logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శావల్యాపురం మండలం పిచికలపాలెం దళితుల భూముల సమస్య పరిష్కరించాలి శావల్యాపురం మండలం పిచికలపాలెం గ్రామంలోని దళితుల భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ దళితులు, ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్‌కు అర్జీ సమర్పించారు. 246/సిలో 73 మంది దళితులకు పట్టాలు మంజూరైనా ప్లాట్లు కేటాయించలేదని తెలిపారు. 280-1, 58 సర్వే నంబర్లలోని భూములను కూడా ఆక్రమణల నుంచి కాపాడి తమకు అప్పగించాలని కోరారు. స్మశానవాటిక అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యపై విచారణ జరిపి న్యాయం చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు

3 hrs ago
user_Orsu Krishna
Orsu Krishna
Social worker పిడుగురాళ్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
47a20f88-2942-46af-a2a8-a230e735344b

శావల్యాపురం మండలం పిచికలపాలెం దళితుల భూముల సమస్య పరిష్కరించాలి శావల్యాపురం మండలం పిచికలపాలెం గ్రామంలోని దళితుల భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ దళితులు, ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్‌కు అర్జీ సమర్పించారు. 246/సిలో 73 మంది దళితులకు పట్టాలు మంజూరైనా ప్లాట్లు కేటాయించలేదని తెలిపారు. 280-1, 58 సర్వే నంబర్లలోని భూములను కూడా ఆక్రమణల నుంచి కాపాడి తమకు అప్పగించాలని కోరారు. స్మశానవాటిక అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యపై విచారణ జరిపి న్యాయం చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల చిలక జోస్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రస్తుత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఫోటోలతో చిలక జోస్యం వీడియో గురువారం పలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి ఒక్కరూ తమ తమ గ్రూపుల్లో షేర్లు చేసుకుని తమ నాయకుని సేవలు గుర్తించుకుని కొనియాడారు. ఒక్కొక్క రైతే తమ హయాంలోనే అభివృద్ధి సంక్షేమాలు జరిగాయి అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియో ఎలా వైరల్ అయింది అనే విషయమై చర్చనియాంశమైంది
    1
    రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల చిలక జోస్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్
పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రస్తుత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఫోటోలతో చిలక జోస్యం వీడియో గురువారం పలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి ఒక్కరూ తమ తమ గ్రూపుల్లో షేర్లు చేసుకుని తమ నాయకుని సేవలు గుర్తించుకుని కొనియాడారు. ఒక్కొక్క రైతే తమ హయాంలోనే అభివృద్ధి సంక్షేమాలు జరిగాయి అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియో ఎలా వైరల్ అయింది అనే విషయమై చర్చనియాంశమైంది
    user_Raju Paragati
    Raju Paragati
    పెదకూరపాడు, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • రాఖీ పండుగ ఆ తర్వాత శని, ఆదివారం సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ఇళ్లకు బయలుదేరారు రాఖీ పండుగ, ఆ తర్వాత శని, ఆదివారం సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ఇళ్లకు బయలుదేరారు. విద్యా సంస్థల నుంచి పిల్లలను తీసుకెళ్తున్న తల్లిదండ్రులతో రహదారులు కిక్కిరిశాయి. ఖమ్మం కొత్త, పాత బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. వచ్చిన బస్సు వచ్చినట్లే నిండిపోవడంతో అడుగు పెట్టేందుకు స్థలం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల రద్దీ కూడా అధికంగా కనిపించింది.
    1
    రాఖీ పండుగ  ఆ తర్వాత శని, ఆదివారం సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ఇళ్లకు బయలుదేరారు
రాఖీ పండుగ, ఆ తర్వాత శని, ఆదివారం సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ఇళ్లకు బయలుదేరారు. విద్యా సంస్థల నుంచి పిల్లలను తీసుకెళ్తున్న తల్లిదండ్రులతో రహదారులు కిక్కిరిశాయి. ఖమ్మం కొత్త, పాత బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. వచ్చిన బస్సు వచ్చినట్లే నిండిపోవడంతో అడుగు పెట్టేందుకు స్థలం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల రద్దీ కూడా అధికంగా కనిపించింది.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • *ఆర్టీసీ డ్రైవర్‌ గా విధులలో ఉన్న తమ్ముడికి బస్సులోనే రాఖీ కట్టిన అక్క* సూర్యాపేట సిటీ ఆగస్టు 28: విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు రాఖీ కట్టిది ఒక మహిళా ప్రయాణికురాలు. గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ రాజుకు రాజీవ్ రహదారిపై బస్సు ఆపించి డ్రైవర్ అక్క స్వప్న రాఖీ కట్టింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద విధుల్లో ఉన్న తన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
    1
    *ఆర్టీసీ డ్రైవర్‌ గా విధులలో ఉన్న తమ్ముడికి బస్సులోనే రాఖీ కట్టిన అక్క*

సూర్యాపేట సిటీ ఆగస్టు 28:
విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు రాఖీ కట్టిది ఒక మహిళా ప్రయాణికురాలు.
గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ రాజుకు రాజీవ్ రహదారిపై బస్సు ఆపించి  డ్రైవర్ అక్క స్వప్న రాఖీ కట్టింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద విధుల్లో ఉన్న తన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Local News Reporter Suryapet, Telangana•
    8 hrs ago
  • 🎯 “నడిరోడ్డుపై పోలీసుల దాష్టీకం.. కోదాడలో అసలేం జరిగింది?” సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో షాపుల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు.. మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరును నిరసిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కోదాడ టౌన్ సీఐ.. ఆందోళన చేస్తున్న బాధితులపై దాడికి పాల్పడి, కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. అడ్డొచ్చిన మహిళలను సైతం పోలీసులు నెట్టివేసి, పలువురు బాధితులను అరెస్ట్ చేశారని వారు పేర్కొన్నారు.నడిరోడ్డుపై సీఐ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షాపుల తొలగింపుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    🎯 “నడిరోడ్డుపై పోలీసుల దాష్టీకం.. కోదాడలో అసలేం జరిగింది?”
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో షాపుల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు.. మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరును నిరసిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కోదాడ టౌన్ సీఐ.. ఆందోళన చేస్తున్న బాధితులపై దాడికి పాల్పడి, కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. అడ్డొచ్చిన మహిళలను సైతం పోలీసులు నెట్టివేసి, పలువురు బాధితులను అరెస్ట్ చేశారని వారు పేర్కొన్నారు.నడిరోడ్డుపై సీఐ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షాపుల తొలగింపుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • ​దళిత క్రైస్తవుల జోలికి వస్తే మౌనంగా ఉండలేము. ​ఇది కూడా మా ఆత్మగౌరవ సమస్యే. ​ఇది మా అస్తిత్వ సమస్యే. ​మీకు మతం మారే స్వేచ్ఛ మీకు మాత్రమే వద్దూ అని చెప్తే, ఇది నిర్బంధంలో మమ్మల్ని పెట్టినట్టే. ​నాలుగు గోడల మధ్యల పిల్లిని బంధించి కొట్టాలన్నా, చంపాలన్నా కూడా పిల్లి ఎదురు తిరుగుతది. ​అందరికీ స్వేచ్ఛనిస్తాం కానీ దళితులకు మాత్రం ఇవ్వము అని చెప్పి, దళితులను వేధిస్తే, దళితుల హక్కులను తీసేసే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉండలేరు. ​మా దళిత క్రైస్తవుల మీద, మా పేద వర్గాల మీద దాడులు ఆపాలి. ​మీకు చేతనైతే లగ్జరీ కార్లలో తిరిగే కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ ఫాదర్ల గురించి ఆలోచించండి. ​మీకు చేతనైతే విమానాల్లో పోయేటోళ్ల గురించి ఆలోచించండి. ​సైకిల్ తొక్కి మాల, మాదిగ దళిత క్రైస్తవులను అడ్డుకుంటారు, కొడతారు, అవమానిస్తారు. ​మాకు ఊరు దాటి ఊరు పోవడానికి కూడా శక్తి లేకనే సైకిలెక్కి పోతున్నారు. ​వీళ్లు మీకు శత్రువులవుతారా? ​ఇదెట్లా న్యాయమవుతది? ​ఇదెట్లా ధర్మమవుతది? పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ MRPS అధ్యక్షులు.
    1
    ​దళిత క్రైస్తవుల జోలికి వస్తే మౌనంగా ఉండలేము.
​ఇది కూడా మా ఆత్మగౌరవ సమస్యే.
​ఇది మా అస్తిత్వ సమస్యే.
​మీకు మతం మారే స్వేచ్ఛ మీకు మాత్రమే వద్దూ అని చెప్తే, ఇది నిర్బంధంలో మమ్మల్ని పెట్టినట్టే.
​నాలుగు గోడల మధ్యల పిల్లిని బంధించి కొట్టాలన్నా, చంపాలన్నా కూడా పిల్లి ఎదురు తిరుగుతది.

​అందరికీ స్వేచ్ఛనిస్తాం కానీ దళితులకు మాత్రం ఇవ్వము అని చెప్పి, దళితులను వేధిస్తే, దళితుల హక్కులను తీసేసే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉండలేరు.

​మా దళిత క్రైస్తవుల మీద, మా పేద వర్గాల మీద దాడులు ఆపాలి.

​మీకు చేతనైతే లగ్జరీ కార్లలో తిరిగే కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ ఫాదర్ల గురించి ఆలోచించండి.

​మీకు చేతనైతే విమానాల్లో పోయేటోళ్ల గురించి ఆలోచించండి.

​సైకిల్ తొక్కి మాల, మాదిగ దళిత క్రైస్తవులను అడ్డుకుంటారు, కొడతారు, అవమానిస్తారు.

​మాకు ఊరు దాటి ఊరు పోవడానికి కూడా శక్తి లేకనే సైకిలెక్కి పోతున్నారు.

​వీళ్లు మీకు శత్రువులవుతారా?

​ఇదెట్లా న్యాయమవుతది?

​ఇదెట్లా ధర్మమవుతది?


పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ 
MRPS అధ్యక్షులు.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బెయిల్ .. 40 ఏళ్లు పరార్... హత్య కేసులో జీవిత ఖైదీ.. పేరు మార్చుకుని ఉద్యోగం.. 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు.. చివరకు అరెస్టు.. ఒక హత్య కేసులో జీవిత ఖైదు.. జైల్లో గడిపింది కేవలం ఆరు నెలల ఏడు రోజులు.. పెరోల్ పై బయటకు వచ్చి జైలుకు వెళ్లకుం డా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపాడు .. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం.. ఏకంగా 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు. గెలుచుకొన్నాడు .. చివరకు 73 ఏళ్ల వయసులో మళ్లీ అరెస్టు.. అయ్యాడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మం డలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది 1982లో మహబూబాబాద్ లో ఓ పాన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణలో మార్వాడీ వ్యాపారి జవార్ పండరిని తూకం బాటుతో మోది హత్య చేశారు, ఈ కేసులో నిందితుడుగా ఉన్న వీరన్న కు వరంగల్ అద నపు జిల్లా కోర్టు 1983 జూన్ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలులో (ఖైదీ నంబర్ 1567) ఉంచారు. మొత్తం శిక్షలో కేవలం 6 నెలల 7 రోజులు జైలు జీవితం గడిపిన ఆయన 1983 డిసెంబర్ 17న 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చాడు. పెరోల్ పై 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లలేదు. అక్కడి నుంచి మొదలైంది నాలుగు దశాబ్దాల పాటు పోలీస్ ల కళ్ళకు దొరకకుండా తిరిగాడు. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అతడిని పట్టు కుంది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలు మూసివేత కారణంగా చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంతకాలం అధికారులకు చిక్కకుండా ఉన్న వీరన్న పేరు మార్చుకుని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లా గుడివాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి 2013లో పదవీ విరమణ చేశాడు. కోసమేరుపు ఏమిటంటే పెన్షన్ కూడా పొందుతున్నాడు. ఉద్యోగ కాలంలో 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు కూడా అందుకున్నరు 2013 నుంచి మహబూబాబాద్ జిల్లాలోనే నివసిస్తున్నప్పటికీ 2024 వరకు అధికారులు అతడిని పట్టు కోలేకపోయారు. స్వగ్రామమైన పెద్దముప్పారానికి అప్పుడప్పుడు వచ్చేవాడని సమాచారం. వీరన్నను పట్టుకునేందుకు అధికారులు పలు దశల్లో ప్రయ త్నాలు చేశారు 2012 నవంబర్ 19 నుంచి 2020 అక్టోబర్ 3 వరకు మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల పోలీసు అధికారులకు లేఖలు పంపినట్లు, చివరిగా తెలిసిన చిరునామా, సమీప గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు ఎట్టకేలకు 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వీరన్న ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలు కు తరలించారు.... అయితే వీరన్న భార్య సందుల చారమ్మ 2026లో హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్ రద్దు. మూడేళ్ల పాటు పెరోల్ తిరస్కరణ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి. మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్ పై వెళ్లి తిరిగి జైలుకు రాకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగిన జీవిత ఖైదీ విషయంలో హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెరోల్ పై వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పాందడం ఆశ్చర్యకరమని.... అంతే కాకుండా జైళ్ల శాఖలోని లోపాలను ఎత్తిచూపుతోందని, అధికారుల అలసత్వం తెలియజేస్తోందని అందోళన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మోసపూరితంగా పొందడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ఘటనలు ఇతర ఖైదీలు నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రోత్సాహకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. భవిష్య త్లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరోల్ గడువు ముగిసే తేదీని నిరంతరం పర్యవేక్షించడం, గడువు ముగిసిన వెంటనే ఖైదీ జైలుకు హాజరయ్యాడా చూడాలని హాజరుకాని వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోర్టు తెలియజేసింది ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాక రిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో అతడిపై విధించిన జీవిత ఖైదులో మిగిలిన శిక్షను అనుభవించాల్సిం దేనని స్పష్టం చేశారు న్యాయమూర్తి.... ఫెరోల్ నిరాకరణతో..ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నాడు.
    1
    బెయిల్ .. 40 ఏళ్లు పరార్... హత్య కేసులో జీవిత ఖైదీ..

పేరు మార్చుకుని ఉద్యోగం.. 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు.. చివరకు అరెస్టు..
ఒక హత్య కేసులో జీవిత ఖైదు.. జైల్లో గడిపింది కేవలం ఆరు నెలల ఏడు రోజులు.. పెరోల్ పై బయటకు వచ్చి జైలుకు వెళ్లకుం డా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపాడు .. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం.. ఏకంగా 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు. గెలుచుకొన్నాడు .. చివరకు 73 ఏళ్ల వయసులో మళ్లీ అరెస్టు.. అయ్యాడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మం డలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది 
1982లో మహబూబాబాద్ లో ఓ పాన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణలో మార్వాడీ వ్యాపారి జవార్ పండరిని తూకం బాటుతో మోది హత్య చేశారు, ఈ కేసులో  నిందితుడుగా ఉన్న వీరన్న కు వరంగల్ అద నపు జిల్లా కోర్టు 1983 జూన్ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలులో (ఖైదీ నంబర్ 1567) ఉంచారు. మొత్తం శిక్షలో కేవలం 6 నెలల 7 రోజులు జైలు జీవితం గడిపిన ఆయన 1983 డిసెంబర్ 17న 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చాడు. 
పెరోల్ పై 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లలేదు. అక్కడి నుంచి మొదలైంది నాలుగు దశాబ్దాల పాటు పోలీస్ ల కళ్ళకు దొరకకుండా తిరిగాడు. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అతడిని పట్టు కుంది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలు మూసివేత కారణంగా చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇంతకాలం అధికారులకు చిక్కకుండా ఉన్న వీరన్న పేరు మార్చుకుని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లా గుడివాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి  2013లో పదవీ విరమణ చేశాడు. కోసమేరుపు ఏమిటంటే పెన్షన్ కూడా పొందుతున్నాడు. ఉద్యోగ కాలంలో 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు కూడా అందుకున్నరు 2013 నుంచి మహబూబాబాద్ జిల్లాలోనే నివసిస్తున్నప్పటికీ 2024 వరకు అధికారులు అతడిని పట్టు కోలేకపోయారు. స్వగ్రామమైన పెద్దముప్పారానికి అప్పుడప్పుడు వచ్చేవాడని సమాచారం. వీరన్నను పట్టుకునేందుకు అధికారులు పలు దశల్లో ప్రయ త్నాలు చేశారు 2012 నవంబర్ 19 నుంచి 2020 అక్టోబర్ 3 వరకు మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల పోలీసు అధికారులకు లేఖలు పంపినట్లు, చివరిగా తెలిసిన చిరునామా, సమీప గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు ఎట్టకేలకు 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న ప్రత్యేక టాస్క్ ఫోర్స్   వీరన్న ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలు కు తరలించారు....
అయితే 
వీరన్న భార్య సందుల చారమ్మ 2026లో హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్ రద్దు.  మూడేళ్ల పాటు పెరోల్ తిరస్కరణ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి. మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్ పై వెళ్లి తిరిగి జైలుకు రాకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగిన జీవిత ఖైదీ విషయంలో హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెరోల్ పై వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పాందడం ఆశ్చర్యకరమని....  అంతే కాకుండా జైళ్ల శాఖలోని లోపాలను ఎత్తిచూపుతోందని, అధికారుల అలసత్వం తెలియజేస్తోందని అందోళన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మోసపూరితంగా పొందడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ఘటనలు ఇతర ఖైదీలు నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రోత్సాహకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. భవిష్య త్లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరోల్ గడువు ముగిసే తేదీని నిరంతరం పర్యవేక్షించడం, గడువు ముగిసిన వెంటనే ఖైదీ జైలుకు హాజరయ్యాడా  చూడాలని హాజరుకాని వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోర్టు  తెలియజేసింది ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాక రిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో అతడిపై విధించిన జీవిత ఖైదులో మిగిలిన శిక్షను అనుభవించాల్సిం దేనని స్పష్టం చేశారు న్యాయమూర్తి.... ఫెరోల్ నిరాకరణతో..ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నాడు.
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • మనిషికి జంతువుకి మధ్య ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఖమ్మంలోని ఓ కుటుంబం మనిషికి జంతువుకి మధ్య ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఖమ్మంలోని ఓ కుటుంబం. పెంపుడు కుక్కను కుటుంబసభ్యుడిగా భావిస్తూ.. పండుగకల్లా కొత్త బట్టలు కొనడమే కాదు.. ఏకంగా రాఖీ కూడా కట్టి తమ ప్రేమనుచాటుకున్నారు. ఆప్యాయతకు..అనుబంధానికి మనిషి-జంతువు అనే తేడా లేదని నిరూపించింది ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కుటుంబం.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం, వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన పేర్ల శ్రీను మూడేళ్ల క్రితం డాబర్ మాన్ జాతికి చెందిన ఓ కుక్క పిల్లను తీసుకొచ్చారు. ముద్దుగా దానికి రాఖీ అని పేరు పెట్టారు.అప్పటినుండి రాఖీ ఆ ఇంట్లో పెంపుడు కుక్క కాదు.. ఆ ఇంటి బిడ్డ అయిపోయింది. శ్రీను తన ఇద్దరు పిల్లలతో సమానంగా రాఖీని అల్లారుముద్దుగా పెంచుతున్నారు.విశేషం ఏంటంటే.. ప్రతి పండుగకు తన పిల్లలకు కొత్త బట్టలు కొన్నప్పుడు రాఖీకి (కుక్కకు) కూడా స్పెషల్ గా కొత్త డ్రెస్ తీసుకొని, టైలర్ తో ప్రత్యేకంగా కుట్టించి మరీ వేస్తారు.రాఖీ పండుగ సందర్భంగా శ్రీను కుమార్తె తన సోదరులతో పాటు రాఖీని( కుక్కకి) కూడా కట్టి దానిపైతమకున్నఅభిమానాన్ని చాటుకుంది. ప్రతి పండుగకు కుటుంబ సభ్యులతోపాటు దానికి కూడా నూతన వస్త్రాలు తీసుకొని వాటిని ప్రత్యేకంగా కుట్టించి (కుక్కకి) శునకానికి వేసి జంతు ప్రేమను చాటుకుంటాడుశ్రీను.ఆ కుక్క సైతం వారి కుటుంబ సభ్యుడిగా కలిసిపోతూ అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేస్తుండటం విశేషం.
    1
    మనిషికి జంతువుకి మధ్య ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఖమ్మంలోని ఓ కుటుంబం
మనిషికి జంతువుకి మధ్య ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఖమ్మంలోని ఓ కుటుంబం. పెంపుడు కుక్కను కుటుంబసభ్యుడిగా భావిస్తూ.. పండుగకల్లా కొత్త బట్టలు కొనడమే కాదు.. ఏకంగా రాఖీ కూడా కట్టి తమ ప్రేమనుచాటుకున్నారు.
ఆప్యాయతకు..అనుబంధానికి మనిషి-జంతువు అనే తేడా లేదని నిరూపించింది ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కుటుంబం.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం, వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన పేర్ల శ్రీను మూడేళ్ల క్రితం డాబర్ మాన్ జాతికి చెందిన ఓ కుక్క పిల్లను తీసుకొచ్చారు. ముద్దుగా దానికి రాఖీ అని పేరు పెట్టారు.అప్పటినుండి రాఖీ ఆ ఇంట్లో పెంపుడు కుక్క కాదు.. ఆ ఇంటి బిడ్డ అయిపోయింది. శ్రీను తన ఇద్దరు పిల్లలతో సమానంగా రాఖీని అల్లారుముద్దుగా పెంచుతున్నారు.విశేషం ఏంటంటే.. ప్రతి పండుగకు తన పిల్లలకు కొత్త బట్టలు కొన్నప్పుడు రాఖీకి (కుక్కకు)  కూడా స్పెషల్ గా కొత్త డ్రెస్ తీసుకొని, టైలర్ తో ప్రత్యేకంగా కుట్టించి మరీ వేస్తారు.రాఖీ పండుగ సందర్భంగా శ్రీను కుమార్తె తన సోదరులతో  పాటు రాఖీని( కుక్కకి) కూడా కట్టి దానిపైతమకున్నఅభిమానాన్ని చాటుకుంది. ప్రతి పండుగకు కుటుంబ సభ్యులతోపాటు దానికి కూడా నూతన వస్త్రాలు తీసుకొని వాటిని ప్రత్యేకంగా కుట్టించి (కుక్కకి) శునకానికి వేసి జంతు ప్రేమను చాటుకుంటాడుశ్రీను.ఆ కుక్క సైతం వారి కుటుంబ సభ్యుడిగా కలిసిపోతూ అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేస్తుండటం విశేషం.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి? నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందడం కలకలం రేపింది. పట్టణానికి చెందిన కంభంపాటి కవిత ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. తొలుత నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన వైద్యులు, మరుసటి రోజు శిశువు హార్ట్‌బీట్ సరిగా లేదంటూ ఆపరేషన్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం బాలుడు మృతి చెందాడని పేర్కొన్నారు. శిశువు పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే వైద్యం చేశారని, వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని బంధువులు ఆరోపించారు.
    1
    నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి?
నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందడం కలకలం రేపింది. పట్టణానికి చెందిన కంభంపాటి కవిత ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. తొలుత నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన వైద్యులు, మరుసటి రోజు శిశువు హార్ట్‌బీట్ సరిగా లేదంటూ ఆపరేషన్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం బాలుడు మృతి చెందాడని పేర్కొన్నారు. శిశువు పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే వైద్యం చేశారని, వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని బంధువులు ఆరోపించారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.