Shuru
Apke Nagar Ki App…
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంటర్ బోర్డు రద్దు కానుండగా, కొత్త విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేశారు. 2026-27 నుంచి 100 ప్రభుత్వ పాఠశాలల్లో 11వ తరగతి బోధన ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
JADI RAJU
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంటర్ బోర్డు రద్దు కానుండగా, కొత్త విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేశారు. 2026-27 నుంచి 100 ప్రభుత్వ పాఠశాలల్లో 11వ తరగతి బోధన ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అద్దంకి నాగమణి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవితలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీతక్క, అద్దంకి దయాకర్ వంటి ప్రజా నాయకులపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని ఆమె ఘాటుగా విమర్శించారు. కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన కవితకు కష్టపడి పైకి వచ్చిన వారి విలువ తెలియదని నాగమణి ఎద్దేవా చేశారు.1
- రాష్ట్రంలో గన్, డ్రగ్స్, గంజాయి కల్చర్ పెరిగింది : మాజీమంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో పోలీసులు ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంలో చూపుతున్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదని విమర్శించారు.1
- వరంగల్ నగరంలోని ఏకశిలా పరపతి సంఘం కార్యాలయం ఎదుట ఆదివారం సభ్యులు ఆందోళన చేపట్టారు. సంఘం ఆదాయం, ఖర్చులు, సభ్యుల చందాల వివరాలు పారదర్శకంగా వెల్లడించడం లేదని వారు ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని సభ్యులు హెచ్చరించారు.1
- చింతకాని లో బస్తాలు ఖాళీ...మండలం వ్యాప్తంగా రైతులు ఆందోళన లు ఖమ్మం జిల్లా చింత కానీ మండలం దాదాపు గా 22లక్షల బస్తాలు రావలిసిన వి కేవలం 5లక్షలు రావడం పట్ల రైతగాం మoడిపాడుతుంది వెంటనే బస్తాలు తెపించాలని రైతులు కోరుతున్నారు.... అయితే అధికారులు వస్తున్నాయి అని చెప్తున్నారు... కానీ కాంట్రక్టర్ ల నెమది వైఖరి వల్ల బస్తాలు రావడం లేదని.. రైతులు వాపోతున్నారు1
- పెద్దపల్లి జిల్లాలో పది రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు వంశీ మృతదేహం ఎక్లాస్ పూర్ వద్ద లభ్యం...హత్య చేసి శవం దొరకకుండా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బంధువులు ఆందోళన పెద్దపల్లి జిల్లాలో పది రోజుల క్రితం అదృశ్యమైన రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన యువకుడు జూల వంశీ మృతదేహం మంథని మండలం ఎక్లాస్ పూర్ శివారులోని గాడుల గండి వద్ద లభించింది. హత్యచేసి ఎక్లాస్ పూర్ గాడుదుల గండి గుట్ట వద్ద లోయలో మృతదేహాన్ని పడేశాని బందువులు ఆందోళనకు దిగారు. రోడ్డు పై బైఠాయించి ధర్నా చేశారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో మృతుని కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని పదిరోజుల నుండి పోలీసులు మృతదేహాన్ని గుర్తించకపోవడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో పోలీసుల పురోగతి లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30 నుండి వంశీ కనబడకుండా పోవడంతో మూడు రోజులు అనంతరం కుటుంబ సభ్యుల గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంఘటన స్థలానికి గోదావరిఖని ఏసిపి మడత రమేష్ చేరుకుని జూల వంశీ హత్య కేసులో ఓ మహిళతోపాటు ముగ్గురిని గుర్తించామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శవాన్ని దొరకనీయకుండా దాచి పెట్టే ప్రయత్నం చేసిన కేసుతో పాటు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.1
- అన్నపురెడ్డిపల్లిలో అకాల వర్షం బీభత్సం - డ్రైనేజీ లేక ఇళ్లలోకి చేరిన వరద నీరు అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు నివాస గృహాల్లోకి, చిరు వ్యాపారుల దుకాణాల్లోకి చేరి నిత్యావసర వస్తువులు, సామగ్రి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. క్షేత్రస్థాయిలో పర్యటించిన కాంగ్రెస్పార్టీ యువజన అధ్యక్షులు వేముల నరేష్ బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించారు. నీట మునిగిన ఇళ్లను, పాడైపోయిన సామాగ్రిని పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన సమస్యలు మరియు విమర్శలు: అధికారుల నిర్లక్ష్యం సెంట్రల్ లైటింగ్ మరియు రోడ్డు పనులు చేపట్టిన సమయంలో, ప్రత్యామ్నాయ డ్రైనేజీ మార్గాలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. అస్తవ్యస్త అభివృద్ధి "అభివృద్ధి పనులు చేసేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సెంట్రల్ లైటింగ్ పేరుతో డ్రైనేజీ నిర్మాణం లేనపుడు రోడ్లు నిర్మించడం సరికాదు" అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వరద వల్ల నష్టపోయిన పేద కుటుంబాలకు, చిరు వ్యాపారులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలి. శాశ్వత పరిష్కారం నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పునర్నిర్మించాలి. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. "కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం." — వేముల నరేష్ 1
- NCHM JEE-2026 పరీక్షకు సంబంధించిన మొదటి ఆన్సర్ కీ విడుదలైంది. విద్యార్థులు తమ సమాధానాలను వెంటనే సరిచూసుకొని స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు. తదుపరి ప్రక్రియకు ఇది అత్యంత కీలకమైన అడుగు.1
- హన్మకొండ జిల్లా ఐనవోలు నుండి 11 మంది హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టుకు పాదయాత్ర మొదలుపెట్టారు. నాలుగు రోజుల పాటు సుమారు 150 కిలోమీటర్లు నడిచి, వారు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మాల విరమణ చేయనున్నారు.1