Shuru
Apke Nagar Ki App…
Ravi Poreddy
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తమకు నెలకు 26 వేల గౌరవ వేతనం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జి.ఓ. విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నిరసనకు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలపడం గమనార్హం. ఆశా వర్కర్లు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తగిన పారితోషికం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.1
- బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిలో పనిచేస్తున్న సింగరేణి లారీ డ్రైవర్లు, క్లీనర్లు AITUC ఆధ్వర్యంలో నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. డ్రైవర్లకు రూ.34,000, క్లీనర్లకు రూ.21,000 వేతనం, అలాగే EPF, ESI, బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని AITUC బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ హెచ్చరించారు. కార్యక్రమంలో డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు.1
- జన్నారం మండలంలోని రాయికుంట గ్రామంలో పాడైన బోర్లకు అధికారులు మరమ్మతులు చేయించాలని సిపిఎం జన్నారం మండల కార్యదర్శి లింగన్న డిమాండ్ చేశారు. మంగళవారం రాయికుంట గ్రామంలో సిపిఎం ప్రతినిధి బృందం పర్యటించింది. ఈ సందర్భంగా సమస్యలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో బోర్లు పాలు కావడంతో ప్రజలు నీటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ఇందిరమ్మ ఇళ్ళకు నీరు పట్టడం కష్టంగా ఉందన్నారు. వెంటనే పాడైన బోర్లకు మరమ్మతులు చేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.1
- ప్రభుత్వాలు 'స్వచ్ఛ భారత్' అంటూ కోట్లు ఖర్చు చేస్తున్నాయి.. కానీ మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో మాత్రం పరిస్థితి చూస్తే 'అధ్వాన్నం' అనే మాట కూడా చిన్నబోతుంది. 29 గ్రామాల ప్రజలకు కూడలిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక్క పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం సిగ్గుచేటు. ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమేనా? ప్రజల కనీస అవసరాలు అధికారుల కంటికి ఆనడం లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల 'భూమి' నాటకం.. బయటపెట్టిన జితేందర్! ఇటీవల జిల్లా స్థాయి ప్రజావాణిలో సామాజిక కార్యకర్త తుడుం జితేందర్ ఈ సమస్యను కలెక్టర్ కుమార్ దీపక్ ముందు ఉంచినప్పుడు అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. సాకు: "సార్.. జన్నారంలో మరుగుదొడ్లు కట్టడానికి ప్రభుత్వ భూమి లేదు" అని అధికారులు కలెక్టర్ ముందు బుకాయించే ప్రయత్నం చేశారు. వాస్తవం: బస్టాండ్ దగ్గర ఇరిగేషన్ భూమి ఉండగా, కవ్వాల్ పాయింట్ వద్ద బావి సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ప్రశ్న: ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఆక్రమించుకుని పట్టాలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకున్న అధికారులు, ప్రజల అవసరాల కోసం ఒక్క గుంట భూమిని కూడా చూపలేకపోవడం వెనుక మతలబు ఏమిటి? అని జితేందర్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నమలాల్సి వచ్చింది. మంగళవారం 'మంట'.. మహిళల 'గోస' ప్రతి మంగళవారం జరిగే వారపు సంత రోజున జన్నారం ఒక నరకప్రాయమైన ప్రాంతంగా మారుతోంది. వ్యాపారుల ఆవేదన: ఉదయాన్నే అడవి నుంచి, తండాల నుంచి కూరగాయలు తెచ్చే మహిళా వ్యాపారులు సాయంత్రం వరకు మలమూత్ర విసర్జన ఆపుకోలేక పడుతున్న బాధలు వర్ణనాతీతం. విద్యార్థినుల ఇబ్బందులు: కళాశాలలు, పాఠశాలలకు వచ్చే విద్యార్థినులు అత్యవసర సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య ముప్పు: గత్యంతరం లేక రోడ్ల పక్కనే వెళ్లాల్సి రావడంతో అటు పారిశుద్ధ్యం క్షీణించి, రోగాలకు నిలయంగా మారుతోంది. కలెక్టర్ ‘డెడ్ లైన్’.. అమలు జరిగేనా? ప్రజల గోసను అర్థం చేసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్, వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించాలని, తక్షణమే మూడు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల తర్వాత కూడా అధికారులు 'ఫైళ్ల' మీద కాలక్షేపం చేస్తారా? లేక యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెడతారా? అని జన్నారం ప్రజలు ఎదురుచూస్తున్నారు. "ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడలేని అధికారులు, కనీసం ప్రజల ప్రాథమిక అవసరాల కోసం కేటాయించలేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి."1
- वांकिडी केंद्र में आज (मार्च 16, 2026) हुई इस घटना का विवरण इस प्रकार है: *शॉर्ट सर्किट से दुर्घटना*: मंडल केंद्र में यात्रा कर रही एक पल्सर बाइक में शॉर्ट सर्किट के कारण अचानक आग लग गई। *बेपरवाह मोटर चालक*: मोटर चालक ने बाइक से धुआं निकलते देखा और तुरंत उसे सचेत किया और गाड़ी को किनारे पर रोक दिया और बिना किसी खतरे के नीचे उतर गया। जिंदगी. नहीं मिला। *पूरी तरह जला हुआ वाहन:*देखते-देखते आग तेजी से फैल गई और बाइक पूरी तरह जल गई। *बड़ा हादसा होने से बच गया:*हालाँकि यह घटना हमेशा व्यस्त रहने वाले मंडल केंद्र के मुख्य मार्ग पर हुई, लेकिन स्थानीय लोगों ने राहत की सांस ली कि वाहन चालक की सूझबूझ से एक बड़ा हादसा टल गया।1
- తుంగతుర్తి ఎమ్మెల్యే వేదమంత్రాలు మీద మాట్లాడిన బూతు మాటలకు తక్షణమే ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాలి..... ఈ ఎమ్మెల్యేకు ఎందుకు సనాతన ధర్మం మీద అంతా అక్కసు వేదమంత్రాలను ఎందుకు అవమానిస్తున్నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హిందూ సనాతన ధర్మాన్ని ఈ విధంగా అవమానిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి హిందువులు ఏం చేస్తున్నారు ఎందుకు ప్రశ్నించడం లేదు రాజకీయాల కోసం మన ధర్మాన్ని కించపరిచిన, అవమానపరిచిన మూసుకొని ఉందామా....1
- కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై ఫైర్ అయ్యారు. జగిత్యాల లో విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ తో తనకు అనుబంధం ఉందన్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో, ఎక్కడ ఉన్నాడో ఆయనకే తెలియదని, అలాంటి వ్యక్తి కలిసి పని చేద్దామనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఈరోజు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారణం ఎవరు...పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి సంజయ్ కారణం కాదా? అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఎవరు కోరుకోరు, కానీ కాంగ్రెస్ లో ఐక్యతను కొందరు చెడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తీసుకునే నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికి తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ నేతలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఉగాది తర్వాత పిసిసి చీప్ మహేష్ గౌడ్ తనతో మాట్లాడతా అన్నారని తెలిపారు. పార్టీ నాయకుల అనుచరుల సలహాలు సూచనలు తీసుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు. జరుగుతున్న పరిణామాలకు కాంగ్రెస్ అధిష్టానమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే సంజయ్ ఉడుంలా చేరారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదని హితవు పలికారు. ఫిరాయించిన ఎమెల్యేపై చర్యలు ఉంటేనే తన సమస్య పరిష్కారం అవుతుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.2
- జగిత్యాల జిల్లా కోటిలింగాలలో కుక్కకాటుకు బాలుడు బలికావడం కలకలం సృష్టిస్తుంది. వెల్గటూరు మండలం కోటిలింగాలకు చెందిన మంచికట్ల శ్రీనివాస్-మాధవి దంపతులకు కుమారుడు మణితేజ పై 2024 డిసెంబరు 26న కుక్క దాడి చేసి గాయపరిచింది. మెడ, భుజం మధ్య భాగంలో గాయం కావడంతో ఆసుపత్రికి తరలించి టీకా ఇప్పించారు. కొద్ది రోజుల తర్వాత మణితేజకు అకస్మాత్తుగా జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించగా వెన్నెముక నుంచి మెదడుకు వెళ్లే నరం దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. అప్పటి నుంచి శరీర కదలికలు మినహా ఎలాంటి స్పందన లేకుండా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అరకోటికిపైగా ఖర్చు చేసిన చివరకు ప్రాణాలు దక్కకపోవడంతో కన్నవారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.2