ప్రజలెవరూ వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదు: జిల్లా కలెక్టర్ కే. హైమవతి ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ మన జిల్లాలో 03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.
ప్రజలెవరూ వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదు: జిల్లా కలెక్టర్ కే. హైమవతి ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ మన జిల్లాలో 03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.
- ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ మన జిల్లాలో 03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.1
- గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ వినతిపత్రాలు అందించే కార్యక్రమం లో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందించడం జరిగింది.గ్రామపంచాయతీ కార్మికులందరికీ 26,000 వేతనం అందించాలి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి పెండింగ్ జీతాలు అందించాలి రెండో పి ఆర్ సి గ్రామపంచాయతీ కార్మికులకు వర్తింపచేయాలి అని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ధర్నా చేసి వినతి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మూషం రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు యూనియన్ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్ గౌడ్. కార్యదర్శి మల్యాల నరసయ్య సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జిల్లా నాయకులు. ఎలిగేటి రాజశేఖర్ మండల నాయకులు. గూడెం శ్రీనివాస్. రవి మల్లయ్య బిక్షపతి. గంభీరావుపేట మండల అధ్యక్షుడు అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు1
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో శనివారం కరీంనగర్ నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేపడుతున్నారు. బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 7 గంటలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుండి ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ పేరుతో పాదయాత్ర ప్రారంభిస్తారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీజేపీ సర్పంచులు 108 మంది, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సైతం బండి సంజయ్ తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. వారితోపాటు వేలాది మంది బిజేపి కార్యకర్తలు, భక్తమండళ్లు, స్వచ్ఛంద సంస్థలు, హనుమాన్ భక్తులు భారీ ఎత్తున బండి సంజయ్ తో కలిసి కరీంనగర్ఊ నుండి కొండగట్టు వరకు పాదయాత్రలో పాల్గొంటారు. ఇప్పటికే కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు దారి పొడవునా స్వాగత తోరణాలు ఫ్లెక్సీలతో నింపేశారు. 40 కిలోమీటర్లు సాగే పాదయాత్ర లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న నేపథ్యంలో దారిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు పకఢ్బందీ చర్యలు చేపట్టారు.1
- గ్యాస్ కొత్తగా ఉందని చాలామంది రెండు లేదా మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు అలా అక్కర్లేదు డొమెస్టిక్ సిలిండర్లకు ఎటువంటి కోరతలేదు మీరు ఎటువంటి చింత చేయనక్కర్లేదు ఎవరైనా ఇంతకుముందు లాగానే బుక్ చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారిచే శుక్రవారం రోజున సరస్వతి హై స్కూల్ యందు నిర్వహించిన కరాటే పోటీ పరీక్షలలో మా పాఠశాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్ధినీ, విద్యార్థులు కరాటే పోటీలలో పాల్గొని వారి, వారి స్థాయికి తగ్గ ప్రతిభను ప్రదర్శించి కరాటేలోని వివిధ స్థాయి బెల్టులను,సర్టిఫికెట్లను పాఠశాల కరాటే శిక్షకుడు పుల్లూరి శ్రీనివాస్ శిక్షణలో, ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఎగ్జామినర్ కే. వసంత కుమార్ పర్యవేక్షణలో సాధించారు. ఇట్టి బెల్టులను వసంత కుమార్ గారితో పాటు గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు అందించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ మిట్టపల్లి రాజశేఖర్ తెలిపారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ మిట్టపల్లి మాధవి తో పాటు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు అభినందించారు.1
- పత్రిక ప్రకటన తేది:13.03.2026 కామారెడ్డి జిల్లా శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం అడ్లూర్–ఎల్లారెడ్డి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ అధికారుల ద్వారా అడ్లూర్ శివారులో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేసి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు నేషనల్ హైవే పైన ఉన్న డాబా హోటళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హైవే పైన ఉన్న అన్ని డాబా హోటళ్లకు పంచాయతీ కార్యదర్శులు (PSs) నోటీసులు జారీ చేసి, వారికి సంబంధిత లైసెన్సులు ఉన్నాయా లేదా, అలాగే నేషనల్ హైవే అధికారుల అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాలను పరిశీలించాలని ఆదేశించారు. కలెక్టర్ గారి అప్పీల్: ప్రయాణికులు , ప్రజలు నేషనల్ హైవే పైన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్, ఫుడ్ వేస్టేజ్, పేపర్ వేస్టేజ్ వంటి చెత్తను వేయకుండా రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ గవిజ్ఞప్తి చేశారు. ఈ దిశగా గ్రామపంచాయతీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నేషనల్ హైవే పైన ఉన్న డాబా హోటళ్లను పంచాయతీ కార్యదర్శులు (PS), ఎంపీఓ (MPO), ఎంపీడీవో (MPDO)లు సంయుక్తంగా తనిఖీ చేసి, నేషనల్ హైవే అనుమతులు , గ్రామపంచాయతీ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని ఆదేశించారు. హోటళ్ల నుండి వచ్చే చెత్తను రోడ్డుపై వేస్తే సంబంధిత గ్రామపంచాయతీలు అధిక మొత్తంలో జరిమానాలు విధించాలని కలెక్టర్ ఆదేశించారు.1
- మెడికల్ రియంబర్స్ మెంటు బిల్లుల అవుట్ వర్డు రిజిస్టర్ పరిపాలన విభాగం లో లేదనిఎసిబిడిఎస్పిసుదర్శన్ తెలిపారు. డిజిపి ఆదేశాలమేరకు ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రిలో 282ఫైల్ కు గాను సెక్షన్ సూపరింటెండెంట్ లతీఫోద్దిన్ ముజాయిద్దిన్ వద్ద 116 ఫైలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. విచారణ నివేదిక పై అధికారులకు పంపిస్తామనితెలిపారు. మెడికల్ రియంబర్స్మెంట్ ఫణమదరఖాస్తుదారులతో సూపర్డెంట్ వారితో మాట్లాడి ఇవ్వడం జరిగిందని తెలిపారు.1
- ఇందిరమ్మ ఇల్లు కల సాకారం నూతన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం లో నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని చిన లింగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అనసూర్య, చంద్రయ్య లు ఈరోజు గృహప్రవేశం నిర్వహించగా ఇట్టి కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్ గారీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయడం జరిగింది,అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ కెకె మహేందర్ రెడ్డి గారు పంపించిన చిరు కానుక ప్రవీణ్ టోనీ చేతుల మీదుగా అందివ్వడం జరిగింది.లబ్ధిదారులు ప్రజా పాలన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి ,కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరల నర్సింగ0 గౌడ్ గారు ,నాయకులు బైరినేని రాము,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగేల రాజు,మిరాల శ్రీనివాస్,నారా గౌడ్,రవీంద్రారెడ్డి మరియు నాయకులు,మహిళలు పాల్గొన్నారు.1