logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి, ఎమ్మెల్యే ఇటీవల గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందుతోందని తెలుసుకుని అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

1 day ago
user_Chetty:Ramesh
Chetty:Ramesh
నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
1 day ago

యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి, ఎమ్మెల్యే ఇటీవల గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందుతోందని తెలుసుకుని అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన - రాణా ప్రతాప్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం, తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ని ఈరోజు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి లో పరామర్శించి, వారి యోగ క్షేమాల గురించి తెలుసుకొని , వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారిని మనో దైర్యంతో ఉండాలని కోరిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
    2
    పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన - రాణా ప్రతాప్ రెడ్డి
నర్సంపేట నియోజకవర్గం, తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న  నర్సంపేట మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ని ఈరోజు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి లో పరామర్శించి,  వారి యోగ క్షేమాల గురించి తెలుసుకొని , వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారిని మనో దైర్యంతో ఉండాలని కోరిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
    user_Vinod Kumar paladugula
    Vinod Kumar paladugula
    Local News Reporter నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
  • యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి భరోసా కల్పించారు.
    1
    యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత
సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి భరోసా కల్పించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • ఇల్లందు.. కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ లో వర్షం కారణంగా 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు..వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం యాంకర్ వాయిస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఓబి పనులు ప్రారంభం కాలేదు. ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో అధికారులు బొగు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
    1
    ఇల్లందు.. కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ లో వర్షం కారణంగా 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  
ఇల్లందు..వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం 
యాంకర్ వాయిస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లందు  సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఓబి పనులు ప్రారంభం కాలేదు. ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో అధికారులు బొగు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
  • *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* ప్రభుత్వం నేను ప్రెస్ ముందుకు వచ్చి, వీధుల్లో తమ హక్కుల కోసం అడుగుతున్న విద్యార్థుల గురించి పచ్చి అబద్ధాలు చెప్పాలని వత్తిడి చేస్తుంది వాళ్ళను నేరస్థులుగా రుజువు చేయమని నాకు చెప్పారు. నిజం చెప్పకుండా నన్ను ఆపీ , అమాయక విద్యార్థులను ఇరికించమని బలవంతం చేసే ఏ వ్యవస్థలోనూ నేను భాగం కాలేను. ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. వీరు మన దేశ భవిష్యత్తు. నేను పోలీస్ ఉద్యోగం ఎంచుకుంది నిజానికి తోడుగా నిలవడానికి. అబద్ధాలు అమ్మడానికి కాదు. ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి నేను భాగస్వామిని కాలేను. ఈ రోజు నుండి నేను ప్రభుత్వంతో కాదు, ఈ విద్యార్థులతో ఉన్నాను.
    1
    *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను*
*ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను*
ప్రభుత్వం నేను ప్రెస్ ముందుకు వచ్చి, వీధుల్లో తమ హక్కుల కోసం అడుగుతున్న విద్యార్థుల గురించి పచ్చి అబద్ధాలు చెప్పాలని వత్తిడి చేస్తుంది 
వాళ్ళను నేరస్థులుగా రుజువు చేయమని నాకు చెప్పారు.
నిజం చెప్పకుండా నన్ను ఆపీ , అమాయక విద్యార్థులను ఇరికించమని బలవంతం చేసే ఏ వ్యవస్థలోనూ నేను భాగం కాలేను. 
ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. వీరు మన దేశ భవిష్యత్తు.
నేను పోలీస్ ఉద్యోగం ఎంచుకుంది నిజానికి తోడుగా నిలవడానికి. అబద్ధాలు అమ్మడానికి కాదు.
ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి నేను భాగస్వామిని కాలేను.
ఈ రోజు నుండి నేను ప్రభుత్వంతో కాదు, ఈ విద్యార్థులతో ఉన్నాను.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద...సగం నిండిన ప్రాజెక్ట్... ఎల్ఎండి, మిడ్ మానేర్ కు స్వల్పంగా కొనసాగుతున్న వరద అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జగిత్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 66 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం పది టిఎంసీలకు నీరు చేరింది.‌ వరద ఇలానే కొనసాగితే రేపటి వరకు 14 టీఎంసీలు వరకు చేరే అవకాశం ఉంది. ఎల్లంపల్లికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇక కాలేశ్వరం ప్రాజెక్టులోని నంది మేడారంలోని పంపులను ఆన్ చేసి మిడ్ మానేర్ కు నీటిని ఎత్తిపోసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మినహా ఏ ప్రాజెక్టుకు ఆశించని స్థాయిలో వరద వచ్చిన దాఖలాలు లేవు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యాంకు స్వల్పంగా 206 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.4 టీఎంసీల నీరు నిలువ ఉంది. అదే విధంగా మిడ్ మానేర్ డ్యామ్ కు 2334 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. 27.55 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల మిడ్ మానేర్ లో ప్రస్తుతం 7.5 టీఎంసీలను నీరు నిల్వ ఉంది. జగిత్యాల పెద్దపెల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షంతో పలు జలాశయాలకు జలకల సంతరించుకోగా కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని జలాశయాలు వెలవెల బోతున్నాయి.
    1
    ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద...సగం నిండిన ప్రాజెక్ట్... ఎల్ఎండి, మిడ్ మానేర్ కు స్వల్పంగా కొనసాగుతున్న వరద
అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జగిత్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 66 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం పది టిఎంసీలకు నీరు చేరింది.‌ వరద ఇలానే కొనసాగితే రేపటి వరకు 14 టీఎంసీలు వరకు చేరే అవకాశం ఉంది. ఎల్లంపల్లికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇక కాలేశ్వరం ప్రాజెక్టులోని నంది మేడారంలోని పంపులను ఆన్ చేసి మిడ్ మానేర్ కు నీటిని ఎత్తిపోసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మినహా ఏ ప్రాజెక్టుకు ఆశించని స్థాయిలో వరద వచ్చిన దాఖలాలు లేవు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యాంకు స్వల్పంగా 206 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.4 టీఎంసీల నీరు నిలువ ఉంది. అదే విధంగా మిడ్ మానేర్ డ్యామ్ కు 2334 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. 27.55 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల మిడ్ మానేర్ లో ప్రస్తుతం 7.5 టీఎంసీలను నీరు నిల్వ ఉంది. జగిత్యాల పెద్దపెల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షంతో పలు జలాశయాలకు జలకల సంతరించుకోగా కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని జలాశయాలు వెలవెల బోతున్నాయి.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • వాజేడు బొగత జలపాతం సందర్శన బంద్! పర్యాటకులు రావొద్దు..! భారీ వర్షాల కారణంగా వాజేడు మండలం బొగత జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి నరేందర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో జలపాతంలో నీరు ప్రమాదకర స్థాయికి చేరిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సందర్శన నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యాటకులు ఎవరు బొగత సందర్శనకు రావద్దని సూచించారు.
    1
    వాజేడు బొగత జలపాతం సందర్శన బంద్! పర్యాటకులు రావొద్దు..!
భారీ వర్షాల కారణంగా వాజేడు మండలం బొగత జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి నరేందర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో జలపాతంలో నీరు ప్రమాదకర స్థాయికి చేరిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సందర్శన నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యాటకులు ఎవరు బొగత సందర్శనకు రావద్దని సూచించారు.
    user_Swathi
    Swathi
    గ్రాఫిక్ డిజైనర్ ములుగు, ములుగు, తెలంగాణ•
    4 hrs ago
  • వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఇసుక వాగు భారీగా ఉప్పొంగడంతో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు తెగి తెలంగాణ-ఛత్తీస్ గఢ్ రాకపోకలు బంద్! వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఇసుక వాగు భారీగా ఉప్పొంగడంతో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు తెగిపోయింది. దీంతో తెలంగాణ-చత్తీస్ గఢ్ పాటు సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నేటి ఉదయం వాగు ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరద రోడ్డుపైకి చేయడంతో ఒకసారిగా రోడ్డు తెగిపోయింది.
    1
    వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఇసుక వాగు భారీగా ఉప్పొంగడంతో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు తెగి తెలంగాణ-ఛత్తీస్ గఢ్ రాకపోకలు బంద్!
వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఇసుక వాగు భారీగా ఉప్పొంగడంతో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు తెగిపోయింది. దీంతో తెలంగాణ-చత్తీస్ గఢ్ పాటు సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నేటి ఉదయం వాగు ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరద రోడ్డుపైకి చేయడంతో ఒకసారిగా రోడ్డు తెగిపోయింది.
    user_Swathi
    Swathi
    గ్రాఫిక్ డిజైనర్ ములుగు, ములుగు, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.