Shuru
Apke Nagar Ki App…
నల్గొండ జిల్లాలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో కార్పొరేషన్లలో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక గురువారం నుంచి విస్తృతంగా అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారాస్త్రాలు ఎక్కు పెట్టనున్నారు.
Journalist Prem
నల్గొండ జిల్లాలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో కార్పొరేషన్లలో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక గురువారం నుంచి విస్తృతంగా అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారాస్త్రాలు ఎక్కు పెట్టనున్నారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లంపేట మున్సిపాలిటీ సైదోనిగడ్డ తండాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మేడ్చల్–మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులు మెగావత్ శాంతి జీవన్ నాయక్, అంకిత రవి నాయక్ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్లానని, “ఇది నా వల్ల కాదు” అని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తానే పనిచేయలేకపోతున్నానని చెబుతుండటం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యేనే పనిచేయలేకపోతే రేపు గెలిచే వార్డ్ కౌన్సిలర్ ఏమి చేయగలడని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. రెండు వేల పెన్షన్‌ను నాలుగు వేలు చేస్తామని, నాలుగు వేల పెన్షన్‌ను ఆరు వేలు చేస్తామని చెప్పినప్పటికీ, గత రెండేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదని తెలిపారు. భర్తలను కోల్పోయిన మహిళలకు, వికలాంగులకు కూడా ఒక్క కొత్త పెన్షన్ రావడం లేదన్నారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండటం ఆందోళనకరమన్నారు. నిధులే లేనప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో సమాధానం చెప్పాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రావడం లేదని, కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలేదని ఆరోపించారు. గ్రామాలు, పట్టణాలకు వస్తున్న ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే పంపిస్తున్నదని, అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే సాధ్యమైనంత ఎక్కువ నిధులు తీసుకువచ్చి ప్రాంత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట అధ్యక్షులు శ్రీశైలం, నందా రెడ్డి, నరసింహారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ అమర్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్ మల్లికార్జున్, కృష్ణ గౌడ్, వెంకట్, మేడ్చల్ మున్సిపల్ ప్రెసిడెంట్ శైలజ హరి, జగన్, పూడూరు నరసింహారెడ్డి, గడ్డం సాయి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దబోయిన దేవేంద్ర యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో తగిన గౌరవం దక్కకపోవడంతోనే బీఆర్ఎస్‌లో చేరినట్లు దేవేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ఈ చేరికతో స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.1
- అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద *పులిహోర పంపిణీ కార్యక్రమం* *తేదీ 03-02-2025 మంగళవారం ఉదయం 9-30 గంటలకు* సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ రేపు దాతగా పేరు:- శ్రీమతి & శ్రీ *నాయిని సత్యలక్ష్మి యాదగిరి* *దంపతులు మరియు* *వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ మందిరం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం కలదు కావున అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు *జై హనుమాన్ జై జై హనుమాన్* ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్ దూబగుంట లచ్చల్, భైరయ్య సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు4
- మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం అయ్యగారి పల్లి సమీపం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఫోన్ మాట్లాడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న హచ్యా అనే వ్యక్తిని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది ఈ ఘటనలో హత్య అక్కడికక్కడే మృతి చెందగా ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు గాయపడిన వ్యక్తిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్/ బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి 15 వ వార్డ్ నుండి జోడు మౌనిక ప్రకాష్ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు2
- డిగ్రీ తో బ్యాంకు ఉద్యోగాలు exam లేదు... ఫుల్ డీటెయిల్స్ వీడియో ఇన్ my యూట్యూబ్ ఛానల్ లింక్ ఇన్ కామెంట్స్ box 👇👇👇🤝1
- మిర్యాలగూడలో బహిరంగ సభ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మిర్యాలగూడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో సహా జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎమ్మెల్యేలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.1
- వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి కొండేటి రజిత–సాంబయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే.ఆర్. నాగరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కొండేటి రజితను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- ఉప్పల్, నియోజకవర్గం షబ్-ఎ-బరాత్ పవిత్ర సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, బీరప్పగడ్డ ప్రాంతాలకు చెందిన ముస్లిం మైనారిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మందమూల పరమేశ్వర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు. ఉప్పల్ ముస్లిం ఖబ్రస్తాన్‌లో అడవిలా పెరిగిన చెట్ల తొలగింపు, పరిసరాల శుభ్రత, గోడలు మరియు సమాధులకు రంగుల వేయింపు, భక్తుల సౌకర్యార్థం లైట్ల ఏర్పాటు వంటి పనులు పరమేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చేపట్టడం జరిగింది. ప్రజా ప్రభుత్వ పాలనలో ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఖబ్రస్తాన్లు, మసీదులు, మైనారిటీ సంక్షేమ పథకాల ద్వారా విస్తృత అభివృద్ధి జరుగుతోందని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా పండుగల సందర్భంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వారు పేర్కొన్నారు. ఇటీవల కొందరు నాయకులు ఖబ్రస్తాన్‌కు వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి కేవలం ఫోటోలు దిగడం, ప్రచారం చేసుకోవడానికే పరిమితమయ్యారని ముస్లిం సమాజం ప్రజలు విమర్శించారు. అలాంటి చూపుడు మాటలకు భిన్నంగా ఎలాంటి ప్రచారం లేకుండా ప్రజల అవసరాలను గుర్తించి నిశ్శబ్దంగా పనులు చేసిన నాయకుడు మందమూల పరమేశ్వర్ రెడ్డిని వారు కొనియాడారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఉప్పల్ ముస్లిం ఖబ్రస్తాన్‌లో మిగిలిన అభివృద్ధి పనులు కూడా అత్యంత త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఖబ్రస్తాన్ అభివృద్ధి విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన అన్ని పనులు పూర్తి చేయడం తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనుల పట్ల ఉప్పల్, బీరప్పగడ్డ ప్రాంతాల ముస్లిం మైనారిటీ ప్రజలు సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేస్తూ మందమూల పరమేశ్వర్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.2