Shuru
Apke Nagar Ki App…
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సోమవారం భారీ వాహనం ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని మలుపు వద్ద వాహనం ఆగిపోవడంతో ట్రాఫిక్‌కు పెద్ద ఎత్తున అంతరాయం కలిగింది. హనుమకొండ - కరీంనగర్ జాతీయ రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ఘటన వల్ల ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు గంటల తరబడి రహదారిపైనే నిలిచిపోయాయి. ఈ పరిస్థితిపై స్పందించిన పోలీసులు, రహదారులపై వాహనాలను ఎక్కువసేపు నిలపవద్దని, ముఖ్యంగా మూల మలుపుల వద్ద వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Mahesh Chary
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సోమవారం భారీ వాహనం ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని మలుపు వద్ద వాహనం ఆగిపోవడంతో ట్రాఫిక్‌కు పెద్ద ఎత్తున అంతరాయం కలిగింది. హనుమకొండ - కరీంనగర్ జాతీయ రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ఘటన వల్ల ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు గంటల తరబడి రహదారిపైనే నిలిచిపోయాయి. ఈ పరిస్థితిపై స్పందించిన పోలీసులు, రహదారులపై వాహనాలను ఎక్కువసేపు నిలపవద్దని, ముఖ్యంగా మూల మలుపుల వద్ద వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
More news from Siddipet and nearby areas
- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సోమవారం భారీ వాహనం ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని మలుపు వద్ద వాహనం ఆగిపోవడంతో ట్రాఫిక్‌కు పెద్ద ఎత్తున అంతరాయం కలిగింది. హనుమకొండ - కరీంనగర్ జాతీయ రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ఘటన వల్ల ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు గంటల తరబడి రహదారిపైనే నిలిచిపోయాయి. ఈ పరిస్థితిపై స్పందించిన పోలీసులు, రహదారులపై వాహనాలను ఎక్కువసేపు నిలపవద్దని, ముఖ్యంగా మూల మలుపుల వద్ద వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు.1
- యువతి వివాహాన్ని అడ్డుకోవాలనే దురుద్దేశంతో వాల్ పోస్టర్లు ముద్రించి ప్రచారం చేసిన ఆరుగురు నిందితులను సిద్దిపేట పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట ఏసిపి రవీందర్ సమక్షంలో ఈ అరెస్టు వివరాలను వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో పెద్దగుండవెళ్లికి చెందిన దొడ్ల వెంకటేష్, గుర్రాలగొందికి చెందిన వన్నెల అశ్విత్ కుమార్ అలియాస్ బన్నీ, బక్రిచెప్యాలకు చెందిన బండి భాను ప్రసాద్ అలియాస్ దినేష్ మరియు అతని భార్య రేఖ, రామంచకు చెందిన బురుజుకింది ఈశ్వర్, సిద్దిపేటకు చెందిన రాజబోయిన నవీన్ కుమార్ ఉన్నారు. వీరి నుంచి పోలీసులు కారు, మొబైల్ ఫోన్లు మరియు వాల్ పోస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన దొడ్ల వెంకటేష్, సిద్దిపేట జిల్లాకు చెందిన యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నానని వేధించాడు. ఆమెకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో, దానిని అడ్డుకోవాలని కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. యువతి పరువుకు భంగం కలిగించేలా అభ్యంతరకరమైన పోస్టర్లను తయారు చేయించి, వాటిని తంగళ్ళపల్లి మరియు యువతి స్వగ్రామంలో అతికించినట్లు నిందితుడు అంగీకరించాడు. యువతి కుటుంబ సభ్యులు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏసిపి రవీందర్ హెచ్చరించారు. అభ్యంతరకర పోస్టర్లను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులపై మరియు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై కూడా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మహిళలు ఎటువంటి సమస్య ఎదురైనా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని ఆయన సూచించారు.4
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కళ్లేపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బాలవికాస్ సంస్థ మరియు సన్‌రైజ్ హాస్పిటల్ సంయుక్తంగా ఒక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఈ శిబిరంలో గ్రామస్తులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు జరిపి, రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలను గుర్తించారు. వైద్యులు తగిన సలహాలు, చికిత్స సూచనలు అందించడంతో పాటు, అవసరమైన వారికి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిగుల్లా మోహన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శేషి వినీత్, డాక్టర్ రమణి, డాక్టర్ వినయ్, వార్డు సభ్యులు మంకాళి మోహన్, ఒగ్గు కానుకయ్య, సన్‌రైజ్ హాస్పిటల్ క్యాంపు మేనేజర్ కొత్తూరి రాజేందర్, బాలవికాస్ ప్రతినిధులు అన్నమేరి, సుజాత, సన్‌రైజ్ బృందం సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.2
- కరీంనగర్ నగరంలోని ఓ బేకరీలో పుట్టినరోజు వేడుకల కోసం ఆర్డర్ చేసిన కేకులో ఫంగస్ రావడంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కేకును కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత సంతోషంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకున్న బాధితుడు, కేకును కట్ చేయగానే అందులో ఫంగస్ ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. అప్పటికే కొంతమంది చిన్నారులు ఆ పాడైపోయిన కేకును తిన్నారని బాధితుడు వాపోయాడు. ఈ ఫంగస్ విషయంపై సదరు బేకరీ సిబ్బందిని ప్రశ్నించగా, వారు కేవలం “సారీ” చెప్పి, తమ తప్పైందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి బేకరీలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.4
- మంత్రి కొండ సురేఖ కడియం శ్రీహరి రాజకీయ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు, తాము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి గనుక నిజంగా విలువలు తెలిసిన వ్యక్తి అయితే, తన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకవైపు తన కుమారుడిని కాంగ్రెస్ కండువా కప్పించి కాంగ్రెస్ ఎంపీగా గెలిపించుకుంటూ, తాను మాత్రం బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగడం రాజకీయ విలువలు లేకపోవడాన్ని సూచిస్తుందని కొండ సురేఖ మండిపడ్డారు. ఎదురుదాడి చేయడం కాదని, రాజకీయాలలో విలువలు అత్యంత ముఖ్యమని ఆమె పునరుద్ఘాటించారు.1
- కామారెడ్డిలో యూనియన్ బ్యాంక్ అధికారుల తీరుపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా తమ పనులు జరగకపోవడంతో వినియోగదారుల సహనం నశించి, ఈరోజు బ్యాంక్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అత్యంత కీలకమైన సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వేస్తున్న వడ్ల పైసలు (ధాన్యం డబ్బులు) ఖాతాల్లో జమ అయినా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు రైతు రుణాలు, పంట రుణాలు సకాలంలో అందడం లేదు. యూనియన్ బ్యాంక్‌ను నమ్ముకుంటే అడుగడుగునా కష్టాలే మిగులుతున్నాయని, గంటల తరబడి లైన్లలో నిలబడినా 'సర్వర్ లేదు', 'లింక్ లేదు' అంటూ సాకులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. 'మాకు ఈ బ్యాంక్ వద్దు.. మా ఊరికి వెంటనే మరో బ్యాంక్ కావాలి' అంటూ ఆవేదనతో నినదించారు. బ్యాంక్ వద్ద ఉద్రిక్తత నెలకొందన్న సమాచారం అందుకున్న వెంటనే స్థానిక మాజీ ఎంపీటీసీ నీరజ గారి భర్త సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చెందుతున్న ప్రజలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన, యూనియన్ బ్యాంక్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను గమనించిన ఆయన, వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఇక్కడి ప్రజల అవస్థలను, రైతుల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, కేవలం ఒకే బ్యాంక్ ఉండటం వల్ల పని భారం పెరిగి సేవలు అందడం లేదని వివరించారు. ఈ ప్రాంతంలో జనాభా పెరిగిందని, దానికితోడు రైతులకు సంబంధించిన లావాదేవీలు కోట్లలో జరుగుతున్నాయని, వేలాది మంది ఒకే బ్యాంక్‌పై ఆధారపడటం వల్ల ప్రతిరోజూ నరకం చూస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నూతన శాఖను ఏర్పాటు చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. బీబీపేట్ మండల కేంద్రంలో ఎస్‌బీఐ (SBI) నూతన బ్రాంచ్‌ను ఏర్పాటు చేసేందుకు తక్షణమే సర్వే నిర్వహించి, అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అధికారులు ఇప్పటికైనా స్పందించి కొత్త బ్యాంక్‌ను ఏర్పాటు చేయకపోతే, రాబోయే రోజుల్లో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు కళ్లు తెరిచి ఎస్‌బీఐ బ్యాంక్ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు రోజులుగా తిరిగినా పనులు కాని యూనియన్ బ్యాంక్ ప్రజల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.1
- కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రైవేటు విద్యాసంస్థలను రద్దు చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కంకం కుమారస్వామి మాట్లాడుతూ, వచ్చేనెల 10వ తేదీన ప్రైవేటు విద్యా బాధితుల భారీ నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ నిరసన ప్రదర్శన అంబేద్కర్ స్టేడియం నుండి ప్రారంభమై కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, ప్రైవేటు విద్యా బాధితుల తల్లిదండ్రులు, అనేక వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రైవేటు విద్యావిధానాన్ని రద్దు చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థలను ప్రభుత్వం అండర్‌టేకింగ్ చేసుకొని ఆధీనంలో నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్న సిబ్బందిని ప్రభుత్వ అండర్‌టేకింగ్ ఉద్యోగులుగా గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే తెలంగాణ ఉద్యమకారుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో తక్షణమే ఉచిత విద్యను అందించాలని లేదా 50% రాయితీతో కూడిన ఫీజులు మాత్రమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఆంధ్ర ఉపాధ్యాయులు, లెక్చరర్లకు అవకాశాలు కల్పించకూడదని, తెలంగాణ బిడ్డలకు, నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు విద్యకు ప్రాధాన్యతనిస్తూ, ప్రైవేటు వ్యవస్థ రద్దు చేసి, ఉచిత ప్రభుత్వ విద్యను ప్రవేశపెడతామని తమ మేనిఫెస్టోలో మొదటి అంశంగా పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు గరిక కోటేశ్వర్, టౌన్ అధ్యక్షులు గాలి రమేష్ యాదవ్, కనకం నరసయ్య, ఉత్తర తెలంగాణ మహిళా అధ్యక్షురాలు కార్పాకల మున్నా, సిరిసెట్టి భాగ్యలక్ష్మి, తునికి వనజ, పెద్దపల్లి భారతక్క, ఆవారు లత, బాలామణి, కోమల, సత్యలక్ష్మి, గౌరీ, విజయ, రాజమ్మ, సుజాత రెడ్డి, సత్యవతి, దేవేంద్ర రెడ్డి, షబ్బీర్, అసీం ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.1
- హుస్నాబాద్ నియోజకవర్గం, హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఉన్న కరీంనగర్ - హనుమకొండ జాతీయ రహదారిపై డివైడర్లు ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు మరమ్మత్తు పనులను ప్రారంభించారు. ఈ రహదారి మార్గం గుండా ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే, రహదారి మధ్యలో డివైడర్లు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు, ప్రమాదాల నివారణే లక్ష్యంగా డివైడర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల దృష్ట్యా వాహనదారులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, వేగంగా వాహనాలను నడపవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.1