ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వేములవాడ పొడి వనరుల సేకరణ కేంద్రంలో నూతన యంత్రాల ప్రారంభం ప్రజల సహకారంతోనే పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం సాధ్యమవుతుందని, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచేందుకు ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను తప్పనిసరిగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం వేములవాడ మండలం తెట్టెకుంట శివారులో వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించిన పొడి వనరుల సేకరణ కేంద్రంలో నూతనంగా సమకూర్చిన యంత్రాలను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6వ తేదీ నుంచి మున్సిపాలిటీలు, గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పట్టణాల్లో చెత్త సేకరణ, చెత్త నిర్వహణను మరింత సమర్థవంతంగా చేసేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే పొడి వనరుల సేకరణ కేంద్రం ఉండగా, ఇప్పుడు ఆ కేంద్రంలో ఏజెన్సీ ద్వారా నూతనంగా సమకూర్చిన యంత్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడానికి ఈ యంత్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీ వాహనాల ద్వారా ఇంటింటికీ తిరిగి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సేకరిస్తున్నామని తెలిపారు. సేకరించిన పొడి చెత్తను ఈ కేంద్రానికి తీసుకువచ్చి యంత్రాల సహాయంతో ప్రాసెస్ చేసి కంపోస్ట్ తయారు చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల చెత్త నిర్వహణ సక్రమంగా జరిగి పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని వివరించారు.ప్రజలు తమ ఇళ్లలోనే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వాహనాల్లో కూడా తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరు కంపార్ట్‌మెంట్లలో సేకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెత్తను వేరు చేయడం వల్ల రీసైక్లింగ్ ప్రక్రియ సులభమవుతుందని, తడి చెత్త, పొడి చెత్త కలిసిపోవడం వల్ల డంపింగ్ యార్డుల్లో సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చని తెలిపారు.ఈ డీఆర్‌సీసీ కేంద్రంలో ఒక బేలింగ్ మెషిన్, ఒక వెయిమెంట్ మెషిన్ ఏర్పాటు చేయగా, ఈ కేంద్రం 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుందని తెలిపారు. అలాగే కంపోస్ట్ కేంద్రం కూడా 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు కొక్కుల బాలకృష్ణ, అన్నారం శ్రీనివాస్, తూమ్ మధు, ఎల్ల శ్రీనివాస్, తోట రాజు, కాషా శ్రీనివాస్, మూడపల్లి నీలమ్మ,మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వేములవాడ పొడి వనరుల సేకరణ కేంద్రంలో నూతన యంత్రాల ప్రారంభం ప్రజల సహకారంతోనే పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం సాధ్యమవుతుందని, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచేందుకు ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను తప్పనిసరిగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం వేములవాడ మండలం తెట్టెకుంట శివారులో వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించిన పొడి వనరుల సేకరణ కేంద్రంలో నూతనంగా సమకూర్చిన యంత్రాలను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6వ తేదీ నుంచి మున్సిపాలిటీలు, గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పట్టణాల్లో చెత్త సేకరణ, చెత్త నిర్వహణను మరింత సమర్థవంతంగా చేసేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే పొడి వనరుల సేకరణ కేంద్రం ఉండగా, ఇప్పుడు ఆ కేంద్రంలో ఏజెన్సీ ద్వారా నూతనంగా సమకూర్చిన యంత్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడానికి ఈ యంత్రాలు ఉపయోగపడతాయని
పేర్కొన్నారు. మున్సిపాలిటీ వాహనాల ద్వారా ఇంటింటికీ తిరిగి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సేకరిస్తున్నామని తెలిపారు. సేకరించిన పొడి చెత్తను ఈ కేంద్రానికి తీసుకువచ్చి యంత్రాల సహాయంతో ప్రాసెస్ చేసి కంపోస్ట్ తయారు చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల చెత్త నిర్వహణ సక్రమంగా జరిగి పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని వివరించారు.ప్రజలు తమ ఇళ్లలోనే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వాహనాల్లో కూడా తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరు కంపార్ట్‌మెంట్లలో సేకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెత్తను వేరు చేయడం వల్ల రీసైక్లింగ్ ప్రక్రియ సులభమవుతుందని, తడి చెత్త, పొడి చెత్త కలిసిపోవడం వల్ల డంపింగ్ యార్డుల్లో సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చని తెలిపారు.ఈ డీఆర్‌సీసీ కేంద్రంలో ఒక బేలింగ్ మెషిన్, ఒక వెయిమెంట్ మెషిన్ ఏర్పాటు చేయగా, ఈ కేంద్రం 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుందని తెలిపారు. అలాగే కంపోస్ట్ కేంద్రం కూడా 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు కొక్కుల బాలకృష్ణ, అన్నారం శ్రీనివాస్, తూమ్ మధు, ఎల్ల శ్రీనివాస్, తోట రాజు, కాషా శ్రీనివాస్, మూడపల్లి నీలమ్మ,మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తమకు నెలకు 26 వేల గౌరవ వేతనం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జి.ఓ. విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నిరసనకు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలపడం గమనార్హం. ఆశా వర్కర్లు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తగిన పారితోషికం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.1
- కరీంనగర్ జిల్లా కల్వల ప్రాజెక్టు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని ఎల్ఎండిలో ఇరిగేషన్ కార్యాలయం ముందు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జాగృతి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 3 ఏళ్ళ క్రితం కల్వల ప్రాజెక్టు ద్వంసమైతే ఇప్పటి వరకు మరమ్మత్తులు చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ద్వంసంతో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగండి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కల్వల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి మరమ్మత్తు పనులు చేపట్టాలని లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.4
- జన్నారం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి సూచించారు. మంగళవారం వివిధ గ్రామాలలో సర్పంచుల ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేయించారు. మండలంలోని వివిధ గ్రామాలలో దొంగతనాలు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఊరికి వెళ్లేవాళ్లు ఇళ్లల్లో బంగారం, నగదును ఉంచవద్దన్నారు.1
- శివంపేట్ మండలంలోని Bharat Petroleum కు చెందిన Bharatgas ఏజెన్సీ వద్ద ముందుగా బుకింగ్ చేసుకున్నప్పటికీ ప్రజలు సిలిండర్లతో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.ఉదయం నుంచే చిన్న పిల్లలు, మహిళలు లైన్లో నిలబడి గంటల తరబడి ఎదురుచూస్తుండటం స్థానికులను కలచివేస్తోంది. సరఫరా లోపం, నిర్వాహక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1
- ప్రభుత్వాలు 'స్వచ్ఛ భారత్' అంటూ కోట్లు ఖర్చు చేస్తున్నాయి.. కానీ మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో మాత్రం పరిస్థితి చూస్తే 'అధ్వాన్నం' అనే మాట కూడా చిన్నబోతుంది. 29 గ్రామాల ప్రజలకు కూడలిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక్క పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం సిగ్గుచేటు. ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమేనా? ప్రజల కనీస అవసరాలు అధికారుల కంటికి ఆనడం లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల 'భూమి' నాటకం.. బయటపెట్టిన జితేందర్! ఇటీవల జిల్లా స్థాయి ప్రజావాణిలో సామాజిక కార్యకర్త తుడుం జితేందర్ ఈ సమస్యను కలెక్టర్ కుమార్ దీపక్ ముందు ఉంచినప్పుడు అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. సాకు: "సార్.. జన్నారంలో మరుగుదొడ్లు కట్టడానికి ప్రభుత్వ భూమి లేదు" అని అధికారులు కలెక్టర్ ముందు బుకాయించే ప్రయత్నం చేశారు. వాస్తవం: బస్టాండ్ దగ్గర ఇరిగేషన్ భూమి ఉండగా, కవ్వాల్ పాయింట్ వద్ద బావి సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ప్రశ్న: ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఆక్రమించుకుని పట్టాలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకున్న అధికారులు, ప్రజల అవసరాల కోసం ఒక్క గుంట భూమిని కూడా చూపలేకపోవడం వెనుక మతలబు ఏమిటి? అని జితేందర్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నమలాల్సి వచ్చింది. మంగళవారం 'మంట'.. మహిళల 'గోస' ప్రతి మంగళవారం జరిగే వారపు సంత రోజున జన్నారం ఒక నరకప్రాయమైన ప్రాంతంగా మారుతోంది. వ్యాపారుల ఆవేదన: ఉదయాన్నే అడవి నుంచి, తండాల నుంచి కూరగాయలు తెచ్చే మహిళా వ్యాపారులు సాయంత్రం వరకు మలమూత్ర విసర్జన ఆపుకోలేక పడుతున్న బాధలు వర్ణనాతీతం. విద్యార్థినుల ఇబ్బందులు: కళాశాలలు, పాఠశాలలకు వచ్చే విద్యార్థినులు అత్యవసర సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య ముప్పు: గత్యంతరం లేక రోడ్ల పక్కనే వెళ్లాల్సి రావడంతో అటు పారిశుద్ధ్యం క్షీణించి, రోగాలకు నిలయంగా మారుతోంది. కలెక్టర్ ‘డెడ్ లైన్’.. అమలు జరిగేనా? ప్రజల గోసను అర్థం చేసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్, వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించాలని, తక్షణమే మూడు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల తర్వాత కూడా అధికారులు 'ఫైళ్ల' మీద కాలక్షేపం చేస్తారా? లేక యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెడతారా? అని జన్నారం ప్రజలు ఎదురుచూస్తున్నారు. "ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడలేని అధికారులు, కనీసం ప్రజల ప్రాథమిక అవసరాల కోసం కేటాయించలేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి."1
- Post by KR NEWS 3691
- ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు మూషం రమేష్ కోరారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిష్కరించాలని మూషం రమేష్ కోరారు.1
- కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై ఫైర్ అయ్యారు. జగిత్యాల లో విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ తో తనకు అనుబంధం ఉందన్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో, ఎక్కడ ఉన్నాడో ఆయనకే తెలియదని, అలాంటి వ్యక్తి కలిసి పని చేద్దామనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఈరోజు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారణం ఎవరు...పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి సంజయ్ కారణం కాదా? అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఎవరు కోరుకోరు, కానీ కాంగ్రెస్ లో ఐక్యతను కొందరు చెడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తీసుకునే నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికి తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ నేతలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఉగాది తర్వాత పిసిసి చీప్ మహేష్ గౌడ్ తనతో మాట్లాడతా అన్నారని తెలిపారు. పార్టీ నాయకుల అనుచరుల సలహాలు సూచనలు తీసుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు. జరుగుతున్న పరిణామాలకు కాంగ్రెస్ అధిష్టానమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే సంజయ్ ఉడుంలా చేరారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదని హితవు పలికారు. ఫిరాయించిన ఎమెల్యేపై చర్యలు ఉంటేనే తన సమస్య పరిష్కారం అవుతుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.2
- జన్నారం మండలంలోని రాయికుంట గ్రామంలో పాడైన బోర్లకు అధికారులు మరమ్మతులు చేయించాలని సిపిఎం జన్నారం మండల కార్యదర్శి లింగన్న డిమాండ్ చేశారు. మంగళవారం రాయికుంట గ్రామంలో సిపిఎం ప్రతినిధి బృందం పర్యటించింది. ఈ సందర్భంగా సమస్యలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో బోర్లు పాలు కావడంతో ప్రజలు నీటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ఇందిరమ్మ ఇళ్ళకు నీరు పట్టడం కష్టంగా ఉందన్నారు. వెంటనే పాడైన బోర్లకు మరమ్మతులు చేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.1