logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎంజీఎం సర్కిల్‌లో కానిస్టేబుల్ సంగీత మృతదేహంతో కుటుంబ నిరసన – మహిళా భద్రతపై బీజేపీ విమర్శలు వరంగల్:వరంగల్ నగరంలోని ఎంజీఎం సర్కిల్ వద్ద కానిస్టేబుల్ సంగీత మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. పోలీస్ శాఖలోనే మహిళా కానిస్టేబుళ్లకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, పోలీస్ వ్యవస్థలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు.

5 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
5 hrs ago

ఎంజీఎం సర్కిల్‌లో కానిస్టేబుల్ సంగీత మృతదేహంతో కుటుంబ నిరసన – మహిళా భద్రతపై బీజేపీ విమర్శలు వరంగల్:వరంగల్ నగరంలోని ఎంజీఎం సర్కిల్ వద్ద కానిస్టేబుల్ సంగీత మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. పోలీస్ శాఖలోనే మహిళా కానిస్టేబుళ్లకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, పోలీస్ వ్యవస్థలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నందునే ప్రమాదం జరిగిందని ప్రయాణికుల ఆగ్రహం కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా, గాయాలపాలైన పలువురు ప్రయాణికులు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
    1
    కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నందునే ప్రమాదం జరిగిందని ప్రయాణికుల ఆగ్రహం
కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా, గాయాలపాలైన పలువురు ప్రయాణికులు
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • పెళ్లికి ముందు యువతి అనుమానాస్పద మృతి – మహబూబాబాద్ జిల్లాలో కలకలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న–వినోదల కుమార్తె భూక్య సంగీత (20), కొత్త తండాకు చెందిన అజ్మీరా గోవిందు కుమారుడు అజ్మీర అరవింద్‌తో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఈ ప్రేమ వ్యవహారంపై మొదట కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వారిని ఒప్పించేందుకు సంగీత గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు సమాచారం. అనంతరం చేసేది లేక పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించి, ఈ నెల 29వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఇలాంటి సంఘటన జరగడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం సాయంత్రం ప్రియుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి సంగీత కుటుంబాన్ని ఆహ్వానించగా, వారు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రియుడు అరవింద్, సంగీతను అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే బుధవారం ఉదయం ఇటుకల గడ్డ తండా సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో సంగీత మృతదేహం కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. బావి సమీపంలో రక్తం మరకలతో చెప్పులు లభించడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
    1
    పెళ్లికి ముందు యువతి అనుమానాస్పద మృతి – మహబూబాబాద్ జిల్లాలో కలకలం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న–వినోదల కుమార్తె భూక్య సంగీత (20), కొత్త తండాకు చెందిన అజ్మీరా గోవిందు కుమారుడు అజ్మీర అరవింద్‌తో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు బంధువులు తెలిపారు.
ఈ ప్రేమ వ్యవహారంపై మొదట కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వారిని ఒప్పించేందుకు సంగీత గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు సమాచారం. అనంతరం చేసేది లేక పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించి, ఈ నెల 29వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఇలాంటి సంఘటన జరగడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మంగళవారం సాయంత్రం ప్రియుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి సంగీత కుటుంబాన్ని ఆహ్వానించగా, వారు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రియుడు అరవింద్, సంగీతను అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే బుధవారం ఉదయం ఇటుకల గడ్డ తండా సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో సంగీత మృతదేహం కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. బావి సమీపంలో రక్తం మరకలతో చెప్పులు లభించడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ స్పందన లభించింది. పలుచోట్ల అద్దె బస్సులను అడ్డుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రతకు దారి తీసింది. అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. వేకువజాము నుంచే ఆర్టీసి ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి బస్సులు డిపోల నుంచి బయటకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టిన ఉద్యోగులు డిపోల ముందు నిరసన ఆందోళనకు దిగారు. దీంతో ఉదయం 9 గంటల వరకు డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 11 డిపోలలో 920 బస్సులు ఉండగా 450 బస్సులు నడిచాయని అధికారులు ప్రకటించారు. 414 అద్దె బస్సులతోపాటు 36 ఆర్టీసీ బస్సులు నడిచాయని తెలిపారు. సమ్మేలో 3236 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. అద్దె బస్సులో డ్రైవర్లకే టికెట్లు ఇచ్చే అవకాశం కల్పించి బస్సులు నడిపించడాన్ని నిరసిస్తూ ఆర్టిసి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె ప్రభావం లేకుండా ఉండేందుకు అధికారులు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. డిమాండ్ లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెతో పూర్తి స్థాయిలో బస్సులు నడవక, ఆరకొర బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగుల సమస్య సత్వరమే పరిష్కరించి ప్రయాణీకుల ఇక్కట్లను తొలగించాలని ప్రయాణీకులు కోరారు.
    4
    ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ స్పందన లభించింది. పలుచోట్ల అద్దె బస్సులను అడ్డుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రతకు దారి తీసింది.
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. వేకువజాము నుంచే ఆర్టీసి ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి బస్సులు డిపోల నుంచి బయటకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టిన ఉద్యోగులు డిపోల ముందు నిరసన ఆందోళనకు దిగారు. దీంతో ఉదయం 9 గంటల వరకు డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 11 డిపోలలో 920 బస్సులు ఉండగా 450 బస్సులు నడిచాయని అధికారులు ప్రకటించారు. 414 అద్దె బస్సులతోపాటు 36 ఆర్టీసీ బస్సులు నడిచాయని తెలిపారు. సమ్మేలో 3236 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.  అద్దె బస్సులో డ్రైవర్లకే టికెట్లు ఇచ్చే అవకాశం కల్పించి బస్సులు నడిపించడాన్ని నిరసిస్తూ ఆర్టిసి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె ప్రభావం లేకుండా ఉండేందుకు అధికారులు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. డిమాండ్ లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెతో పూర్తి స్థాయిలో బస్సులు నడవక, ఆరకొర బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగుల సమస్య సత్వరమే పరిష్కరించి ప్రయాణీకుల ఇక్కట్లను తొలగించాలని ప్రయాణీకులు కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    11 hrs ago
  • నల్లగొండ జిల్లా : గుర్రంపోడు మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు, అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ధనుంజయ గౌడ్ (50), నర్సింగ్ మధు గౌడ్ (35)తో పాటు కారులో ప్రయాణిస్తున్న బాల్రెడ్డి (55) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ధనుంజయ గౌడ్, మధు గౌడ్ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో కనగల్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం, గుర్రంపోడు మండలం గుమ్మడవెల్లి వద్ద ఉన్న రైస్ మిల్లులో ధాన్యం పోసిన డబ్బులు తీసుకోవడానికి ఉదయం ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, గుర్రంపోడు మండల పరిధిలోని చేపూర్ ఎక్స్ రోడ్డు వద్ద దేవరకొండ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, కారు చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న బాల్రెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. ఒకే కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడం వారిని విషాదంలో ముంచెత్తింది.. గాయపడిన క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు..
    1
    నల్లగొండ జిల్లా :
గుర్రంపోడు మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు, అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది..
ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ధనుంజయ గౌడ్ (50), నర్సింగ్ మధు గౌడ్ (35)తో పాటు కారులో ప్రయాణిస్తున్న బాల్రెడ్డి (55) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ధనుంజయ గౌడ్, మధు గౌడ్ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో కనగల్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
స్థానికుల వివరాల ప్రకారం, గుర్రంపోడు మండలం గుమ్మడవెల్లి వద్ద ఉన్న రైస్ మిల్లులో ధాన్యం పోసిన డబ్బులు తీసుకోవడానికి  ఉదయం ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, గుర్రంపోడు మండల పరిధిలోని చేపూర్ ఎక్స్ రోడ్డు వద్ద దేవరకొండ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, కారు చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న బాల్రెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. ఒకే కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడం వారిని విషాదంలో ముంచెత్తింది..
గాయపడిన క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు..
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు..
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    39 min ago
  • దివ్యాంగుల అందరూ స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని యూత్ ఫోర్ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా 8 మండలాల ఇన్చార్జి మోరే కృష్ణ అన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలోని యూత్ ఫోర్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ కేంద్రంలో బుధవారం దివ్యాంగులకు స్వయం ఉపాధి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గన్నేరువరం మండలంలోని చిన్న చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద దివ్యాంగులను గుర్తించి వారికి వారి ప్రతిభకు తగ్గట్లు వ్యాపారంలో రాణించేలా చేయూతనివ్వాలన్నారు. అర్హులైన 24 మంది దివ్యాంగులకు ఉచితంగా స్వయం ఉపాధి పరికరాలను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ పాశం ఎల్లయ్య, ట్రైనర్ శివరాత్రి శారద, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కొలుపుల మహేందర్, దివ్యాంగులు, పేరెంట్స్ పాల్గొన్నారు
    1
    దివ్యాంగుల అందరూ స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని  యూత్ ఫోర్ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా 8 మండలాల ఇన్చార్జి మోరే కృష్ణ  అన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలోని యూత్ ఫోర్ ఫౌండేషన్  ఉచిత శిక్షణ కేంద్రంలో  బుధవారం దివ్యాంగులకు స్వయం ఉపాధి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గన్నేరువరం  మండలంలోని చిన్న చిరు వ్యాపారం  చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద దివ్యాంగులను గుర్తించి వారికి వారి ప్రతిభకు తగ్గట్లు వ్యాపారంలో రాణించేలా చేయూతనివ్వాలన్నారు. అర్హులైన 24 మంది దివ్యాంగులకు ఉచితంగా స్వయం ఉపాధి పరికరాలను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కోఆర్డినేటర్ పాశం ఎల్లయ్య, ట్రైనర్ శివరాత్రి శారద, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కొలుపుల మహేందర్, దివ్యాంగులు, పేరెంట్స్ పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • వరంగల్:మత్తు పదార్థాలకు బానిసైన యువత కోసం వరంగల్ కమిషనరేట్ సన్ ప్రీత్ సింగ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ‘మత్తు వదలరా.. కేసు మాఫీ చేసుకోరా’ అనే నినాదంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు డీ-అడిక్షన్ సెంటర్లలో చికిత్స పొందితే, వారి పై ఉన్న పాత కేసులను తొలగించే అవకాశముంటుందని తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ యువతలో మార్పు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమాజాన్ని మత్తు పదార్థాల బారినుంచి దూరం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
    1
    వరంగల్:మత్తు పదార్థాలకు బానిసైన యువత కోసం వరంగల్ కమిషనరేట్ సన్ ప్రీత్ సింగ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ‘మత్తు వదలరా.. కేసు మాఫీ చేసుకోరా’ అనే నినాదంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు డీ-అడిక్షన్ సెంటర్లలో చికిత్స పొందితే, వారి పై ఉన్న పాత కేసులను తొలగించే అవకాశముంటుందని తెలిపారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ యువతలో మార్పు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమాజాన్ని మత్తు పదార్థాల బారినుంచి దూరం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • నిద్రిస్తున్న కుమారుడిపై తండ్రి గొడ్డలితో దాడి మహబూబాబాద్ జిల్లా చంద్రు తండాలో దారుణం జరిగింది. పాత గొడవలను మనసులో పెట్టుకున్న తండ్రి జీవన్.. నిద్రిస్తున్న తన కుమారుడు వంకుడోతు అఖిల్ (20)పై గొడ్డలితో హత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని బంధువులు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
    1
    నిద్రిస్తున్న కుమారుడిపై తండ్రి గొడ్డలితో దాడి
మహబూబాబాద్ జిల్లా చంద్రు తండాలో దారుణం జరిగింది. పాత గొడవలను మనసులో పెట్టుకున్న తండ్రి జీవన్.. నిద్రిస్తున్న తన కుమారుడు వంకుడోతు అఖిల్ (20)పై గొడ్డలితో హత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని బంధువులు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని ఇటుక బట్టీలలో వీధి కుక్కల దాడిలో మూడేళ్ళ చిన్నారి మృతి చెందిన ఘటన పై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేశారు. కుక్కల బెడద నివారణకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇటుక బట్టిలో మృతి వివరాలను బాలిక తల్లిదండ్రులతో అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు ఇటుక బట్టీల్లో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఇటుక బట్టీ యజమానికి సూచించారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా బాధిత కుటుంబానికి తగు సహాయం అందించడం జరుగుతుందని, దాడికి సంబంధించిన వివరాల నివేదికను జిల్లా జడ్జికి పంపించడం జరుగుతుందని జడ్జి గణేశ్ తెలిపారు. అలాగే చిన్నారి మృతికి కారణమైన వీధి కుక్కలపై మరియు వాటిని ప్రేరేపించే జంతు ప్రేమికులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇటుక బట్టీలలో సరైన సెక్యూరిటీ లేక ఇటుక బట్టీల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని పాప తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
    4
    పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని ఇటుక బట్టీలలో వీధి కుక్కల దాడిలో మూడేళ్ళ చిన్నారి మృతి చెందిన ఘటన పై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేశారు. కుక్కల బెడద నివారణకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. 
సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇటుక బట్టిలో మృతి వివరాలను బాలిక తల్లిదండ్రులతో అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు ఇటుక బట్టీల్లో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఇటుక బట్టీ యజమానికి సూచించారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా బాధిత కుటుంబానికి తగు సహాయం అందించడం జరుగుతుందని, దాడికి సంబంధించిన వివరాల నివేదికను జిల్లా జడ్జికి పంపించడం జరుగుతుందని జడ్జి గణేశ్ తెలిపారు. అలాగే చిన్నారి మృతికి కారణమైన వీధి కుక్కలపై మరియు వాటిని ప్రేరేపించే జంతు ప్రేమికులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇటుక బట్టీలలో సరైన సెక్యూరిటీ లేక ఇటుక బట్టీల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని పాప తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.