Shuru
Apke Nagar Ki App…
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు కలుషిత నీరు.. పురుగులున్న ఆహారం! తెలంగాణలోని బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో తాగునీటి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మురుగు నీటిలా కనిపించే నీటిని విద్యార్థులకు అందిస్తున్నారని ఆరోపణలు. వసతి గృహాల్లో పురుగులు ఉన్న ఆహారం వడ్డిస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు నిత్యకృత్యంగా మారాయని విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా పరిస్థితుల్లో మార్పు రాలేదంటూ ప్రశ్నలు. విద్యార్థుల గళాన్ని వినిపించేందుకు ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం ద్వారా ఈ సమస్యలను వెలుగులోకి తేవాలనే డిమాండ్.
Seelam Ashok Reddy
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు కలుషిత నీరు.. పురుగులున్న ఆహారం! తెలంగాణలోని బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో తాగునీటి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మురుగు నీటిలా కనిపించే నీటిని విద్యార్థులకు అందిస్తున్నారని ఆరోపణలు. వసతి గృహాల్లో పురుగులు ఉన్న ఆహారం వడ్డిస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు నిత్యకృత్యంగా మారాయని విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా పరిస్థితుల్లో మార్పు రాలేదంటూ ప్రశ్నలు. విద్యార్థుల గళాన్ని వినిపించేందుకు ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం ద్వారా ఈ సమస్యలను వెలుగులోకి తేవాలనే డిమాండ్.
More news from Ntr and nearby areas
- బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు కలుషిత నీరు.. పురుగులున్న ఆహారం! తెలంగాణలోని బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో తాగునీటి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మురుగు నీటిలా కనిపించే నీటిని విద్యార్థులకు అందిస్తున్నారని ఆరోపణలు. వసతి గృహాల్లో పురుగులు ఉన్న ఆహారం వడ్డిస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు నిత్యకృత్యంగా మారాయని విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా పరిస్థితుల్లో మార్పు రాలేదంటూ ప్రశ్నలు. విద్యార్థుల గళాన్ని వినిపించేందుకు ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం ద్వారా ఈ సమస్యలను వెలుగులోకి తేవాలనే డిమాండ్.3
- *సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ప్రకటించిన సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్..* తేదీ: 09-11-2026 స్థలం: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, *సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ప్రకటించిన సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్..* తేదీ: 09-11-2026 స్థలం: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సత్తుపల్లి సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రకటన.. 18 మందితో కమిటీ ఏర్పాటు *సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రకటించారు. చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని సోమవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారు క్యాంపు కార్యాలయంలో ప్రకటించారు. ఈ కమిటీ 04-11-2026 నుంచి రెండేళ్ల పాటు కొనసాగనుంది.* ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు మాట్లాడుతూ.. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసి, కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపుగా పదవులు కేటాయించామని తెలిపారు. కమిటీలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. *సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం వివరాలు* చైర్మన్: 1. చల్లగుళ్ల నరసింహారావు – చైర్మన్ వైస్ చైర్మన్: 2. వంట్ల కృష్ణార్జునరావు – వైస్ చైర్మన్ డైరెక్టర్లు / సభ్యులు: 3. మండపాటి రాజేందర్ ప్రసాద్ రెడ్డి 4. పొన్నగంటి జోగారావు 5. దాసరి వెంకటేశ్వర రెడ్డి 6. మోండ్రు సుందరరావు 7. కొప్పుల శ్రీను 8. కోర్సా సత్యవతి 9. ముచ్చనపల్లి నరసింహారావు 10. ఒగ్గు కరుణాకర్ రెడ్డి 11. మహమ్మద్ ఇబ్రహీం 12. చిల్లపల్లి లక్ష్మీ శ్రావణి 13. గుండు ప్రసాద్ 14. నడిపల్లి శ్రీనివాసరావు 15. సత్తుపల్లి PACS చైర్మన్ 16. ఖమ్మం జిల్లా మార్కెటింగ్ అధికారి 17. సత్తుపల్లి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు 18. సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ *ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు ఇటీవల మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు హెలికాప్టర్ ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలకు స్పందించారు.* మంత్రి గారి కోసం వస్తున్న హెలికాప్టర్‌లో తాను ప్రయాణించానని, అధికారికంగా ఎలాంటి హెలికాప్టర్‌ను వినియోగించలేదని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ కేసుల్లో మూలాలు ఉన్న వ్యక్తుల కార్లలో తాను తిరగలేదని పేర్కొంటూ, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకుండా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఘాటుగా హెచ్చరించారు. 15 సంవత్సరాల పాటు సత్తుపల్లి ప్రజలు సండ్ర వెంకట వీరయ్య గారికి అధికారం ఇచ్చినా, ప్రజలకు ఆయన చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆయన సత్తుపల్లికి ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసే పరిస్థితి ఉండేదని అన్నారు. 15 ఏళ్ల పాటు ప్రజలు అవకాశం ఇచ్చినా సత్తుపల్లిని సొంత ఊరిలా భావించలేదని, అందుకే ఇక్కడ సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేదని ఎద్దేవా చేశారు. ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉంటే చెప్పాలని, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 100 గజాల స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా చూస్తామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ప్రకృతి విపత్తు సమయంలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారి గురించి మాట్లాడకుండా హెలికాప్టర్‌లో దిగాడు, కారులో వచ్చాడు అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రెస్‌మీట్ పెట్టడానికి సమయం ఉన్నప్పటికీ, విపత్తు సమయంలో ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు తన అనుచరులను, పార్టీ కార్యకర్తలను పిలుపునివ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇకనైనా చౌకబారు వ్యాఖ్యలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నారావు గారు, సత్తుపల్లి మరియు వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు గారు, నూతన వైస్ చైర్మన్, నూతన డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.4
- గుంటూరులో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ పార్కులో ఆల్గే ట్రీ గుంటూరు నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛమైన గాలిని అందించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ పార్కులో ఆల్గే ట్రీని ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆల్గే ట్రీ సాధారణ చెట్టు కాదని, సూక్ష్మ శైవలాలతో కూడిన ప్రత్యేక ట్యాంక్ వ్యవస్థ అని వివరించారు. ఇది కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని తెలిపారు. సౌరశక్తితో పనిచేసే ఈ వ్యవస్థను పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.నవ గుంటూరు కార్యక్రమంలో భాగంగా లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎస్‌ఆర్ నిధులతో సుమారు రూ.5 లక్షల వ్యయంతో ఈ ఆల్గే ట్రీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వెల్లడించారు.2
- కార్తీక మాసం సందర్భంగా టిఫిన్ ఏర్పాట్లు కార్తీక మాసం మొదటి సోమవారం ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరులోని గుజ్జనగుండ్ల పార్కు నందు పులి శ్రీనివాసరెడ్డి మిత్రులకు టిఫిన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మిత్రులు టిఫిన్ ఆరగించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిత్రులకు ఈ విధంగా టిఫిన్ ఏర్పాటు చేసి పండుగ యొక్క ప్రత్యేకతను తెలియజేశారు1
- శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన లింగపాలెం మండల జడ్పీటీసీ, ఎంపీటీసీల బృందం! ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో లింగపాలెం మండల జడ్పీటీసీగా ఎన్నికైన శ్రీమతి ముసునూరి వెంకట సరోజిని గారు, మండలంలోని ఎంపీటీసీ సభ్యులు సంయుక్తంగా చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నిస్వార్థంగా ప్రజాసేవ అందించాలని సూచించారు. అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం, సింగారెడ్డిపాలెం గ్రామాలలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కలెక్టర్ దివాకర టి.ఎస్ పరిశీలించారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం, సింగారెడ్డిపాలెం గ్రామాలలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కలెక్టర్ దివాకర టి.ఎస్ పరిశీలించారు.ఇళ్ల నిర్మాణ స్థితిగతులను,పూర్తి కావడానికి అయ్యే వ్యయాన్ని అధికారులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు రాంప్రసాద్, ఎంపీడీవో ఎర్రయ్య, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శాఖమూరి రమేశ్, సర్పంచ్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.1
- పవన్ కల్యాణ్ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటన పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల 13 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నారు. తాము స్నేహితులుగా ఉంటామని, పిల్లలకు తల్లిదండ్రులుగా కొనసాగుతామని తెలిపారు.1
- న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు1