Shuru
Apke Nagar Ki App…
బుకింగ్ ఉన్నా గ్యాస్ లేదు… చిన్నారులే క్యూలో నిలబడే పరిస్థితి!” శివంపేట్ మండలంలోని Bharat Petroleum కు చెందిన Bharatgas ఏజెన్సీ వద్ద ముందుగా బుకింగ్ చేసుకున్నప్పటికీ ప్రజలు సిలిండర్లతో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.ఉదయం నుంచే చిన్న పిల్లలు, మహిళలు లైన్లో నిలబడి గంటల తరబడి ఎదురుచూస్తుండటం స్థానికులను కలచివేస్తోంది. సరఫరా లోపం, నిర్వాహక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ASHOK VENGANI
బుకింగ్ ఉన్నా గ్యాస్ లేదు… చిన్నారులే క్యూలో నిలబడే పరిస్థితి!” శివంపేట్ మండలంలోని Bharat Petroleum కు చెందిన Bharatgas ఏజెన్సీ వద్ద ముందుగా బుకింగ్ చేసుకున్నప్పటికీ ప్రజలు సిలిండర్లతో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.ఉదయం నుంచే చిన్న పిల్లలు, మహిళలు లైన్లో నిలబడి గంటల తరబడి ఎదురుచూస్తుండటం స్థానికులను కలచివేస్తోంది. సరఫరా లోపం, నిర్వాహక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- Hotel ki Nahari mey Chuha aur Tahari mey Chipkali tou pachan liye, Haleem ki Degh mey jo ghotey gaye honge uska kya ?1
- కామారెడ్డి జిల్లా బీర్కుర్: ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి: బీజేపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీర్కూర్ బీజేపీ నాయకులు ఉప తహశీల్దార్ రవికుమార్కు వినతిపత్రం. అందజేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2,500 పథకాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని. మండిపడ్డారు.1
- సెలవు ఇవ్వలేదని బ్యాంకు మేనేజర్‌పై కాల్పులు! ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజియాబాద్‌లో అత్యంత ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. కేవలం సెలవు ఇవ్వలేదన్న కోపంతో ఒక సెక్యూరిటీ గార్డ్ ఏకంగా బ్యాంకు మేనేజర్‌నే తుపాకీతో కాల్చి చంపాడు. గాజియాబాద్‌లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్, గత కొంతకాలంగా తన జీతం మరియు సెలవుల విషయంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తనకు సెలవు కావాలని బ్యాంకు మేనేజర్‌ను కోరగా, మేనేజర్ అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు సెక్యూరిటీ గార్డ్, తన వద్ద ఉన్న తుపాకీతో మేనేజర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో మేనేజర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పని ఒత్తిడి మరియు వ్యక్తిగత కారణాలతోనే ఈ దారుణం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన స్థానికంగా మరియు బ్యాంకింగ్ రంగంలో తీవ్ర సంచలనం సృష్టించింది.1
- జిల్లా కలెక్టర్ కె. హేమావతి రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, విజయ ఎండి చంద్రశేఖర్ రెడ్డి లతో కలిసి నంగునూరు మండలం నర్మెట్టలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించి 22వ తేదీన ముఖ్యమంత్రి ఫ్యాక్టరీ ప్రారంభించడానికి అవసరమైన హెలిప్యాడ్ ఏర్పాటు, బహిరంగ సభా స్టేజ్ ఏర్పాటు, రైతు మేళాకు స్టాళ్ల ఏర్పాటు, ఫ్యాక్టరీ ప్రారంభానికి ఫ్యాక్టరీలో చేస్తున్న ఏర్పాట్లు తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకుండా వివిధ శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. హెలిపాడ్ ఏర్పాటు, బహిరంగ సభ, ఫ్యాక్టరీ ప్రారంభం, స్టాళ్లు, శిలాపలకం ఆవిష్కరణ తదతర అన్ని కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం ఉండాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని, అధికారులు సూచించిన విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలనీ అన్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ ఉపయోగపడే గొప్ప కార్యక్రమం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవమని అన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభంతోపాటు రైతు మేళాకు వచ్చే వేలాదిమంది రైతులు ఆయిల్ ఫామ్ తోటల పెంపకం పొందే ప్రయోజనాలను, వ్యవసాయ యాంత్రికరణ, పాడి పరిశ్రమ, పశువుల పెంపకం వలన కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉన్నందున సంబంధిత అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్, వ్యవసాయ, ఆర్టికల్చర్, ఆర్ అండ్ బీ, పోలీస్, ఆయిల్ళ్ ఫెడ్, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఉదయం శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పరివార దేవతల అర్చనలు నిర్వహించబడ్డాయి. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించారు. ఈ కార్యక్రమాన్ని రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.1
- అక్కన్నపేట మండల కేంద్రంలో ఈదురు గాలులు భారీగా రావడంతో చేతికచ్చిన పంట నష్టపోయింది మామిడి తోటలు,ముక్కలు, వరి పంటలు భారీగా నష్టం జరిగాయి నీళ్ళు లేక వరస సల్లు పెట్టుకుని పరిచ్చిన పంట కాస్త నేల మట్టం ఐపోయింది. ఒక వైపు యూరియా కొరత మరో వైపు భూగర్భ జలాలు అడుగంటడంతో రైతుల ఆవేదన ప్రభుత్వం ఆదుకోవాలనీ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.2
- కామారెడ్డి జిల్లా అయ్యవారిపల్లి బీజేపీ అధ్యక్షునిగా రాజేందర్ బిక్కనూర్ మండలం అయ్యవారిపల్లి బీజేపీ నూతన గ్రామ కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా భూమోళ్ళ రాజేందర్, కార్యదర్శిగా వీరాయోళ్ల ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు ఉప్పరి రమేష్, ప్రధాన కార్యదర్శులు తిరుమలేష్, రంజిత్ కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- విజయవాడలో ముస్లింలకు ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు.అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.1
- మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మహిళలు, ఉద్యోగులను సన్మానించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పోషకాహారం తీసుకోవాలని, వ్యాయామం, యోగా చేయాలని తెలిపారు. ప్రతి మహిళా కనీసం 20 మంది మహిళలకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. తాము విధులు నిర్వర్తించే చోట, తమ పరిసర ప్రాంతాల వారికి ఆపద సమయములో భరోసా ఇవ్వాలని సూచించారు. మహిళలు డబ్బును పొదుపు చేయాలని వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధితో తన కుటుంబం, దేశ వృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీఓ గీత, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మత్స్య శాఖ అధికారి సౌజన్య, వైద్యాధికారి రజిత, మైనార్టీ సంక్షేమ అధికారి భారతి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు.1