logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఈ సందర్భంగా TRP పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల హన్మాండ్లు మాట్లాడుతూ— మెట్‌పల్లి తహసీల్దార్ సస్పెన్షన్‌తో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ శ్రేణుల్లో సంబరాలు మెట్‌పల్లి తహసీల్దార్ సస్పెండ్ అయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించి, స్వీట్లు పంపిణీ చేసి, బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా TRP పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల హన్మాండ్లు మాట్లాడుతూ— “అధికారులందరూ నిజాయితీగా తమ విధులు నిర్వర్తించాలి. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను విస్మరించి అవినీతి, లంచాలకు పాల్పడే అధికారులు తమ తీరు మార్చుకోవాలి. ప్రజల కోసం ఇంకా ఎన్నో పనులు చేయాల్సి ఉంది. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కోరుతున్నాం. అధికారులంటే మాకు గౌరవం ఉంది. అయితే ప్రజలను లంచాల కోసం పట్టిపీడించే ఏ అధికారి అయినా చట్టపరంగా బాధ్యత వహించాల్సిందే. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై చర్యలు తీసుకోవడం అవసరం. మెట్‌పల్లి తహసీల్దార్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ చర్యలు తీసుకుని, ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపై నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకున్న కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రజల సమస్యలపై మా పార్టీ నిరంతరం పోరాడుతుంది. ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నాం.” ఆకుల హన్మాండ్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)

50 min ago
user_NIMMANAGANTI ANIL BABU
NIMMANAGANTI ANIL BABU
Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
50 min ago
dad3a504-3f8d-4836-964f-c768cc7c0e09

ఈ సందర్భంగా TRP పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల హన్మాండ్లు మాట్లాడుతూ— మెట్‌పల్లి తహసీల్దార్ సస్పెన్షన్‌తో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ శ్రేణుల్లో సంబరాలు మెట్‌పల్లి తహసీల్దార్ సస్పెండ్ అయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించి, స్వీట్లు పంపిణీ చేసి, బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా TRP పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల హన్మాండ్లు మాట్లాడుతూ— “అధికారులందరూ నిజాయితీగా తమ విధులు నిర్వర్తించాలి. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను విస్మరించి అవినీతి, లంచాలకు పాల్పడే అధికారులు తమ తీరు మార్చుకోవాలి. ప్రజల కోసం ఇంకా ఎన్నో పనులు చేయాల్సి ఉంది. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కోరుతున్నాం. అధికారులంటే మాకు గౌరవం ఉంది. అయితే ప్రజలను లంచాల కోసం పట్టిపీడించే ఏ అధికారి అయినా చట్టపరంగా బాధ్యత వహించాల్సిందే. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై చర్యలు తీసుకోవడం అవసరం. మెట్‌పల్లి తహసీల్దార్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ చర్యలు తీసుకుని, ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపై నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకున్న కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రజల సమస్యలపై మా పార్టీ నిరంతరం పోరాడుతుంది. ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నాం.” ఆకుల హన్మాండ్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)

More news from తెలంగాణ and nearby areas
  • తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ప్రైమరీ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ గోపాలపురంలో ఈరోజు రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని గత కొంతకాలంగా శిధిలావస్థలో ఉన్న మంజూరు చేయించి ఆ నూతన భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించినారు.
    1
    తిరుమలాయపాలెం మండలం  గోపాలపురం గ్రామంలో ప్రైమరీ  నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ గోపాలపురంలో ఈరోజు రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని గత కొంతకాలంగా శిధిలావస్థలో ఉన్న  మంజూరు చేయించి ఆ నూతన భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించినారు.
    user_YELLIMALLI SRINIVASARAO
    YELLIMALLI SRINIVASARAO
    Local News Reporter తిరుమలాయపాలెం, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు. నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు. నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    1
    భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా  మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 
18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని
మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు.
నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు.
నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, 
ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ స్టాండ్లు లేక సెలైన్ బాటిల్ గోడకు వేలాడదీసిన పరిస్థితి ఫ్యాన్లు లేక ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగుల బంధువులు
    1
    *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు*

తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు

ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ

*వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు*
తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు
ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ
స్టాండ్లు లేక సెలైన్ బాటిల్ గోడకు వేలాడదీసిన పరిస్థితి
ఫ్యాన్లు లేక ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగుల బంధువులు
    user_మద్దెల బిక్షపతి
    మద్దెల బిక్షపతి
    Doctor మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.
    1
    ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే!
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • ఖమ్మంలో దంచి కొట్టిన వాన.వర్షంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి వాన దంచికొట్టింది. ఈ సీజన్లో అత్యధిక వర్షం రెండవసారి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ వర్షం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలిగినా ప్రజలందరూ వర్షం రాకతో ఉత్సాహంగా ఉన్నారు.
    1
    ఖమ్మంలో దంచి కొట్టిన వాన.వర్షంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు.
ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి వాన దంచికొట్టింది. ఈ సీజన్లో అత్యధిక వర్షం రెండవసారి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు.
ఈ వర్షం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలిగినా ప్రజలందరూ వర్షం రాకతో ఉత్సాహంగా ఉన్నారు.
    user_మాంధాత సత్య
    మాంధాత సత్య
    Astrologer సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • భక్తి బావంతో ఘనంగా బోనం ఎత్తి మొక్కులు సమర్పించిన మరిపెడ మహిళలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో భక్తి బావంతో మహిళలు ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు.. పసుపు, కుంకుమ, బియ్యం లతో బోనాన్ని వండి మహిళలు తలపై మోస్తూ ముత్యాలమ్మ తల్లి కి సమర్పించేందుకు బయలు దేరి ఆటపాటలతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు..
    2
    భక్తి బావంతో ఘనంగా బోనం ఎత్తి మొక్కులు సమర్పించిన మరిపెడ మహిళలు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో భక్తి బావంతో మహిళలు ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు.. పసుపు, కుంకుమ, బియ్యం లతో బోనాన్ని వండి మహిళలు తలపై మోస్తూ ముత్యాలమ్మ తల్లి కి సమర్పించేందుకు బయలు దేరి ఆటపాటలతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు..
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు.పెద్దమండవ,గందసిరి గ్రామాల్లోని మున్నేరు నుంచి కొంతమంది అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.ఇసుక ట్రాక్టర్ లను పోలీసులు తనిఖీ చేయగా వాటికి ఎలాంటి అనుమతి లేనట్లు గుర్తించి స్టేషన్ కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల యజమానులపై ముదిగొండ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా సిఐ మురళి మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
    1
    ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు.పెద్దమండవ,గందసిరి గ్రామాల్లోని మున్నేరు నుంచి  కొంతమంది అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.ఇసుక ట్రాక్టర్ లను పోలీసులు తనిఖీ చేయగా వాటికి ఎలాంటి అనుమతి లేనట్లు గుర్తించి స్టేషన్ కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల యజమానులపై ముదిగొండ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా సిఐ మురళి మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • మున్నేరు నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు ను పట్టుకున్న ముదిగొండ ఎస్సై హరిత సిబ్బంది. ఖమ్మం జిల్లా ముదిగొండ ఎస్సై హరిత తన సిబ్బందితో పాటు 5 గంటల సమయంలో మున్నేరు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సుమారుగా 12 ట్రాక్టర్లను వివి కృష్ణాపురం సమీపంలో సీజ్ చేయడం జరిగింది. ఈ ఉదయం ఏడు గంటల సమయంలో లక్ష్మీపురం సమీపంలోనే ఐదు ఇసుక ట్రాక్టర్లను మొత్తం 17 ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లను ఓనరులను మీద కేసులు నమోదు చేసినట్లు ఇసుక ట్రాక్టర్లు పెద్దమండవ గంధసిరికి చెందినవిగా గుర్తించడం జరిగింది. ఇన్స్పెక్టర్ మురళి ఆదేశాల మేరకు మొత్తంగా 24 మంది పై కేసులు నమోదు చేసి ఇసుకతో ఉన్న ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎస్సై హరిత, పిసిలు లక్ష్మణ్, శ్రీను,వెంకట్, కృష్ణ, రాజులు పాల్గొన్నారు.
    1
    మున్నేరు నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు ను పట్టుకున్న ముదిగొండ ఎస్సై హరిత సిబ్బంది.
ఖమ్మం జిల్లా ముదిగొండ ఎస్సై హరిత తన సిబ్బందితో పాటు 5 గంటల సమయంలో మున్నేరు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సుమారుగా 12 ట్రాక్టర్లను వివి కృష్ణాపురం సమీపంలో సీజ్ చేయడం జరిగింది. ఈ ఉదయం ఏడు గంటల సమయంలో లక్ష్మీపురం సమీపంలోనే ఐదు ఇసుక ట్రాక్టర్లను మొత్తం 17 ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లను ఓనరులను మీద కేసులు నమోదు చేసినట్లు ఇసుక ట్రాక్టర్లు పెద్దమండవ గంధసిరికి చెందినవిగా గుర్తించడం జరిగింది. ఇన్స్పెక్టర్ మురళి ఆదేశాల మేరకు మొత్తంగా 24 మంది పై కేసులు నమోదు చేసి ఇసుకతో ఉన్న ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎస్సై హరిత, పిసిలు లక్ష్మణ్, శ్రీను,వెంకట్, కృష్ణ, రాజులు పాల్గొన్నారు.
    user_YELLIMALLI SRINIVASARAO
    YELLIMALLI SRINIVASARAO
    Local News Reporter తిరుమలాయపాలెం, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.