వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటుచేసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనులను చేస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటుచేసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనులను చేస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో అన్ని దేవాలయాలు స్టోన్ తో నిర్మాణాలు చేపడితే ఇక్కడ మాత్రం సిమెంట్ నిర్మాణాలు చేస్తున్నారని, అభివృద్ధి పేరిట వేములవాడ చరిత్రను రూపుమాపుతున్నారని, ఇటీవల శూన్య మాసమైన ఆషాడ మాసంలో మంత్రులు అభివృద్ధి పనులకు ఎలా ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల్లో ఆది శంకరాచార్య విగ్రహం, ఈ దేవాలయాన్ని నిర్మించిన రాజరాజ నరేంద్రుని విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై అధికారులను ప్రశ్నిస్తే తమకేం సంబంధం లేదని, ఈవోని అడుగుతే తనకు సంబంధం లేదని, పవర్ ఉంది కదా అని నిర్మాణాలు ఇష్టమొచ్చినట్లు జరిపితే పశ్చిమబెంగాల్లో పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్ కు పడుతుందన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్మాణాలు లేకపోతే వచ్చే శ్రావణమాసంలో పెద్ద ఎత్తున తమ పార్టీ తరఫున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటుచేసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనులను చేస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటుచేసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనులను చేస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో అన్ని దేవాలయాలు స్టోన్ తో నిర్మాణాలు చేపడితే ఇక్కడ మాత్రం సిమెంట్ నిర్మాణాలు చేస్తున్నారని, అభివృద్ధి పేరిట వేములవాడ చరిత్రను రూపుమాపుతున్నారని, ఇటీవల శూన్య మాసమైన ఆషాడ మాసంలో
మంత్రులు అభివృద్ధి పనులకు ఎలా ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల్లో ఆది శంకరాచార్య విగ్రహం, ఈ దేవాలయాన్ని నిర్మించిన రాజరాజ నరేంద్రుని విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై అధికారులను ప్రశ్నిస్తే తమకేం సంబంధం లేదని, ఈవోని అడుగుతే తనకు సంబంధం లేదని, పవర్ ఉంది కదా అని నిర్మాణాలు ఇష్టమొచ్చినట్లు జరిపితే పశ్చిమబెంగాల్లో పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్ కు పడుతుందన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్మాణాలు లేకపోతే వచ్చే శ్రావణమాసంలో పెద్ద ఎత్తున తమ పార్టీ తరఫున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
- మెట్ పల్లి లో ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలు...ఇద్దరు పాపలు, ఒక బాబు జననం జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. ఒకేసారి ముగ్గురు చిన్నారులు జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మెట్పల్లి మండలం రాజేశ్వర్ రావు పేట గ్రామానికి చెందిన జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు వివాహమైన తర్వాత ఇది మొదటి సంతానం. రాజ లక్ష్మికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మెట్ పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆమెకు కాన్పు చేయగా ఒకే ప్రసవంలో ముగ్గురు పసిపాపలు జన్మించారు.పుట్టిన వారిలో ఒక బాబు,ఇద్దరు పాపలు ఉన్నారు. బాబు బరువు: 1.8 కేజీలు మొదటి పాప బరువు: 1.5 కేజీలు,రెండో పాప బరువు: 1.4 కేజీలు,ప్రస్తుతం తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.ముగ్గురు చిన్నారులు తక్కువ బరువుతో జన్మించడంతో,పిల్లల నిపుణుల (Pediatrician) ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.మొదటి సంతానంలోనే ఒకేసారి ముగ్గురు బిడ్డలు పుట్టడంతో జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు స్థానికులు,బంధువులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.1
- కాఅఖిల్ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఎస్సై పోస్టులకు ఉచిత శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోవాలి . ఫౌండేషన్ చైర్మన్ తౌడ సత్యనారాయణ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరం అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల చేసిన పట్టణ సీఐ మెదక్ ఆగస్టు 10 :- ఉమ్మడి మెదక్ జిల్లాలోని యువతి యువకులకు అఖిలరాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్.ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ శిబిరం ఫౌండేషన్ చైర్మన్ తాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మెదక్ పట్టణ సీఐ మహేష్ తెలిపారు ఈ సందర్భంగా మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐ మహేష్ మాట్లాడుతూ నిరుపేద యువతి యువకులు అన్ని వర్గాలకు చెందినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగం సాధించాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తౌడ సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన రామాయంపేట స్నేహ డిగ్రీ కళాశాలలో పరీక్ష కు హాజరై అర్హత సాధించిన వారికి నాగూర్ కర్నూల్.వట్టెం వద్దా పి సి ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఆయన తెలిపారు. యువతి యువకులు ఇంటర్మీడియట్ డిగ్రీ పాసైన వారు16 తేదీన రామాయంపేట స్నేహ డిగ్రీ కళాశాలలో జరుగు అర్హత పరీక్షకు హాజరుకావాలని. అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 1 నుండి శిక్షణ పూర్తయ్య వరకు పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. క్రమశిక్షణ. అంకిత భావం.సంకల్పశక్తి.విజయానికి మార్గమని ఆయన తెలిపారు. అభ్యర్థులకు ఏదైనా సందేహాలు ఉంటే.7416661182నంబర్ కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది. శివ తదితరులు పాల్గొన్నారు1
- నాణ్యమైన విద్య వైద్యానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి నాణ్యమైన విద్య, వైద్యానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట -ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) నూతన భవన ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు1
- ఒక చంటి పాప దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న స్వామీజీ ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.1
- ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం విద్యార్థులతో మొక్కలు నాటించి.. రక్షణ బాధ్యతలు అప్పగింత మంచిర్యాల, ఆగస్టు 10, 2026 | PVR TV 9 న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల నగరంలోని సాయికుంట ఇంటిగ్రేటెడ్ బీసీ బాలుర హాస్టల్ ఆవరణలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యత, వాటి సంరక్షణ, మొక్కలను దత్తత తీసుకొని పెంచాల్సిన బాధ్యతపై ప్రకృతి మిత్ర వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్ అవగాహన కల్పించారు. అనంతరం హాస్టల్ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో విద్యార్థులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటించారు. మొక్కల సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, నాటిన మొక్కలను వారికి దత్తతగా అప్పగించారు. మొక్కలను కాపాడుతూ వాటి పెరుగుదలకు తోడ్పడే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ సుధమల హరికృష్ణ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కొత్తూరి ముకుందం, జిల్లా ఫారెస్ట్ ఏఓ పొన్న మల్లయ్య, బీసీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి గుండు వెంకటేష్, జైపూర్ ఎంపీడీవో శ్రీపతి బాపురావు, వేమనపల్లి ఎంపీఓ పోలంపల్లి వెంకటేష్, హాస్టల్ అధికారి నైతం లక్ష్మణ్, ప్రకృతి మిత్ర సభ్యులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, చెట్ల ప్రాధాన్యత, ప్రకృతిని కాపాడాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 🌱🌳1
- పెద్ది విగ్రహ ప్రతిష్ఠను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఉద్రిక్తత ల మధ్య బీఆర్ఎస్ నాయకులు నర్సంపేటలో ప్రతిష్ఠించారు. సోమవారం నిర్వహించిన ఈ విగ్రహ ప్రతిష్ఠ స్థలానికి చేరుకున్న డీసీపీ, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ప్రైవేట్ భూమిలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే మీకేంటని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు వెనక్కి తగ్గడంతో విగ్రహ ఏర్పాటును ఘనంగా నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ కి వచ్చే పర్యాటకుల భద్రతకు చర్యలు. పర్యాటకులు పోలీస్ వారి సూచనలు, హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలి. మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.1
- ఎంతకాలం బతికినం అనేది కాదు ఎట్లా బతికినమనేదే ముఖ్యం . దీనికి నిదర్శనం మన పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర : BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతకాలం బతికినం అనేది కాదు.. ఎట్లా బతికినం అనేది ముఖ్యం దానికి నిదర్శనం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలివచ్చిన జనం లక్షకు పైగా మంది 12 గంటల పాటు వర్షం పడుతున్నా ఎక్కడికి వెళ్లకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతాము2
- కొడుకు వేధింపులు తట్టుకోలేక కడతేర్చేందుకు యత్నించిన తండ్రీ...ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొడుకు, తండ్రిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించిన పోలీసులు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం వేధించే కొడుకును కడతేర్చేందుకు యత్నించిన తండ్రి కటకటాల పాలయ్యాడు. మలకపేట గ్రామానికి చెందిన గుడిపేట రాఘవులు అలియాస్ రాఘవరెడ్డికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు రాజేందర్ ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ తండ్రిని వేధించడం, కొట్టడం అప్పులు చేసి కట్టకుండా గొడవ చేస్తుండేవాడు. కొడుకు వేధింపులను భరించలేని తండ్రి, నిత్యం గొడవపడే కొడుకు రాజేందర్ బ్రతికి ఉంటే ఎప్పటికైనా ఇబ్బందేనని భావించి గొడ్డలితో నరికాడు. తీవ్ర గాయాలపాలైన రాజేందర్ ప్రస్తుతం వరంగల్ MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు తండ్రీ రాఘవులును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు చందుర్తి సిఐ రవీందర్ తెలిపారు.2