరకు ఎన్యూమరేషన్ ఫామ్ లు స్వీకరించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది.  డబల్ ఎంట్రీ, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిపోతున్నాయి. ఓటర్ జాబితా పై అభ్యంతరాలను రేపటి నుంచి స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పరిష్కరిస్తారు. ఓటర్ ఫైనల్ జాబితా అక్టోబర్  19న ప్రకటించనున్నారు. తాజా ఓటర్ జాబితాలో పేర్లు రానివారు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటర్ నమోదు కావాలంటే ఫామ్ 6 తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ 2002 లేదా 2026 సర్ ఫ్యామిలీ మ్యాపింగ్ డిటేల్స్ సమర్పించాల్సి ఉంటుంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • సిరిసిల్లలో CITU - ఆధ్వర్యంలో కదం తొక్కిన కార్మికులు జైల్ భరో కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి సిరిసిల్లలో CITU - ఆధ్వర్యంలో కదం తొక్కిన కార్మికులు జైల్ భరో కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి ఉద్యోగ భద్రత కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక , రైతు , వ్యవసాయ ఉపాధి కూలీల , ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ కార్మిక చట్టాలు , హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు CITU - రైతు - వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ గారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తుందని మండిపడ్డారు రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా రైతులకు అన్యాయం చేస్తుందని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేకుంటే కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు కార్మిక , రైతు , వ్యవసాయ ఉపాధి కూలీల చట్టాలు హక్కులను రక్షించుకోవడం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జిల్లా కార్యదర్శి కోడం రమణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్ జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్ , సూరం పద్మ , ఎలిగేటి రాజశేఖర్ , గీస బిక్షపతి , దాసరి రూప , ఆడెపు రజిత , బూర శ్రీనివాస్ , మల్యాల నరసయ్య , శ్రీరామ్ సదానందం , సిరిమల్ల సత్యం , గోవిందు లక్ష్మణ్ , కోల శ్రీనివాస్ , బేజుగం సురేష్ , స్వర్గం శేఖర్ , సావణ పెళ్లి రాములు , గిరిబాబు , మల్లయ్య , ప్రభాకర్ , నరేందర్ , రాజెల్లయ్య , శ్రీధర్ , కమలాకర్ , రమేష్ , శంకర్ , బాలయ్య , లచ్చయ్య , సురేష్ , రవీందర్ , శ్రీనివాస్ , పోచమల్లు వివిధ రంగాల నాయకులు , కార్మికులు పాల్గొన్నారు.
    3
    సిరిసిల్లలో CITU - ఆధ్వర్యంలో కదం తొక్కిన కార్మికులు
జైల్ భరో కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో
కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
సిరిసిల్లలో CITU - ఆధ్వర్యంలో కదం తొక్కిన కార్మికులు
జైల్ భరో కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి ఉద్యోగ భద్రత కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు
కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక , రైతు , వ్యవసాయ ఉపాధి కూలీల , ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ కార్మిక చట్టాలు , హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు CITU - రైతు - వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది
ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ గారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తుందని మండిపడ్డారు
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా రైతులకు అన్యాయం చేస్తుందని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేకుంటే కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు కార్మిక , రైతు , వ్యవసాయ ఉపాధి కూలీల చట్టాలు హక్కులను రక్షించుకోవడం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జిల్లా కార్యదర్శి కోడం రమణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్ జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్ , సూరం పద్మ , ఎలిగేటి రాజశేఖర్ , గీస బిక్షపతి , దాసరి రూప , ఆడెపు రజిత , బూర శ్రీనివాస్ , మల్యాల నరసయ్య , శ్రీరామ్ సదానందం , సిరిమల్ల సత్యం , గోవిందు లక్ష్మణ్ , కోల శ్రీనివాస్ , బేజుగం సురేష్ , స్వర్గం శేఖర్ , సావణ పెళ్లి రాములు , గిరిబాబు , మల్లయ్య , ప్రభాకర్ , నరేందర్ , రాజెల్లయ్య , శ్రీధర్ , కమలాకర్ , రమేష్ , శంకర్ , బాలయ్య , లచ్చయ్య , సురేష్ , రవీందర్ , శ్రీనివాస్ , పోచమల్లు వివిధ రంగాల నాయకులు , కార్మికులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • జైల్ భరో విజయవంతానికి గోదావరిఖనిలో 2K రన్ : తుమ్మల రాజారెడ్డి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మెండే శ్రీనివాస్ గోదావరిఖని సిఐటియు ఆఫీసు శ్రామిక భవన్ నుండి కూరగాయల మార్కెట్ వరకు... ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ గోదావరిఖని పారిశ్రామిక కార్మికులు, యువత, ప్రజల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి గారు 2k రన్ జండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ... క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు రైతులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికుల హక్కులను హరిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి ఎన్టీపీసీ తదితర సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ, 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల రైతుల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు, కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మెండె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపెల్లి జిల్లా కోశాధికారి ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి, ఆరేపల్లి రాజమౌళి, వంగల శివరాం రెడ్డి, నంది నారాయణ, దుర్గాప్రసాద్, జనార్దన్ రెడ్డి, అఖిల్, కుంభం కిషన్, కే సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
    1
    జైల్ భరో విజయవంతానికి గోదావరిఖనిలో 2K రన్ : తుమ్మల రాజారెడ్డి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మెండే శ్రీనివాస్ 
గోదావరిఖని సిఐటియు ఆఫీసు శ్రామిక భవన్ నుండి కూరగాయల మార్కెట్ వరకు... ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ గోదావరిఖని పారిశ్రామిక కార్మికులు, యువత, ప్రజల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి గారు 2k రన్ జండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ... క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు రైతులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికుల హక్కులను హరిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి ఎన్టీపీసీ తదితర సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ, 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల రైతుల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు, కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మెండె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపెల్లి జిల్లా కోశాధికారి ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి, ఆరేపల్లి రాజమౌళి, వంగల శివరాం రెడ్డి, నంది నారాయణ, దుర్గాప్రసాద్, జనార్దన్ రెడ్డి, అఖిల్, కుంభం కిషన్, కే సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    23 hrs ago
  • నేత కార్మికుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్, డీఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన డీఎస్పీ నాగేంద్రచారి సిరిసిల్ల పట్టణం లో నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి బీవై నగర్‌కు చెందిన కుసుమ గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తానే వెంకటేశం ను హత్య చేసినట్లు పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు. డీఎస్పీ నాగేంద్ర చారి కథనం ప్రకారం సిరిసిల్ల పట్టణానికి చెందిన వెంగళ వెంకటేశం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో విచారణ జరిపారు.దర్యాప్తులో భాగంగా కుసుమ గణేష్ పై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో వెంకటేశం ను హత్య చేసినట్లు గణేష్ వెల్లడించారు. గణేష్ కు సహకరించిన మరో నలుగురిపై విచారణ జరుపుతున్నామని డిఎస్పి వివరించారు.నిందితుడి నుంచి మోటార్‌ సైకిల్, రెండు మొబైల్‌ ఫోన్లు, నైట్రాప్‌ (విష పదార్థం), ఎంసీ విస్కీ క్వార్టర్‌ బాటిల్, దుస్తులు, క్యాప్, మృతుడికి సంబంధించిన పేపర్‌ నోట్‌ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తులో సిరిసిల్ల పోలీసులు కీలక ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.
    4
    నేత కార్మికుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్, డీఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన డీఎస్పీ నాగేంద్రచారి 
సిరిసిల్ల పట్టణం లో నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్య  కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి బీవై నగర్‌కు చెందిన కుసుమ గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తానే వెంకటేశం ను హత్య చేసినట్లు పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు. డీఎస్పీ నాగేంద్ర చారి కథనం ప్రకారం సిరిసిల్ల పట్టణానికి చెందిన వెంగళ వెంకటేశం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో విచారణ జరిపారు.దర్యాప్తులో భాగంగా కుసుమ గణేష్ పై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో వెంకటేశం ను హత్య చేసినట్లు గణేష్  వెల్లడించారు. గణేష్ కు సహకరించిన మరో నలుగురిపై విచారణ జరుపుతున్నామని డిఎస్పి వివరించారు.నిందితుడి నుంచి మోటార్‌ సైకిల్, రెండు మొబైల్‌ ఫోన్లు, నైట్రాప్‌ (విష పదార్థం), ఎంసీ విస్కీ క్వార్టర్‌ బాటిల్, దుస్తులు, క్యాప్, మృతుడికి సంబంధించిన పేపర్‌ నోట్‌ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తులో సిరిసిల్ల పోలీసులు కీలక ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    15 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.