బోయిన్పల్లి మండలంలోని విలాసాగర్ గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పక్షాన దళితవాడలను సందర్శించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీయడం జరిగింది. గ్రామంలోని వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజానీకం కొత్త పెన్షన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ అవి అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరు కేజీల బియ్యం కుటుంబాలకు ఏమాత్రం సరిపోవడం లేదని సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తికి 12 కేజీల బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ వ్యవసాయ కార్మిక జిల్లా సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజాల శ్రీధర్, గ్రామస్తులు సుంకపాక రాములు, సుంకపాక అంజయ్య, సుంకపాక దేవయ్య, సుంకపాక అశోక్, పొత్తూరు యాదగిరి, బొడ్డు దేవయ్య, దోమకొండ పోచయ్య తదితరులు పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని వారు కోరారు.
బోయిన్పల్లి మండలంలోని విలాసాగర్ గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పక్షాన దళితవాడలను సందర్శించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీయడం జరిగింది. గ్రామంలోని వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజానీకం కొత్త పెన్షన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ అవి అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరు కేజీల బియ్యం కుటుంబాలకు ఏమాత్రం సరిపోవడం లేదని సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తికి 12 కేజీల బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ వ్యవసాయ కార్మిక జిల్లా సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజాల శ్రీధర్, గ్రామస్తులు సుంకపాక రాములు, సుంకపాక అంజయ్య, సుంకపాక దేవయ్య, సుంకపాక అశోక్, పొత్తూరు యాదగిరి, బొడ్డు దేవయ్య, దోమకొండ పోచయ్య తదితరులు పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని వారు కోరారు.
- బోయిన్పల్లి మండలంలోని విలాసాగర్ గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పక్షాన దళితవాడలను సందర్శించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీయడం జరిగింది. గ్రామంలోని వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజానీకం కొత్త పెన్షన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ అవి అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరు కేజీల బియ్యం కుటుంబాలకు ఏమాత్రం సరిపోవడం లేదని సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తికి 12 కేజీల బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ వ్యవసాయ కార్మిక జిల్లా సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజాల శ్రీధర్, గ్రామస్తులు సుంకపాక రాములు, సుంకపాక అంజయ్య, సుంకపాక దేవయ్య, సుంకపాక అశోక్, పొత్తూరు యాదగిరి, బొడ్డు దేవయ్య, దోమకొండ పోచయ్య తదితరులు పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని వారు కోరారు.1
- కామారెడ్డిలో యూనియన్ బ్యాంక్ అధికారుల తీరుపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా తమ పనులు జరగకపోవడంతో వినియోగదారుల సహనం నశించి, ఈరోజు బ్యాంక్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అత్యంత కీలకమైన సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వేస్తున్న వడ్ల పైసలు (ధాన్యం డబ్బులు) ఖాతాల్లో జమ అయినా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు రైతు రుణాలు, పంట రుణాలు సకాలంలో అందడం లేదు. యూనియన్ బ్యాంక్‌ను నమ్ముకుంటే అడుగడుగునా కష్టాలే మిగులుతున్నాయని, గంటల తరబడి లైన్లలో నిలబడినా 'సర్వర్ లేదు', 'లింక్ లేదు' అంటూ సాకులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. 'మాకు ఈ బ్యాంక్ వద్దు.. మా ఊరికి వెంటనే మరో బ్యాంక్ కావాలి' అంటూ ఆవేదనతో నినదించారు. బ్యాంక్ వద్ద ఉద్రిక్తత నెలకొందన్న సమాచారం అందుకున్న వెంటనే స్థానిక మాజీ ఎంపీటీసీ నీరజ గారి భర్త సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చెందుతున్న ప్రజలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన, యూనియన్ బ్యాంక్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను గమనించిన ఆయన, వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఇక్కడి ప్రజల అవస్థలను, రైతుల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, కేవలం ఒకే బ్యాంక్ ఉండటం వల్ల పని భారం పెరిగి సేవలు అందడం లేదని వివరించారు. ఈ ప్రాంతంలో జనాభా పెరిగిందని, దానికితోడు రైతులకు సంబంధించిన లావాదేవీలు కోట్లలో జరుగుతున్నాయని, వేలాది మంది ఒకే బ్యాంక్‌పై ఆధారపడటం వల్ల ప్రతిరోజూ నరకం చూస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నూతన శాఖను ఏర్పాటు చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. బీబీపేట్ మండల కేంద్రంలో ఎస్‌బీఐ (SBI) నూతన బ్రాంచ్‌ను ఏర్పాటు చేసేందుకు తక్షణమే సర్వే నిర్వహించి, అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అధికారులు ఇప్పటికైనా స్పందించి కొత్త బ్యాంక్‌ను ఏర్పాటు చేయకపోతే, రాబోయే రోజుల్లో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు కళ్లు తెరిచి ఎస్‌బీఐ బ్యాంక్ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు రోజులుగా తిరిగినా పనులు కాని యూనియన్ బ్యాంక్ ప్రజల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.1
- కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రైవేటు విద్యాసంస్థలను రద్దు చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కంకం కుమారస్వామి మాట్లాడుతూ, వచ్చేనెల 10వ తేదీన ప్రైవేటు విద్యా బాధితుల భారీ నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ నిరసన ప్రదర్శన అంబేద్కర్ స్టేడియం నుండి ప్రారంభమై కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, ప్రైవేటు విద్యా బాధితుల తల్లిదండ్రులు, అనేక వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రైవేటు విద్యావిధానాన్ని రద్దు చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థలను ప్రభుత్వం అండర్‌టేకింగ్ చేసుకొని ఆధీనంలో నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్న సిబ్బందిని ప్రభుత్వ అండర్‌టేకింగ్ ఉద్యోగులుగా గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే తెలంగాణ ఉద్యమకారుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో తక్షణమే ఉచిత విద్యను అందించాలని లేదా 50% రాయితీతో కూడిన ఫీజులు మాత్రమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఆంధ్ర ఉపాధ్యాయులు, లెక్చరర్లకు అవకాశాలు కల్పించకూడదని, తెలంగాణ బిడ్డలకు, నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు విద్యకు ప్రాధాన్యతనిస్తూ, ప్రైవేటు వ్యవస్థ రద్దు చేసి, ఉచిత ప్రభుత్వ విద్యను ప్రవేశపెడతామని తమ మేనిఫెస్టోలో మొదటి అంశంగా పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు గరిక కోటేశ్వర్, టౌన్ అధ్యక్షులు గాలి రమేష్ యాదవ్, కనకం నరసయ్య, ఉత్తర తెలంగాణ మహిళా అధ్యక్షురాలు కార్పాకల మున్నా, సిరిసెట్టి భాగ్యలక్ష్మి, తునికి వనజ, పెద్దపల్లి భారతక్క, ఆవారు లత, బాలామణి, కోమల, సత్యలక్ష్మి, గౌరీ, విజయ, రాజమ్మ, సుజాత రెడ్డి, సత్యవతి, దేవేంద్ర రెడ్డి, షబ్బీర్, అసీం ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.1
- యువతి వివాహాన్ని అడ్డుకోవాలనే దురుద్దేశంతో వాల్ పోస్టర్లు ముద్రించి ప్రచారం చేసిన ఆరుగురు నిందితులను సిద్దిపేట పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట ఏసిపి రవీందర్ సమక్షంలో ఈ అరెస్టు వివరాలను వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో పెద్దగుండవెళ్లికి చెందిన దొడ్ల వెంకటేష్, గుర్రాలగొందికి చెందిన వన్నెల అశ్విత్ కుమార్ అలియాస్ బన్నీ, బక్రిచెప్యాలకు చెందిన బండి భాను ప్రసాద్ అలియాస్ దినేష్ మరియు అతని భార్య రేఖ, రామంచకు చెందిన బురుజుకింది ఈశ్వర్, సిద్దిపేటకు చెందిన రాజబోయిన నవీన్ కుమార్ ఉన్నారు. వీరి నుంచి పోలీసులు కారు, మొబైల్ ఫోన్లు మరియు వాల్ పోస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన దొడ్ల వెంకటేష్, సిద్దిపేట జిల్లాకు చెందిన యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నానని వేధించాడు. ఆమెకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో, దానిని అడ్డుకోవాలని కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. యువతి పరువుకు భంగం కలిగించేలా అభ్యంతరకరమైన పోస్టర్లను తయారు చేయించి, వాటిని తంగళ్ళపల్లి మరియు యువతి స్వగ్రామంలో అతికించినట్లు నిందితుడు అంగీకరించాడు. యువతి కుటుంబ సభ్యులు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏసిపి రవీందర్ హెచ్చరించారు. అభ్యంతరకర పోస్టర్లను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులపై మరియు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై కూడా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మహిళలు ఎటువంటి సమస్య ఎదురైనా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని ఆయన సూచించారు.4
- జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్ మండలం నరసింహులపల్లె గ్రామంలో అంగన్‌వాడీ భవనాన్ని ఆక్రమించుకున్నారని, దానిని వెంటనే తొలగించి ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు, పార్టీ నాయకులు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలోని సర్వే నంబర్–22, హౌస్ నంబర్–3-96లో ఉన్న భవనం ప్రభుత్వ అంగన్‌వాడీదని రెవెన్యూ అధికారులు నిర్ధారించారని తెలిపారు. ఎమ్మార్వో నివేదిక ప్రకారం ప్రభుత్వ ఆస్తి ఆక్రమణకు గురైందని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై గతంలో గ్రామస్థులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆక్రమణ తొలగించాలని ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. అయితే, డీపీఓ శిక్షణలో ఉన్నందున ఎంపీడీఓను పంపించారని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం అధికారుల బాధ్యత అని, ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారంలో జాప్యం జరిగితే గ్రామస్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, ఇటీవల గ్రామంలో జరిగిన నిరసన సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేసి గ్రామస్థులను భయాందోళనకు గురిచేశారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలబడటమే కానీ, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరుతున్న వారిపై చర్యలు తీసుకోవడం కాదని ఆయన స్పష్టం చేశారు. అలాగే, గోడ కూల్చివేత ఘటనలో స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్‌ను చట్ట ప్రకారం కోర్టుకు అప్పగించకుండా పోలీస్ స్టేషన్‌లో ఉంచడం సరికాదని పేర్కొన్నారు. రైతుల జీవనాధారమైన ట్రాక్టర్‌ను దాని యజమానికి లేదా కోర్టు ఆదేశాల మేరకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. నరసింహులపల్లె అంగన్‌వాడీ భవనం సమస్యను అధికారులు చట్టబద్ధంగా, పారదర్శకంగా వ్యవహరించి శాంతియుతంగా పరిష్కరించాలని జీవన్‌రెడ్డి తన వినతిపత్రంలో కోరారు.1
- కరీంనగర్ నగరంలోని ఓ బేకరీలో పుట్టినరోజు వేడుకల కోసం ఆర్డర్ చేసిన కేకులో ఫంగస్ రావడంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కేకును కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత సంతోషంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకున్న బాధితుడు, కేకును కట్ చేయగానే అందులో ఫంగస్ ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. అప్పటికే కొంతమంది చిన్నారులు ఆ పాడైపోయిన కేకును తిన్నారని బాధితుడు వాపోయాడు. ఈ ఫంగస్ విషయంపై సదరు బేకరీ సిబ్బందిని ప్రశ్నించగా, వారు కేవలం “సారీ” చెప్పి, తమ తప్పైందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి బేకరీలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.4
- కరీంనగర్ నగరంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించగా, తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ మరియు పిడిఎస్యు నాయకులను పోలీసులు బలవంతంగా, అక్రమంగా అరెస్టు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంద్‌ను అడ్డుకుని, విద్యార్థి నేతలను అరెస్టు చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డిదని విమర్శలు వెల్లువెత్తాయి. విద్యారంగ సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, రేవంత్ రెడ్డి తన మనవడితో పూరీలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వైఖరిని నిరసిస్తూ, రేవంత్ రెడ్డిని శాశ్వతంగా ఇంటికి పరిమితమయ్యేలా విద్యార్థి లోకం బుద్ధి చెబుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు.4