Shuru
Apke Nagar Ki App…
మంచిర్యాల: బెల్లంపల్లిలో అండర్-19 వాలీబాల్ ఎంపిక పోటీలు జోనల్ స్థాయి ఎసీఎఫ్ అండర్-19 వాలీబాల్ బాలుర ఎంపిక పోటీలు ఈ నెల 18న బెల్లంపల్లి పట్టణంలోని శివాలయం రోడ్డులో ఉన్న కాసిపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఎసీఎఫ్ సెక్రటరీ బాబురావు తెలిపారు. 1-1-2008 తర్వాత జన్మించి జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 9 గంటలకు కళాశాల ప్రాంగణంలో హాజరుకావాలని సూచించారు.
M S SRIDHAR
మంచిర్యాల: బెల్లంపల్లిలో అండర్-19 వాలీబాల్ ఎంపిక పోటీలు జోనల్ స్థాయి ఎసీఎఫ్ అండర్-19 వాలీబాల్ బాలుర ఎంపిక పోటీలు ఈ నెల 18న బెల్లంపల్లి పట్టణంలోని శివాలయం రోడ్డులో ఉన్న కాసిపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఎసీఎఫ్ సెక్రటరీ బాబురావు తెలిపారు. 1-1-2008 తర్వాత జన్మించి జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 9 గంటలకు కళాశాల ప్రాంగణంలో హాజరుకావాలని సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- శ్రీరాంపూర్: కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: HMS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంపూర్ సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని HMS రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య డిమాండ్ చేశారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 నెలలుగా గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. గనుల్లో పనిచేసే కార్మికులకు అవసరమైన పనిముట్లు, రక్షణ పరికరాలు తక్షణమే అందించాలని కోరారు. కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు.1
- టైగర్ లేకున్నా టైగర్ జోన్ అమలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అభయారణ్యంలో టైగర్ లేకుండా టైగర్ జోన్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం మండలానికి చెందిన బద్రి నాయక్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్నారు. జన్నారంలో అమలు చేస్తున్న ఎకో జోన్ తో ఇసుక రాక ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని వాపోయారు. అధికారులు స్పందిస్తూ ఎకో జోన్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.1
- డేంజర్ జోన్ గా జగిత్యాల బైపాస్ రోడ్డు: గుంతలు పూడ్చేదెప్పుడు? ప్రయాణం సురక్షితమయ్యేదెప్పుడు? జగిత్యాల పట్టణంలో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే కొత్త బస్ స్టాండ్ సమీపంలోని తెలంగాణ వైన్స్ చౌరస్తా నుండి బైపాస్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డు పునర్నిర్మాణం లేదా డ్రైనేజీ/పైప్‌లైన్ పనుల కోసం తవ్విన భారీ గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చకుండా, మట్టి మరియు రాళ్ల శిథిలాలను (Debris) రోడ్డు పైనే అస్తవ్యస్తంగా వదిలేశారు. ప్రాణసంకటంగా రాత్రి ప్రయాణం: తెలంగాణ వైన్స్ చౌరస్తా వద్ద నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ గుంతల వద్ద ఎటువంటి రేడియం సూచికలు గానీ, ప్రకాశించే బారికేడ్లు గానీ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు ట్రాఫిక్ దిగ్బంధం: కొత్త బస్ స్టాండ్ వైపు, బైపాస్ వైపు వెళ్లే వాహనాలు ఈ గుంతలను తప్పించబోయి హఠాత్తుగా బ్రేకులు వేయడం వల్ల చౌరస్తా ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. ప్రయాణికులకు దుమ్ము ఇబ్బందులు: రోడ్డుపై విసిరేసినట్లున్న కంకర, మట్టి వల్ల వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతంగా దుమ్ము రేగి కాలినడకన వెళ్లే ప్రయాణికులు, స్థానిక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త బస్ స్టాండ్ మరియు బైపాస్ రోడ్డును కలిపే ఈ కీలకమైన చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ మరియు ఆర్ అండ్ బి (R&B) అధికారులు తక్షణమే స్పందించాలి. వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి, తవ్విన గుంతలకు శాశ్వత మరమ్మతులు చేపట్టి వాహనదారుల ప్రయాణాన్ని సురక్షితం చేయాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.1
- ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను: 1) పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. 2) మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు. ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.1
- *బీసీలకు అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం** *కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నం – బీసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు* *బీసీల హక్కుల కోసం పోరాటం ఆపేది లేదు: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్* ఆసిఫాబాద్: బీసీ కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీ కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2025 మే 1న ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఓబీసీ కుటుంబాలను సమగ్రంగా లెక్కించి, ప్రత్యేక బీసీ కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ కాలమ్ కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీని బహిష్కరించడం బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు. పోలీసులు అడ్డుకున్నా బీసీల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ కులగణనను శాస్త్రీయంగా నిర్వహించే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని రూప్నార్ రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లోబడే లాహు కుమార్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు సాయి కృష్ణ నాయకులు, అసద్, జయరాజ్, వెంకన్న,ముబీన్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభవార్త చెప్పారు..! డంపింగ్ యార్డ్ పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. స్వచ్ఛ భారత్ పథకం కింద ఇప్పటికే 16 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. యూసీఎఫ్ నిధుల నుంచి మరో 80 కోట్ల రూపాయలను డంపింగ్ యార్డ్ కోసం వెచ్చిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్‌లో 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. రోడ్లు, డ్రెయిన్లు, పైప్‌లైన్లు, ఓపెన్ జిమ్ పనులను ప్రారంభించారు. గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం.. ప్రతి డివిజన్‌లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తాం అని బండి సంజయ్ తెలిపారు. యూసీఎఫ్ కింద కరీంనగర్‌కు మొత్తం 840 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నామని.. కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌కు టెండర్లు.. యూసీఎఫ్ నుంచి మరో 80 కోట్లు.. కరీంనగర్ అభివృద్ధికి భారీ ప్రణాళిక..!3
- కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.1
- చెన్నూరు: చెత్త సేకరణలో వివక్ష.. ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తుడు చెన్నూరు మండలం అంగరాజుపల్లిలో చెత్త సేకరణ విషయంలో వివక్ష చూపుతున్నారని గ్రామానికి చెందిన తిరుపతి ఆరోపించారు. జనరల్ వార్డు కాలనీలో మాత్రమే చెత్త బండి ద్వారా వ్యర్థాలను సేకరిస్తున్నారని, ఇతర వార్డులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. గ్రామంలోని అన్ని వార్డుల్లోనూ క్రమం తప్పకుండా చెత్త సేకరణ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.1