Shuru
Apke Nagar Ki App…
మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: నిర్మలారెడ్డి మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి పీ ఎస్ ఆర్ గార్డెన్ లో మహిళా సంఘాల సభ్యులకు 195.18 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను శనివారం పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు వనిత, అంజమ్మ పాల్గొన్నారు.
Praveen
మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: నిర్మలారెడ్డి మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి పీ ఎస్ ఆర్ గార్డెన్ లో మహిళా సంఘాల సభ్యులకు 195.18 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను శనివారం పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు వనిత, అంజమ్మ పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- గజ్వేల్ పట్టణంలో మే డే సందర్భంగా లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షుడు ఎండీ కరీం నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు పి. ఆంజనేయులు, ఎస్.కె ఫరీద్, కోశాధికారి ఆర్. దయాకర్, సభ్యులు ఎండీ యూసుఫ్, రాజు చారి, విజయ్, దుర్గేష్, సోహెల్, బాలేష్, సోను, పాషా, స్వామి, వెంకటేష్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆటో డ్రైవర్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై మే డే ప్రాముఖ్యతను తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.4
- భిక్నూర్ 02-05-2026 కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును లబ్దిదారులతో కలిసి గృహప్రవేశం చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. లబ్దిదారులకు బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. ఈ కార్యక్రమంలో భిక్నూర్ గ్రామ సర్పంచ్ రేఖ సుదర్శన్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, భిక్నూర్ మండల అధ్యక్షులు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు,గ్రామ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, నాయకులు రాజబాబు గౌడ్, విజయ్ గౌడ్, వెంకటేష్ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- స్టేషన్ ఘన్ పూర్ (మీదికొండ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మీదికొండలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్య అంశాలు: కుటుంబ సభ్యులపై ఆరోపణలు: తన తండ్రి (కేసీఆర్), సోదరులు అవినీతికి పాల్పడ్డారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ద్రోహులకు పదవులు: తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి, ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన వారికి (తెలంగాణ ద్రోహులకు) పదవులు కట్టబెట్టి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలపై హితవు: తాను కేసీఆర్ విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనను నిత్యం విమర్శించడం మానుకోవాలని సూచించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినా, అసలు అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవద్దని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలపై ఇప్పటికైనా స్పందించి వివరణ ఇవ్వాలని, పారదర్శకతను నిరూపించుకోవాలని కడియం శ్రీహరి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.1
- *మత్తు పదార్థాలకు యువత బానిస అవుతుంది* *గ్రామాల్లో పట్టణంలో గంజాయి అమ్ముతున్నారు* *పిల్లలు, యువత చెడు బాట పడుతున్నారు* *పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించండి* *లేకపోతే ఇది సమాజానికే ప్రమాదం* *గంజాయి నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలి* *ప్రజా పాలన లో అధికారులకు సూచించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*1
- డ్రగ్స్ మహమ్మరిని నిర్మూలిద్దాం భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రతి విద్యార్థి,యువత యాంటీ డ్రగ్ సోల్జర్ మారాలి. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో 2k రన్. ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు,యువత, విద్యార్థులు,పోలీస్ అధికారులు,సిబ్బంది. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపునిచ్చారు.డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం రోజున నిర్వహించిన 2K రన్‌లో విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యత గలవారిగా వ్యవహరించి,డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు.విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు. ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు.కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ర్యాలీ కి వచ్చిన విద్యార్థులతో,క్రీడాకారులతో ప్రతిజ్ఞ. "నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగ్యస్వామి అవుతానని, డ్రగ్స్ వాడటం వలన కలిగే దుష్పరిమానాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను."ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి,సి.ఐ లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు శ్రీకాంత్, డిసిపిఓ కవిత, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, క్రీడాకారులు,యువత, ప్రజలు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.3
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట క్షణాల్లో మంటలకు ఆహుతి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెలుకల కొండల రెడ్డి, చెలుకల ప్రతాప్ రెడ్డి, చెలుకల కేశవరెడ్డి రైతులకు చెందిన పంట కాలిపోవడంతో సుమారు ₹10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. కాలిపోయిన పొలాలను పరిశీలించి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు నష్టపోతే దేశం అభివృద్ధి సాధ్యం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన రైతు సంక్షేమ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన పంటకు ఎకరానికి కనీసం ₹25 వేల చొప్పున నష్టపరిహారం వెంటనే అందించాలని, అదనంగా విద్యుత్ శాఖ ద్వారా కూడా పరిహారం కల్పించాలని కోరారు. అలాగే ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.3
- కామారెడ్డి మండలం : కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఇంటర్మీడియట్ పూర్తైన | విద్యార్థినులకు స్కూటీలు అందజేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం కామారెడ్డిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్ పరీక్షల్లో జిల్లాకు చెందిన విద్యార్థినులు ఉత్తమ ర్యాంకులు సాధించారని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు.1
- కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెళ్లి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేంద్రంలో లారీల కొరత ఉందని రైతులు తెలపడంతో, పంట రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దళారుల బెడద లేకుండా, మెరుగైన మద్దతు ధర కోసం రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఈనాడు దినపత్రిక రిపోర్టర్ బొజ్జ రాజ్ కుమార్(34) ప్రమాదవశాత్తు ఎల్ఎండి లోని బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మిత్రుడితో కలిసి డ్యామ్ వద్దకు వెళ్ళగా ప్రమాదవశాత్తు బావిలో జారిపోవడంతో ఈత రాక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించగా బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య పొరండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్ కుమార్ కు భార్య సబిత ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులను రాజకీయ నాయకులతోపాటు పలువురు అధికారులు పరామర్శించి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.1