హెడ్‌మాస్టర్ మాలకొండయ్య పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల పాఠశాలను స్వగృహంలా భావించి అభివృద్ధికి కృషి చేశారని ప్రసంశ..! వింజమూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్ గా (గ్రేడ్-II) దీర్ఘకాలం సేవలందించిన చీర్లదిన్నె మాలకొండయ్య పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై, మాలకొండయ్య ని శాలువాతో సన్మానించి వారి విశిష్ట సేవలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, మాలకొండయ్య గత 37 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో నిబద్ధతతో, అంకితభావంతో పనిచేసి విద్యారంగానికి అపారమైన సేవలు అందించారని ప్రశంసించారు. తాను పనిచేసిన పాఠశాలను స్వగృహంలా భావించి, అక్కడి విద్యార్థుల భవిష్యత్తు కోసం, పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తిగా ఆయన నిలిచారని కొనియాడారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులను గుర్తించి వాటి సాధన కోసం చేసిన కృషి నిజంగా ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఎంతో సవాలుతో కూడుకున్నదని, అయినప్పటికీ మాలకొండయ్య విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు తమ శక్తి వంచన లేకుండా పనిచేశారని అన్నారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, వారు అందించే జ్ఞానం అనేక తరాల భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని గుర్తుచేశారు.పదవీ విరమణ అనంతరం కూడా మాలకొండయ్య సమాజ సేవలో చురుకుగా పాల్గొని, తన అనుభవాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ఉపాధ్యాయుడు తన వృత్తిలో రాణించాలంటే కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమని, ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మాలకొండయ్య సేవలను స్మరించుకుంటూ, సమాజం పట్ల ఆయన చూపిన అంకితభావాన్ని కొనియాడుతూ, పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితం ఆరోగ్యంతో, ఆనందంతో, సుఖసంతోషాలతో నిండి ఉండాలని ఎమ్మెల్యే హృదయపూర్వకంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- బద్వేలు: రోడ్డు పనుల ప్రారంభోత్సవం కోసం నియోజకవర్గ ఇంచార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి వర్గాల మధ్య రచ్చ లో రోడ్ల ప్రారంభోత్సవం తామే చేయాలంటూ రెండు వర్గాల పట్టు.. రితీష్ రెడ్డి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తే డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని ఆగ్రహని కారణం అంటున్నారు. తెలుగుగంగ కాలనీలో రోడ్డు ప్రారంభోత్సవానికి డీసీసీబీ చైర్మన్ ఉపక్రమించిన విషయం తెలిసిన రెండు వర్గం అడ్డుకునేందుకు ఉదయం నుంచి మోహరించిన రితీష్ వర్గీయులు విషయం తెలుసుకుని డీసీసీబీ చైర్మన్జాగ్రత్త పడ్డారు.ప్రారంభోత్సవానికి రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద రితీష్ రెడ్డి అనుచరుల హల్ చల్ తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. గత కొంత కాలంగా ఇరువర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసినదే..! పనుల ప్రారంభోత్సవానికి ఏ ఒక్కరికీ ప్రోటోకాల్ లేని టీడీపీ నేతల రచ్చ ప్రజలు గెలిపించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాసరి సుధా ఉండగా ప్రారంభోత్సవం కోసం ఏ అర్హత లేని నేతల కొట్లాటలు..2
- ఏ పరిధిలో ఉందొ కూడా తెలియని పరిస్థితి ఈ tidko apartments పంచాయితీ పట్టించుకోదు మునిసపాలిటీ అవసరము లేదు. ఒక పని మీద gandhi నగర్ సచివాలయం కి వెళ్లిన అది మా లిమిట్స్ కాదు అని అంటున్నారు రాత్రి అయితే బయటకు రావాలి అంటే భయపడుతున్న ప్రజలు కారణం పాములు తెల్లు శుభ్రం చేసే వాళ్ళు కరువు అయ్యారు కనీసం రోడ్లు అయినా చిమ్మడం లేదు పట్టించుకోని అధికారులు గాలికి వదిలేసిన గవర్నమెంట్.1
- సింగరాయకొండ హైవేపై మంగళవారం కారు-ట్రాక్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారు, ట్రాక్టర్ రెండూ బోల్తా పడ్డాయి. వైజాగ్ నుంచి తిరుమల వెళ్తున్న ఆ కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా వారిలో రేవతి, వివేక్, సంతోశ్, రాజేశ్, యశోదలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారులోని ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయట పడ్డారు.1
- 👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”1
- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు “రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమాలోచన కార్యక్రమం” నంద్యాల పట్టణంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించబడింది. రాయలసీమ ప్రాంత భవిష్యత్తుకు కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చలు జరపడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ—రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న నీటి సమస్య తీవ్రతను, సాగునీటి అవసరాన్ని స్పష్టంగా గుర్తించిన నాయకుడు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని పేర్కొన్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో గోప్య ఒప్పందాలు కుదుర్చుకుని రాయలసీమ హక్కులను దెబ్బతీస్తూ, రైతులకు అన్యాయం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ అంశాలపై శాసన మండలిలో ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానాలు రాలేదని, ఎన్జీటీ అనుమతుల కోసం తీసుకున్న చర్యలు, రాయలసీమ నీటి అవసరాల కోసం నిధుల కేటాయింపు వంటి కీలక ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిస్థితులను బట్టి రాయలసీమకు జరుగుతున్న అన్యాయం స్పష్టమవుతోందని, కాబట్టి మన హక్కుల సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు,మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ DR తలారి రంగయ్య గారు,నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలత రెడ్డి గారు, నంద్యాల మాజీ పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారు, కాటసాని రామి రెడ్డి గారు, గంగుల నాని గారు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త ధార సుదీర్ గారు, మాజీ ఎమ్మెల్సి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు,బుడ్డా శేషి రెడ్డి గారు,రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి గారు, చల్లా విగ్నేశ్వర రెడ్డి గారు మరియు YSR Congress Party - YSRCP నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Syyed taher1
- కృష్ణ జిల్లా మచిలీపట్నం :- తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి, రూ. 80,500 నగదును సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి, అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని, తల్లుల నుండి వేరుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితులు: 1. గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ 2. పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ 3. గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ వీరు ప్రధానంగా బిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.1
- ఒంగోలు నియోజకవర్గంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి రూ.19 లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే దామచర్ల వెల్లడించారు. సంబంధిత సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఒంగోలులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే జనార్దన్ పంపిణీ చేశారు. లబ్ధిదారులు చెక్కులను సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.1