Shuru
Apke Nagar Ki App…
శ్రీకాకుళం నగరంలో జాతీయ నేత్రదానం పక్షోత్సవాల అవగాహన ర్యాలీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ, కళ్యాణ్ మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రం ఆధ్వర్యం లో 41వ జాతీయ నేత్రదానం పక్షోత్సవాలు అవగాహన ర్యాలీ బుధవారం శ్రీకాకుళం నగరంలో జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ చనిపోయిన తరువాత కూడా ఇతరులకు చూపు ప్రసాదించే అవకాశం నేత్రదానం ద్వారా మాత్రమే వీలవుతుందని, నేత్రదానo ఆవశ్యకతను అందరూ గుర్తించాలని ఆయన పిలుపు ఇచ్చారు. నేత్రదానo ఆవశ్యకతను అందరూ గుర్తించాలని ఆయన పిలుపు ఇచ్చారు.జాతీయ నేత్రదానం పక్షోత్సవాల అవగాహన ర్యాలీని రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్ రావు ప్రారంభించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, కళ్యాణ్ మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు.
Venkata Ramana Murthy K
శ్రీకాకుళం నగరంలో జాతీయ నేత్రదానం పక్షోత్సవాల అవగాహన ర్యాలీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ, కళ్యాణ్ మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రం ఆధ్వర్యం లో 41వ జాతీయ నేత్రదానం పక్షోత్సవాలు అవగాహన ర్యాలీ బుధవారం శ్రీకాకుళం నగరంలో జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ చనిపోయిన తరువాత కూడా ఇతరులకు చూపు ప్రసాదించే అవకాశం నేత్రదానం ద్వారా మాత్రమే వీలవుతుందని, నేత్రదానo ఆవశ్యకతను అందరూ గుర్తించాలని ఆయన పిలుపు ఇచ్చారు. నేత్రదానo ఆవశ్యకతను అందరూ గుర్తించాలని ఆయన పిలుపు ఇచ్చారు.జాతీయ నేత్రదానం పక్షోత్సవాల అవగాహన ర్యాలీని రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్ రావు ప్రారంభించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, కళ్యాణ్ మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీకాకుళం రెడ్ క్రాస్ భవన్ లో కలెక్టరుకు ఆత్మీయ సత్కారం శ్రీకాకుళం : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా విశిష్ట సేవలు అందించినందుకు గుర్తింపుగా గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక గవర్నర్ గోల్డ్‌మెడల్ అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక రెడ్ క్రాస్ భవనంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కరికి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు విశ్వసనీయత పెంచడమే అసలైన విజయం అనీ అన్నారు. కలెక్టర్లు అందించిన నిరంతర ప్రోత్సాహం, స్వచ్ఛంద సంస్థల ఉదారత, రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు నేతృత్వంలో సాగుతున్న నిస్వార్థ సేవలే రాష్ట్రస్థాయిలో ఈ గుర్తింపుకు కారణమని కొనియాడారు. జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, చైతన్య సదస్సులు, ముసలివారికి శరణాలయాలు, అనాథ పిల్లల సంరక్షణ, ఉచిత అంబులెన్స్ సేవలు, ఉచిత రక్త మార్పిడి లాంటి అనేక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సేవా విభాగాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్న రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, వైస్ చైర్మన్ డాక్టర్ సుధీర్, ట్రెజరర్ దుర్గా శ్రీనివాస్, వైద్యులు, వాలంటీర్లు చిన్మయరావు, సన్యాసిరావు, డాక్టర్ సచిత్ర, వైకుంఠరావు, చైతన్య, లక్ష్మణరావు, శ్రీకాంత్, నర్సింగరావు, సత్యనారాయణ, రమణ, సతీష్‌లను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.2
- గోదావరి నది నీళ్ల ఉత్తరాంధ్ర గడపకు సంతకవిటి రైతు సంఘం. ఇన్నాళ్లకు మా కళ్లు చల్లబడ్డాయి.. ఎప్పుడో వస్తాయనుకున్న గోదావరి ఎర్రటి నీళ్లు ఎట్టకేలకు మా ఊరి గుమ్మం ముందుకు, మా ఇంటి దాకా పారుతుంటే కళ్లారా చూసి మైమరిచిపోతున్నాం.ఇక మా పంటలకు, తాగునీటికి ఏ లోటు ఉండదని గుండె నిండా సంతోషంగా ఉంది.1
- రాజాం లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు... బైక్ పై భారీ ర్యాలీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజాం నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.1
- డోలపేట శ్రీ కనక దుర్గ అమ్మ వారి మహిమ గురించి ప్రముఖ జానపద గాయకుడు రేలారే రఘు గారు వాయిస్.1
- రాజాం రోడ్లపై గోవులు... సింహాచలం గోశా లకు తరలింపు..... రాజాం పురపాలక సంఘ పరిధిలో రోడ్లపై సంచరిస్తున్న గోవులను కమిషనర్ రామచందర్రావు, సీఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం గోశాల తరలించారు. యజమానులు పాలు పితికిన అనంతరం గోవులను రోడ్లపై వదిలేయడంతో వాహదారులకు, గోవులకు ప్రమాదాల జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. యజమానులకు పలుమార్లు అవగాహన కల్పించిన మార్పు రాకపోవడంతో 35 గోవులను 3 లారీలో సింహాచలం గోశాలకు తరలించినట్లు వెల్లడించారు.1
- విజయనగరం: కలెక్టర్ ఆఫీస్ లో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ క్షన్ కౌన్సిల్ సమావేశం. జేసీ విజయనగరం కలెక్టర్ ఆఫీసులో బుధవారం డిసిపిసి సమావేశం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సమావేశంలో జెసి చర్చించారు. డిసిపిసి నెంబర్ గా ఎమ్ ఎస్ శ్రీనివాసరావును నియమించినట్లు జేఎస్ఓ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్ఓ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.1
- విజయనగరం జిల్లా గజపతినగరంలో జనసేన సభ్యత్వ నమోదులో కలిగి పండు అగ్రస్థానం.. గజపతినగరం నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో గజపతినగరానికి చెందిన కలిగి పండు 353 సభ్యులను చేర్పించి ప్రథమ స్థానంలో నిలిచారు. పైల మహేష్ ద్వితీయ, తాళ్లపూడి సౌమిత్రి త్రివేది తృతీయ, ఎర్రి నాయుడు నాలుగో స్థానంలో నిలిచారు. బుధవారం గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణలు పలువురు జనసేన సాధకులను శాలువాలతో సత్కరించారు.1
- కలెక్టర్ అధ్యక్షతన కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం శ్రీకాకుళం : కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమావేశానికి అధ్యక్షత వహిo చారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాల మంజూరు, లక్ష్యాల సాధనపై సంబంధిత శాఖల అధికారులు మరియు బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.1