Shuru
Apke Nagar Ki App…
కోమటిపల్లి అడవిలో కూలిన భారీ వృక్షాల పరిశీలన.. పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని లక్ష్మణ్ బాబు డిమాండ్ ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి అడవిలో ప్రకృతి వైపరీత్యంతో కూలిపోయిన భారీ వృక్షాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పరిశీలించారు. అడవి ధ్వంసం పర్యావరణం, వన్యప్రాణులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూలిన చెట్లను తొలగించి, అటవీ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అటవీ శాఖను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
M D Azizuddin
కోమటిపల్లి అడవిలో కూలిన భారీ వృక్షాల పరిశీలన.. పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని లక్ష్మణ్ బాబు డిమాండ్ ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి అడవిలో ప్రకృతి వైపరీత్యంతో కూలిపోయిన భారీ వృక్షాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పరిశీలించారు. అడవి ధ్వంసం పర్యావరణం, వన్యప్రాణులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూలిన చెట్లను తొలగించి, అటవీ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అటవీ శాఖను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- గురుపౌర్ణమి వేళ సాయినామస్మరణ.. కిటకిటలాడిన సాయిబాబ ఆలయాలు వరంగల్ నగరంలో గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీ దత్తాత్రేయ, సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పోర్టురోడ్డు శివనగర్‌లోని శ్రీ గణేష్ సాయిబాబా మందిరం, ములుగు రోడ్డులోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం, భద్రకాళి, దేశాయిపేట లక్ష్మీ టౌన్‌షిప్‌లోని శిరిడి సాయిబాబా దేవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. సాయిబాబాకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.1
- సీసీ రోడ్డు,మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం,మన్ పహాడ్ గ్రామంలో గ్రామాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతుల విస్తరణతో పాటు మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు,అలాగే రూ.10 లక్షల వ్యయంతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు,మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేస్తూ గ్రామాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాలమ్మ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్,జిల్లా నాయకులు ధర్మారెడ్డి, తోటకూరి పాండుకృష్ణ, మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న,నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు ఉప్పుల ప్రకాష్,మండల ఎస్సి మైనార్టీ సెల్ అధ్యక్షులు నాగరాజు, మహ్మద్ రసూల్, NSUI మండల అధ్యక్షుడు ఉమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు యాకయ్య, మండల గ్రామ నాయకులు,రెడ్డి రమేష్, రవి,మహ్మద్ జాకిర్, మొటికే చంద్రశేఖర్, తోటకూరి రమేష్, లీనారెడ్డి, రాజేందర్, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘాలు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన - రాణా ప్రతాప్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం, తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ని ఈరోజు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి లో పరామర్శించి, వారి యోగ క్షేమాల గురించి తెలుసుకొని , వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారిని మనో దైర్యంతో ఉండాలని కోరిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి2
- యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి, ఎమ్మెల్యే ఇటీవల గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందుతోందని తెలుసుకుని అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.1
- కోర్టులను గౌరవిస్తూ హైదరాబాద్‌ను కాపాడే హైడ్రా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజకీయ హంగామా కబ్జాదారులను కాపాడలేనని కోర్టులను గౌరవిస్తూ, హైదరాబాద్‌ను కాపాడే విధంగా కొనసాగే హైడ్రా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.1
- దివ్యాంగుడి చిరకాల స్వప్నాన్ని నిజం చేసి మల్కాజ్గిరి కమిషనరేట్ కార్యాలయంలో సిపి సుమతి దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ పోలీస్ ఆఫీసర్ కావాలనే దివ్యాంగుడి చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన సీపీ మల్కాజిగిరి కమిషనరేట్ కార్యాలయంలో రాహుల్‌ను తన కుర్చీపై కూర్చోబెట్టి, పోలీస్ క్యాప్ పెట్టి గౌరవించిన సీపీ సుమతి1
- ఇక అబద్ధం చెప్పను అందుకే రాజీనామా చేశాను: ఢిల్లీ DCP సుమిత్ జా *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* ప్రభుత్వం నేను ప్రెస్ ముందుకు వచ్చి, వీధుల్లో తమ హక్కుల కోసం అడుగుతున్న విద్యార్థుల గురించి పచ్చి అబద్ధాలు చెప్పాలని వత్తిడి చేస్తుంది వాళ్ళను నేరస్థులుగా రుజువు చేయమని నాకు చెప్పారు. నిజం చెప్పకుండా నన్ను ఆపీ , అమాయక విద్యార్థులను ఇరికించమని బలవంతం చేసే ఏ వ్యవస్థలోనూ నేను భాగం కాలేను. ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. వీరు మన దేశ భవిష్యత్తు. నేను పోలీస్ ఉద్యోగం ఎంచుకుంది నిజానికి తోడుగా నిలవడానికి. అబద్ధాలు అమ్మడానికి కాదు. ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి నేను భాగస్వామిని కాలేను. ఈ రోజు నుండి నేను ప్రభుత్వంతో కాదు, ఈ విద్యార్థులతో ఉన్నాను.1
- గురుపౌర్ణమి వేళ శ్రీ దత్తాత్రేయ స్వామికి విశేష పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పంచామృతాభిషేకం.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులు విశేషంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.1