logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉపాధి హామీని పాత విధానంలోనే కొనసాగించాలి కూలీలకు సకాలంలో వేతనాలు, పనిముట్లు, సౌకర్యాలు కల్పించాలి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానం గిరిజన ప్రాంతాల్లో కూలీలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మారుమూల గిరిజన గ్రామాల్లో సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో కూలీలు హాజరు నమోదు చేయలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. రోజుకు రెండు సార్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సిన నిబంధన కూలీలకు భారంగా మారిందని, నెట్‌వర్క్ సమస్యల కారణంగా ఫోటోలు అప్లోడ్ కాకపోవడం వల్ల పనికి వచ్చినా హాజరు నమోదు కాకపోవడం జరుగుతోందని వివరించారు. దీంతో కూలీలు తమ వేతనాలు కోల్పోతామేమోనన్న ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా ఎండ తీవ్రత మధ్య ఈ ప్రక్రియ మరింత కష్టతరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని రద్దు చేసి, పాత హాజరు విధానాన్ని కొనసాగించాలని ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల వాస్తవ పరిస్థితులను గుర్తించి, సాంకేతిక సమస్యలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడంతో పాటు, పని ప్రదేశాల్లో అవసరమైన పనిముట్లు, తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కూలీల దినసరి వేతనాన్ని రూ.600కు పెంచాలని, మేట్లకు కూడా జీతాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు కోరారు.

2 hrs ago
user_Nava surya
Nava surya
జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
8e31b9ac-f1a4-4a4a-8e35-857454298d8e

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • హుకుంపేట మండలం గడుగుపల్లి–కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న పాల వ్యాన్ డ్రైవర్‌కు నిద్ర రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వ్యాన్ కింద డ్రైవర్ చేయి ఇరుక్కుపోవడంతో విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పైకి లేపి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    హుకుంపేట మండలం గడుగుపల్లి–కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న పాల వ్యాన్ డ్రైవర్‌కు నిద్ర రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
వ్యాన్ కింద డ్రైవర్ చేయి ఇరుక్కుపోవడంతో విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పైకి లేపి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • పాలకొండ-రాజాం ప్రధాన రహదారిపై యాక్సిడెంట్
    1
    పాలకొండ-రాజాం ప్రధాన రహదారిపై యాక్సిడెంట్
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    1
    ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    1
    గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి గ్రామంలో ఉన్న అంగన్ వాడి శుక్రవారం ఉచి తహోమియో వైద్యశిబిరం నిర్వహించారు. తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారినీ డాక్టర్ ఎస్. ఉమాగౌరీ చిన్న పిల్లలకు, బాలింతలకు, సాధారణ నొప్పులకు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్య శాల ఫార్మసిస్ట్ దివ్య రెడ్డి, అంగన్ వాడి బి. పద్మ ఉన్నారు.
    3
    పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి గ్రామంలో ఉన్న అంగన్ వాడి శుక్రవారం ఉచి తహోమియో వైద్యశిబిరం నిర్వహించారు. తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారినీ డాక్టర్ ఎస్. ఉమాగౌరీ చిన్న పిల్లలకు, బాలింతలకు, సాధారణ నొప్పులకు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్య శాల ఫార్మసిస్ట్ దివ్య రెడ్డి, అంగన్ వాడి బి. పద్మ ఉన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.