Shuru
Apke Nagar Ki App…
పెళ్లి ఖర్చులకి 50 వేలు సహాయం చేసిన తెలుగు తమ్ముళ్లు. .. . పెదకూరపాడు. . సహాయం కోసం అర్జించిన బీసీ మహిళ మనవరాలు పెళ్ళికి జిల్లా మాజీ టిడిపి కార్యదర్శి ఆర్చి మల్ల రమేష్ ఆధ్వర్యంలో 50 వేల రూపాయలు పెళ్లి ఖర్చుల నిమిత్తం తెలుగు తమ్ముళ్లు అందించారు. మండల టిడిపి అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం టిడిపి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని పెదకూరపాడు మండల టిడిపి నేతలు ఆపదని వస్తే ఆదుకునేందుకు ముందు ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అర్తిమల్ల రమేష్ ,అండ్ర ప్రసాద్, ఏటుకూరు బ్రహ్మయ్య ,రామగోపాల్ రావు ,వడ్లమూడి అప్పారావు, ముంతాజ్, అజుముల్లా, మలార్ రఫీ, రఘు, బుల్లబ్బాయి పాల్గొన్నారు
Raju Paragati
పెళ్లి ఖర్చులకి 50 వేలు సహాయం చేసిన తెలుగు తమ్ముళ్లు. .. . పెదకూరపాడు. . సహాయం కోసం అర్జించిన బీసీ మహిళ మనవరాలు పెళ్ళికి జిల్లా మాజీ టిడిపి కార్యదర్శి ఆర్చి మల్ల రమేష్ ఆధ్వర్యంలో 50 వేల రూపాయలు పెళ్లి ఖర్చుల నిమిత్తం తెలుగు తమ్ముళ్లు అందించారు. మండల టిడిపి అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం టిడిపి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని పెదకూరపాడు మండల టిడిపి నేతలు ఆపదని వస్తే ఆదుకునేందుకు ముందు ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అర్తిమల్ల రమేష్ ,అండ్ర ప్రసాద్, ఏటుకూరు బ్రహ్మయ్య ,రామగోపాల్ రావు ,వడ్లమూడి అప్పారావు, ముంతాజ్, అజుముల్లా, మలార్ రఫీ, రఘు, బుల్లబ్బాయి పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- కూసుమంచి పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు.బండమీది తండాకు చెందిన భూక్యా మంగ్యా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈనెల 21 న నిందితులు తాళం పగులగొట్టి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.చోరీ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన కిన్నెర మధు,ముదిగొండ వెంకన్నను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు చోరీ చేసిన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కూసుమంచి సీఐ సంజీవ్ తెలిపారు.1
- హరితహారం మొక్కలతో ఆహ్లాదకరమైన ప్రయాణం.................. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామపురం నుంచి చాకిరాల వరకు రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు పెద్దవిగా పెరిగాయి. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ చెట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎండలో ప్రయాణించే వారికి నీడనిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మొక్కల సంరక్షణతో మరింత పచ్చదనం పెరగాలని స్థానికులు కోరుతున్నారు.1
- పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనెలు తయారీ. ముదిగొండ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పశువుల కొవ్వులతో వంట నూనె తయారు చేస్తున్న వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయిస్తుంటారు.మిగిలిన పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నూనె డబ్బాలను పశువుల మాంసాన్ని ఛీ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు గత కొంతకాలంగా పశువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్నంతో దుర్వాసన వస్తుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- **విద్యార్థులలో విద్య సామర్థ్యాలను పెంపొందించాలి*** *- ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి.. *- నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్. *- నల్గొండ జిల్లా కేంద్రంలోని కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. *- విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్. విద్యార్థులలో కనీస విద్య సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ వేశారు. అనంతరం విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం ,రాయడంతో పాటు, తెలుగు ,ఇంగ్లీష్ లలో పదాలకు అర్థాలు తెలిసే విధంగా నేర్పించాలని, ప్రాథమిక స్థాయిలో కనీస విద్యా సామర్ధ్యాలు పెంపొందినప్పుడే పై తరగతులకు వెళ్లిన సందర్భంలో విషయం సులభంగా అర్థమవుతుందని, ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే కొత్త పదాలకు అర్థాలతో పాటు, చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ యూనిఫామ్స్ గురించి అడిగారు. అందరికీ యూనిఫామ్ అందించడం జరుగుతుందని, యూనిఫాం వచ్చినవారు సరైన విధంగా ఉన్నది సరిచూసుకోవాలని, అవసరమైతే పాఠశాలలోనే ఆల్టరేషన్ చేయించేందుకు టైలర్లను పాఠశాలకు పిలిపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మహేశ్వరి తో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సామర్ధ్యాల పెంపుదలకు స తరచు పాఠశాలను సందర్శించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.2
- ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విలేకరి హల్ చల్-టాయ్ పిస్టల్ తో బెదిరింపులు అక్షరం ముక్క రాదు.. కానీ చేతిలో అక్రిడిటేషన్ కార్డు ఉంది. చికెన్ షాపులో పని చేసే వ్యక్తి విలేకరి అవతారం ఎత్తి మైలవరంలో హల్ చల్ చేస్తున్నాడు. అతడే కుంభ గోవింద్ అలియాస్ వజ్రం. అసలేం జరిగింది? ఈ నెల 5వ తేదీన ఫుడ్ సేఫ్టీ అధికారులు మైలవరంలో తనిఖీలు చేశారు. సాధారణంగా విలేకరి అయితే ఫోటోలు తీస్తాడు. కానీ ఈ గోవింద్ మాత్రం అధికారుల పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఇప్పుడు వైరల్ అవుతోంది. అధికారులు వెళ్లిపోగానే అసలు కథ మొదలైంది. హోటళ్లు, షాపుల యజమానుల దగ్గరకు వెళ్లి కేసులు కాకూడదంటే డబ్బులు ఇవ్వండి అంటూ అక్రిడిటేషన్ కార్డు చూపుతూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు. కారులో టాయ్ పిస్టల్ : బాధిత హోటల్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కారును నున్న వద్ద గుర్తించారు. కారులో సోదా చేయగా అచ్చం నిజమైన పిస్టల్ ను పోలిన టాయ్ పిస్టల్ బయటపడింది.ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డాడని, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.1
- తిరుమలాయపాలెం ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించన తిప్పరెడ్డి గూడెం రైతులు. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం తిప్పరెడ్డి గూడెం దళిత రైతులు ఈ రోజు సిపిఐంల్ న్యూ డెమోక్రసి పార్టీ అధ్యరలో ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించినరు. 128సర్వ్ నెంబర్ లో14ఎకరాల20కుంటాలపేదల భూమి లో సీతారామ ప్రజక్ట్ కాలువలు తవ్వి పేదలకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇప్పుడూ అది ప్రభత్వ భూమి అని తప్పుడు పత్రాలు,పోర్జరి సంతకాలు సూపించి పేద రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతులు 50 సంవత్సరాలుగా సేద్యంలో ఉంటూన్న రైతులనుగత ఆరు సంవత్సరాల నుంచి సీతారామ కాలవ పేరుతో పేదల భూములు లాక్కొని ఆ పేదల భూముల్లో కాలువల తవ్వి ఆనాటి ప్రభుత్వం మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పిఇప్పుడు ఆ భూమిని ప్రభుత్వ భూమి గా చూపిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తిప్పారెడ్డి గూడెం రైతుల పక్షాన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వం నుంచి వారికి నష్టపరిహారం అందేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపినారు.1
- సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో 5గురు ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో 5గురు ఆత్మహత్యకి పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. దీనితోసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో బత్తలపల్లిలో విషాదం నెలకొంది టీచర్స్ కాలనీకి చెందిన ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. శ్రీశైలంలో ఓ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డారు.మృతుల్లో అన్న సుధాకర్, నలుగురు చెల్లెళ్లలో మల్లేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి ఉన్నారు. 14 ఏళ్ల బాలుడు మణి కూడా మృతి, మణి మల్లేశ్వరి కుమారుడిగా సమాచారం1
- సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.2
- Writing హైదరాబాద్–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్ రాడ్ల కంటైనర్ DCMను ఓవర్‌టేక్ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.1