logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తులు గొండ ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిని అనారోగ్యంతో మృతి తులు గొండ ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న లేలి చెల్లమ్మ అనారోగ్యంతో ఈరోజు మృతి చెందారు. సమాచారం ప్రకారం, చెల్లమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెల్లమ్మ మరణవార్త తెలిసిన వెంటనే సహోద్యోగులు, స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె సేవలను స్మరించుకుంటూ పలువురు సంతాపం తెలిపారు. అంత్యక్రియలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిసింది.

2 hrs ago
user_Sode Prasad
Sode Prasad
Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
d73dde98-686e-406a-8fce-a6bedf64c07e

తులు గొండ ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిని అనారోగ్యంతో మృతి తులు గొండ ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న లేలి చెల్లమ్మ అనారోగ్యంతో ఈరోజు మృతి చెందారు. సమాచారం ప్రకారం, చెల్లమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెల్లమ్మ మరణవార్త తెలిసిన వెంటనే సహోద్యోగులు, స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె సేవలను స్మరించుకుంటూ పలువురు సంతాపం తెలిపారు. అంత్యక్రియలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిసింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    1
    ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    1
    గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • దేశంలో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెంచాలనే ఉద్దేశ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఏదైతే గతంలో ఆమోదించబడిన బిల్లుకు సంబంధించి సెన్సెస్ కు సంబంధించి అమెండ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టడం అలాగే డీ లిమిటేషన్ కి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ రెండు ఆమోదం పొంది 2029 లోనే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి ఏదైతే స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితమైన మహిళకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి తద్వారా 272 మంది మహిళలకు పార్లమెంటులో స్థానం కల్పించాలి అనే ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ గారు నాంది పలకడం జరిగింది. కానీ దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ఆమోదం కాకుండా చేయాలని ప్రయత్నించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎంతో కాలంగా అందరూ కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయాల వల్ల ఇది సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. అనేకసార్లు ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విమర్శలు చేస్తూ ఇదేదో భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమంగా వారు మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1952 నుంచి అనేకసార్లు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా జరుగని నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. ఒక పౌరుడికి ఒకటే ఓటు కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి హయాంలో తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అబాస్యం చేశారో మనమే చూసాం. అదేవిధంగా శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని వారికి ఓటు హక్కు క్రియేట్ చేసి అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ప్రవర్తించారు. అటువంటి కార్యక్రమాలకు చోటు ఇవ్వకూడదు ఓటు హక్కు అనేదాన్ని వజ్రాయుధంగా మనం భావిస్తున్నామో ఆ వజ్రాయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సత్సంకల్పంతో ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం నిర్వహిస్తుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ ని సమర్థిస్తూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఇందులో భాగస్వామ్యులు కావాలని స్పష్టం చేసింది. SIR కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక భాగస్వామిగా ఉంది తప్పించి ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు అని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో కూడా ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయించుకోవాలి. రేపు ఆధార్ తో లింకు చేసేటప్పుడు ఈ సమగ్ర సమాచారం కావాల్సి ఉంటుంది. కాబట్టి అందరిని నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
    1
    దేశంలో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెంచాలనే ఉద్దేశ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఏదైతే గతంలో ఆమోదించబడిన బిల్లుకు సంబంధించి సెన్సెస్ కు సంబంధించి అమెండ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టడం అలాగే డీ లిమిటేషన్ కి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ రెండు ఆమోదం పొంది 2029 లోనే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి ఏదైతే స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితమైన మహిళకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి తద్వారా 272 మంది మహిళలకు పార్లమెంటులో స్థానం కల్పించాలి అనే ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ గారు నాంది పలకడం జరిగింది. 
కానీ దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ఆమోదం కాకుండా చేయాలని ప్రయత్నించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎంతో కాలంగా అందరూ కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయాల వల్ల ఇది సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 
అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. అనేకసార్లు ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విమర్శలు చేస్తూ ఇదేదో భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమంగా వారు మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1952 నుంచి అనేకసార్లు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా జరుగని నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. 
ఒక పౌరుడికి ఒకటే ఓటు  కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి హయాంలో తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అబాస్యం చేశారో మనమే చూసాం. అదేవిధంగా శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని వారికి ఓటు హక్కు క్రియేట్ చేసి అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ప్రవర్తించారు. అటువంటి కార్యక్రమాలకు చోటు ఇవ్వకూడదు ఓటు హక్కు అనేదాన్ని వజ్రాయుధంగా మనం భావిస్తున్నామో ఆ వజ్రాయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సత్సంకల్పంతో ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం నిర్వహిస్తుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ ని సమర్థిస్తూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఇందులో భాగస్వామ్యులు కావాలని స్పష్టం చేసింది. SIR కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక భాగస్వామిగా ఉంది తప్పించి ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు అని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో కూడా ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది 
ప్రజలందరూ కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయించుకోవాలి. రేపు ఆధార్ తో లింకు చేసేటప్పుడు ఈ సమగ్ర సమాచారం కావాల్సి ఉంటుంది. కాబట్టి అందరిని నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
    user_P. Ashok
    P. Ashok
    అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    32 min ago
  • రాయవరంలో ఘనంగా 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవం ​పిఠాపురం: రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించినప్పుడే భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి (జెడి) ఎన్. విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో నిర్వహించిన 'మంచి వ్యవసాయ పద్ధతులు' మరియు 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడి ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పంట కోతలకు ముందే పొలంలో నవధాన్యాలు లేదా పి.ఎం.డి.ఎస్ విత్తనాలు చల్లడం వల్ల భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని తెలిపారు. రాయవరంలో ఇప్పటికే 100 ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, హార్వెస్టర్ల ద్వారా కోత కోసే సమయంలో బ్లోయర్ వాడటం వల్ల ధాన్యంలో తేమ తగ్గి రైతులకు మంచి ధర లభిస్తుందని సూచించారు. 14 వారాల పొలంబడి శిక్షణలో నేర్చుకున్న అనుభవాలను రైతులు ఈ సందర్భంగా వివరించారు. సహజ కషాయాల వాడకంతో ఎకరానికి రూ.10,000 పెట్టుబడి తగ్గిందని రైతు కర్నీడి జగ్గారావు తెలిపారు. జీవామృతం,పి.ఎం.డి.ఎస్ పద్ధతుల వల్ల పంట బలంగా ఉండి తుపానులకు కూడా పడిపోలేదని రైతు పెదపూడి విష్ణు చక్రం వివరించారు. ​జిల్లేడు కషాయం,మట్టి ద్రావణం వంటి పద్ధతులతో దెబ్బతిన్న పంటను మళ్ళీ ఆరోగ్యవంతంగా మార్చి మంచి దిగుబడి సాధించానని కౌలు రైతు మాదేపల్లి సీతారాములు గర్వంగా చెప్పారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ స్వాతి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి రాయవరం గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఏవో గంగాధర్ 14 వారాల పొలంబడి ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    రాయవరంలో ఘనంగా 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవం
​పిఠాపురం: రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించినప్పుడే భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి (జెడి) ఎన్. విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో నిర్వహించిన 'మంచి వ్యవసాయ పద్ధతులు' మరియు 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడి  ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పంట కోతలకు ముందే పొలంలో నవధాన్యాలు లేదా పి.ఎం.డి.ఎస్  విత్తనాలు చల్లడం వల్ల భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని తెలిపారు. రాయవరంలో ఇప్పటికే 100 ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, హార్వెస్టర్ల ద్వారా కోత కోసే సమయంలో బ్లోయర్ వాడటం వల్ల ధాన్యంలో తేమ తగ్గి రైతులకు మంచి ధర లభిస్తుందని సూచించారు. 14 వారాల పొలంబడి శిక్షణలో నేర్చుకున్న అనుభవాలను రైతులు ఈ సందర్భంగా వివరించారు. సహజ కషాయాల వాడకంతో ఎకరానికి రూ.10,000 పెట్టుబడి తగ్గిందని రైతు కర్నీడి జగ్గారావు తెలిపారు.
జీవామృతం,పి.ఎం.డి.ఎస్ పద్ధతుల వల్ల పంట బలంగా ఉండి తుపానులకు కూడా పడిపోలేదని రైతు పెదపూడి విష్ణు చక్రం వివరించారు. ​జిల్లేడు కషాయం,మట్టి ద్రావణం వంటి పద్ధతులతో దెబ్బతిన్న పంటను మళ్ళీ ఆరోగ్యవంతంగా మార్చి మంచి దిగుబడి సాధించానని కౌలు రైతు మాదేపల్లి సీతారాములు గర్వంగా చెప్పారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ స్వాతి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి రాయవరం గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఏవో గంగాధర్ 14 వారాల పొలంబడి ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    23 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    19 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు
    1
    ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.