Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి జిల్లా : మద్నూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాం, సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి, కామారెడ్డి జిల్లా మద్నూర్: సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ మద్నూర్ మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం పనులను మంగళవారం సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ ప్రారంభించారు. గ్రామంలో రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉష సంతోష్ మేసీ ఇప్పటికే గ్రామంలో నీటి సమస్య పరిష్కారం కోసం పది బోర్లు వేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంతోష్ మేస్త్రీ, కాలనీ వాసులు పాల్గొన్నారు
Narmala Swapna
కామారెడ్డి జిల్లా : మద్నూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాం, సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి, కామారెడ్డి జిల్లా మద్నూర్: సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ మద్నూర్ మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం పనులను మంగళవారం సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ ప్రారంభించారు. గ్రామంలో రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉష సంతోష్ మేసీ ఇప్పటికే గ్రామంలో నీటి సమస్య పరిష్కారం కోసం పది బోర్లు వేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంతోష్ మేస్త్రీ, కాలనీ వాసులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా బీర్కుర్: ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి: బీజేపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీర్కూర్ బీజేపీ నాయకులు ఉప తహశీల్దార్ రవికుమార్కు వినతిపత్రం. అందజేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2,500 పథకాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని. మండిపడ్డారు.1
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున ఆలయ పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంజీరా నది జలాలతో అభిషేకము పట్టు వస్త్రాలంకరణ అమ్మవారి అలంకరణ గావించారు అనంతరం పుష్పాలకరణ రావించి సహస్ర మార్చిన ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు ఆ తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు ఆలయ ఈవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు ఆలయ పూజారి భక్తులను ఆశీర్వదించి తీర్థ వితరణ గావించారు.1
- Jai jai BRS TRS 🚙🚙🚙🌹💐🪴💯4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఉదయం శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పరివార దేవతల అర్చనలు నిర్వహించబడ్డాయి. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించారు. ఈ కార్యక్రమాన్ని రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.1
- జిల్లా కలెక్టర్ కె. హేమావతి రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, విజయ ఎండి చంద్రశేఖర్ రెడ్డి లతో కలిసి నంగునూరు మండలం నర్మెట్టలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించి 22వ తేదీన ముఖ్యమంత్రి ఫ్యాక్టరీ ప్రారంభించడానికి అవసరమైన హెలిప్యాడ్ ఏర్పాటు, బహిరంగ సభా స్టేజ్ ఏర్పాటు, రైతు మేళాకు స్టాళ్ల ఏర్పాటు, ఫ్యాక్టరీ ప్రారంభానికి ఫ్యాక్టరీలో చేస్తున్న ఏర్పాట్లు తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకుండా వివిధ శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. హెలిపాడ్ ఏర్పాటు, బహిరంగ సభ, ఫ్యాక్టరీ ప్రారంభం, స్టాళ్లు, శిలాపలకం ఆవిష్కరణ తదతర అన్ని కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం ఉండాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని, అధికారులు సూచించిన విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలనీ అన్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ ఉపయోగపడే గొప్ప కార్యక్రమం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవమని అన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభంతోపాటు రైతు మేళాకు వచ్చే వేలాదిమంది రైతులు ఆయిల్ ఫామ్ తోటల పెంపకం పొందే ప్రయోజనాలను, వ్యవసాయ యాంత్రికరణ, పాడి పరిశ్రమ, పశువుల పెంపకం వలన కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉన్నందున సంబంధిత అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్, వ్యవసాయ, ఆర్టికల్చర్, ఆర్ అండ్ బీ, పోలీస్, ఆయిల్ళ్ ఫెడ్, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- శివంపేట్ మండలంలోని Bharat Petroleum కు చెందిన Bharatgas ఏజెన్సీ వద్ద ముందుగా బుకింగ్ చేసుకున్నప్పటికీ ప్రజలు సిలిండర్లతో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.ఉదయం నుంచే చిన్న పిల్లలు, మహిళలు లైన్లో నిలబడి గంటల తరబడి ఎదురుచూస్తుండటం స్థానికులను కలచివేస్తోంది. సరఫరా లోపం, నిర్వాహక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1
- జగిత్యాల ఇందిరా భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెకాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన కారణమని ఆరోపించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం, నామినేటెడ్ పోస్టులు మరియు కార్యకర్తల హక్కుల విషయంలో తీసుకున్న వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ వ్యవహారం జిల్లాలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు దారితీస్తోందని అన్నారు.1
- కామారెడ్డి జిల్లా అయ్యవారిపల్లి బీజేపీ అధ్యక్షునిగా రాజేందర్ బిక్కనూర్ మండలం అయ్యవారిపల్లి బీజేపీ నూతన గ్రామ కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా భూమోళ్ళ రాజేందర్, కార్యదర్శిగా వీరాయోళ్ల ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు ఉప్పరి రమేష్, ప్రధాన కార్యదర్శులు తిరుమలేష్, రంజిత్ కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.1