Shuru
Apke Nagar Ki App…
Bondhu Suresh
More news from Sri Sathya Sai and nearby areas
- Post by N Nagaraju2
- కాకినాడరెడ్ క్రాస్ సమీపంలో ఓ వ్యక్తినీ గొంతు కోసిన దుండగులు కాకినాడ సిటీ గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ ఘటనకు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు..రెడ్ క్రాస్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది.బాధితుడు రోడ్డుపై నడుస్తు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా దాడితో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు..ఘటన ప్రాంతం,పరిసర ప్రాంతాల పరిస్థితులను క్లూస్ టీం పోలీసులు పరిశీలిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితులు కదలికలపై ఆరా తీస్తున్నారు.ఈ ఘటన పాత కక్షలా లేక వ్యక్తిగత కక్షల అనేదానిపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు..మృతుడు జి నాగేశ్వరరావు, 46 ఏళ్ల ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా గుర్తించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...3
- పోలీసులు పై ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ సీరియస్.. డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని మాధవ్ డిమాండ్ కడపలో ఒక సెంటర్ పేరు మార్పు వ్యవహారం లో బిజెపి నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బిజెపి జిల్లా అధ్యక్షుడు పై చేయి చేసుకున్న డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అరాచక శక్తులు జోలికి పోకుండా కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే పోలీసులు ఈ విధంగా దాడులకు దిగుతారా అంటూ మాధవ్ పోలీసులు తీరుపై మండి పడ్డారు. డిఎస్పీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నామని హెచ్చరించారు. ఈమేరకు పోలీసులు చేయిచేసుకున్న వీడియోను మీడియాకు విడుదల చేశారు.1
- నంద్యాల జిల్లా వీపనగండ్లలో కురిసిన మోస్తరు వర్షం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, గ్రామంలోని రహదారులు బురదమయంగా మారడంతోపాటు పొగాకు రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.1
- నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో రూ.4.89 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పార్లమెంట్ ఇన్‌ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రారంభించారు. కొత్త సబ్‌స్టేషన్, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులతో గ్రామం రూపురేఖలు మారాయి. ఐకేపీ రుణాలతో భూమి కొనుగోలు చేసిన 81 మందికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమి పట్టాలు అందజేశారు.1
- చిత్తూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో తమిళనాడు సీఎం, సినీ నటి త్రిష కుటుంబంతో సమావేశమయ్యారు. ఈ ఆకస్మిక భేటీ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.1
- కూటమి ప్రభుత్వం తప్పుల్ని వైయస్ఆర్ సీపీ ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా కొల్లు రవీంద్ర మూడు సూత్రాలను ఫాలో అవుతున్నాడు బురద చల్లడం.. ఎదురుదా*డి చేయడం.. పచ్చి అబద్ధాలు చెప్పడం చేస్తున్నాడు అడిగిన దానికి సమాధానం లేనప్పుడే ఇలా చేస్తారు -కొండా రాజీవ్ గాంధీ గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి1
- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ 2027 రాజమండ్రి పుష్కరాల ముహూర్తాన్ని పంచాంగం బదులు ఆగమ శాస్త్రం ప్రకారం మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పవిత్ర గోదావరి జల ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని, ఏర్పాట్లను సీతానగరం నుండి అంతర్వేది వరకు విస్తరించాలని ఆయన సూచించారు.1
- ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. జగన్‌ను విమర్శించడం, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని, పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.1