కారు- ఆటో ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాల పాలైన సంఘటన ఇల్లందు మండలం మసివగు సమీపంలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, బూటితండ గ్రామ నివాసులైన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సభ్యులు ఆటోలో తమ బంధువుల గ్రామం మసివాగుకు వెళ్తుండగా మసివగు సమీపంలో కారు ఆటోను ఢీకొంది.. ఆటోలో ప్రయాణించే స్వప్న, లక్ష్మి అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయాల పాలైన వారిలో రాజేశ్వరి అనే మహిళ పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురు ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాయిస్ ఓవర్: బోటి తండకు చెందిన ఎనిమిది మంది సభ్యులు వారింట్లో ఒక వ్యక్తి చనిపోవడంతో నిద్ర కోసం ఇల్లందు మండలం, మసివాగు లోని తమ బంధువుల ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో హాస్పిటల్ ఆవరణలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.

- Post by V Ramarao4
- తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తున్న నగదును 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షలు ఇల్లు నిర్మించుకునేందుకు అరకొరగా ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం సిమెంటు ధరలు, ఇనుప చువ్వా, హమాలీల ధరలు భారీగా పెరిగినందున 10 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా బిల్లులను వారంలో కచ్చితంగా లబ్ధిదారుడికి అందే విధంగా చూడాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ మాటలను నిలబెట్టుకోవాలని కోరారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మహిళలకు నగదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన .ఊకే ముత్తయ్య దొర. కొమ్ము విజయకుమార్. నరపోగు దీప్తి. నరేష్.వెంట ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం…నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన నిందితుడు చిలుకబత్తిని రంజిత్, S/o వెంకన్న, 19 సం,,లు, వృత్తి:డెకరేషన్ వర్క్, అనే యువకుడు, 15 సం,,ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గత సోమవారం మహబూబాబాద్ కు వచ్చిన బాలికను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కిడ్నాప్ మరియు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.*1
- *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…2
- నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.1
- పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సూర్యాంధ్ర ప్రగతి శకటాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పరిశీలించారు.1
- ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.1
- Post by Ramprasad islavath1