Shuru
Apke Nagar Ki App…
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు.......... ఈ నెల 13న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న సీడ్ యాక్సిస్ రోడ్డు, ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి ఏర్పాట్లను అమరావతి డెవలప్‌మెంట్ చైర్మన్ లక్ష్మీ పార్థసారధి, కలెక్టర్ సాయి కాంత్ వర్మ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ వకుల్ జిందాల్‌ను ఆదేశించారు.
SIVA
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు.......... ఈ నెల 13న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న సీడ్ యాక్సిస్ రోడ్డు, ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి ఏర్పాట్లను అమరావతి డెవలప్‌మెంట్ చైర్మన్ లక్ష్మీ పార్థసారధి, కలెక్టర్ సాయి కాంత్ వర్మ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ వకుల్ జిందాల్‌ను ఆదేశించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు.......... ఈ నెల 13న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న సీడ్ యాక్సిస్ రోడ్డు, ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి ఏర్పాట్లను అమరావతి డెవలప్‌మెంట్ చైర్మన్ లక్ష్మీ పార్థసారధి, కలెక్టర్ సాయి కాంత్ వర్మ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ వకుల్ జిందాల్‌ను ఆదేశించారు.1
- వాకింగ్ ట్రాక్ లో కంటి పరీక్షలు కరోనా తరువాత ప్రజలకు ఆరోగ్యం పట్ల రోజురోజుకీ శ్రద్ధ పెరుగుతున్న క్షేమం తెలిసింది. దీన్ని ఆసరాగా తీసుకొని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఈరోజు గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ లో వాసం కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వాకర్స్ కు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా షుగర్ బీపీ చెక్ చేసి పలు సలహాలు ఇచ్చారు.1
- డీఎస్సీ ప్రక్రియలో పారదర్శక లోపించింది, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. వైసిపి ఇన్చార్జి మోహన్ డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు రేపల్లె పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి.ఈ సందర్భంగా రేపల్లె వైసీపీ ఇన్‌ఛార్జ్ పీటా నాగమోహన్ కృష్ణ మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, అర్హులైన ప్రతి అభ్యర్థికీ న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పట్టణంలోని ముఖ్య వీధుల గుండా సాగిన ఈ బైక్ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిమట బాలాజీ, చిత్రాల ఓబేదులతో పాటు పలువురు స్థానిక నేతలు, విభాగల అధ్యక్షులు, భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.3
- నవులూరి చెన్నారెడ్డి హత్య జీర్ణించుకోలేని ఘటన... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా మాచర్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా, తమ శ్రేయస్సు కోరుకునే కుటుంబ సభ్యుడిలా ఉన్న నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్య అత్యంత బాధాకరమని, ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. రెంటచింతలలో నిర్వహించాల్సిన రిలే నిరాహార దీక్షకు సంబంధించి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొట్టం బ్రహ్మారెడ్డితో కలిసి నవులూరి చెన్నారెడ్డి పోలీస్ స్టేషన్‌లో అనుమతి తీసుకుని, అక్కడి నుంచి రెంటాలకు వెళ్తున్న సమయంలో దారికాచి హత్య చేయడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ హత్యకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.నవులూరి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తమ కుటుంబంతో ఎంతోకాలంగా ఉన్న అనుబంధం, సన్నిహిత సంబంధాల కారణంగా బాధలో కొన్ని మాటలు మాట్లాడితే, వాటిని వక్రీకరించి కూటమి ప్రభుత్వం, వారికి అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా తమపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.ఇప్పటికే చెన్నారెడ్డి హత్య కేసులో అనుమానం ఉన్న నవులూరి అశోక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే మరో వ్యక్తి మోర్తాల ఉమామహేశ్వర్ రెడ్డిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీ నియమ నిబంధనలను అతిక్రమించి ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని హెచ్చరించారు.ప్రత్యర్థులు ధైర్యంగా ఎదురుగా వచ్చి రాజకీయాలు చేయాలని, సోషల్ మీడియా, ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. “మేము మా పార్టీ నాయకులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. అవసరమైతే వారికి రక్షణగా గుండె అడ్డేసి నిలబడతాం. మీలాగా తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని మేము చూడము” అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.నవులూరి చెన్నారెడ్డి హత్య కేసులో నిందితులను త్వరగా గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మరోసారి కోరారు.1
- ఎన్టీఆర్ జిల్లా వర్గంమృతి చెందిన కార్మికుడికి న్యాయం చేయాలి ఐ ఎఫ్ టి యు కార్యదర్శి కొప్పుల కుమార్ *అబ్బూరి రాంబాబు కుటుంబానికి న్యాయం చేయాలి* మూలపాడు గ్రామం దొనకొండ క్వారీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కోరి మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఉదయం నుండి ధర్నా కార్యక్రమం నిర్వహించగా ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు. జిల్లా ఉపాధ్యక్షులు. ఐ ఎఫ్ టి యు కార్యదర్శి కొప్పుల కుమార్ అబ్బూరి. రాంబాబు కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. నంబూరి రాంబాబుకి కుటుంబానికి కోరి ఓనరు నిర్లక్ష్యంగా ఉంటానా ఒక నిండు ప్రాణం బలైపోయింది ఆ కార్మికుడు కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు గ్రామస్తులు నిరసన తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే. రెవిన్యూ వారు లేబరే డిపార్ట్మెంట్ వారు కార్మిక శాఖ. అబ్బూరి. రాంబాబు .కార్మికుడు కుటుంబానికి తక్షణమే 10 లక్షలు ఎక్స్క్రిష్య ఇవ్వాలని. కోరి వానరు శివరామకృష్ణ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ. ఇట్లు ఐఎఫ్టియు యూనియన్ నాయకులు మునియప్ప. మండల నాయకులు. శ్రీనివాసరావు కార్మికులు.1
- గుంటూరు నగరంలో వైసీపీ భారీ ర్యాలీ..................... గుంటూరు శంకర్ విల్లాస్ నుంచి లాడ్జి సెంటర్ వరకు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. 'మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ' అని నినాదాలు చేస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, పానుగంటి చైతన్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- అందరికి నమస్కారం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ముఖ్య విజ్ఞప్తి... ది :10-08-2026 సాయంత్రం 4గంటలకు జి. కొండూరు గ్రామం బైపాస్ రోడ్ నుండి గ్రామంలో దివంగత రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వరకు ర్యాలీ జరుగును. యరమల నంద సాయి కిషోర్ రెడ్డి మైలవరం నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు1