Shuru
Apke Nagar Ki App…
ఆరు గ్యారంటీలు........ KR NEWS 369........... NEWS UPDATES
KR NEWS 369
ఆరు గ్యారంటీలు........ KR NEWS 369........... NEWS UPDATES
More news from తెలంగాణ and nearby areas
- Post by KR NEWS 3691
- బోథ్ లో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో నెరడిగొండ మండలంలోని బొరిగామ గ్రామంలో అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఇండ్లు మొత్తం నేలమట్టం అయిపోయాయని, కావున బోథ్ లో ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలి బోథ్ మండల కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రిలో డాక్టర్ల కొరతను తీర్చాలని కోరారు. అదేవిధంగా ఆసుపత్రి భవనం పూర్తి కావొస్తోంది దాని బిల్లులు పెండింగులో ఉన్నందుకు ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి బిల్లులు వెంటనే అందించాలి.బోథ్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలి.ఇచ్చొడ లో షాది ఖాన కొరకు 3 కోట్లు ఫైనాన్స్ పర్మిషన్ ఇస్తే ముస్లిం సోదరులకు రంజాన్ తోఫ అందించవచ్చని కోరారు.బోథ్ నియోజకవర్గంలో పత్తి, సొయా పండిస్తున్న రైతులకు సైతం బోనస్ అందించి ఆదుకోవాలని కోరారు.1
- మెట్ పల్లి, మార్చి 18: పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల జగన్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మైలారపు రాంబాబు, పుల్ల జగన్ గౌడ్, పుల్ల శ్రీనివాస్ గౌడ్‌లను శాలువాలతో సన్మానించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రజలు ట్రస్ట్ సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.3
- కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈకో క్లబ్ వృక్షశాస్త్రం మరియు ఫారెస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో పర్యావరణహిత రంగుల తయారీ విద్యార్థుల ద్వారా చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.విజయ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణహిత రంగులను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా ఆరోగ్యాలను కూడా సంరక్షించుకోవచ్చని తెలిపారు. హానికరమైన రసాయనాలను వాడకుండా నిత్యం ఉపయోగించే ఆకుకూరలు కూరగాయలు పుష్పాలు వంటి మొక్క భాగాలను ఎండబెట్టి వాటి నుండి రసాలను లేదా పొడులను తయారుచేయటం అద్భుతమైన ఆలోచన అని ఇందులో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులను అభినందించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె . కిష్టయ్య మాట్లాడుతూ.. చిరుధాన్యాలపొడులను బియ్యం గోధుమ పిండిని ఉపయోగించి దానిలో మొక్క భాగాల పొడులను కలపటం ద్వారా భిన్నమైన రంగులను పొందవచ్చని వీటిని హోలీ పండుగ రంగులలో మరియు పండగల సందర్భంలో రంగోలి/ ముగ్గులు వేయటంలో ఉపయోగించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ దినకర్ అధ్యాపకులు శ్రీమతి శ్రీవల్లి, స్వాతి, శ్రీలత, వెన్నెల, రమణ, లింగం, దీవెనమ్మ, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.1
- దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే పరాభవ నామ సంవత్సరంలో కూడా వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు1
- కుమురం భీమ్ ఆసిఫాబాద్: సిర్పూర్ నియోజకవర్గంలో ఆర్&బీ రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోడ్ల నిర్వహణ లేక ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెంచికల్‌పేట్ సహా అటవీ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిని ఆర్టీసీ బస్సులు సైతం నడవలేని పరిస్థితి ఉందని తెలిపారు. అటవీశాఖ అనుమతులు సాధించి వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- Post by KR NEWS 3691