Shuru
Apke Nagar Ki App…
పింఛన్ కోసం వృద్ధురాలి వినతి – ప్రజావాణిలో ఆవేదన మెట్ పల్లి, మార్చి 30 :- పట్టణంలోని 2వ వార్డు గాజులపేటకు చెందిన పానుగంటి ఆశగంగు (87) వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులను ఆశ్రయించారు. వృద్ధాప్యంలో జీవనం సాగించడం కష్టంగా మారిందని, ఇప్పటివరకు పింఛన్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తగిన అర్హతలు, ఆధారాలు ఉన్నప్పటికీ పింఛన్ మంజూరు కాలేదని వాపోయారు. ఇప్పటికైనా తన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని వెంటనే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆమె కోరారు.ఈ మేరకు డిఆర్‌డీవో అధికారులు స్పందిస్తూ, సంబంధిత విభాగం ద్వారా విచారణ జరిపించి అర్హతలు పరిశీలించి వెంటనే పింఛన్ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Mahammad Vaseem
పింఛన్ కోసం వృద్ధురాలి వినతి – ప్రజావాణిలో ఆవేదన మెట్ పల్లి, మార్చి 30 :- పట్టణంలోని 2వ వార్డు గాజులపేటకు చెందిన పానుగంటి ఆశగంగు (87) వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులను ఆశ్రయించారు. వృద్ధాప్యంలో జీవనం సాగించడం కష్టంగా మారిందని, ఇప్పటివరకు పింఛన్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తగిన అర్హతలు, ఆధారాలు ఉన్నప్పటికీ పింఛన్ మంజూరు కాలేదని వాపోయారు. ఇప్పటికైనా తన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని వెంటనే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆమె కోరారు.ఈ మేరకు డిఆర్‌డీవో అధికారులు స్పందిస్తూ, సంబంధిత విభాగం ద్వారా విచారణ జరిపించి అర్హతలు పరిశీలించి వెంటనే పింఛన్ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- మెట్‌పల్లి మార్చి 30: పట్టణంలోని 26వ వార్డులో భద్రతను బలోపేతం చేసే దిశగా బీజేపీ 26వ వార్డు కౌన్సిలర్, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, సీఐ అనిల్, ఎస్సై కిరణ్, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన డీఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ, ఈ సీసీ కెమెరాలు ప్రజలకు అన్నివేళలా నిఘా నేత్రాలుగా పనిచేస్తాయని తెలిపారు. వీటి ద్వారా చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్, దొంగతనాల వంటి ఘటనలను త్వరగా గుర్తించి నిందితులను పట్టుకోవడం పోలీసులకు సులభమవుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్ల ఆనంద్, ధర్మపురి స్వరూప, వేణు, నాయకులు బొడ్ల రాహుల్, సుంకేటి విజయ్, సతీష్, బొడ్ల గౌతం, అజిత్, సంజీవ్, అంజయ్య, జెట్టి రూపేష్, శ్రీకాంత్, లత, లక్ష్మి, రాజు, భాయ్, హరితతో పాటు వార్డు ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.3
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మోస్తా నుండి భారీ వర్షం నమోదవుతుంది. సోమవారం సాయంత్రం మూడున్నర గంటలకు ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం జన్నారంతో పాటు పలు గ్రామాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడుతోంది. జన్నారం మండలంలో ప్రతిరోజు 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ రైతు కార్యదర్శి జంగం అంజయ్య విద్యుత్ షాక్ తో మృతి. వెంకట్రాయుని చెరువు సమీపంలో పంట పొలం వద్ద ఘటన.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3
- రాబోయే రోజుల్లో కరువు దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రాణహిత జలాలను సద్వినియోగం చేసుకునేలా కాలేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో పర్యటించిన జీవన్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో శ్రీ సీతారామ స్వామి వారి బ్రహ్మోత్సవములలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాలలో విద్యుత్ అర్టిసన్ కార్మికుల సమ్మెలో పాల్గొని సంఘిభావం తెలిపారు. సారంగాపూర్ లో మీడియాతో మాట్లాడుతూ సాగునీటి సౌకర్యం మెరుగుపర్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2004 లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎస్సారెస్పీ దిగువన కడెం ప్రాజెక్టు నీటిని నిలువరింప చేసే విధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబడడంతో పాటుగా తుమ్మడి హెట్టి నుండి ప్రాణహిత నది జలాలను పొందే విధంగా 152 మీటర్ లెవెల్ లో బ్యారేజ్ నిర్మాణం చేయాలనుకోవడం జరిగిందన్నారు. దానికి అనుగుణంగా కాలువలు కూడా తవ్వకం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి టిఆర్ఎస్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి 152 లెవెల్ మీటర్స్ తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణాన్ని 148 మీటర్స్ కుదించే విధంగా దానితో పాటుగా దిగువ 100 మీటర్ల లెవెల్ లో మేడిగడ్డ వద్ద దానికి ప్రతిగా ఇంకో బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని సంకల్పించి మేడిగడ్డ వద్ద కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగిందని తెలిపారు. దానికి అనుసంధానంగా అన్నారం, సుందిళ్ల వద్ద రెండు బ్యారేజీలు నిర్మించి ఎల్లంపల్లికి నీటిని తరలించే ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిన నేపథ్యంలో దానికి మరమ్మత్తులు చేసేందుకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం, తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి తగిన ప్రణాళిక రూపొందించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందని విమర్శించారు. తుమ్మడిహేట్టి ప్రాణహిత నది జలాల కొరకు 52 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి, కొడంగల్ ఇరిగేషన్ కు 1100 కోట్లు కెటాయించడంతో ఉత్తర తెలంగాణ ప్రాంతం పట్ల వివక్షత చూపడం కాదా అని ప్రశ్నించారు.3
- Post by Munna Khan1
- తెలంగాణ అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్యారాక్విట్ గడ్డి మందు నిషేధంపై మాట్లాడారు. ఈ మందు అత్యంత విషపూరితమైందని, రైతులు పత్తి చేనుల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారని తెలిపారు. ప్యారాక్విట్ వాడకం వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. దీనికి బదులుగా బ్రష్ కట్టింగ్ వంటి పరికరాలను ఉపయోగించాలని సూచించారు.1
- మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్న మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అధికారుల తీరును కౌన్సిలర్ ఆంజనేయులు విమర్శించారు ఈ సమావేశంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ డి ఈ మహేష్ ఏఈ అధికారులుకౌషన్సిలర్లు తధితరులు పాల్గొన్నారు1
- రోడ్డు మధ్యలో గ్యాప్ రావడంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ముల్కలగూడా రోడ్డులో మధ్యలోని సిమెంటు రోడ్డుకు గ్యాప్ రావడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన రోడ్డు మధ్యలో గ్యాప్ రావడంతో వాహనాలు అదుపుతప్పి ప్రజలు పడిపోతున్నారు. దీంతో అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఏర్పడిన గ్యాప్ ను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.1