గన్నేరువరం మండల కేంద్రంలోని దివ్యాంగులు యూత్ ఫోర్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ. దివ్యాంగుల అందరూ స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని యూత్ ఫోర్ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా 8 మండలాల ఇన్చార్జి మోరే కృష్ణ అన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలోని యూత్ ఫోర్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ కేంద్రంలో బుధవారం దివ్యాంగులకు స్వయం ఉపాధి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గన్నేరువరం మండలంలోని చిన్న చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద దివ్యాంగులను గుర్తించి వారికి వారి ప్రతిభకు తగ్గట్లు వ్యాపారంలో రాణించేలా చేయూతనివ్వాలన్నారు. అర్హులైన 24 మంది దివ్యాంగులకు ఉచితంగా స్వయం ఉపాధి పరికరాలను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ పాశం ఎల్లయ్య, ట్రైనర్ శివరాత్రి శారద, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కొలుపుల మహేందర్, దివ్యాంగులు, పేరెంట్స్ పాల్గొన్నారు
గన్నేరువరం మండల కేంద్రంలోని దివ్యాంగులు యూత్ ఫోర్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ. దివ్యాంగుల అందరూ స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని యూత్ ఫోర్ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా 8 మండలాల ఇన్చార్జి మోరే కృష్ణ అన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలోని యూత్ ఫోర్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ కేంద్రంలో బుధవారం దివ్యాంగులకు స్వయం ఉపాధి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గన్నేరువరం మండలంలోని చిన్న చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద దివ్యాంగులను గుర్తించి వారికి వారి ప్రతిభకు తగ్గట్లు వ్యాపారంలో రాణించేలా చేయూతనివ్వాలన్నారు. అర్హులైన 24 మంది దివ్యాంగులకు ఉచితంగా స్వయం ఉపాధి పరికరాలను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ పాశం ఎల్లయ్య, ట్రైనర్ శివరాత్రి శారద, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కొలుపుల మహేందర్, దివ్యాంగులు, పేరెంట్స్ పాల్గొన్నారు
- దివ్యాంగుల అందరూ స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని యూత్ ఫోర్ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా 8 మండలాల ఇన్చార్జి మోరే కృష్ణ అన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలోని యూత్ ఫోర్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ కేంద్రంలో బుధవారం దివ్యాంగులకు స్వయం ఉపాధి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గన్నేరువరం మండలంలోని చిన్న చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద దివ్యాంగులను గుర్తించి వారికి వారి ప్రతిభకు తగ్గట్లు వ్యాపారంలో రాణించేలా చేయూతనివ్వాలన్నారు. అర్హులైన 24 మంది దివ్యాంగులకు ఉచితంగా స్వయం ఉపాధి పరికరాలను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ పాశం ఎల్లయ్య, ట్రైనర్ శివరాత్రి శారద, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కొలుపుల మహేందర్, దివ్యాంగులు, పేరెంట్స్ పాల్గొన్నారు1
- కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్ లో బి ఆర్ ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. నగరంలోని తెలంగాణ చౌక్ లో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. హై కోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుట్ర పూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హై కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనే భావనతో రెండున్నరేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకొని రేవంత్ రెడ్డి రిపేరింగ్ పేరిట హడావుడి చేశారని అన్నారు.1
- బెజ్జంకి మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో బుధవారం UKG విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ల తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమం అరుదని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు జంగోని శ్రీనివాస్, శిరీష, హరీష పాల్గొన్నారు. తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.1
- జగిత్యాల జిల్లా..... RTC నాయకులు, ప్రభుత్వ అధికారుల మధ్య నిన్న జరిగిన చర్చలు విఫలం..... సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించిన RTC JAC..... కోరుట్ల, మెట్టుపల్లి పట్టణాల్లో డిపోలకే పరిమితమైన RTC బస్సులు.1
- నవనారసింహ స్వామి క్షేత్రాలలో ఒక్కటైన జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలతో అర్చకులు గోదావరినదికి వెళ్ళి బిందె తీర్థం ఆలయానికి తీసుకు వచ్చారు. శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి…శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలలో లోకకళ్యాణం కొరకువేద పండితుల వేదమంత్రోచ్చరణల మధ్య సంకల్ప పూజలు…కలశగణపతి విశ్వక్షేణ ఆరాధన… కలశ స్థాపన…. పంచామృతాలతో శ్రీ యోగానంద…శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి మూల మూర్తులకు పంచోపనిషత్తులతో అభిషేకము శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలంకర అష్టోత్తర శతనామర్చనలు, దూప, దీప నివేదన సప్త హారతులు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రధాన కార్యక్రమాలు ఈనెల 25న అన్నకూటోత్సవము, 26న సహస్ర కలశాభిషేకం, 27న చందనోత్సవం, 28న పల్లవ ఉత్సవం, వసంతోత్సవం, 29న లక్ష తులసి అర్చన, 30న శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలు కొనసాగనున్నాయని ఆలయ అర్చకులు నంబి అరుణ్ కుమార్ చార్య, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.1
- ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో మల్లికార్జున్ కార్గే దిష్టి బొమ్మను దగ్గదం చేసిన బీజేపీ నాయకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ కార్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఖర్గే ప్రధాని మోదీని టెర్రరిస్టుగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ… దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు దేశ రాజకీయ విలువలను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- కరీంనగర్ లోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- ఆర్టీసీ లో రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు అందులో 40 లక్షల మంది మహిళా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.వారు ఉద్యోగ రీత్యా,విద్యా,వైద్య అవసరాలకు ప్రయాణం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది మిగిలిన మూడు అంశాలపై చర్చిస్తున్నాం.. మేము రాగానే వేసిన మొట్ట మొదటి కమిటీ సీనియర్ ఐఏఏస్ లతో వేశాం.. అధికారుల కమిటీ తో ఐదు గంటలపైగా చర్చిస్తుండగానే సమ్మెకు పోతున్నామని మద్యలో వెళ్లిపోవడం ఇది కుట్ర లో భాగమే ఇటీవల జగిత్యాల సభలో మహా లక్ష్మీ ప్రయాణం కేసీఆర్ అవహేళన గా మాట్లాడారు ... వెంటనే ఆర్టీసీ పై కుట్రలో భాగంగానే గతంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు గా ఉన్న హరీష్ రావు సమ్మె పై కార్మికులను ప్రోత్సహించారు.. మహా లక్ష్మీ పథకాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేరు ఆర్టీసీ డిమాండ్స్ పై చర్చిస్తున్నాని అధికారులు చెప్పారు.. అయిన వినకూడనే ఎవరితో ఫోన్ లో మాట్లాడి సమ్మె కి వెళ్ళారు ఆర్టీసీ కార్మికులకు 2013 బాండ్స్ 280 కోట్లు ఇచ్చాం..1134 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చాం.. రాష్ట్ర రవాణా శాఖ పక్షాన పని భారం లేకుండా కార్మిక చట్టాలు లోపలే చేశాం.. గతంలో 12 గంటలు వాహనం నడపడం వల్ల మరునాడు హాఫ్ ఉండేది.. వాళ్ళు ఎలా అంటే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. మేమే పని భారం లేకుండా చేయాలని చూస్తున్నాం.. మేము శ్రమ దోపిడి చేయదలచుకోలేదు విలీనం ,యూనియన్ ల అంశాలపై ప్రభుత్వం పరిగణన లో ఉంది ప్రభుత్వం నెలకి ఆర్టీసీకి 300 కోట్ల ,అవసరమైనప్పుడు 400 కోట్లు ఎంత అవసరం ఉంటే అంత ఇస్తుంది ఆర్టీసీ లో సర్వీసు నుండి రిమూవ్ అయిన వారికి 250 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తున్నాం.. పేద ప్రజల లైఫ్ లైన్ ఆర్టీసీ ..ఆర్టీసీ నిర్వీర్యం చేసే కుట్రలు చేయద్దు. పేద ప్రజల రవాణా వ్యవస్థ బాగుండాలి ,పని చేస్తున్న 40 వేల కుటుంబాల ఉద్యోగుల బాగుండాలి నిరసనలు చెప్పే వారు బస్ డిపో లు చేసుకోండి.. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు మేము ఏర్పడిన తరువాత మొదటి కమిటీ వేశాం..మేము కమిటీ కి 4 వారాల సమయం అడిగాం.. ప్రభుత్వం తో కూర్చొని మాట్లాడాల్సిన అంశాలు నాయకత్వం వహించిన వారు రిటైర్డ్ అయిన వారు ,ఉద్యోగాలు చేయని వారు ఉన్నారు.. గత ప్రభుత్వం ఆర్టీసీ నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించింది.. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఎండీ కి , ప్రిన్సిపల్ సెక్రటరీ కి తెలియకుండా ఆదరభదార గా విలీనం అంశాన్ని తెచ్చారు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరకు రండి కూర్చొని మాట్లాడడం.. మహా లక్ష్మీ పథకం నచ్చినంత మాత్రాన మీరు ఆర్టీసీ పై కుట్రలు చేస్తున్నారు రాజకీయ వ్యూహంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. పేద ప్రజల ప్రయాణానికి సంబంధించి ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్న వారు సంస్థ పరిరక్షణ దృశ్య ,ప్రయోజన దృశ్య సమ్మె విరమించాలి. అధికారులు ఆర్టీసీ కార్మికులు సమ్మె కి పోతున్నారని ఊహించలేదు.. డిప్యూటీ సీఎం చెన్నై లో ఉండడం వల్ల మాట్లాడలేకపోయం.. డిపో వారిగా సమీక్ష చేసి పని ఒత్తిడి ఉన్న దగ్గర తగ్గించేందుకు సిద్ధం.. మేము కింది స్థాయి నుండి వచ్చాం..ఆర్టీసీ కుటుంబాల తో 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక సార్లు ఇంటరాక్ట్ అయ్యారు.. ఉద్యోగస్థులు అక్కా చెల్లెలు ,అన్న దమ్ములు ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలి.. 29 అంశాలపై వెంటనే మేము టేబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. ఇప్పటికిప్పుడు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం..ఆర్థిక పరమైన అంశాలను కూడా ప్రభుత్వం భారం మోయడానికి సిద్ధంగా ఉంది.. విలీనం ,సంఘాల ఏర్పాటు , పీఆర్సీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది..మూడు సాంకేతిక అంశాలపై కమిటి రిపోర్ట్ అందిస్తుంది అధికారుల సంప్రదింపులు కొనసాగుతుండగానే కమిటీ లోని వికాస్ రాజ్ ,దాన కిషోర్ ,సందీప్ కుమార్ సుల్తానియ మీ అంశాలపై సానుకూల దృక్పథంతో ఉండేవారు. ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నాం.. పెండింగ్ బకాయిలు చెల్లిస్తున్నాం.. సమ్మె దృశ్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం.. గత ప్రభుత్వం యూనియన్ లను రద్దు చేసినప్పుడు ఎందుకు అడగలేదు ఈవీ బస్సులు 2018 లో స్టార్ట్ అయ్యాయి.. అది కేంద్ర ప్రభుత్వ స్కీమ్..ముఖ్యమంత్రి లేఖ రాశారు.. ఈవీ బస్సుల కారణంగా ఒక్క ఆర్టిసి ఉద్యోగి నీ కూడా తొలగించం .. దేశ వ్యాప్తంగా 14 వేల బస్సులు ఇస్తుండగా తెలంగాణ కి 2 వేల బస్సులు ఇస్తున్నారు.. కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ బస్సులు తీసుకొస్తున్నారు.. ఆర్టీసీ అనేక సంస్కరణలు తీసుకొస్తుంది.. బేషరతుగా సమ్మె విరమించండి.. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధం ఉన్నాం.. ప్రతిపక్ష పార్టీకి కావాల్సింది దోపిడీ మేము వచ్చిన తర్వాత 2800 బస్సులు కొనుగోలు చేశాం.. 2017 పీఆర్సీ ఇచ్చాం.. 2013 బాండ్స్ 280 కోట్లు ఇచ్చాం.. సర్వీసు నుండి శాశ్వతంగా రిమూవ్ అయిన వారికి 250 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.. మూడు సంవత్సరాల పిరియడ్ ను 2 సంవత్సరాలకు తగ్గించాం.. ఆర్టీసీ డిపో లు ఎవరి సొత్తు కాదు .. హైదరాబాద్ లో ఇబ్బందులు కలగకుండా ఎంఎంటీఎస్, మెట్రో సర్వీసులు ఫ్రీక్వెన్సీ పెంచాలని చెప్పాం.. ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రి గా కోరుతున్న..మీ నిరసన ప్రజాస్వామికంగా ప్రభుత్వం గురించే విధంగా ఉండాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,హరీష్ రావు ఆర్టీసీ సమ్మె తో రాక్షసానందం పొందడం ,మహిళా ప్రయాణికులను ఇబ్బంది కలగజేయవద్దు.. తెలంగాణ అక్కా చెల్లలు దాదాపు 300 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసి 10 వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు.1