Shuru
Apke Nagar Ki App…
https://youtu.be/NdA7nnq5Bck?si=xZwppUbf5RFapHVL
Sayad Mahaboibmadari
https://youtu.be/NdA7nnq5Bck?si=xZwppUbf5RFapHVL
- NUKALA SATYANARAYANAకర్నూల్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్i want telangana n Andhra pradesh news Teluguon 25 January
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబు గుంపల గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి కోసం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు కుళాయిల వద్ద బిందెలను క్యూ లైన్లో పెట్టుకుని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్ అధికారులకు తాగునీటి సమస్యను గ్రామస్థులు తెలియజేశారు. అయినా ఎవరూ స్పందించలేదు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1
- చేనేత కార్మికులకు నేటి నుండి ఉచిత విద్యుత్ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డులో మగ్గం చేనేత కార్మికులతో ముచ్చటించారు. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఆది నుండి తెలుగుదేశం పార్టీకి చేనేత వర్గం వారు అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.1
- బద్వేలు, ఏప్రిల్ 0 2: ఫిబ్రవరి మాసంలో వృద్ధాప్యంలో కూడా వీడని అన్న చెల్లెల అనుబంధం. అనేటువంటి కథనం సోషల్ మీడియా ద్వారా మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో వారు చేసినటువంటి ట్వీట్ట్ ద్వారా కలెక్టర్ జిల్లా యంత్రాంగం స్పందించి గోపవరం మండలం పిపి కుంట గ్రామంలోని ఇద్దరు నిరాశ్రయులను ఆర్డిఓ చంద్రమోహన్ మరియు డిఆర్డిఏ పిడి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో లక్కీ కొండయ్య మరియు ఆయన సోదరి పొంత గిరిలక్ష్మీనారాయణమ్మ గా గుర్తించారు. బద్వేలు పట్టణంలోని మెప్మా మరియు బద్వేలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నైట్ షెల్టర్, ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహం. నకు తరలించి, వారికి అవసరమైనటువంటి వసతులను ఏర్పాటు చేసి, డాక్టర్ల ద్వారా వైద్యం అందించడం జరిగింది. అధికారులు స్వయంగా వారి చేతుల మీదుగా వారికి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఆర్డీవో , డిఆర్డిఎ పిడి రాజ్యలక్ష్మి ఆదేశాలతో, వారిని నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించుకొని, వారికి అవసరమైనటువంటి వైద్యము, వసతి, ఆహారాన్ని, ఈ రెండు నెలలపాటు అందించడం జరిగింది. అధికారుల సహకారంతో, వారికి అవసరమైన రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, మంజూరు చేశారు. నేడు ఏప్రిల్ ఒకటో తారీకు ఉదయం, పెన్షన్ వారికి ఇవ్వడంతో ఆనంద నిలయంలోని వృద్ధులు అందరు కూడా తమ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని, తెలియపరుస్తూ, వచ్చినటువంటి అధికారులకు కృతజ్ఞతలతో చిరు సన్మానం చేయడం జరిగింది .ఆనంద నిలయం నిర్వాహకులు పిడతల రవికుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గోపవరం మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.2
- వికారాబాద్, మోమిన్ పేట్ : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మొహం పేట్ మండలం బూరుగుపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ పతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆర్డిఓ వాసు చంద్ర జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు గ్రామంలోని ప్రజలకు అందాల లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేస్తున్నదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలను పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటివరకు పదివేల కోట్ల రూపాయల ప్రయాణాలు చేశారని, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ గురజాతి పథకంలో పేదల ఇళ్లకు ఉచిత కరెంట్ రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు కల్పించినట్లు తెలిపారు.1
- కదిరి మండల పరిధిలోని ముత్యాల చెరువు గ్రామంలో శుక్రవారం మన ఊరు మన నీరు మన అందరి బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సాగునీటి చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సీనియర్ టిడిపి నాయకుడు న్యాయవాది వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఓటమి నాయకులు పాల్గొన్నారు.1
- a Masjid-e-Abbas (Gulshan-e-Abul Fazal Abbas A.S.) langar house ke paas mori ka pani jama ho raha hai, jiski wajah se musalliyon ko aane jaane mein sakht mushkilat ho rahi hain. GHMC se guzarish hai ke is masle par fauri tawajjo de kar ise hal karein.1
- నందవరం బంగారమ్మ ఆలయంలో భక్తి విరాజిల్లింది… గోపుర కలశ ప్రతిష్టతో మహోత్సవ వైభవం!”1
- బద్వేలు :స్వచ్ఛ సర్వేక్షన్ 2026 లక్ష్యంగా మన బద్వేలు పురపాలక సంఘం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు వార్డు స్థాయిలో జరిగిన చెత్త వర్గీకరణ (Waste Segregation) కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ కమీషనర్ స్వయంగా పాల్గొని, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమ ముఖ్యాంశాలు: నేరుగా క్షేత్రస్థాయిలో: కమిషనర్ గారు స్వయంగా తడి, పొడి మరియు హానికర వ్యర్థాలను ఎలా వేరు చేయాలో (ఆకుపచ్చ, నీలం, ఎరుపు బుట్టల వినియోగం) ప్రజలకు వివరించారు. కార్మికులకు దిశానిర్దేశం: పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి, వ్యర్థాల సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలను పర్యవేక్షించారు. పౌరుల బాధ్యత: "మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మన వీధిని, మన పట్టణాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత" అని కమీషనర్ గారు పిలుపునిచ్చారు. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న వేళ, మన వంతుగా చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి సహకరిద్దాం. స్వచ్ఛ సర్వేక్షన్ 2026లో మన బద్వేలు ను నంబర్ 1 గా నిలుపుదాం!1
- గాండ్లపెంట మండలo క ఠారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించి, ముగింపుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి ఉత్సవాలు ముగింపు కావడంతో యోగివేమన గొడుగుకి వేమన పీఠాధిపతులు నందవేమారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలు చేశారు. వేమన సమాధిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన నందవేమారెడ్డికి భక్తులు ప్రశంసిస్తున్నారు.1