వార్షిక తనిఖీల్లో అమరచింత పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ : సునిత రెడ్డి *➤ అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలి* *➤ బ్లూ కోల్ట్స్, పెట్రోల్ కార్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి* ➤ జూరాల డ్యాంకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా చర్యలు అమరచింత, ఆగస్టు 25: ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి *సునిత రెడ్డి, ఐపీఎస్.,* గారు అన్నారు. *అమరచింత ఆగస్టు, 25:* మంగళవారం వనపర్తి జిల్లా పరిధిలోని ఆత్మకూరు సర్కిల్‌లో గల అమరచింత పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి వనపర్తి డీఎస్పీ గిరిబాబు, ఆత్మకూరు సీఐ శివకుమార్, అమరచింత ఎస్సై స్వాతి తదితర అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్‌హెచ్‌ఓ గది, సిబ్బంది విశ్రాంతి గది, లాక్‌అప్, వాహనాల పార్కింగ్ ప్రాంతం తదితర ప్రదేశాలను పరిశీలించారు. స్టేషన్‌లో నిర్వహిస్తున్న జనరల్ డైరీ, సెంట్రీ రిలీఫ్ బుక్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్, సుపీరియర్ ఆఫీసర్స్ విజిటింగ్ బుక్, ఫైనల్ రిపోర్ట్స్ తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అమరచింత పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి తదితర అంశాలను ఎస్సై స్వాతిని అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేకంగా సమీక్షించి, వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతూ ముందస్తు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, అవసరమైన చోట సైన్ బోర్డులు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.అమరచింత పోలీస్ స్టేషన్ పరిధిలోని జూరాల డ్యాంకు వచ్చే సందర్శకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. సందర్శకుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రద్దీ సమయాల్లో పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సూచించారు. గ్రామ పెద్దలు, యువత, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలని అన్నారు. స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్లు తదితరుల వివరాలను నిరంతరం పరిశీలించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. పగలు, రాత్రి బీట్ విధుల్లో భాగంగా అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా పరిశీలించి పాత నేరస్తులను గుర్తించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నేరాల నియంత్రణ, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. సీసీటీఎన్ఎస్, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి ఆధునిక పోలీసింగ్ సాంకేతికతపై సిబ్బంది పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. స్టేషన్ రికార్డులను పార్ట్-1 నుంచి పార్ట్-5 వరకు ఎలాంటి పెండింగ్ లేకుండా సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. సిబ్బందికి వారి సామర్థ్యం, అనుభవం ఆధారంగా వర్టికల్ వారీగా విధులు కేటాయించి, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేలా చూడాలని ఎస్సైకి సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ వారి విధులు, పనితీరు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు శాఖ అందించిన కిట్ ఆర్టికల్స్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో లేదా వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి నేరుగా తీసుకురావచ్చని తెలిపారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా ప్రతి పోలీసు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు అన్ని రకాల పోలీసు విధులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రస్తుతం నేర్చుకుంటున్న నైపుణ్యాలు భవిష్యత్ సేవా కాలంలో ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడు పోలీసు శాఖ తనకు అండగా ఉందనే నమ్మకంతో తిరిగి వెళ్లాలి. బాధితులకు న్యాయం చేయడం, ప్రజలకు భద్రత కల్పించడం, నేరాలను నియంత్రించడం ప్రతి పోలీసు అధికారి బాధ్యత” అని ఎస్పీ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, హెల్మెట్ ధరించని సిబ్బందిని విధుల్లోకి అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ జిల్లా ఎస్పీ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ గిరిబాబు, ఆత్మకూరు సీఐ శివకుమార్, అమరచింత ఎస్సై స్వాతి, డీసీఆర్‌బీ ఎస్సై తిరుపతిరెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వార్షిక తనిఖీల్లో అమరచింత పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ : సునిత రెడ్డి *➤ అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలి* *➤ బ్లూ కోల్ట్స్, పెట్రోల్ కార్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి* ➤ జూరాల డ్యాంకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా చర్యలు అమరచింత, ఆగస్టు 25: ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి *సునిత రెడ్డి, ఐపీఎస్.,* గారు అన్నారు. *అమరచింత ఆగస్టు, 25:* మంగళవారం వనపర్తి జిల్లా పరిధిలోని ఆత్మకూరు సర్కిల్‌లో గల అమరచింత పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి వనపర్తి డీఎస్పీ గిరిబాబు, ఆత్మకూరు సీఐ శివకుమార్, అమరచింత ఎస్సై స్వాతి తదితర అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్‌హెచ్‌ఓ గది, సిబ్బంది విశ్రాంతి గది, లాక్‌అప్, వాహనాల పార్కింగ్ ప్రాంతం తదితర ప్రదేశాలను పరిశీలించారు. స్టేషన్‌లో నిర్వహిస్తున్న జనరల్ డైరీ, సెంట్రీ రిలీఫ్ బుక్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ
బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్, సుపీరియర్ ఆఫీసర్స్ విజిటింగ్ బుక్, ఫైనల్ రిపోర్ట్స్ తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అమరచింత పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి తదితర అంశాలను ఎస్సై స్వాతిని అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేకంగా సమీక్షించి, వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతూ ముందస్తు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, అవసరమైన చోట సైన్ బోర్డులు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.అమరచింత పోలీస్ స్టేషన్ పరిధిలోని జూరాల డ్యాంకు వచ్చే సందర్శకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. సందర్శకుల భద్రతకు
ప్రాధాన్యతనిస్తూ రద్దీ సమయాల్లో పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సూచించారు. గ్రామ పెద్దలు, యువత, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలని అన్నారు. స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్లు తదితరుల వివరాలను నిరంతరం పరిశీలించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. పగలు, రాత్రి బీట్ విధుల్లో భాగంగా అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా పరిశీలించి పాత నేరస్తులను గుర్తించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నేరాల నియంత్రణ, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. సీసీటీఎన్ఎస్, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి ఆధునిక పోలీసింగ్ సాంకేతికతపై సిబ్బంది పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. స్టేషన్ రికార్డులను పార్ట్-1 నుంచి పార్ట్-5 వరకు ఎలాంటి పెండింగ్ లేకుండా సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. సిబ్బందికి వారి సామర్థ్యం, అనుభవం ఆధారంగా వర్టికల్ వారీగా విధులు కేటాయించి, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేలా చూడాలని ఎస్సైకి సూచించారు. అనంతరం పోలీస్
సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ వారి విధులు, పనితీరు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు శాఖ అందించిన కిట్ ఆర్టికల్స్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో లేదా వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి నేరుగా తీసుకురావచ్చని తెలిపారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా ప్రతి పోలీసు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు అన్ని రకాల పోలీసు విధులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రస్తుతం నేర్చుకుంటున్న నైపుణ్యాలు భవిష్యత్ సేవా కాలంలో ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడు పోలీసు శాఖ తనకు అండగా ఉందనే నమ్మకంతో తిరిగి వెళ్లాలి. బాధితులకు న్యాయం చేయడం, ప్రజలకు భద్రత కల్పించడం, నేరాలను నియంత్రించడం ప్రతి పోలీసు అధికారి బాధ్యత” అని ఎస్పీ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, హెల్మెట్ ధరించని సిబ్బందిని విధుల్లోకి అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ జిల్లా ఎస్పీ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ గిరిబాబు, ఆత్మకూరు సీఐ శివకుమార్, అమరచింత ఎస్సై స్వాతి, డీసీఆర్‌బీ ఎస్సై తిరుపతిరెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- NGKL:హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు: సీఐటీయూ హెచ్చరిక ఆర్టీసీ యాజమాన్యం చర్చల వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను వంచిస్తోందని ఎస్‌డబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు పి.చింతలయ్య ధ్వజమెత్తారు. మంగళవారం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని గౌరవాధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు ప్రారంభించగా, టీజేఎంయూ నాయకుడు డీవీ నాయక్ మద్దతు పలికారు. రూట్ సర్వేలు చేయకుండానే ఏకపక్షంగా రన్నింగ్ టైమ్స్ మారుస్తున్నారని చింతలయ్య విమర్శించారు. మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, 2017 వేతన బకాయిలు, ఆర్పీఎస్-2021 అరియర్స్ వెంటనే చెల్లించాలని, 2019 నాటి పోలీసు కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు నందీశ్వర్, లింగయ్య, అర్జున్, వెంకట వర్ధనమ్మ పాల్గొన్నారు.3
- గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు *ప్రజల మధ్య శేఖరన్న – అభివృద్ధి బాటలో కులుమల గ్రామం *గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు.* *ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై, గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.* *ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా శేఖరన్న గారి పర్యటన కొనసాగింది.1
- అలంపూర్: మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్!! మొక్కలను నాటుదాం దానిని చెట్లగా మారుద్దాం.. మున్సిపల్ కమిషనర్ రాజేష్ పిలుపు అలంపూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ రాజేష్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందేటట్లు చూడాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు , మున్సిపల్ చైర్మన్ పీజయరాముడు, వైస్ చైర్మన్ విక్రం,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- స్వచ్ఛందంగా త్రాగునీటి కొరకు రోడ్డు పైకీ ఎక్కి ఆగ్రహించిన మహిళలు. ఎవరి పర్మిషన్ తీసుకున్నారు అంటున్న పోలీసులు. ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కొండపేట చెందిన మహిళలు స్వచ్ఛందంగా బిందెలు తీసుకొని రోడ్డుపైకి ఎక్కి అగ్రహంతో ధర్నాకు దిగారు. మహిళలు మాట్లాడుతూ ఏ ఒక్క నాయకుడు వచ్చినా తూతూ మంత్రంగానే మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప కోడుమూరు పట్టణానికి శాశ్వతంగా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఇంకిత జ్ఞానం నాయకులకు లేదు. మాకు 20 రోజులైనా కుళాయిల నుంచి నీరు అందటం లేదు మేము ఎందుకు రోడ్డుపైకి వస్తాం మాకు ఏమైనా పొగరా..? మాకు నీళ్లు వస్తే ఎందుకు ఎక్కుతం రోడ్డు. అదే మీ ఇండ్లలో నీళ్లు లేకుంటే మీ ఆడవాళ్లు ఎలా ఉంటారు మీకు అర్థమవుతుంది మాలాగైతేనే మీకు తెలుస్తుంది ఉద్యోగాలు చేసుకుని జీతాలు తినేది కాదు.. నీటి సమస్యను తీరేంతవరకు ఈ ధర్నా నుంచి విరమించుకునేదే లేదు కలెక్టర్ రావాలి అంటూ పట్టు పట్టారు. పోలీసులు వచ్చి మహిళలు మాట్లాడిన మాటలు విని పోలీసులు మాట్లాడుతూ మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు. పరిమిషన్ ఉంటేనే ధర్నాకు దిగాలి మీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు ఎక్కితే సరిపోదు మీ మీద కేసులు పెడతాం జాగ్రత్త అంటూ ఆగ్రహించారు. అంబులెన్స్ లో నాలుగు వెళ్లాయి గర్భవతులు అందులో ఉన్నారు అందులో గర్భవతులు చనిపోతే మీ మీద కేసులు పెడతాం . ఇదంతా సిపిఎం పార్టీ వాళ్లే చేసినట్టు ఉన్నారు.అంటూ గాంభీరంగా పోలీసులు మాట్లాడారు .దురుసు ఎక్కువ అయిపోతున్నది అంటూ మహిళలు పోలీసులపై మండిపడ్డారు. మాకు ఏ నాయకులతో సంబంధం లేదు మేము స్వచ్ఛందంగా బిందెలు తీసుకొని రోడ్ ఎక్కాం.మా ఇండ్లలో మాదిరిగా మీకు మా పరిస్థితి వస్తే సరిపోతుంది. ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసులు మాట్లాడేది కాదు మాకు ఏ నాయకుడు చెప్పలేదు రోడ్డు ఎక్కమని.మేమే స్వచ్ఛందంగా వచ్చాం త్రాగునీటి కొరకు మా ఇండ్లలో నీళ్లు ఉన్నాయో లేదో పోలీసులైన పంచాయతీ అధికారులు అయిన మీరు వచ్చి చూడండి మీకు అర్థం అవుతుంది. అంటూ మహిళల ఆగ్రహించి మాట్లాడారు. ఒక్కసారిగా పోలీసులు ఏమీ ఆలోచించకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుగా ధర్నాకు దిగిన మహిళలను పోలీసు స్టేషన్ కు తరలించారు. మరి కోడుమూరు త్రాగునీటి సమస్య ఎంతవరకు అవుతుందో సమస్యను తీరుస్తారో లేదో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ వీడియో చూస్తే అధికారులకు తెలుస్తుంది. వేచి చూడాలి.1
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శించుకున్న జిల్లా మంత్రులు - _*కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పర్యటనలో సహచర మంత్రి గొట్టిపాటి రవి,కర్నూలు ఎంపీ బస్తి పాటి నాగరాజు,ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి,గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి,కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ,మంత్రాలయం ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి, మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జి లక్ష్మన్న,మరియు కూటమి పార్టీల నాయకులతో గురు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది.*_ #NimmalaRamaNaidu #kurnoolcity #BvJayaNageshwaraReddy #APGovernment #NDA #leader #temples1
- సమిష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి భక్త మండలి సహకారంతో డి పి యు పి మరియు ఉర్దూ ప్రాథమిక పాఠశాల యందు 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఐదు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలతో పని చేయించుకోవడం చట్టరితే నేరమని, ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని పిల్లలకు మధ్యాహ్న భోజనం, దుస్తులు మరియు పుస్తకాలు,, 15000 నగదు పురస్కారం అందిస్తుందని పిల్లలకు విద్య నేర్పిస్తే ఆస్తులు ఇచ్చిన దానికంటే ఎక్కువ అని బ్రహ్మానంద చారి వివరించారు. డిపియుపి ఇన్చార్జి హెచ్ఎం పుష్పరాజు ఉర్దూ స్కూల్ హెచ్ఎం ఫాతిమా అలియానా మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే సదుపాయాలు వివరించారు. ప్రాత పుస్తకాలు పెన్నులు ఇచ్చిన ఆంజనేయ స్వామి భక్తి మండలి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకోబారావు, నాగేంద్రుడు, కే పుష్పరాజు, మంగళ్ లక్ష్మన్న, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు, అనంతరం 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు బ్రహ్మానందం పంపిణీ చేశారు.2
- మంగనూర్ లో బీసీ రిజర్వేషన్ పితామహుడు బి.పి. మండల్ గారి 108వ జయంతి. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూర్ గ్రామం లోని బీసీ కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే గార్ల నూతన విగ్రహాల దిమ్మె దగ్గర బిందేశ్వరి ప్రసాద్ మండల్ ( బి.పి. మండల్ ) గారి 108వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమంలో మంగనూర్ గ్రామం సర్పంచ్ జాలం నాగయ్య యాదవ్, ఉప సర్పంచ్ బోట్క చంద్రశేఖర్, వార్డు మెంబర్ కత్తి పరశురాములు, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు అప్పల మాసయ్య యాదవ్, బీసీ సంఘం నాయకులు వేముల సత్యశీల సాగర్, మేకల యాదయ్య యాదవ్, తోట జయరాములు, నక్కల సాయులు, వంక వెంకటయ్య, ఎలుక నరసింహ, అప్పల మల్లేష్, ఇండ్ల మల్లిఖార్జున్, కుమ్మరి సాంబశివ, వంక ఎల్లయ్య, దాసరి అంజి, వడ్ల నరేష్, పిట్టల నిరంజన్, అప్పల శ్రీను, సల్ల భీమయ్య, కొంగిరి లక్ష్మయ్య, నరసగల్ల కురుమూర్తి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.1