Shuru
Apke Nagar Ki App…
బీర్కూరు మండలంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి, ఉప తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు కామారెడ్డి జిల్లా బీర్కుర్: ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి: బీజేపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీర్కూర్ బీజేపీ నాయకులు ఉప తహశీల్దార్ రవికుమార్కు వినతిపత్రం. అందజేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2,500 పథకాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని. మండిపడ్డారు.
Narmala Swapna
బీర్కూరు మండలంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి, ఉప తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు కామారెడ్డి జిల్లా బీర్కుర్: ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి: బీజేపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీర్కూర్ బీజేపీ నాయకులు ఉప తహశీల్దార్ రవికుమార్కు వినతిపత్రం. అందజేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2,500 పథకాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని. మండిపడ్డారు.
More news from తెలంగాణ and nearby areas
- మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మహిళలు, ఉద్యోగులను సన్మానించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పోషకాహారం తీసుకోవాలని, వ్యాయామం, యోగా చేయాలని తెలిపారు. ప్రతి మహిళా కనీసం 20 మంది మహిళలకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. తాము విధులు నిర్వర్తించే చోట, తమ పరిసర ప్రాంతాల వారికి ఆపద సమయములో భరోసా ఇవ్వాలని సూచించారు. మహిళలు డబ్బును పొదుపు చేయాలని వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధితో తన కుటుంబం, దేశ వృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీఓ గీత, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మత్స్య శాఖ అధికారి సౌజన్య, వైద్యాధికారి రజిత, మైనార్టీ సంక్షేమ అధికారి భారతి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు.1
- ఉప్పల్ శిల్పరామం వద్ద చెత్త పేరుకుపోవడంతో ప్రజలకు ఇబ్బందులు హైదరాబాద్‌లోని ఉప్పల్ శిల్పరామం సమీప రోడ్డుపై ఇటీవల జరిగిన ఒక కార్యక్రమం తర్వాత చెత్త పేరుకుపోయి మూడు రోజులు గడిచినా ఇప్పటికీ శుభ్రపరచలేదు. ప్లాస్టిక్ కవర్లు, ఆహార అవశేషాలు రోడ్డుపై ఉండటంతో దుర్వాసన వస్తూ స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరచాలని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు.1
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ పులిని మహారాష్ట్రకు చెందిన “జే-1”గా అటవీశాఖ గుర్తించింది. ఇటీవల ఆవును చంపిన పులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పులిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా ఈ పులి జగిత్యాలకు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో నిఘా పెంచారు. సాయంత్రం తర్వాత బయటకు రాకూడదని, పులికి హాని చేయవద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.1
- డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్ చెకింగ్ కీలకం: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ అత్యంత ప్రాధాన్యం పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కృత్రిమ మేధస్సు ద్వారా తయారవుతున్న కంటెంట్, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలను ప్రజలలోకి చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని ఆమె అన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన వార్త లాప్ కార్యక్రమంలో ఆమె పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.1
- Post by KR NEWS 3691
- మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు భారీగా చేరుకుని నిరసన చేపట్టగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటలు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పలువురు ఆశా వర్కర్లతో పాటు సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. గత 20 ఏళ్లుగా పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీసం రూ.18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇన్సూరెన్స్, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించి, ఇతర ఖర్చుల కోసం రూ.50,000 మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎర్ర అశోక్ మాట్లాడుతూ, ఆశా వర్కర్ల శ్రమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆశలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్బంధాలను ఛేదించి 48 గంటల నిరసనలో పాల్గొన్న ఆశా వర్కర్లు తమ సమస్యలను కలెక్టరేట్‌కు విన్నవించేందుకు వెళ్లగా, అక్రమంగా అరెస్టు చేశారని నాయకులు ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాలను అణచలేరని హెచ్చరిస్తూ, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా నాయకులు రేవతి, అనిత, ఐ. రాజశేఖర్, బి. లింగస్వామి, పి. గణేష్, ఆర్. సంతోష్, ఎం. నరేష్, శంకరమ్మ, రమ, సబియా, పద్మ, వసంత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.3
- కామారెడ్డి జిల్లా మద్నూర్: సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ మద్నూర్ మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం పనులను మంగళవారం సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ ప్రారంభించారు. గ్రామంలో రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉష సంతోష్ మేసీ ఇప్పటికే గ్రామంలో నీటి సమస్య పరిష్కారం కోసం పది బోర్లు వేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంతోష్ మేస్త్రీ, కాలనీ వాసులు పాల్గొన్నారు1
- ప్రజల సహకారంతోనే పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం సాధ్యమవుతుందని, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచేందుకు ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను తప్పనిసరిగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం వేములవాడ మండలం తెట్టెకుంట శివారులో వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించిన పొడి వనరుల సేకరణ కేంద్రంలో నూతనంగా సమకూర్చిన యంత్రాలను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6వ తేదీ నుంచి మున్సిపాలిటీలు, గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పట్టణాల్లో చెత్త సేకరణ, చెత్త నిర్వహణను మరింత సమర్థవంతంగా చేసేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే పొడి వనరుల సేకరణ కేంద్రం ఉండగా, ఇప్పుడు ఆ కేంద్రంలో ఏజెన్సీ ద్వారా నూతనంగా సమకూర్చిన యంత్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడానికి ఈ యంత్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీ వాహనాల ద్వారా ఇంటింటికీ తిరిగి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సేకరిస్తున్నామని తెలిపారు. సేకరించిన పొడి చెత్తను ఈ కేంద్రానికి తీసుకువచ్చి యంత్రాల సహాయంతో ప్రాసెస్ చేసి కంపోస్ట్ తయారు చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల చెత్త నిర్వహణ సక్రమంగా జరిగి పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని వివరించారు.ప్రజలు తమ ఇళ్లలోనే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వాహనాల్లో కూడా తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరు కంపార్ట్‌మెంట్లలో సేకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెత్తను వేరు చేయడం వల్ల రీసైక్లింగ్ ప్రక్రియ సులభమవుతుందని, తడి చెత్త, పొడి చెత్త కలిసిపోవడం వల్ల డంపింగ్ యార్డుల్లో సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చని తెలిపారు.ఈ డీఆర్‌సీసీ కేంద్రంలో ఒక బేలింగ్ మెషిన్, ఒక వెయిమెంట్ మెషిన్ ఏర్పాటు చేయగా, ఈ కేంద్రం 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుందని తెలిపారు. అలాగే కంపోస్ట్ కేంద్రం కూడా 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు కొక్కుల బాలకృష్ణ, అన్నారం శ్రీనివాస్, తూమ్ మధు, ఎల్ల శ్రీనివాస్, తోట రాజు, కాషా శ్రీనివాస్, మూడపల్లి నీలమ్మ,మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తమకు నెలకు 26 వేల గౌరవ వేతనం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జి.ఓ. విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నిరసనకు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలపడం గమనార్హం. ఆశా వర్కర్లు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తగిన పారితోషికం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.1