Shuru
Apke Nagar Ki App…
Ali ammu
More news from తెలంగాణ and nearby areas
- ఉప్పల్ రామంతపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. 2 నుండి 5వ తరగతి విద్యార్థులకు నాలుగు సంవత్సరాలలో 140 శాతం, 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు 84 శాతం ఫీజులు పెంచారని తల్లిదండ్రులు ఆరోపించారు. పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, స్కూల్ గేటు ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ బయటకు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరారు.1
- దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భోజనం విరమణ సమయంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. జిల్లా చైర్మన్ జావిద్ అని మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సి వెంటనే ప్రకటించాలని కోరారు. సమస్యలు పరిష్కరించుకుంటే మే ఐదవ తేదీన కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు.1
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మా ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఆలయ పూజారులు అమ్మవారికి మంజీరా నది జలాలతో అభిషేకంపట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు కుంకుమార్చన సహస్రనామార్చన పుష్పార్చన నిమ్మకాయల హారంతో ప్రత్యేక పూజలు అనంతరం మంగళహారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు దివ్యదర్శన భాగ్యం కలిగించారు.ఆలయ ఈవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారుకోరికలుతీరినభక్తులు అమ్మవారికి కొంతమంది బోనాలు సమర్పించగా మరి కొంతమంది ఓడిబియాలను సమర్పించారు మరి కొంతమంది తలనీలాలు సమర్పించారు.1
- ఎంపీ కడియం కావ్యగారు మాట్లాడుతూ ఉమెన్ రిజర్వేషన్ గత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది 2004లో కూడా అమలు చేయాలని నరేంద్ర మోడీని ప్రశ్నించడం జరిగింది1
- ఓం శ్రీమాత్రే నమః శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమః జై వారాహి జై జై వారాహి దుర్గ భవాని దుర్గమ్మ జై జై 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹1
- నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుభాష్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ గత కొన్ని నెలలుగా పని చేయడం లేదు. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారుల వెంటనే స్పందించి సిగ్నల్స్ మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- 15 ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలి కలెక్టర్ ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరించాలి. సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో గ్రామాలలో డ్రింకింగ్ వాటర్ సమస్యలను నిర్మూలించాలి ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సమన్వయంతో గ్రామంలో సుపరిపాలన అందించాలి. 15వ ఆర్థిక సంఘం విధుల వినియోగంపై సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు వర్క్ షాప్ నిర్వహణ గ్రామాల్లో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని.ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరిం. చాలని. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సర్పంచులు ,పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లకు 15 ఆర్ధిక సంఘం నిధుల వినియోగం పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో 15 వ ఆర్ధిక సంఘం నిధులు సక్రమంగా వినియోగించి గ్రామా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు. జిల్లాలోని గ్రామపంచాయతీలు మోడల్ గా తీర్చిదిద్దాలని, గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు, అంగన్వాడీ బిల్డింగ్స్, జిపి బిల్డింగ్స్ లేని గ్రామాలకు నూతన బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రత్యేక అధికారి, పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్ సమన్వయంతో గ్రామ పంచాయతీలో పనులు సవ్యంగా నడవాలన్నారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని 15 ఆర్ధిక సంఘం నిధులను అన్ని గ్రామాలకు ప్రభుత్వం అందించిందని ,వాటితో గ్రామాల్లో సమస్యలు లేకుండా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలన్నారు. నిధుల వినియోగం లో అక్రమాలకు తావులేదన్నారు. నిధులు సక్రమంగా వినియోగించక పోతే ,అక్రమాలు జరిగితే సర్పంచ్ , కార్యదర్శుల పై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. గ్రామాల్లో త్రాగు నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఈ.ఈ మిషన్ భగీరథ ఇంట్రా సంపత్ కుమార్, గ్రిడ్ డి.ఈ నాగభూషణం, డిఎల్పిఓలుసాయి బాబు, తిరుపతి రెడ్డి ,అధికారులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నల బొగుడ గేటు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ప్రయాణిస్తున్న వాహనం మరో వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో వాహనం పూర్తిగా దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3
- కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి రోడ్‌లో సెంట్రల్ లైటింగ్ విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో చీకటి కారణంగా ప్రమాదాల భయం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి సెంట్రల్ లైటింగ్ బల్బులు అమర్చాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.1