కార్మిక కుటుంబానికి అండగా.. - మృతి చెందిన కార్మికుడి భార్యకు రూ.20 వేల ఆర్థిక సాయం మెట్ పల్లి, ఆగస్టు 1 : జగిత్యాల జిల్లా , మెట్‌పల్లి మున్సిపాలిటీలో కార్మికుడిగా పనిచేస్తున్న కాంపెళ్లి పోచయ్య (57) ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతి చెందడంతో ఆయన కుటుంబానికి అండగా స్థానిక ప్రజాప్రతినిధులు, తోటి కార్మికులు నిలిచారు. శనివారం మృతుడి నివాసానికి వెళ్లిన మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, పోచయ్య భార్య లక్ష్మికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా మున్సిపల్ కార్మిక సంఘం, తోటి కార్మికులు కలిసి మరో రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించి తమ సంఘీభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని నాయకులు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ జవాన్ ముజీబ్, నరేష్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఉస్మాన్, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు లంక శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్, అనిల్, యు. శ్రీను, సంజీవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక కుటుంబానికి అండగా.. - మృతి చెందిన కార్మికుడి భార్యకు రూ.20 వేల ఆర్థిక సాయం మెట్ పల్లి, ఆగస్టు 1 : జగిత్యాల జిల్లా , మెట్‌పల్లి మున్సిపాలిటీలో కార్మికుడిగా పనిచేస్తున్న కాంపెళ్లి పోచయ్య (57) ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతి చెందడంతో ఆయన కుటుంబానికి అండగా స్థానిక ప్రజాప్రతినిధులు, తోటి కార్మికులు నిలిచారు. శనివారం మృతుడి నివాసానికి వెళ్లిన మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, పోచయ్య భార్య లక్ష్మికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా మున్సిపల్ కార్మిక సంఘం, తోటి కార్మికులు కలిసి మరో రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించి తమ సంఘీభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని నాయకులు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ జవాన్ ముజీబ్, నరేష్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఉస్మాన్, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు లంక శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్, అనిల్, యు. శ్రీను, సంజీవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
- నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన బిల్లుల చెల్లింపులలో దాదాపు కోటి 70 లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్ కి బీజేపీ కౌన్సిలర్ ల పిర్యాదు కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం అనంతరం జరిగిన బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని, ఈ విషయంలో అధికారులతో పాటు పాలకవర్గంలోని కొంత మంది చేతి వాటం చూయించారని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కలిసి పిర్యాదు చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ లు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో నూతన పాలక వర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కామారెడ్డి మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 5,92,91,364 ఖర్చు కాగా అందులో 75 బిల్లులు 1,13,14566 రూపాయల చెల్లింపు విషయంలో, అంతే కాకుండా SDRF సంబంధించిన 71,28,937 రూపాయలు ఖర్చు కా అందులో 5 బిల్లులకు గాను 59,86,353 రూపాయలు చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్టుగా అనుమానం అందని వీటి విషయంలో సరియైన విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై, వాటి వెనక ఉన్న ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరడం జరిగిందని, ఈ విషయంలో సరియైన స్పందన రాకపోతే విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి పిర్యాదు చేస్తామని అన్నారు.1
- హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.2
- ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు. డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు సాంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.1
- వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎ.రాజేందర్ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం అవడం ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ MH-34 M 9927 గల టాటా సుమో గోల్డ్ వాహనం చెన్నూర్ వైపు నుంచి వస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించారు.ఈ క్రమంలో భీమారం మండలం పోలంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై బస్‌స్టాప్ సమీపంలో వాహనాన్ని రోడ్డుపక్కన వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.అనంతరం పంచుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభించింది. అందులో ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ 120 సీసాలు,రాయల్ స్టాగ్ విస్కీ 108 సీసాలు, హేవర్డ్స్ 5000 బీర్ 216 టిన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం మొత్తం విలువ రూ.2,15,100గా నిర్ధారించారు. అనంతరం మద్యం, టాటా సుమో వాహనాన్ని భీమారం పోలీస్ స్టేషన్‌కు తరలించి,తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 34(ఎ) కింద సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పరారీలో ఉన్న వాహన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎ.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.1
- బోధన్ ఉర్సు మహోత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హజ్రత్ షా జలాల్ బుఖారీ (రహ్.) 675వ ఉర్సు మహోత్సవాల్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. పాల్గొన్నారు. దర్గా వద్ద చాదర్ సమర్పించి, గులాబీ పూలతో నివాళులర్పించిన కమిషనర్... రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా నిర్వాహకులు పోలీస్ కమిషనర్‌కు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, దర్గా కార్యదర్శి ముక్తాదారు, మత పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతూ , అభిషేక్ సింగ్వి లాంటి మంచి న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టు లో న్యాయపరంగా సమర్థవంతంగా పోరాడిన ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందన్నారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఈ తీర్పు కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయని, రైతులకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇవి ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు.తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవ, ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.2
- కామారెడ్డి జిల్లా కేంద్రంలో లిటిల్ స్కాలర్స్ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు, అదనపు చార్జీలు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ప్రతి విద్యార్థి నుంచి రూ.4 వేల వరకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని, దీనిపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అలాగే పాఠశాల యాజమాన్యం పుస్తకాలను పాఠశాలలోనే విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిరసన సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.1
- ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా *మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,* 1963లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారని, 1959లో కడెం ప్రాజెక్టుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగిందన్నారు. 2004 జూలై 28న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా రైతులకు సాగునీరు అందిస్తుండగా, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో మెజారిటీ పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టుకు దివంగత శ్రీపాదరావు పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల సాధ్యపడలేదన్నారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని లిఖితపూర్వకంగా సూచించిందని తెలిపారు. ఇటీవల జరిగిన సాంకేతిక సమావేశంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), ఎన్‌డీఎస్‌ఏ అధికారులు కూడా నిపుణుల కమిటీ సూచనల మేరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారని పేర్కొన్నారు. డీపీఆర్ ప్రకారం షీట్‌పైల్ ఫౌండేషన్ నిర్మించాల్సి ఉండగా స్కాంట్ పైల్ ఫౌండేషన్ నిర్మించారని, మూడు బ్యారేజీల పునాదుల నాణ్యతపై నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. గత రెండు నెలలుగా ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనల మేరకు మూడు బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు గంట గంటకు నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగంపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో పూర్తి చేయలేదని విమర్శించారు. ఉత్తర తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, గత 34 నెలలుగా కాళేశ్వరం మూడు బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఎత్తిపోకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించి 340 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించామని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.80 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు.3