logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మోడీ హటావో–దేశ బచావో... రాజ్యాంగాన్ని రక్షించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి - పిఠాపురంలో సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ ర్యాలీ పిఠాపురం: సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, అఖిలభారత వ్యవసాయ– గ్రామీణ కార్మిక సంఘం (అయార్ల) ఆధ్వర్యంలో ఆదివారం పిఠాపురంలో “మోడీ హటావో–దేశ బచావో.. రాజ్యాంగాన్ని రక్షించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి” అనే నినాదాలతో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పాడా అధికారులకు అందించారు. సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బుగత బంగార్రావు మాట్లాడుతూ బీజేపీ–మోడీ పాలన కార్పొరేట్ ప్రయోజనాలకే పనిచేస్తోందని ఆరోపించారు. దేశ సహజ వనరులు, ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని, దళితులు, గిరిజనులు, ముస్లింలు, మహిళలు, మైనారిటీలు, రైతులు, విద్యార్థులు, యువతపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయని, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆరోపించారు. సర్వే పేరుతో తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని, పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు, పని, జీవనానికి సరిపడా వేతనం ఇవ్వాలని, వి.బి గ్రామ్ జీ పథకంలో పనులు కల్పించి కూలీల బకాయిలు చెల్లించాలని కోరారు. పట్టణ పేదలకు 2 సెంట్లు, గ్రామీణ పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ పరిధిలోని చెందుర్తి ప్రాంతంలో గత 40 ఏళ్లుగా పేదలు సాగు చేస్తున్న రెవెన్యూ కొండ పోరంబోకు భూములకు హక్కులు కల్పించి, సాగుదారులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరారు. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్. అప్పలరాజు మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల హామీని అమలు చేయడంతో పాటు, ఇప్పటికే పట్టాలు పొందిన వారికి స్థలాలు చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గొడుగు సత్యనారాయణ, వ్యవసాయ కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మానుకొండ లచ్చబాబు, సి.హెచ్. అప్పలరాజు, నక్కా మంగ, కన్నాటి వెంకట రమణ, తంగెళ్ళ మహాలక్ష్మి, రాంబాబు, నక్కా అప్పన్న, టి. లక్ష్మమ్మ, ఆర్‌వైఏ నాయకులు గొడుగు వినోద్, తంగెళ్ళ తిరుపతయ్య, జి. నాగేశ్వరరావు, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

1 day ago
user_Prasanna kumar Rowthu
Prasanna kumar Rowthu
Press advisory Pithapuram, Kakinada•
1 day ago
92d88d49-177e-4844-b14e-d4b48411c8d8

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏 ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా > ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి! > > డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు. > > మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏 > > #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema ---
    2
    ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏
ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా 
> ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి!
>
> డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు.
>
> మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏
>
> #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema
---
    user_Ramugowd Matta
    Ramugowd Matta
    Fruit & Vegetable Trader ఆత్రేయపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే రోడ్డు పై 132 కె వి వైర్లు కిందకి వేలాడుతూ ఉండటం వలన పెద్ద వాహనాలు కు ఇబ్బంది ఉంటుందని ప్రస్తుతం రాకపోకలు నిలుపుదల చేసినారు. చించినాడ బ్రిడ్జి పనులు చేసినప్పుడే 132 K V పనులు చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. రోడ్ క్రాసింగ్ టవర్లలో ఒక టవరు పిల్లర్ల పని ఈరోజుతో పూర్తి అయినది. రెండవ టవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ ట్రాన్స్ కో, N H R & B వారు సమన్వయంతో కలిసి పనిచేసి హైవే పై రాకపోకలను వెంటనే పున రుద్దరించాలని కాంగ్రెస్ పార్టీ తరపు న డిమాండ్ చేస్తున్నాము.
    1
    శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది
అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే రోడ్డు పై 132 కె వి వైర్లు కిందకి వేలాడుతూ ఉండటం వలన పెద్ద వాహనాలు కు ఇబ్బంది ఉంటుందని ప్రస్తుతం రాకపోకలు నిలుపుదల చేసినారు. చించినాడ బ్రిడ్జి పనులు చేసినప్పుడే 132 K V  పనులు చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. రోడ్ క్రాసింగ్ టవర్లలో ఒక టవరు పిల్లర్ల పని ఈరోజుతో పూర్తి అయినది.  రెండవ టవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ ట్రాన్స్ కో, N H  R & B వారు సమన్వయంతో కలిసి పనిచేసి హైవే పై రాకపోకలను వెంటనే పున రుద్దరించాలని కాంగ్రెస్ పార్టీ తరపు న డిమాండ్ చేస్తున్నాము.
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    1
    బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ 
పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి డ్రైవర్ లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ డ్రైవర్ గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి డ్రైవ‌ర్ దుర‌హంకారం షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆప‌లేద‌ని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయ‌డంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
    1
    రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి డ్రైవర్

లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ డ్రైవర్
గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి డ్రైవ‌ర్ దుర‌హంకారం 
షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆప‌లేద‌ని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి
ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి
విచక్షణ రహితంగా దాడి చేయ‌డంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
  • కొత్త బస్సులు ఎప్పుడు వేస్తారు..సీఎం రేవంత్ ను కోరిన బాలుడు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఒకే బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో బస్సు కిందికి కుంగిపోయిందని ప్రయాణికులు ఆరోపించారు కొత్త బస్సులు ఇస్తారా? లేదా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఓ బాలుడు ప్రశ్నించారు. ఈ సమస్యలను పట్టించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రయాణికులు కోరారు.
    1
    కొత్త బస్సులు ఎప్పుడు వేస్తారు..సీఎం రేవంత్ ను కోరిన బాలుడు.
సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఒకే బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో బస్సు కిందికి కుంగిపోయిందని ప్రయాణికులు ఆరోపించారు
కొత్త బస్సులు ఇస్తారా? లేదా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఓ బాలుడు ప్రశ్నించారు. ఈ సమస్యలను పట్టించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రయాణికులు  కోరారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    13 min ago
  • దేశంలో బీసీలు 50 శాతం ఉన్నారు. బీసీల జనాభాకు అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించండి - కర్నేన గౌరు నాయుడు డిమాండ్
    1
    దేశంలో బీసీలు 50 శాతం ఉన్నారు. బీసీల జనాభాకు అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించండి 
- కర్నేన గౌరు నాయుడు డిమాండ్
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
    2
    సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • Writing హైదరాబాద్‌–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్‌ రాడ్ల కంటైనర్‌ DCMను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
    1
    Writing
హైదరాబాద్‌–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్‌ రాడ్ల కంటైనర్‌ DCMను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.