*మైదుకూరు:* ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వారి వేధింపులు తాళలేక చనిపోయిన రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ లోన్లు మంజూరు చేసి పేద ప్రజలను ఆదుకోవాలి:-ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెదుల్లపల్లి ప్రభాకర్ డిమాండ్ మైక్రో ఫైనాన్స్ మరియు హోమ్ లోన్ల పేరిట పేద ప్రజలకు గుదిబండలా మారి పేద ప్రజలను వేధింపులకు గురి చేస్తున్న ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. స్థానిక మైదుకూరు ఏఐవైఎఫ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ......... పేద ప్రజలే టార్గెట్గా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు మరియు హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, బజాజ్ కంపెనీలు తక్కువ వడ్డీ అనే ఆశ చూపి లోన్లు ఇచ్చి రికవరీ ఒక రోజు లేట్ అయినా పేద ప్రజలను నానా వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులకు పెడుతున్న కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లోన్లు మాకొద్దు బాబు అని మొరపెట్టుకున్న ప్రజల ఇంటి చుట్టూ తిరిగి లోన్లు ఇచ్చి తర్వాత ప్రజలను అనేక రకాల ఒత్తిళ్లు, వేధింపులు, ఇబ్బందులకు గురి చేస్తున్న ఫైవ్ స్టార్ బిజినెస్ లోన్, ఫెడరల్ బ్యాంక్, స్పందన ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఫిన్ కేర్, కీర్తన ఫైనాన్స్, ఎస్ బ్యాంక్ ఫైనాన్స్, మొదలగు ఫైనాన్స్ కంపెనీలు పై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రజల మానప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీలు అరాచకానికి అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ప్రజలకు సహకరించి తక్కువ వడ్డీతో బ్యాంకు ద్వారా లోన్ ఇస్తే ఇటువంటి అఘాయిత్యాలు జరగవని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు సహకరించక ప్రజలకు సరైన పనులు దొరకక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఆశ చూపి తక్కువ వడ్డీతో డబ్బులు ఇస్తామని ఒక్కొక్కరికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు లోన్లు ఇచ్చి ఆ లోను నెల నెల రికవరీ చేసే సమయంలో కట్టడం లేట్ అయితే అర్ధరాత్రి 12 అయిన లోను రికవరీ ఏజెంట్లు మాత్రం ఇంటి దగ్గర నుంచి కదలకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రజల మానప్రాణాలతో చెలగాడుతున్నారని వీరిపైన పోలీసులు మరియు అధికారులు క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకొని లోను రికవరీ ఏజెంట్ల ఒత్తిడిని తగ్గించకపోతే ఇలాంటి మరణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని ఆయన అన్నారు. తక్షణమే అధికారులు మరియు పోలీసులు మైక్రో ఫైనాన్స్ కంపెనీలపై మరియు హోం లోన్స్ బిజినెస్ లోన్స్ ఇచ్చే కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలను ఒత్తిడి పెట్టి ఇబ్బందులు గురి చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వమే పేద ప్రజలకు సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ప్రదీప్, జిల్లా సమితి సభ్యులు మధు లు పాల్గొన్నారు.

- Post by KLakshmi Devi1
- Post by Katravath Hathiram1
- అంబేద్కర్ భవన స్థలాన్ని వెంటనే పరిష్కరించాలి. ఏఐబిఎస్పి. పలమనేరు డిసెంబర్ 16( ప్రజా ప్రతిభ) గంగవరం మండలంలో వివాదాస్పదంగా మారిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంకు సంబంధించిన స్థలాన్ని అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం కోరారు. అందులో భాగంగా మంగళవారం పలమనేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు మణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.వి. మునిరత్నం, అమానుల్లా,వాణి, గుర్రం సుబ్రహ్మణ్యం, నారాయణ శెట్టి, మాట్లాడుతూ గత వారం రోజుల నుండి అంబేద్కర్ భవనానికి సంబంధించిన స్థలాన్ని అక్కడే నివాసముంటున్న శ్రీలంక కాలనీవాసులు ఆక్రమించుకోవాలనే ప్రయత్నాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. నిత్యం తహసిల్దార్ , ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆ మార్గంలోనే వెళ్తున్నప్పటికీ శ్రీలంక వాసులు ఆక్రమిస్తున్న స్థలం కనపడినా ప్రశ్నించ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీలంక శరణార్థులు రోజుకో దేవాలయం పేరు చెప్పుకొని ఉన్నత అధికారులకు అర్జీలతో పాటు ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ భవన ఆవరణలో శరణార్థులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఇతరులకు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాటిని నివారించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. లంక వాసులు ఆ స్థలములో చేస్తున్న వివిధ రకాల అసాంఘిక కార్యక్రమాలను చూసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేయక చాలా ఏళ్ల నుండి చేతగాని వారిగా మిగిలిపోతున్నారని ఆవేద వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్థల వివాదంలో శ్రీలంక వాసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళితే, ఓ అధికారి సమన్వయం పాటించండని, ఇంకొక అధికారి శ్రీలంక వాసులు రెచ్చగొట్టిన మీరు రెచ్చిపోవద్దని ఉచిత సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతవరకు ఆక్రమణదారులను అధికారులు పిలిపించి విచారించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంబేద్కర్ స్థలాన్ని ఆక్రమించి, విద్వేషాలను రెచ్చగొడుతున్న వ్యక్తులను విచారించి నివారించాలని , అంబేద్కర్ భవనం స్థలాన్ని సర్వే చేసి హద్దులు చూపించాలని కోరారు. మంజునాథ్, సూర శ్రీనివాసులు, శివ, ఆనంద, శాంతమ్మ, మునెయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.1
- Post by Ravi Poreddy1