Shuru
Apke Nagar Ki App…
ఉప్పల్ శిల్పరామం వద్ద చెత్త పేరుకుపోవడంతో ప్రజలకు ఇబ్బందులు హైదరాబాద్‌లోని ఉప్పల్ శిల్పరామం సమీప రోడ్డుపై ఇటీవల జరిగిన ఒక కార్యక్రమం తర్వాత చెత్త పేరుకుపోయి మూడు రోజులు గడిచినా ఇప్పటికీ శుభ్రపరచలేదు. ప్లాస్టిక్ కవర్లు, ఆహార అవశేషాలు రోడ్డుపై ఉండటంతో దుర్వాసన వస్తూ స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరచాలని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు.
Telangana news
ఉప్పల్ శిల్పరామం వద్ద చెత్త పేరుకుపోవడంతో ప్రజలకు ఇబ్బందులు హైదరాబాద్‌లోని ఉప్పల్ శిల్పరామం సమీప రోడ్డుపై ఇటీవల జరిగిన ఒక కార్యక్రమం తర్వాత చెత్త పేరుకుపోయి మూడు రోజులు గడిచినా ఇప్పటికీ శుభ్రపరచలేదు. ప్లాస్టిక్ కవర్లు, ఆహార అవశేషాలు రోడ్డుపై ఉండటంతో దుర్వాసన వస్తూ స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరచాలని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఉప్పల్ శిల్పరామం వద్ద చెత్త పేరుకుపోవడంతో ప్రజలకు ఇబ్బందులు హైదరాబాద్‌లోని ఉప్పల్ శిల్పరామం సమీప రోడ్డుపై ఇటీవల జరిగిన ఒక కార్యక్రమం తర్వాత చెత్త పేరుకుపోయి మూడు రోజులు గడిచినా ఇప్పటికీ శుభ్రపరచలేదు. ప్లాస్టిక్ కవర్లు, ఆహార అవశేషాలు రోడ్డుపై ఉండటంతో దుర్వాసన వస్తూ స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరచాలని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు.1
- కీసర మండలంలోని సుభాష్ నగర్ కాలనీలో పట్టపగలే ఇల్లు చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాలనీలో నివాసం ఉంటున్న ఆర్. వెంకట్ రెడ్డి భార్య శిరీష ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న అల్మారాలు పరిశీలించి సుమారు మూడు తులాల బంగారం మరియు ఒక మొబైల్ ఫోన్‌ను అపహరించి పరారయ్యారు.ఇంటివారు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బంగారం, ఐఫోన్ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. కాలనీలో ఇటీవల జరుగుతున్న చోరీ ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.1
- Post by Anji Raju1
- ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి యాంకర్...సామ్రాజ్యవాద దురాక్రమనే లక్ష్యంగా ప్రమాదకరకంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు నేతన్యాహు జియోనిస్ట్ కూటమి వ్యవహరిస్తూ ఇరాన్‌పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దాన్ని ఆపి, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మల్లాపూర్ లో ప్లకార్డులు చేతబూని నిరసన ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రపంచ శాంతి మరియు మానవత్వం కోసం యుద్ధం కాకుండా సంభాషణలు, రాజదౌత్యం మాత్రమే మార్గమని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించిందన్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని సామ్రాజ్యవాద శక్తులు అమెరికా, ఇజ్రాయిల్ తమ రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు మధ్యప్రాచ్య దేశాలను యుద్ధ వేదికగా మార్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఇరాన్‌పై యుద్ధ వాతావరణం సృష్టించడం కూడా అదే విధమైన ప్రమాదకర ధోరణికి నిదర్శనమన్నారు. యుద్ధం ఎప్పటికీ సాధారణ ప్రజలకు మేలు చేయదని,యుద్ధం వల్ల కార్మికులు, రైతులు, పేద ప్రజలు, మహిళలు మరియు పిల్లలే అత్యంత భయంకరమైన నష్టాన్ని ఎదుర్కొంటారన్నారు. బైట్:విఎస్. బోస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు2
- प्यार में इनकार का खौफनाक बदला! महिला को लगाया HIV संक्रमित खून का इंजेक्शन एकतरफा प्यार में इनकार से बौखलाए युवक ने हैरान कर देने वाली वारदात को अंजाम दिया। आरोप है कि युवक ने शादी के लिए महिला पर दबाव बनाया, लेकिन जब उसने साफ इनकार कर दिया तो उसने बदला लेने की ठान ली। बताया जा रहा है कि आरोपी ने HIV संक्रमित खून का इंतजाम किया और मौका पाकर महिला के शरीर में इंजेक्शन लगा दिया। उसकी सोच थी कि अगर महिला संक्रमित हो जाएगी तो कोई उससे शादी नहीं करेगा और आखिरकार उसे उसी के पास आना पड़ेगा। घटना सामने आने के बाद इलाके में सनसनी फैल गई है। पुलिस मामले की जांच कर रही है और आरोपी की तलाश जारी है। यह घटना समाज में बढ़ती विकृत मानसिकता पर बड़ा सवाल खड़ा करती है।1
- శివంపేట్ మండలంలో Bharatgas గ్యాస్ సిలిండర్ కోసం ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో ఏజెన్సీ వద్ద ప్రజలు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచే మహిళలు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి బుకింగ్ చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో అక్కడ రద్దీ నెలకొంది. గంటల తరబడి లైన్‌లో వేచి చూడాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసి గ్యాస్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- విజయవాడలో ముస్లింలకు ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు.అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.1
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వరల్డ్ కప్ హీరో తిలక్ వర్మ! హైదరాబాద్ : టీమ్ ఇండియా యువ ఆల్‌రౌండర్, టీ20 వరల్డ్ కప్-2026 విజేత తిలక్ వర్మ సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా కలిశారు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మొదటిసారి నగరానికి చేరుకున్న తిలక్ వర్మ, జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలక్ వర్మను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసి, తెలంగాణ గడ్డ గర్వపడేలా చేసినందుకు తిలక్ వర్మను సీఎం ప్రశంసించారు.కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 1