Shuru
Apke Nagar Ki App…
తాళం వేసిన ఇళ్లలో నగదును బంగారాన్ని ఉంచవద్దు: సర్కిల్ ఇన్స్పెక్టర్ జన్నారం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి సూచించారు. మంగళవారం వివిధ గ్రామాలలో సర్పంచుల ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేయించారు. మండలంలోని వివిధ గ్రామాలలో దొంగతనాలు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఊరికి వెళ్లేవాళ్లు ఇళ్లల్లో బంగారం, నగదును ఉంచవద్దన్నారు.
Gourinatha p.g
తాళం వేసిన ఇళ్లలో నగదును బంగారాన్ని ఉంచవద్దు: సర్కిల్ ఇన్స్పెక్టర్ జన్నారం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి సూచించారు. మంగళవారం వివిధ గ్రామాలలో సర్పంచుల ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేయించారు. మండలంలోని వివిధ గ్రామాలలో దొంగతనాలు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఊరికి వెళ్లేవాళ్లు ఇళ్లల్లో బంగారం, నగదును ఉంచవద్దన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జన్నారం మండలంలోని రేండ్లగూడ మందపల్లి గ్రామంలో ఉన్న అగ్గి మల్లన్న దేవాలయంలో మల్లన్న పట్నాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఇటీవల అగ్గి మల్లన్న దేవాలయాన్ని ప్రారంభించారు. మంగళవారం దేవాలయ నిర్వాహకులు భక్తులు మల్లన్న మూల విగ్రహాన్ని సమీప గోదావరికి తీసుకువెళ్లి జలాలతో అభిషేకం చేశారు. ప్రస్తుతం సుంపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రేపు స్వామి వారి కళ్యాణం, బోనాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.1
- ప్రభుత్వాలు 'స్వచ్ఛ భారత్' అంటూ కోట్లు ఖర్చు చేస్తున్నాయి.. కానీ మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో మాత్రం పరిస్థితి చూస్తే 'అధ్వాన్నం' అనే మాట కూడా చిన్నబోతుంది. 29 గ్రామాల ప్రజలకు కూడలిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక్క పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం సిగ్గుచేటు. ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమేనా? ప్రజల కనీస అవసరాలు అధికారుల కంటికి ఆనడం లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల 'భూమి' నాటకం.. బయటపెట్టిన జితేందర్! ఇటీవల జిల్లా స్థాయి ప్రజావాణిలో సామాజిక కార్యకర్త తుడుం జితేందర్ ఈ సమస్యను కలెక్టర్ కుమార్ దీపక్ ముందు ఉంచినప్పుడు అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. సాకు: "సార్.. జన్నారంలో మరుగుదొడ్లు కట్టడానికి ప్రభుత్వ భూమి లేదు" అని అధికారులు కలెక్టర్ ముందు బుకాయించే ప్రయత్నం చేశారు. వాస్తవం: బస్టాండ్ దగ్గర ఇరిగేషన్ భూమి ఉండగా, కవ్వాల్ పాయింట్ వద్ద బావి సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ప్రశ్న: ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఆక్రమించుకుని పట్టాలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకున్న అధికారులు, ప్రజల అవసరాల కోసం ఒక్క గుంట భూమిని కూడా చూపలేకపోవడం వెనుక మతలబు ఏమిటి? అని జితేందర్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నమలాల్సి వచ్చింది. మంగళవారం 'మంట'.. మహిళల 'గోస' ప్రతి మంగళవారం జరిగే వారపు సంత రోజున జన్నారం ఒక నరకప్రాయమైన ప్రాంతంగా మారుతోంది. వ్యాపారుల ఆవేదన: ఉదయాన్నే అడవి నుంచి, తండాల నుంచి కూరగాయలు తెచ్చే మహిళా వ్యాపారులు సాయంత్రం వరకు మలమూత్ర విసర్జన ఆపుకోలేక పడుతున్న బాధలు వర్ణనాతీతం. విద్యార్థినుల ఇబ్బందులు: కళాశాలలు, పాఠశాలలకు వచ్చే విద్యార్థినులు అత్యవసర సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య ముప్పు: గత్యంతరం లేక రోడ్ల పక్కనే వెళ్లాల్సి రావడంతో అటు పారిశుద్ధ్యం క్షీణించి, రోగాలకు నిలయంగా మారుతోంది. కలెక్టర్ ‘డెడ్ లైన్’.. అమలు జరిగేనా? ప్రజల గోసను అర్థం చేసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్, వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించాలని, తక్షణమే మూడు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల తర్వాత కూడా అధికారులు 'ఫైళ్ల' మీద కాలక్షేపం చేస్తారా? లేక యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెడతారా? అని జన్నారం ప్రజలు ఎదురుచూస్తున్నారు. "ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడలేని అధికారులు, కనీసం ప్రజల ప్రాథమిక అవసరాల కోసం కేటాయించలేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి."1
- జగిత్యాల ఇందిరా భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెకాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన కారణమని ఆరోపించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం, నామినేటెడ్ పోస్టులు మరియు కార్యకర్తల హక్కుల విషయంలో తీసుకున్న వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ వ్యవహారం జిల్లాలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు దారితీస్తోందని అన్నారు.1
- मध्य प्रदेश के बांधवगढ़ नेशनल पार्क में बाघों के सड़क पार करने का एक वीडियो सोशल मीडिया पर वायरल हो गया है। छह बाघों ने एक साथ सड़क पार की। पहले तीन ने सड़क पार की, उसके बाद एक और बाघ ने। वहां आए टूरिस्ट ने तस्वीरें खींचीं और उन्हें सोशल मीडिया पर शेयर किया।1
- బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిలో పనిచేస్తున్న సింగరేణి లారీ డ్రైవర్లు, క్లీనర్లు AITUC ఆధ్వర్యంలో నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. డ్రైవర్లకు రూ.34,000, క్లీనర్లకు రూ.21,000 వేతనం, అలాగే EPF, ESI, బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని AITUC బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ హెచ్చరించారు. కార్యక్రమంలో డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు.1
- Post by KR NEWS 3691
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ పులిని మహారాష్ట్రకు చెందిన “జే-1”గా అటవీశాఖ గుర్తించింది. ఇటీవల ఆవును చంపిన పులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పులిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా ఈ పులి జగిత్యాలకు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో నిఘా పెంచారు. సాయంత్రం తర్వాత బయటకు రాకూడదని, పులికి హాని చేయవద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.1
- లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు, విద్యార్థులు ముందస్తు ఉగాది సంబరాలు నిర్వహించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని మంగళవారం డిగ్రీ కళాశాలలో వారు ఉగాది పండుగ విశిష్టతను వివరిస్తూ పండుగను నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి తయారు చేశారు. అలాగే పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహాత్మా సంతోష్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు మొదటి పండుగ ఉగాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.1