Shuru
Apke Nagar Ki App…
వరంగల్: ఎంజీఎంలో రోగులకు ఇవేం అవస్థలు.............. .. వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల అవస్థలు రోజురోజుకూ పెరుగుతున్నాయని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆర్థోపెడిక్ సమస్యతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని ఎక్స్‌రే కోసం తీసుకెళ్లేందుకు వీల్‌చైర్ అందుబాటులో లేకపోవడంతో బంధువులు అతడిని భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో కనీస వసతులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి ఆస్పత్రిలో అవసరమైన వీల్‌చైర్లు, ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని కోరారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఎంజీఎంలోని సమస్యలను పరిష్కరించాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేశారు.
Chetty:Ramesh
వరంగల్: ఎంజీఎంలో రోగులకు ఇవేం అవస్థలు.............. .. వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల అవస్థలు రోజురోజుకూ పెరుగుతున్నాయని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆర్థోపెడిక్ సమస్యతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని ఎక్స్‌రే కోసం తీసుకెళ్లేందుకు వీల్‌చైర్ అందుబాటులో లేకపోవడంతో బంధువులు అతడిని భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో కనీస వసతులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి ఆస్పత్రిలో అవసరమైన వీల్‌చైర్లు, ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని కోరారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఎంజీఎంలోని సమస్యలను పరిష్కరించాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి కలెక్టర్ హేమంత్ బోర్కాడే. ములుగు జిల్లా. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి. మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పాటుపడాలని, మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా మంగళవారం గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ పైలాన్ ఆవరణలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్‌డీఓ సత్తయ్య, జాకారం సర్పంచ్, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి: తహసీల్దార్‌కు బీజేపీ వినతి హసన్‌పర్తి: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని తప్పనిసరిగా ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హసన్‌పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మారం తిరుపతి ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్ర నాయకులు, 66వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గురుమూర్తి శివకుమార్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతి నెలా ఉచితంగా 5 కిలోల బియ్యం అందిస్తున్నప్పటికీ, రేషన్ కార్డులపై కేవలం ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చిత్రాలను మాత్రమే ముద్రించి, ప్రధాని మోదీ ఫోటోను విస్మరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని గుర్తిస్తూ ప్రధాని చిత్రాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ చేపడుతున్నందున, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్డులపై ఫోటోలు మారుస్తూ నిధులు వృథా చేయవద్దని ఆయన సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మారపల్లి రామచంద్రారెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుడు పెద్ది మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, నాయకులు చల్లగొండ ప్రభాకర్ రెడ్డి, గంట సత్యం, దాసరి రాజు, చకిలం రాజేశ్వరరావు, తాళ్ల శ్యామ్, పెద్దమ్మ నాగరాజు, పెద్దమ్మ శ్రీనివాస్, దాది మధుసూదన్, శీలం బిక్షపతి, దాట్ల సునీల్, ఇమ్మడి కరుణాకర్, కందుకూరి శ్రీకాంత్, మట్టెడ సుమన్, చల్పూరి శంకర్, కోయడ రాజు, ఆర్మీ శ్రీనివాస్, శ్రావణపల్లి రవీంద్ర చారి, కడుపికొండ పట్టాభి, ప్రవీణ్ రెడ్డి, రవీందర్ గౌడ్, సురేష్ గౌడ్, తిప్పన్నా, రవీందర్, కుంబర్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు.1
- స్టేషన్ ఘనపూర్‌లో పెన్షన్ కోసం వృద్ధుల పడిగాపులు..ఒకే చోట పెన్షన్ ఇవ్వాలని లబ్ధిదారుల విజ్ఞప్తి జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా పెన్షన్ ఎక్కడ పంపిణీ చేస్తారో స్పష్టత లేక లబ్ధిదారులు పలుచోట్లకు తిరుగుతూ గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ కోసం రావడమే కష్టంగా ఉన్న తమను ఇలా తిప్పడం ఇబ్బందిగా ఉందని, ఒకే చోట పెన్షన్ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1
- జనగామ జిల్లా బస్టాండ్లో దొంగల చేతివాటం, పోలీసుల తనిఖీలు జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద రూ.20,600 నగదు అపహరణకు గురైంది. లింగాలఘణపురం మండలం కుందారానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.1
- సారు.. పింఛను ఇప్పించండి..?* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* *సెంటర్:- అశ్వారావుపేట* *స్లగ్: సారు.. పింఛను ఇప్పించండి..?* *యాంకర్ వాయిస్:* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. కూలి పనులు చేసుకుంటూ ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి.. తండ్రి చిన్నతనంలోనే మృతి.. సదరం సర్టిఫికెట్ లేక పదేళ్లుగా పింఛన్‌కు దూరం.. కనీసం ఉండేందుకు సురక్షితమైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. *వాయిస్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారిగూడెం గ్రామానికి చెందిన ఊకె నందిని.. వయసు 14 ఏళ్లు. పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో జన్మించింది. నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై.. నిత్యం ఇతరులపై ఆధారపడుతూ జీవనం సాగిస్తోంది. నందిని తండ్రి ఊకె బాలరాజు చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి ఊకె లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడమే కాకుండా.. అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన కుమార్తెకు సపర్యలు చేస్తోంది. *వాయిస్* నందినికి సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో ఇప్పటివరకు వికలాంగ పింఛన్ అందడం లేదు. నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా సదరం కోసం దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో దాదాపు పదేళ్లుగా ప్రభుత్వ పింఛన్‌కు ఈ కుటుంబం దూరమైంది.. కుమార్తె తోపాటు తల్లి లక్ష్మీ కూడా 10ఏళ్లుగా భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రభుత్వం నుండి అందుకోవాల్సిన వితంతు పింఛను పొందటం లేదంటే వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందే ఇట్టే తెలిసిపోతుంది..ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులంతా పింఛను ఇప్పిస్తాం అని చెప్పే మాటలు గుడ్డిగా నమ్మటమే తప్ప గొంతెత్తి నాకు పింఛను ఇప్పించని అడగలేని పేదరికం ఆమెది. ఇటీవల సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు నందినికి ప్రతినెలా అవసరమయ్యే మందుల ఖర్చు కూడా తల్లికి అదనపు భారంగా మారింది. *వాయిస్* కుటుంబం ఉంటున్న ఇల్లు పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటి స్లాబ్ నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నా.. ఇప్పటివరకు ఆ కుటుంబానికి సొంతంగా సురక్షితమైన ఇల్లు దక్కలేదు. *వాయిస్* నందిని పరిస్థితి కారణంగా ఆమెను 24 గంటలూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సిందే. దీంతో నాయనమ్మ లక్ష్మి కూడా చిన్నారికి తోడుగా నిరంతరం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కూలి పనులు.. మరోవైపు చిన్నారి సంరక్షణ.. మందుల ఖర్చులు.. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఇల్లు.. ఇలా అన్ని విధాలుగా ఈ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోంది. *వాయిస్ ఓవర్* నందిని పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే సదరం సర్టిఫికెట్, వికలాంగ పింఛన్ అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే సురక్షితమైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి.. వైద్యం, మందుల విషయంలోనూ సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఈ 14 ఏళ్ల చిన్నారి దీనస్థితిపై ప్రభుత్వ అధికారులు, ఐటీడీఏ పీఓ, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పందించి.. నందినికి అండగా నిలుస్తారా? పింఛన్, ఇల్లు, వైద్య సహాయం అందించి ఆ కుటుంబంలో వెలుగులు నింపుతారా? అనేది వేచి చూడాలి..1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- నర్సంపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు... తొలి బహుజన యోధుడు, గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి వేడుకలను నర్సంపేట పట్టణంలోని పాపన్న గౌడ్ విగ్రహం వద్ద వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహం కమిటీ అధ్యక్షులు సోల్తి సారయ్య గౌడ్ తో పాటు కమిటీ సభ్యులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ 15వేల మంది బహుజన సైన్యంతో నాటి పాలకులపై ఎదురొడ్డి గోల్కొండ ఖిలాను ఏలిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నకే దక్కిందని పేర్కొన్నారు.విగ్రహం కమిటీ ప్రధాన కార్యదర్శి, గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయస్ఫూర్తితో గౌడుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గౌడ సామాజిక వర్గం ఆర్థిక స్వావలంబన, సామాజిక అభ్యున్నతి, సముచిత రాజకీయ ప్రాధాన్యం కోసం ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విగ్రహం కమిటీ కోశాధికారి ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు,కమిటీ సభ్యులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, కొయ్యేడి కొమురయ్య గౌడ్, గిరాగాని చంద్రమౌళి గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్, నాతి సదానందం గౌడ్, గిరాగాని కిరణ్ గౌడ్, మొలగాని సురేష్ గౌడ్, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, మద్దెల రవి గౌడ్, నాగేలి ప్రమోద్ గౌడ్, వేముల కృష్ణ గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, తాళ్లపెల్లి చంద్రమౌళి గౌడ్, గండు స్వామి గౌడ్, మోకు దెబ్బ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కందుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గొపగాని వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల దేవేందర్ గౌడ్, దుడ్డే కుమారస్వామి గౌడ్, పోశాల సతీష్ గౌడ్, మచ్చిక రాజు గౌడ్, సోల్తి సాంబయ్య గౌడ్, సోల్తి సునీల్ గౌడ్, సొల్తి మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.1