Shuru
Apke Nagar Ki App…
మచిలీపట్నంలో గ్యాస్ కోసం భారీ క్యూలు – ప్రజల ఇబ్బందులు మచిలీపట్నం సుకర్లాబాద్‌లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా బారులు తీరారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో చేరుకుని గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బండలను వరుసగా పెట్టి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. సరఫరా ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Arja Durga Prasad
మచిలీపట్నంలో గ్యాస్ కోసం భారీ క్యూలు – ప్రజల ఇబ్బందులు మచిలీపట్నం సుకర్లాబాద్‌లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా బారులు తీరారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో చేరుకుని గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బండలను వరుసగా పెట్టి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. సరఫరా ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మచిలీపట్నం సుకర్లాబాద్‌లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా బారులు తీరారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో చేరుకుని గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బండలను వరుసగా పెట్టి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. సరఫరా ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- Post by SS NEWS1
- దమ్మపేట మండల పరిధిలోని గొర్రె గుట్ట గ్రామములో ఈరోజు ఉదయం జరిగిన లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మల యుగంధర్ తో పాటు దొడ్డ ప్రసాద్ కాసాని నాగప్రసాద్ మంగేశ్వర తో పాటు దమ్మపేట మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు తుమ్మల అభిమానులు పాల్గొన్నారు1
- Post by Sampathkumar neerudu1
- అమెరికా అనుసరిస్తున్న యుద్ధోన్మాద విధానాలను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నట్రాజ్ సెంటర్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ల దాడులు ప్రపంచ శాంతికి విఘాతమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం విమర్శించారు. ట్రంప్‌ను ఒక యుద్ధోన్మాదిగా ఆయన అభివర్ణించారు. అమెరికా ఒత్తిళ్లకు లొంగి కేంద్రం మౌనం వహించడం దేశ సార్వభౌమాధికారానికి భంగకరమని, ఇరాన్ నౌక కూల్చివేతను ఖండించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తోందని, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని ధ్వజమెత్తారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో *అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,* జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి కచ్చితంగా సమాధానం ఇస్తూ తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెండింగ్ ఫైళ్ళ పరిష్కారం, కార్యాలయాల పరిశుభ్రత తదితర అంశాలను కచ్చితంగా అమలుపరచాలని, పరిష్కరించిన ఫైళ్ళ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల అధికారులు, క్షేత్రస్థాయి మండల అధికారులకు సూచించారు, సీనియర్ సిటిజన్స్, భూ సంబంధిత, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వ్యవసాయం, ఇరిగేషన్, దివ్యాంగుల పెన్షన్, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు, తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి నివేదిక సమర్పించాలన్నారు, *మండల ప్రధాన కార్యాస్థానం నుండి గూగుల్ మీట్ ద్వారా సంబంధిత ఇనుగుర్తి, గార్ల, డోర్నకల్, కేసముద్రం, చిన్న గూడూరు, తహసిల్దార్లతో భూ సమస్య పరిష్కారం చేయుటకు ఆదేశాలు జారీ చేశారు,* ఈ సోమవారం దంతాలపల్లి మండలం తూర్పు తండ గ్రామ పంచాయతీ కి చెందిన గుగులోతు నాగమణి తనకు చెందిన భూమిని నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగా భవన నిర్మాణానికి మంజూరి ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన పాలక వర్గం అట్టి భవన నిర్మాణం మరొక స్థలంలో నిర్మించుచున్నారని, ఇట్టి విషయంలో హైకోర్ట్ వారిని సంప్రదించామని, విచారణ చేసి హైకోర్టు నుండి తీర్పు వెలువడే వరకు అట్టి గ్రామ పంచాయతీ భవనానికి నిధులు మంజూరు చేయకుండా నిలుపుదల చేయమని కోరారు. డోర్నకల్ మండల కేంద్రంలోని యాదవ నగర్ కు చెందిన బొల్లం విజయ తన పేరు మీద మహబూబాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తన ఇంటి పట్టా భూమిని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసారని అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని పరిశీలించి తమ స్థలాన్ని తమకు ఇప్పించాలని కోరారు. నెల్లికుదురు మండలం శ్రీరాం నగర్ గ్రామం శివారు వెంకటాపూరు కు చెందిన బుర్ర కర్ణాకర్ తాను దివ్యాంగుడినని వికలాంగుల స్కూటి ఇప్పించగలరని కోరారు. కురవి మండల కేంద్రానికి చెందిన నిమ్మల భిక్షం తనకు ఉన్న సర్వే నెంబర్ లో గల భూమి రోడ్డు అని చూపిస్తుందని దానిని సరిచేసి వ్యవసాయ భూమిగా మార్చి పట్టా పాసు పుస్తకము ఇప్పించగలరని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వివిధ శాఖలకు సంబంధించి ( 156 ) వచ్చిన దరఖాస్తులకు సంబందిత అధికారులకు పరిష్కారానికి ఆదేశించారు.1
- NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామం వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడలి వద్ద అధికారులు సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో, కొత్తగా వచ్చే వాహనదారులు, ప్రయాణికులు ఏ గ్రామం ఎంత దూరంలో ఉందో, ఏ వైపు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ప్రయాణికులు, వాహనదారులు గ్రామస్తులను ఆపి దారి తెలుసుకుంటున్నారు. అధికారులు స్పందించి, గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద సూచికలు ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- పాము1