పరీక్షా కేంద్రం పొరపాటు… కంగారుపడ్డ పదో తరగతి విద్యార్థిని, వెంటనే స్పందించిన పోలీసులు – సమయానికి సరైన ఎగ్జామ్ సెంటర్‌కు తరలింపు ఈరోజు నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఒక విద్యార్థిని చిన్న పొరపాటు కారణంగా ఆందోళనకు గురైన ఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రాన్ని సరిగా చూసుకోకపోవడంతో ఆమె గాజువాక హై స్కూల్ నే తన ఎగ్జామ్ సెంటర్‌గా భావించి అక్కడికి చేరుకుంది. ఆమె తల్లిదండ్రులు కూడా అదే కేంద్రం అనుకుని అక్కడే వదిలి వెళ్లిపోయారు. అయితే పరీక్షా హాల్లోకి వెళ్లిన తర్వాత ఇన్విజిలేటర్ హాల్ టికెట్ పరిశీలించగా, అది గాజువాక హై స్కూల్ సెంటర్ కాదని, అసలు పరీక్షా కేంద్రం కనితి హై స్కూల్ అని తెలియజేశారు. దీంతో విద్యార్థిని ఒక్కసారిగా కంగారు పడుతూ భయభ్రాంతులకు గురైంది. అప్పటికే పరీక్ష సమయం దగ్గర పడడంతో పరిస్థితి ఉద్విగ్నంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, ఆ విద్యార్థినిని పోలీస్ వాహనంలో సరైన పరీక్షా కేంద్రం అయిన కనితి హై స్కూల్‌కు సకాలంలో తరలించారు. దీంతో ఆమె సమయానికి పరీక్షకు హాజరయ్యే అవకాశం లభించింది.
పరీక్షా కేంద్రం పొరపాటు… కంగారుపడ్డ పదో తరగతి విద్యార్థిని, వెంటనే స్పందించిన పోలీసులు – సమయానికి సరైన ఎగ్జామ్ సెంటర్‌కు తరలింపు ఈరోజు నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఒక విద్యార్థిని చిన్న పొరపాటు కారణంగా ఆందోళనకు గురైన ఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రాన్ని సరిగా చూసుకోకపోవడంతో ఆమె గాజువాక హై స్కూల్
నే తన ఎగ్జామ్ సెంటర్‌గా భావించి అక్కడికి చేరుకుంది. ఆమె తల్లిదండ్రులు కూడా అదే కేంద్రం అనుకుని అక్కడే వదిలి వెళ్లిపోయారు. అయితే పరీక్షా హాల్లోకి వెళ్లిన తర్వాత ఇన్విజిలేటర్ హాల్ టికెట్ పరిశీలించగా, అది గాజువాక హై స్కూల్ సెంటర్ కాదని, అసలు పరీక్షా కేంద్రం కనితి హై స్కూల్ అని తెలియజేశారు. దీంతో విద్యార్థిని
ఒక్కసారిగా కంగారు పడుతూ భయభ్రాంతులకు గురైంది. అప్పటికే పరీక్ష సమయం దగ్గర పడడంతో పరిస్థితి ఉద్విగ్నంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, ఆ విద్యార్థినిని పోలీస్ వాహనంలో సరైన పరీక్షా కేంద్రం అయిన కనితి హై స్కూల్‌కు సకాలంలో తరలించారు. దీంతో ఆమె సమయానికి పరీక్షకు హాజరయ్యే అవకాశం లభించింది.
- శ్రీకాకుళం, మార్చి 16: జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను ఒకే చోట అత్యంత భద్రంగా నిల్వ చేసేందుకు ఏర్పాటు చేస్తున్న మాల్ ఖానాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు కలసి సందర్శించారు. నగరంలోని వంశధార పాత క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక ప్రత్యేక కేంద్రాన్ని శనివారం వారిద్దరూ స్వయంగా భవనం లోపల, బయట కలియతిరిగి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా తలుపుల పటిష్టత, సీసీ కెమెరాల నిఘా తీరును తనిఖీ చేశారు. భవనం సంరక్షణ కోసం కేటాయించిన సిబ్బంది వివరాలను ఏఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఎటువంటి అజాగ్రత్తకు తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. బిల్డింగ్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న ఎస్.ఐ పి.నరసింహమూర్తికి భద్రత విషయంలో పలు కీలక సూచనలు చేశారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను నిల్వ చేసిన పద్ధతిపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డి.ఇ మురళీమోహన్, ఆర్ అండ్ బి అధికారులైన డి.ఇ ధనంజయ్, ఈ.ఈ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. భవనంలో అవసరమైన మరిన్ని మౌలిక సదుపాయాలను, ఫినిషింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.2
- శ్రీకాకుళం జిల్లా మార్చి 16, గత నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో తాగునీరు లేక ప్రధానంగా మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నమని సరిగా కులం జిల్లా కొందులవానిపేట గ్రామాల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్న తాగునీటి సమస్యను ఏ ప్రభుత్వం కూడా తీర్చడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ లో తమ గ్రామానికి తాగునీరు అందించాలని వెంటనే ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు అలాగే గ్రామాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదు కోవాలని ర్యాలీ నిర్వహించారు.1
- పాము1
- మచిలీపట్నం సుకర్లాబాద్‌లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా బారులు తీరారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో చేరుకుని గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బండలను వరుసగా పెట్టి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. సరఫరా ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- అమెరికా అనుసరిస్తున్న యుద్ధోన్మాద విధానాలను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నట్రాజ్ సెంటర్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ల దాడులు ప్రపంచ శాంతికి విఘాతమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం విమర్శించారు. ట్రంప్‌ను ఒక యుద్ధోన్మాదిగా ఆయన అభివర్ణించారు. అమెరికా ఒత్తిళ్లకు లొంగి కేంద్రం మౌనం వహించడం దేశ సార్వభౌమాధికారానికి భంగకరమని, ఇరాన్ నౌక కూల్చివేతను ఖండించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తోందని, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని ధ్వజమెత్తారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.1
- దమ్మపేట మండల పరిధిలోని గొర్రె గుట్ట గ్రామములో ఈరోజు ఉదయం జరిగిన లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మల యుగంధర్ తో పాటు దొడ్డ ప్రసాద్ కాసాని నాగప్రసాద్ మంగేశ్వర తో పాటు దమ్మపేట మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు తుమ్మల అభిమానులు పాల్గొన్నారు1
- గిరిజన యువకులు క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఏపీ స్పోర్ట్స్ డైరెక్టర్ జగదేశ్వరి అన్నారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రంపచోడవరం గురుకుల పాఠశాలలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ఎంపిక చేసి కడపలోని స్పోర్ట్స్ స్కూల్‌లో చదువుతో పాటు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు.1
- శ్రీకాకుళం, మార్చి 16: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని భాష్యం పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు కల్పించిన వసతులను స్వయంగా పర్యవేక్షించారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గదుల్లో తగినంత వెలుతురు, ఫ్యాన్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వేసవి దృష్ట్యా తాగునీటి లభ్యతపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థుల హాజరు శాతం, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిఘా ఉంచాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.1
- అమలాపురం మానేపల్లి వారి వీధి లో గోధుమ త్రాచు కలకలం... వేసవి కాలం వస్తున్న కారణం గా....తరచూ గా విషాదర్పాలు జన సంచారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది....కావున ప్రజలు అప్రమత్తంగా వుండవలసిందిగా కోరుచున్నాం.... ఇట్లు, మీ వర్మ (9949956232)1