దక్షిణ భారత కరాటే పోటీల్లో ధర్మవరం సత్తా – 20 పతకాలు సాధించిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన ధర్మవరం క్రీడాకారులకు – మంత్రి ఆదేశాలతో సత్కారం పత్రికా ప్రకటన దక్షిణ భారత కరాటే పోటీల్లో ధర్మవరం సత్తా – 20 పతకాలు సాధించిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన ధర్మవరం క్రీడాకారులకు – మంత్రి ఆదేశాలతో సత్కారం సిరిపి వెంకటేష్ కరాటే అకాడమీ ఘనవిజయం – క్రీడాకారులకు హరీష్ బాబు సత్కారం ధర్మవరం, ఏప్రిల్ 02:– ధర్మవరం నియోజకవర్గంలో క్రీడలకు ప్రోత్సాహం అందిస్తూ యువతను ముందుకు నడిపించే దిశగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మార్గదర్శకత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఇటీవల అనంతపురంలో నిర్వహించిన దక్షిణ భారత స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ – 2026లో సిరిపి వెంకటేష్ కరాటే అకాడమీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 20 పతకాలు సాధించి ధర్మవరం ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలలో అకాడమీ విద్యార్థులు 6 బంగారు, 8 వెండి, 6 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. బంగారు పతకాలు సాధించిన వేదశ్రీ, బి. హేమంత్, పునీత్, ప్రణవి, శశాంక్, లోకేశ్ తమ ప్రతిభతో ప్రథమ స్థానాల్లో నిలిచారు. లాస్య, వేదశ్రీ, సోను, వరుణ్, ఉజ్వల్, కుశాల్, వంశీకృష్ణ, చందన వెండి పతకాలను సాధించగా, ఆదిత్య, వంశీకృష్ణ, భరత్, బాంధవ్య, మోక్ష ప్రియ, బి. హేమంత్ కుమార్ కాంస్య పతకాలను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ఆయన నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, విజయం సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ వారిని ప్రత్యేకంగా సత్కరించారు. క్రీడాకారులకు ప్రోత్సాహంగా బుక్స్, పెన్స్, పెన్సిల్స్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ... క్రీడలు విద్యార్థులలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం ఎంతో ఆనందకరమని పేర్కొన్నారు. ఇలాంటి విజయాలు మరింత మంది యువతను క్రీడల వైపు ఆకర్షించేలా చేస్తాయని అన్నారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

- ఆకలి కడుపులు నింపుటకై పెట్టిన కార్యక్రమం అన్న క్యాంటీన్. దయచేసి ఒక టోకెన్ మాత్రమే తీసుకోవాలి అని మనవి.మీ వెనకాల ఉన్న పేద వాడి కడుపు కూడా నిండాలి అంటే ..1
- కదిరి మండల పరిధిలోని ముత్యాల చెరువు గ్రామంలో శుక్రవారం మన ఊరు మన నీరు మన అందరి బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సాగునీటి చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సీనియర్ టిడిపి నాయకుడు న్యాయవాది వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఓటమి నాయకులు పాల్గొన్నారు.1
- కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల బైక్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో కళ్యాణదుర్గం టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీ సర్కిల్లో బాణసంచా పేల్చి, సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మోరేపల్లి మల్లికార్జున, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని రథోత్సవం పై కొలువు తీర్చి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మడుగుతేరు కార్యక్రమం నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రథోత్సవ వేడుకల్లో పాల్గొని రథాన్నిలాగి మొక్కలు తీర్చుకున్నారు.1
- వైరల్: కారు ఢీకొనడంతో మహిళ గాలిలోకి విసిరివేయబడింది *రోడ్డు దాటేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన తెలియజేస్తుంది. కర్ణాటకలోని బంట్వాల్‌లో భారతి(48) అనే యువతి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. మధ్యలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనం వేగాన్ని అంచనా వేయకుండా ముందుకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఆమెను బలంగా ఢీకొట్టడంతో గాలిలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన భారతిని ఆస్పత్రికి తరలించారు. గత నెల 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.*1
- బద్వేలు:రాజధాని అమరావతి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో రాజధానిపై కమ్ముకున్న అనిశ్చితి, చీకట్లు పూర్తిగా తొలగిపోయాయని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు నిర్వహించారు. అమరావతికి వెలుగులు వచ్చినట్లుగా సంకేతంగా దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు., “ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఇక శాశ్వత రాజధానిగా నిలవనుంది” అని అన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు తమ సొంత భూములను త్యాగంగా సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ కాలంలో రాజధాని అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆ పరిస్థితులను అర్థం చేసుకుని తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇకపై ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా అమరావతిని ఎవరూ కదిలించలేరని, ఇది రాష్ట్ర ప్రజల సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తరఫున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,చెరుకూరి రవికుమార్, పరిటాల వెంకట సుబ్బయ్య,బీరం జయ రామి రెడ్డి, పాలకొండు రాజశేఖర్ రెడ్డి,గాజులపల్లె శంకర్ రెడ్డి కొంకుల రాంబాబు, కల్వపల్లె వీర రెడ్డి, జహంగీర్ భాష,బోవిళ్ళ నరసింహ రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి, పఠాన్ మౌలాలి, రసూల్, ఉపత్తి సుబ్బారెడ్డి,గోపి రెడ్డి, సుబ్బా రాయుడు,రాము,గురు ప్రసాద్ రెడ్డి,కోటపాటి పెంచలయ్య,చిన్నప్ప రెడ్డి, గంగాధర్ రెడ్డి, వెంకటేష్ తదితరు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఎమ్మిగనూరు నుండి ముఖ్య వార్త… అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక ఘట్టంగా మారడంతో ఎమ్మిగనూరులో ఘనంగా సంబరాలు నిర్వహించారు. రైతుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలు ఈ విజయాన్ని పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.1
- గాండ్లపెంట మండలo క ఠారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించి, ముగింపుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి ఉత్సవాలు ముగింపు కావడంతో యోగివేమన గొడుగుకి వేమన పీఠాధిపతులు నందవేమారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలు చేశారు. వేమన సమాధిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన నందవేమారెడ్డికి భక్తులు ప్రశంసిస్తున్నారు.1